Pages

Sunday, January 9, 2011

శ్రీకృష్ణ నివేదిక: బహుళ కోణాల వేదిక

మహాభారతంలో కృష్ణ రాయబారం అనేది యుద్ధానికి బాట వేసింది. యుద్దం తప్పదంటూనే 'అయినను పోయి రావలయు హస్తినకు' అంటూ అక్కడ శత్రు రాజుల స్థితి గతులను గమనించి రావచ్చని బయిలుదేరి వెళ్లాడు శ్రీకృష్ణుడు. నా మాట వినక పోతే యుద్ధం తప్పదనీ,పది వేల మంది కర్ణులైనా అని నొత్తురు చత్తురు అని హెచ్చరించి మరీ చిచ్చు పెట్టాడు. జస్టిస్‌ గారి పేరును బట్టి మీడియాలో కృష్ణ రాయబారం అని,కృష్ణతులాబారం అని పరిపరి విధాల ప్రస్తావనలు చేశారు గాని వాస్తవానికి ఈ శ్రీకృష్ణ పర్వం అందుకు పూర్తి భిన్నమైంది. ప్రాంతీయ రాజకీయ పాచికలతో ఉద్రిక్తమైన రాష్ట్రానికి ఒకింత ఉపశమనం
కోసం సమాచార సాధికారిక క్రోడీకరణ కోసం ఈ కమిటీ ఏర్పాటైంది. రాష్ట్ర విభజన కోరే వారు, ఐక్యంగానే కొనసాగాలనే వారు ఉభయులూ వినిపిస్తున్న వాదోపవాదాలు వాటిలోని నిజానిజాలపై సమగ్ర సంప్రదింపుల కోసం అది ఏర్పడింది. సూటిగా విభజన అన్న ఒక్క అంశంపైనే దాని అభిప్రాయం చెప్పమని కేంద్రం అ డగలేదు. అడగలేదు. అలాగే ఏ ఒక్క ప్రాంతానికో పరిమితంగా కాకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన విషయాల వివేచన విశ్లేషణ కోరారు. ఇందులో కేంద్రానికి ఏమైనా రాజకీయాలుంటే అందుకు శ్రీకృష్ణ కమిటీ బాధ్యత వహించజాలదు. తన పరిధిలో ప్రజాస్వామికంగా పారదర్శకంగా అది పలు ప్రాంతాలు పర్యటించి బహిష్కరించిన బిజెపి తప్ప అందరి అభిప్రాయాలు సాదరంగా స్వీకరించింది. సకాలంలో నివేదికను సమర్పించింది. దానిపై సత్వర నిర్ణయం తీసుకోవలసిందిగా కేంద్రాన్ని కోరింది. కమిటీ బాధ్యతా యుత వైఖరికి ఇది ఒక నిదర్శనమైతే దాన్ని అందుకున్న కేంద్రం మాత్రం ఏ మాట చెప్పక పోవడం బాధ్యతా రాహిత్యానికి తార్కాణం. రాష్ట్ర ప్రజల మనోభావాలతోనూ, భవిష్యత్తుతోనూ చెలగాటమాడే ఈ ధోరణి ఏ మాత్రం అనుమతించరానిది. రకరకాల కుంభకోణాల కుమ్ములాట కుంపట్లలతో కుత కుతలాడుతున్న కాంగ్రెస్‌ నాయకత్వం ఇప్పుడే ఒక విధానం ప్రకటిస్తుందని కూడా ఆశించలేము. అందువల్లనే కమిటీ నియామకానికి ముందు ఏ అనిశ్చితి ఆంధ్ర ప్రదేశ్‌ను కుదిపేసిందో నివేదిక వెలువడ్డాక కూడా అదే వెన్నాడుతున్నది. ఇప్పుడు వివాదాలు విమర్శలు శ్రీకృష్ణ నివేదిక కేంద్రంగా సాగుతున్నాయి.
అందరినీ సంతృప్తి పరుస్తామని చెప్పడమే పొరబాటైనట్టు చాలామంది మాట్లాడుతున్నారు. వివాదంలో రెండు వైపులా వున్న వారు ప్రజలే గనక ఉభయులనూ సమాధాన పర్చకుండా పరిష్కారాలు సాధ్యం కావు. స్వార్థ రాజకీయ వేత్తలు ఏ రోటి దగ్గర ఆ పాట పాడవచ్చు గాని జనహితం కోరేవారు అలా చేయలేరు. గతంలో ఒకసారి తెలంగాణాలోనూ మరోసారి ఆంధ్ర ప్రాంతంలోనూ వేర్పాటు వాద ఉద్యమాలు చేసిన వారు తర్వాత అధికార చట్రంలో హాయిగా కొనసాగారు. ఇప్పుడు కూడా అధికారంలో భాగస్వాములైన వారే అన్ని మాటలూ మాట్టాడుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం పరిస్థితి కూడా అదే రీతిలో వుంది. ఇంత కాలం పాలించిన వారే అక్కడా ఇక్కడా ఇన్ని మాటలు చెబుతున్నప్పుడు గందరగోళానికి గురయ్యేది ప్రజలే. అందులోనూ ప్రధానంగా యువత. వారి ఆవేశమూ ఆగ్రహమూ అర్థం చేసుకోదగినవే గాని ఆ చిచ్చు పెట్టిన వారి నిజస్వరూపం గురించిన అవగాహన మరింత ముఖ్యం.