Pages

Saturday, March 26, 2011

పోరాటాల విజయం



బి.వి.రాఘవులు, ఎస్‌.వీరయ్య, జి.నాగయ్య, ఎం.బాబూరావులు దళితులు గిరిజనుల ఉప ప్రణాళిక నిధులు, ఇతర ప్రజా సమస్యలపై సాగించిన నిరాహారదీక్షలు అనుకున్న విధంగానే సుదీర్ఘ విరామం తర్వాత రాజకీయ అజెండాను మలుపు తిప్పాయి. ఆలస్యంగానైనా పరిమితంగానైనా ప్రభుత్వం ప్రతిస్పందించక తప్పని స్థితి తెచ్చాయి. 22 వ తేదీన జరిగిన బహిరంగసభకు ప్రదర్శనకు పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. అందులోనూ అణగారిన వర్గాలకు చెందిన మహిళలు యువత విస్త్రతంగా కదలిరావడం కనిపించింది. సమస్యలపై పోరాడే వారికి రాజకీయ భేదాలకు అతీతంగా సహకరిస్తామని రాఘవులు చేసిన ప్రతిపాదనను కూడా స్వాగతించారు.ఈ దీక్షల ప్రాధాన్యతపై పత్రికలు కొన్ని సంపాదకీయాలు రాశాయి. ప్రభుత్వ హామీల అమలు కోసం మలిదశ కృషిని కూడా ప్రారంభించవలసి వుంటుందని ప్రజా సంఘాలు ప్రకటించాయి.

సుదీర్ఘ కాలంగా జీతాల పెంపు, ఉద్యోగ భద్రత కోసం పోరాడుతున్న కాంట్రాక్టు జూనియర్‌ కాలేజీ లెక్చరర్లకు గణనీయంగా జీతాల పెంపు లభించడం పోరాటాల ఆవశ్యకతను మరోమారు నిరూపించింది.ఇంకా కొన్ని ముఖ్యమైన కోర్కెలు మిగిలి వున్నా సాధించిన మేరకు ఉత్సాహకరంగా వున్నాయి. ఈసమస్యపైనే పిడిఎఫ్‌ ఎంఎల్‌ఎ ఎంవిఎస్‌ శర్మ నిరవధిక నిరాహారదీక్ష కూడా చేసిన సంగతి గుర్తుండేవుంటుంది. కౌలు రైతులకు రక్షణ బిల్లు కూడా పోరాటాల ఫలితమే. ఇదే రీతిలో అంగన్‌ వాడీలకు కూడా అనేక ఉద్యమాల తర్వాత వేతనాల పెంపు లభించింది. మునిసిపల్‌ కార్మికులు కూడా ఈ కాలంలోనే విస్త్రత స్థాయిలో ఉద్యమాలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత వాతావరణంలోనూ సిపిఎం ప్రజా సంఘాలు సాగిస్తున్న ఉద్యమాలకు ఇవన్నీ ఉదాహరణలు. వీటి ప్రాధాన్యత గుర్తించలేని వారు , కావాలని విస్మరించేవారు ఏం మాట్లాడినా శ్రమ జీవుల కోసం పేద మధ్య తరగతి జనుల హక్కుల రక్షణ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు ఆగేవి కావు.

No comments:

Post a Comment