Pages

Saturday, June 30, 2012

నీటి విడుదలలో కొత్త వివాదం



ప్రాంతాల వారీ వివాదాలు పెంచే ఈ ధోరణి కేవలం మాటలకే పరిమితం కాలేదని సాగర్‌ జలాల విడుదల వివాదం స్పష్టం చేస్తున్నది. మొన్నటి ఎన్నికల ఎదురు దెబ్బల నుంచి తేరుకోవడానికి తరుణోపాయంగా నీటి విడుదలను వివాద గ్రస్తం చేయడం అవాంఛనీయ పరిణామం. కృష్ణా జలాల కనీస మట్టం, ఆ సమయంలో నీటి విడుదలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలు, ఆ సందర్భంలో పాటించాల్సిన ప్రాధాన్యతలు వీటిపై స్పష్టమైన జీవో వుంది. ఇప్పుడు నీటి లభ్యత చాలా తక్కువగా వుంది గనక ఏం చేయాలన్న దానిపై అఖిలపక్ష సమావేశం జరిపి అంగీకృత నిర్ణయానికి రావలసి వుండింది. అలా గాక ఉప ఎన్నికల అనంతర రాజకీయ నిర్వహణలో భాగంగా ఆదరాబాదరాగా నీటిని విడుదల చేయడం, విమర్శలు రాగానే తాత్కాలికంగా విరమించుకోవడం ఇప్పుడున్న సున్నితమైన రాజకీయ పరిస్థితిలో అత్యంత బాధ్యతా రహితం. సాగునీరు తాగునీరు వీటి మధ్య పాటించాల్సిన నిబంధనలు వుండనే వున్నాయి. కొంతమంది చెబుతున్నట్టు ఇది కేవలం తెలంగాణ ప్రాంతంలో తాగునీటి అవసరాలనే గాక ఇతర చోట్ల కూడా ప్రభావం చూపే అంశం. నిజంగా ఆగష్టులో వర్షాలు కురవకపోతే ఏం చేయాలన్నది ఒక సవాలు. సమిష్టిగా చర్చించి సమతుల్యత పాటించాల్సిన సందర్భంలో అకారణ ఉద్రిక్తతలు పెంచడం కూడా ఒక రాజకీయ వ్యూహమనుకోవాలా?

No comments:

Post a Comment