ప్రత్యేక తెలంగాణా కోరే వారు తమ వాదనలో ఎంత వాస్తవం వుందనుకున్నా ఇతరుల కోణాలను కూడా వినిపించుకోక తప్పదు. తెలంగాణాలో భాగమైన కొన్ని రాజకీయ శక్తులు కూడా కొంత భిన్న స్వరం వినిపిస్తున్న వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకోకా తప్పదు. ద్వంద్వ భాషణం చేసే రాజకీయ పక్షాలు అధికారికంగా ఏం చెబుతాయో తెలుసుకోకా తప్పదు. (బిజెపి కమిటీ ముందు అధికారికంగా ఏ నివేదిక ఇవ్వకపోవడం కూడా ఈ కోణం నుంచి అర్థం చేసుకోవచ్చు) వివిధ పక్షాల వర్గాల తరగతుల భావాలతో పాటు అటు సర్కారు వారు, సాధికారిక అవగాహన గల ప్రవీణులు ఇచ్చే సమాచారాన్ని క్రోడీకరించకా తప్పదు. శ్రీకృష్ణ కమిటీ అందుకు ఉపకరించిందనడం నిస్సందేహం. దాని నివేదికను చెత్తబుట్టలో పారేయాలని, నాలుక గీచుకోవడానికి కూడా పనికి రాదని రకరకాల మాట్లాడేవారు దానిలో తమ అభిప్రాయాలు కూడా వున్నాయని మర్చిపోతున్నారు. కమిటీ ఉభయుల కోర్కెలనూ ప్రథమ ద్వితీయ ప్రాధాన్యతల క్రమంలో పొందు పర్చినప్పటికీ దానిపై విరుచుకుపడటం అర్థ రహితం.
వందల పుటలకు విస్తరించిన కమిటీ నివేదికలో ఆఖరును సూచించిన ఆరు ఆప్షన్స్‌( దీనికి సరైన తెలుగు పదం రూపొందించుకోలేక పోవడం ఇంతగా వివాద పడుతున్న మొత్తం తెలుగు జాతి ఘనతకు నిదర్శనం అనుకోవాలి) గురించి విస్తారమైన చర్చ జరిగింది. అందులో మొదటి మూడు కమిటీనే తోసి పుచ్చింది. అలాటప్పుడు వాటిని ఎందుకు పొందిపర్చినట్టు అని కొందరి సవాలు, చాలామందికి సందేహం. వివిధ రూపాల్లో వున్న భావనలను పొందపర్చి ఈ అవకాశం లేదని చెప్పడం సరైన పరిష్కారం వైపు నడిచేందుకు దోహదం చేస్తుందన్న కోణంలో దీన్ని చూడొచ్చు. తర్వాత చెప్పే మూడు పరిష్కారాలలో కొత్తదనం ఏముందన్నది ఎక్కువ మంది అడిగే ప్రశ్న.వినూత్నమైన పరిష్కారాలు ప్రయోగాలకు అవకాశం వున్న అంశం కాదు గనకనే ఇంత ప్రయాస.
కమిటీ రాష్ట్ర చరిత్రను చెప్పే సమయంలో తెలంగాణా విభజన వాదుల ఫిర్యాదుల కోణాన్ని విస్త్రతంగానే పొందుపర్చిందనేది వాస్తవం. రాజకీయాధిపత్యంలో రాయలసీమ, తీరాంధ్ర, తెలంగాణా నేతలు అదే క్రమంలో పాలనా కాలం చేశారని పేర్కొన్నది. ఇది స్వయం పాలన నినాదానికి మద్దతుగా భావించవచ్చు గాని వాస్తవం అందుకు పూర్తి విరుద్దంగా వుంది. ఉదాహరణకు రాయలసీమ ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రులు అత్యధిక కాలం పాలించినా ఆ ప్రాంతం అన్నిటికన్నా వెనకబడి వుందని కమిటీ స్పష్టంగా చెప్పడం ఇందుకు నిదర్శనం. పైగా పాలకుల ముఠా తగాదాలలో ప్రయోజనాల వేటలో ఏ ప్రాంతం వారు ఏ పదవిలోకి వచ్చారన్నది ప్రజలకు పెద్ద ప్రధానం కాదు. రాష్ట్రపతి ప్రధాని పదవులు చేపట్టిన వారు కూడా ఒరగబెట్టింది శూన్యమని అనుభవం చెబుతూనే వుంది.
