Pages

Thursday, March 24, 2011

విలీనం ప్రతిపాదన వివాదం- నిజం!





కాంగ్రెస్‌లో టిఆర్‌ఎస్‌ విలీనం గురించి కె.సి.ఆర్‌. సానుకూలంగా మాట్లాడినట్టు మీడియాలో చర్చ వచ్చినప్పుడు టిఆర్‌ఎస్‌ ప్రతినిధులు గట్టిగా ఖ ండించారు గాని సమగ్రంగా ఖండించలేదు. అలాటి చర్చ పార్టీలో జరుగుతున్నట్టు వివిధ సందర్భాల్లో తెలుస్తూనే వుంది.ఎంఎస్‌వో లతో కె.సిఆర్‌ ఖచ్చితంగా ఏమన్నారనే మీమాంస పక్కనపెడితే అలాటి అంశాలు ప్రస్తావనకు రావడంలో అసహజం గాని ఆశ్చర్యం గాని ఏమీ లేదు. ఆ మరు రోజు కూడా చర్చల్లో పాల్గొన్పపుడు అధికారికంగానే ఆ పార్టీ ప్రతినిధులు అలాటి ప్రస్తావన వచ్చినట్టు,ఎంఎస్‌వోల ప్రశ్నలకు జవాబు చెప్పినట్టు కూడా స్పష్టంగానే చెప్పారు అంత కంటే ఆసక్తికరం ఏమంటే - అంత గట్టిగా ఖండించిన మరురోజునే ఆయన కాంగ్రెస్‌ నుంచి ప్రతిపాదన వస్తే తెలంగాణా ప్రజాభిప్రాయాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని బహిరంగంగానే ప్రకటించడం. ఒక పార్టీతో విలీనం వంటి మాటను పరిశీలిస్తామని చెప్పడం చిన్న విషయమేమీ కాదు. ఖండించడంలో వున్న తీవ్రత నిజమైతే అందుకు అస్కారం కూడా వుండదు. ఎవరు ఎవరితోనైనా విలీనం కావడానికి పూర్తి అధికారం అవకాశం వున్నప్పుడు ఇంత వివాదం దేనికనే ప్రశ్న అనివార్యంగా తలెత్తుతుంది.టిఆర్‌ఎస్‌ చారిత్రిక దశ ముగిసిందని గద్దర్‌ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాంతాలతో సంబంధం లేని వైరుధ్యాలనే సూచిస్తున్నాయి. రాజకీయార్థిక విషయాలు కేవలం ప్రాంతాలను బట్టి నడుస్తుంటాయనేది నిజం కాదని, విభిన్న రాజకీయ శక్తుల ప్రయోజనాల ఘర్ణణలోనూ, అంతిమంగా ఆర్థికాదిపత్య వర్గాల వ్యూహాల ప్రకారం నడుస్తుంటాయనేది ఇక్కడ మరోసారి రుజువవుతున్న పరమ సత్యం. ఇన్ని వివాదాల తర్వాత కూడా ఇప్పుడే విలీనం ప్రతిపాదన పరిశీలిస్తామని చెప్పారంటే రాజకీయ ప్రయోజనాలెంత బలంగా పనిచేస్తున్నాయో అర్థమవుతుంది. అయితే అది వారి పార్టీ గనక వారిష్టం. ఈ వ్యవహారంలో ప్రజల అభీష్టం ప్రకారం నడుస్తామని చెప్పడం మరో మెలిక మాత్రమే. ఈ విలీన వివాద ప్రహసనం ఎలా ముగిసేదీ చూడాలి.

No comments:

Post a Comment