ఉద్యోగాలకు సంబంధించిన ఉత్తర్వులు నిబంధనల అమలులో అవకతవకలు సమగ్రంగానే పరిశీలించి ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని వుండాల్సిందని పేర్కొన్నది. అయితే అదే సమయంలో గిర్‌గ్లానీ కమీషన్‌ నివేదికలో ఇది 20 శాతం వున్నట్టు పేర్కొనడాన్ని కూడా పొందుపర్చింది. అసలు మొత్తంగానే ప్రభుత్వ రంగ ఉద్యోగాల వాటా తీవ్రంగా తగ్గిపోతున్న తరుణంలో వీటిపై శ్రుతిమించిన వివాదాలు అవసరం లేదని కూడా సూచించింది. ఇక నదీ జలాల విషయంలోనూ లెక్కలు ఇచ్చిన తర్వాత ఒక ప్రాంతంలో ప్రాజెక్టులను వివక్షతో నిర్లక్ష్యం చేశారని చెప్పలేమని నిర్ఱారించి వాటిని పకడ్బందీగా అమలు చేయడానికి యంత్రాంగాన్ని సూచించింది.ఈ సందర్భంగా తెలంగాణా ప్రాంతంలో నీటి పారుదలపై ఎక్కువ శాతం ఖర్చు చూపించడంపై అభ్యంతరాలు వస్తున్నాయి గాని నిజాం ఈ రంగాన్ని నిర్లక్ష్యం చేసిన సంగతిని కమిటీ మరో చోట ప్రస్తావించింది. విద్యారంగంలోనూ పరిస్థితిని పరిశీలించి తెలంగాణాలో ఎయిడెడ్‌ సంస్థలు తక్కువగా వుండటంవల్లనే నిధులు తక్కువగా వస్తున్నాయనే వాదనను తోసిపుచ్చింది. ఈ విషయంలో తేడా ఎక్కువగతానే వుందని ఎత్తిచూపింది. ఈ కాలంలో విద్యా సంస్థల సంఖ్యబాగా పెరిగినా ప్రైవేటీకరణ నేపథ్యంలో హైదరాబాదు రంగారెడ్డి దాని చుట్టుపట్లనే కేంద్రీకరణ వుండటాన్ని సమస్యగా పేర్కొంది.ఇలాగే వైద్యం, వివిధ సామాజిక తరగతులు ఆదాయ వ్యత్యాసాలు వగైరాలన్నిటినీ పొందుపర్చిన కమిటీ హైడరాబాదు దాని చుట్టపక్కల ప్రాంతాలు బాగా మెరుగైన స్తితిలో వున్నట్టు చెప్పింది.హైదరాబాదును పక్కనపెట్టినా తెలంగాణా తీరాంధ్రల స్తితిలో పెద్ద తేడా లేదని వాస్తవంలో రాయలసీమ బాగా వెనకబడి వుందని నిర్ఱారించింది. ఈ లెక్కలన్ని ఇక్కడ పరిశీలించలేక పోయినా స్థూలంగా ఇవి గతంలో జరిగిన అధ్యయనాలకు దగ్గరగానే వున్నాయి. లెక్కలు సరిగ్గా లేవనుకుంటే అప్పుడు ఆ మాట అన్ని లెక్కలకూ వర్తించాలి గాని ఎవరి కోణం నుంచి వారు నచ్చని వాటినే తప్పు పట్టేట్టయితే ఏ అధ్యయనమూ సాధ్యం కాదు.
మావోయిజం గురించి గాని, మత ఛాందస శక్తుల ప్రమాదాన్ని గురించి గాని ప్రస్తావించడం కొందరికి బొత్తిగా రుచించడం లేదు. మావోయిజంతో పరోక్షంగా చేతులు కలుపుతూనే దాన్ని దేశానికి ప్రధాన ప్రమాదంగా వర్ణించే పాలకులు( ఆ చెప్పడం గొప్ప కితాబుగా భావిస్తూ) నియమించిన కమిటీ ఆ సమస్యను చెప్పకుండా వుండాలనడం ఎలాటి వాస్తవికత? ప్రస్తావించడమే తప్ప దాన్ని బట్టి కమిటీ తన సిఫార్సును మార్చుకోలేదే? ఇక మత చాందసత్వం అన్న మాట మైనారిటిలకే పరిమితమైనట్టు ఎందుకనుకోవాలో అర్థం కాదు.వాస్తవంలో రెండు మత మతతత్వాలు పరస్పర పోషకాలు తప్ప సంబంధం లేనివి కావు. చిన్న రాష్ట్రాల విషయంలో బిజెపి అత్యుత్సాహం తెలియనదీ కాదు.వలసల సమస్యపైనా వివిధ దశలను కోణాలను ఆవిష్కరించింది. సాంసృతిక అసమానతలు అపార్థాలు ఆధిక్యతల విషయం ప్రస్తావించి వీటిని తొలగించేందుకు తారకమంత్రం ఏదీ లేదన్న వాస్తవాన్ని సూటిగానే పేర్కొంది.
హైదరాబాదును బాగా విస్తరించి విడిగా కేంద్ర పాలిత ప్రాంతంగా వుంచాలన్న నాలుగవ ఆఫ్షన్‌ ఎవరు కోరలేదని చాలామంది వ్యాఖ్యానించారు. అయితే ఈ వివాదం మొదలైనప్పటి నుంచి సగం చర్చ హైదరాబాదుచుట్టూనే కేంద్రీకృతమైందనేది వాస్తవం. కనక ఆ ప్రతిపాదన కూడా చోటు చేసుకోవడం పెద్ద వింతేమీ కాదు. అలా అని దానికి అతిగా ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదు కూడా. ఏది ఎలా పోయినా హైదరాబాదు అందరికీ అందుబాటులో వుండాలని కమిటీ చాలా చోట్ల చెప్పడంలోనూ రాజధాని ప్రత్యేకత కనిపిస్తుంది. అయిదవ ఆప్షన్‌లో హైదరాబాదు రాజధానిగా తెలంగాణా, కొత్త రాజధానితో ఆంధ్ర రాష్ట్రాలను విడదీయడం అనివార్యమైన పరిస్తితిలోనే అందరినీ ఒప్పించిన తర్వాతనే జరగాలని కమిటీ చెప్పింది.ఇది అత్యుత్తమ పరిష్కారంగా గాక రెండవ ఉత్తమ పరిష్కారంగా మాత్రమే చెప్పింది. ఇది మాత్రమే తమకు ఆమోదయోగ్యమనే వారు దానితో ముడిపడిన అంశాలను పట్టించుకోవడం లేదు. అనివార్యమైతేనే అన్న మాటకు విపరీతార్థం తీసి అలాటి పరిస్థితి సృష్టించవలసిందిగా కమిటీ పరోక్షంగా ప్రేరేపిస్తున్నట్టు చెబుతున్నారు. అనివార్యమైతేనే అనడంలో అర్థం నివారించే అవకాశాలను అన్వేషించాలన్న భావనే. పైగా అందరి ఆమోదం వుండాలన్న మాట అత్యంత వాస్తవికమైంది. ఆరవ ఆప్షన్‌ను దీని కొనసాగింపుగా ఇస్తూ అది అత్యుత్తమ మార్గమే కాక జాతీయ దృష్టిలోనూ మంచిదని చెప్పడం కమిటీ భావాన్ని సుస్షష్టంగా వెల్లడించింది.అయితే అదే సమయంలో తెలంగాణా సమస్యలపై మూడురాజ్యాంగ బద్ద యంత్రాంగాలను కమిటీ సూచించింది. ఇలాటివి గతంలో విఫలమైనాయనేది యదార్థమే గాని ఇప్పుడు ఆ వైఫల్యాలు నివారించే రీతిలో ఏర్పాటు చేసుకునే అవకాశాలు పరిశీలించుకోవచ్చు. కాదు అవి గతంలో విఫలమవడమే ఉదాహరణ అనుకుంటే చత్తీస్‌ఘర్‌, జార్ఖండ్‌ వంటి చిన్న రాష్ట్రాలు ఏర్పాటైన కొద్ది కాలానికే అస్థిరత్వం అగచాట్ల వలయంలో కూరుకుపోయిన తీరును కమిటీ సోదాహరణంగా వివరించింది.
శ్రీకృష్ణ కమిటీ నివేదికే సర్వోన్నతమైనది కాకపోవచ్చు. వాస్తవంలో తమ నిర్ణయం దాని పరిధిలోనే వుండకపోవచ్చని కేంద్రం ఇప్పటికే సూచించింది. ఆ కమిటీ చెప్పిన ప్రతిదీ స్వీకరించాలనడం గాని దాన్ని చులకన చేసి అవతల పారేయాలనడం గాని సమంజసం కాదు. పరిశీలించవలసిన అనేక అంశాలను అది ముందుకుతెచ్చింది. వాదోపవాదాలు ఉద్రిక్తతల మధ్య మరుగుపడిన పలు సత్యాలను క్రోడీకరించింది. అందరి మనసుల్లో తారట్లాడుతున్న భావాలకూ చోటు కల్పించింది. ప్రధాన పార్టీలు కనీసం ప్రస్తావించడానికి వెనుకాడుతున్న అనేక కోణాలను సాధికారికంగా ఆవిష్కరించింది. మూడు ప్రాంతాల ప్రజల పార్టీల దృక్పథాలను చాలా వరకు ప్రతిబింబించింది. ఆ మేరకు దానికి ఒక చారిత్రిక విలువ వుంటుంది. అయితే ఆ నివేదికపైన గాని అందులోని సూచనలపైన గాని ఒక వైఖరి ప్రకటించని ప్రభుత్వం అనిశ్చితిని కొనసాగించడానికే కారణమవుతున్నది. అదే పార్టీ నేతలు అయోమయంలో అల్లాడుతూనే జనం ముందు రాజకీయ ప్రహసనాలు సాగిస్తున్నారు. ఈ విన్యాసాలు విరమించి విజ్ఞతాయుతమైన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించవలసిన బాధ్యత కేంద్రంపైనే వుంది. రాజకీయ ప్రయోజనాల గురించే చింతిస్తూ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయడం సహించరాని విషయం. తన అవకాశవాదం వల్ల ఉత్పన్నమైన అనిశ్చితికి విద్యార్థులను యువతను గురి చేయడం ఆ పైన ఆంక్షలు విధించడం మరింత అభ్యంతరకరం.ఈ రాజకీయ మాయాజాలానికి స్వస్తి చెప్పి పారదర్శకమైన నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించాలన్నదే ప్రతివారి కోర్కె కావాలి. శ్రీకృష్ణ కమిటీ చేసిన ఏ సూచనను పాటించినా పాటించకపోయినా సత్వర నిర్ణయం తీసుకోవాలన్న మాట మాత్రం నూటికి నూరు పాళ్లు పాటించి తీరాలి.

19 comments:

  1. శ్రీకృష్ణ కమిటీ నివేదిక రాష్ట్ర విభజన గురించి స్పష్టంగా ఏమీ చెప్పలేదు. ఈ ట్రైన్ తాడేపల్లిగూడెం వెళ్తుంది, ఏలూరూ వెళ్తుంది, ఎక్కడ దిగాలో మీరే నిర్ణయించుకోండి అన్నట్టు ఉంది.

    ReplyDelete
  2. Please split the paragraphs into small ones. We are getting lost when reading the blog enteries. Nice article. Also please write in simple language.

    ReplyDelete
  3. శ్రీకృష్ణ కమిటీ కు ప్రభుత్వం ఒక నిర్దిష్ట బాధ్యత అప్పజెప్పింది.అధికార గణాంకాలను క్రోడీకరించి అందించింది.వివిధ రాజకీయపార్టీల,వివిధ ప్రాంతాల సమూహాల అభిప్రాయాలను సమగ్రంగా సేకరించి కాలవ్యవధి లోపలే నివేదిక సమర్పించింది.నివేదిక గందరగోళంగా ఉందని కెకె లాంటి మేతావులు,కమిటీ నివేదికతో వెలుగులోకివచ్చిన నిజాలతొ తాము అబధ్ధపు పునాదులతో కట్టిన సౌధం కూలిపోయినందుకు ఆక్రోశించే ఇతర తెలంగాణా బుధ్ధిజీవులు ఇకనైనా యువతను,విద్యార్ధులను మభ్యపెట్టడం మాని,సమస్య పరిష్కారానికి అనువైన వాతావరణం కల్పించాలి.కేంద్రప్రభుత్వం ఇప్పటికైనా తెలుగుజాతి తో ఆడే వికృతరాజకీయక్రీడలకు ముగింపు పలికి,దీర్ఘకాల జనహితాన్ని దృష్టిలోఉంచుకొని సత్వర నిర్ణయం తీసుకోవడం తక్షణ కర్తవ్యం.

    ReplyDelete
  4. .admin garu cheppindi patinche prayatnam chestanu.
    .praveen sarma abhiprayalu sariggane dwannchina paxikamainavi.naa vyasamlo aa committee nivedika disanirdesam emito vislesinche prayatnam chesanu.
    .tarakam garu ee dasalo aa bhashalo matladdam valla prayojanam ledu.krishna committe telangana vadula vimarsalu amodinchina,palakulaku hitavachanalu palikina bhagalu kooda unnayi.andariki santruptikai committee kasarattu cheste ee okkariko vyatirekam, anukulam annattu manam choodanavasaramledu. committee evaroo vdiporadanna buddhudi vakkunu nehru matallo ponduparachindi. ippati corporate bhashalo ayite winwin annamata. ade prajaswamyam.kottukuporadu,kottukoradu..
    ippudu avagahanato prajala chaitanyam penche krushi jaragali.prantiya vadalu okosari oko chota oko rupamlo vastuntayi.rajinamale goppa parishkaram anukunewaru gat edadilone gaka 60,70 dasakalalo kuda mantrulu,mlalu goppaga rajinamalu chesi challaga sardukunnarani gurtunchukovali.

    ReplyDelete
  5. రవి గారు మరి కమిటి ఇచిన 6 వ అప్షన్ పాతది కద ఇంప్లిమెట్ కానందుకె కదా ఈ కొట్లతలు. మరి మీరు మీ వ్యాసం లొ ఎందుకు చెప్పలెదు.
    మేము ఎన్ని సార్లు మొసపొవలి.....

    ReplyDelete
  6. anita garu,

    naa vyasam poortiga jagrattaga chadivite ee sandeham kaligedi kadu. meeru, memu ane bhasha prajala madhya undakoodadu.rashtrala vibhajanato mosalu agipovu.udaharanaku jarkhand,chattisgharlalo kuda prajalu aneka roopallo poradutunnaru.dochukune varu,mosaginche varu epudaina ekkadaina untaru.danipai porade chaitanyam mmukhyam.1946-51 telngana sayudha poratam natiki prantala samasya ledu kada.. ippudu kooda udyogulu, karmikulu hakkula kosam kalise poradutunnaru kada.
    rashtranni vibhajinchadama leda anna danipaine edategani vivadam,udriktata konasaginchadam kooda palakula mosame..ayidava option ayina samasyalu mayamai povu.. ..

    ReplyDelete
  7. నేనిక్కడ ఎవర్నీ కించపరిచడానికి కాదుగానీ అటు ఆంధ్రాలో, ఇటు తెలంగాణాలో ఉండే ఇద్దరు సమాన్యుల కోణంలో ఈ క్రింది ప్రశ్నలు అడగదలుచుకున్నాను.
    1.కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోకుండా ఒకే భాష మాట్లాడేటోళ్ళం విడిపోవద్దు, విడిపోతే వీకైపోతం లాంటి కుంటిసాకులెందుకు? అట్టా విడిపోతున్న మొదటి రాష్ట్రం మనదేనా? నిన్నగాక మొన్న బీహారునుండి ఝార్కండ్ విడిపోలేదా, బీహారుకు వేలాది కోట్ల డబ్బులు కాంపెన్షేషన్ ఇవ్వలేదా (నోట్: అక్కడ పాట్నా బీహార్ మద్యలో ఉంది కనుక వదిలేసి ఝార్కండ్ సొంత కేపిటల్ ఏర్పరుచుకుంది. ఇక్కడ హైదరాబాద్ తెలంగాణా మద్యలో ఉంది కనుక వారు కొత్త కేపిటల్ కట్టుకోవాలి, డబ్బులు మేమిస్తాం:)
    ఒకే భాష మాట్లాడే రాస్ట్రాన్ని విడగొట్టడం పాపం అనే కుహనా సమైఖ్యవాదులకు హైదరాబాద్ లేకుండా తెలంగాణా తీసుకోమనేటప్పుడు ఆ బుద్ధి గడ్డికరిచిందా? విడిపోతే కేంద్రంలో వీకైపోతామనేది కూడా ఎంత అర్ధరహితం. ఇప్పుడు 33మంది ఉండికూడా (తమ స్వంత వ్యాపారాలూ, రాజకీయ బ్రోకరెజీలూ తప్ప పక్కనున్న తమిళోడు అన్నీ ఎగరేసుకుపోతుంటే మిడ్గుడ్లేసి చూడటం తప్ప) రాష్ట్రానికి ఊడబొడిచిందేమిటి?
    2."చల్లకొచ్చి ముంత దాచినట్లు” కాకుండా వారి బాదేందో డైరెక్ట్ గా జెప్పాలె. నీళ్ళ విషయంలో వారికుండే అనుమానాలు అర్ధం జేసుకో దగ్గవే, హైదరాబాదులో ఇప్పటికే ఉద్యోగాలు(ప్రభుత్వ& ప్రయివేటుకూడా) చేసుకునేవాళ్ళను కొనసాగనివ్వాలి, కొత్త కేపిటల్ కోసం డబ్బులు ఇవ్వాలి - ఇవన్నీ న్యాయమైన కోరికలేగా. మేమేమన్నా కాదన్నామా?
    ప్రభుత్వోద్యోగావకాశాలు అంతరించిపోతున్న నేటిరోజుల్లో....అంటూ ఆ విషయానికి అంత ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదన్నట్టుగా కమిటీ అభిప్రాయపడటం తప్పు. ఎందుకంటే ఖాళీగా ఉన్న పోస్టుల్లో అవుట్‌సోర్సింగ్ పేరుతో పెట్టుకుంటున్న వారిలో నూటికి తొంబై మంది ఆంధ్రా వారే(వడ్డించే పై అధికారులు ఎక్కువ వాళ్ళవాళ్ళే కావడం & ఇతరత్రా ఇంఫ్లూయెన్స్‌లవల్లానూ) అన్నది ఇక్కడ గమనించాలి.
    3.ఇక హైదరాబాదును చుట్టూతా ఉన్న జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలతో కలిపి యూటీ చెయ్యమనడం ఎంత బాద్యతారాహిత్యం? వారు మదరాసు నుండి విడిపోయి వచ్చినప్పుడుకూడా NH5 & NH205 దారిలో ఉన్న జిల్లాలన్నీ ఇలాగే యూటీలు చేయించుకుని వచ్చారా? ఇప్పుడు హైదరాబాదును మొత్తానికి మొత్తంగా వారే నిర్మించేసినట్టు హక్కులు కావాలంటున్నట్లే మదరాసును కూడా వారే కట్టుంటారే:) మరి దాన్నెలా వదులుకునొచ్చారబ్బా? తమిళ తంబీల దగ్గర పారని వారి పాచిక తెలంగాణోళ్ళ దగ్గర మాత్రం పారాల్నా?
    ఆనాడు మద్రాసు రాష్ట్రంనుండి విడిపోయి వచ్చేనాడు ఈ తెలివి ఎక్కడపోయింది? మద్రాసునుకూడా మా రక్త మాంసాలతో అభివృద్ధి చేసాం కనుక మా ప్రాంతానికి ఎత్తుకుపోతాం అనలేదే?
    అఫ్కోర్స్ వారడిగారుకూడా ఆంధ్రాలో కలపాలని(అది తలా తోకా లేని కోరిక అనేది వేరే విషయం). కానీ దాన్ని సాధించుకోకుండానే తోక ముడవలేదా?
    4.అన్నట్టు హైదరాబాదులోగానీ, అప్పుడు మదరాసులోగానీ ఎవడ్ని బాగుజెయ్యడానికి పెట్టుబడులు పెట్టారన్నా వారు? ఏ వ్యాపారి అయినా తను పెట్టిన పెట్టుబడులకు తగ్గ రాబడి ఎప్పటికప్పుడు తెచ్చుకుంటూనే ఉంటడు. హైదరాబాదులో వారు జేసిందికూడా వ్యాపారమే అయినప్పుడు మమ్మల్నేదో ఉద్ధరించినట్టు బిల్డప్పెందుకు? పైగా చుట్టుపక్కల జిల్లాలకు ఏం ఊడబొడిచారని అవికూడా కలిపి యూటీ చెయాలి? వారికి రాస్తా ఇయ్యడం కోసమా? అంటే ఏది పచ్చగుంటే అది వారికే కావాలా? ఇట్టా జేసేకదా ఆనాటి ఆంధ్రా & తెలంగాణా పెద్దలు మంచి ఉద్దేశ్యంతో పెట్టిన రూల్సన్నీ తుంగలో తొక్కబట్టేకదా ఇప్పిడు ఈ గొడవంతా?
    5. పోనీ వారి డబ్బులు, ఆస్థులు ఇంకా ఇక్కడే ఉంటాయిగదా అనుకున్నా అయ్యన్నీ మేమేమన్నా గుంజుకుంటమా ఏంటి? పాత వ్యాపారాలు కంటిన్యూ చెయ్యొచ్చు, కొత్త వ్యాపారాలూ మొదలు పెట్టొచ్చు. అప్పుడెప్పుడో బయటికొచ్చినా ఇంకా మదరాసులో వ్యాపారాలు జేసుకుంటలేరా ఏంది? ఎటొచ్చీ గవర్నమెంట్ ఉద్యోగాలు కొత్తగా వారికి రావు అంతే తేడా. దీనికి అంత బాదెందుకు. ఒకవేళ మేము మాట తప్పుతం అని వారికనిపిస్తే 1956 లో మాకు రక్షణల పేరుతో చేసుకున్న ఒప్పందం లాంటిదే ఇప్పుడు వారు చేసుకోవచ్చుగదా:)

    ReplyDelete
  8. what is argued by many that 6th option is different from 1st option is not correct in the sense that in whatever new form the Constitutional guarantees may be proposed SA(Samaikya Andhra) politicians and officers who violated all the previous safegaurds starting 4m G'mans Agmt to 610 G.O with step motherly attitude towards TG will continue to do so.
    In fact, Gentlemen's agreement was given highest regard at its inception. six point formula was very much protected by the Constitution(Article 371D).
    Gentlemen's agreement too suggested a Regional Standing Committee subject to following guidelines:
    1. There will be one legislature for the whole of Andhra Pradesh which will be the sole law making body for the entire state and there be one Governor for the State aided and advised by the Council of Ministers responsible to the State Assembly for the entire field of Administration.
    2. For the more convenient transaction of the business of Government with regard to some specified matters the Telangana area will be treated as one region.
    3. For the Telangana region there will be a Regional Standing Committee of the state assembly consisting of the members of the State Assembly belonging to that region including the Ministers from that region but not including the Chief Minister.
    4. Legislation relating to specified matters will be referred to the Regional committee. In respect of specified matters proposals may also be made by the Regional Committee to the State Government for legislation or with regard to the question of general policy not involving any financial commitments other than expenditure of a routine and incidental character.
    5. The advice tendered by the Regional Committee will normally be accepted by the Government and the State Legislature. In case of difference of opinion, reference will be made to the Governor whose decision will be binding.
    But, what was the fate of it and that of 6 point formula. Who were bothered to care the Constitutional safeguards? In the light of the Free zone issue it became clear that in the event of anybody violating them who will fight against it as the keys of the booty are very much in the hands of the looter itself?
    By suggesting constitutional guarantees SKC itself admitted that there is a very good scope for SA politicians and officers to violate any council/ committee like what happened earlier.

    ReplyDelete
  9. తెలకపల్లి రవి గారు,

    చిన్న రాష్ట్రాల లోనే మత ఛాందసత్వం ఉంతుందని ఎలా చెబుతారు? చిన్న రాష్ట్రమైన కేరళలొ, హర్యాణాలో ఉందా? మరి పెద్ద రాష్ట్రమైన బెంగాల్ నుండి మత ఛాందసులు కాదా తస్లిమాను వెళ్ళగొట్టింది? పెద్ద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కాదా తస్లిమాపై చెప్పులు విసిరింది?

    అలాగే మావోయిజం గురించి.

    పెద్దరాష్ట్రమైన పశ్చిమబెంగాల్ ఎందుకు మావోయిజాన్ని అరికట్టలేక పోతుంది?

    "రెండు మత మతతత్వాలు పరస్పర పోషకాలు తప్ప సంబంధం లేనివి కావు"

    మీ సిద్ధాంతం ప్రకారం మతతత్వం ఉన్న అన్నిదేశాలలో రెండుమతాలు ఉండాలి, కాని అలా లేవుగా? ఒకేమతం ఉన్న ఇరాన్, అఫ్గనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో మతతత్వం ఎందుకుంది?

    అసలు చిన్న రాష్ట్రాలకూ, బీజేపీకి సంబంధం ఏమిటి? బీజేపీ పెద్దరాష్ట్రాలలోనూ అధికారంలో ఉంది, చిన్నరాష్ట్రాలలోనూ అధికారంలోకి రాలేక పోయింది.

    ఏదో బీజేపీ చిన్న రాష్ట్రాలను బీజేపీ కోరుతుందికదా అని గుడ్డిగా చిన్నరాష్ట్రాలను వ్యతిరేకించం కరెక్టు కాదు. ఒకప్పటి హైదరాబాదు రాష్ట్రంలో ప్రధానప్రతిపక్షంగా ఉన్న కమ్యూనిస్టులు తర్వాత పెద్దదైన విశాలాంధ్రలో ప్రాధాన్యత కోల్పోయి చివరికి నామమాత్రంగా మిగలటం వాస్తవం కాదా?

    ReplyDelete
  10. Ravi gaaru,
    Thanks for the unbiased and balanced analysis, as always.
    వ్యవస్థ మారకుండా, సరిహద్దులు మారినా మారకున్నా ప్రజల అవస్థలు మాత్రం మారవు.

    ReplyDelete
  11. వాస్థవాలను మరచి ఎవరికివారు తామనుకున్నదే కరక్టని వాదించుకుంటూపోతే ఉపయోగం ఉండదు. నేను కేసీఆర్ లాంటి తెలంగాణా వాదిని కాదు. టీఆరెస్ సపోర్టర్నీ కాదు. నిజాం విషయంలోనూ(జిన్నా విషయంలో అధ్వానీలాగే), ఆంధ్రా ప్రజలను దొంగలు అనడం లాంటివాటన్నింటిలోనూ అతన్ని నేను 100% వ్యతిరేకిస్తాను. ఈ విషయాలన్నీ నా బ్లాగులో(@http://dare2questionnow.blogspot.com/2011/01/blog-post_08.html) clearగా రాసానుకూడా. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ఆయన ఏదో ఒరగబెడతారన్న ఆశలుకూడా నాకు పెద్దగా ఏమీ లేవు. చత్తీస్ఘడ్ లో శిబూసోరెన్ దీనికి ఉదాహరణ.
    అయితే తెలంగాణావాదం ఆయనకేమీ పేటెంట్ చెయ్యబడలేదు. ఆయనా, ఆయనలాంటి నాయకులు గతంలో కొందరూ (జై ఆంధ్రా విషయంలోనూ) దాన్ని రాజకీయ స్వప్రయోజనాలకోసం ఎలా వాడుకున్నారో ఏవాద సమర్ధకులకైనా ఇట్టే తెలిసిపోతుంది.
    కానీ, ఇప్పుడు ఈ ప్రాంతపు ప్రజలందరూ, ఎందరో విధ్యాధికులూ, కొందరు ఆంధ్రాప్రాంత మేధావులు కూడా విభజన డిమాండ్ వెనకున్న సహేతుక కారణాలను అర్ధం చేసుకున్నారు. (same rule applies to support on సమైఖ్యవాదం)
    అయితే కృష్ణ కమిటీ రిపోర్ట్లోకూడా (ఆప్షన్ 1 లో) సమైఖ్యంగా ఉన్న కాలంలో నాటి పెద్ద మనుషులు ఏ విషాల ద్ర్క్పధంతో రెండు ప్రాంతాలను కలిపారో, రెండు ప్రాంతాల మద్య అప్పటికి ఉన్న వాస్థవిక చారిత్రక, సాంస్కృతిక, సామాజిక అంతరాల దృష్ట్యా ఈ ప్రాంతానికి కల్పించిన రక్షణలు సరిగా అమలుచేయబడనందువల్లే ప్రస్థుత విషమ పరిస్థితి దాపురించిందని సూటిగా చెప్పలేదా? అయితే 6వ ఆప్షన్ లో అలాంటి ప్రయోగాన్నే (మరిన్ని రాజ్యాంగ రక్షణలతో అని ఆయన ఉద్దేశ్యం కావచ్చు?) మరోసారి చెయ్యమనేవిధంగా ఉన్న సలహా మంచిదే అయినా “ఇప్పటివరకూ జరిగినవె మళ్ళీ పునరావృతం కావని ఎలా చెప్పగలం" అనే ప్రశ్నలు సగటు తెలంగాణా పౌరులందరిలోనూ ఉంది.
    నామటుకు నేను నిజంగా అలాంటి రాజ్యాంగ రక్షణలతోబాటూ నిజాలను అంగీకరించి వెనకబడ్డ ఏ ప్రాంతన్ని అయినా (ఉత్తర తెలంగాణా, రాయలసీమ, ఉత్తరాంధ్ర....ఇలా ఉండాలి ప్రాధాన్యతలు) చిత్తశుద్ధితో అభివృద్ధి చెయ్యాలనీ, ఒక ప్రాంతంవారి అవకాశాలను మరొకరు దెబ్బతీయకుండా సహనం వహించాలనే విధంగా మనందరి (ముఖ్యంగా నాయకుల) ఆలోచనాధోరణిలో మార్పు రాగలిగితే సమైఖ్యంగా ఉండడం ఖచ్చితంగా బేస్టే.
    అయితే గిర్గ్లానీ కమీషన్ సిక్ష్ పాయింట్ ఫార్ములాకు, రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా తెలంగాణా ఉద్యోగ నియామకాల్లో ఉల్లంఘణలు జరిగాయని నిక్కచ్చిగా చెప్పిన తరువాతా, దాన్ని సరిచేసేందుకు NTR 610 జీఓ తెచ్చిన తరువాత కూడా ఎన్ని యేళ్ళైనా తప్పులను సరిచెయ్యలేకపొగా కనీసం ఏ శాఖలో ఎంతమంది అలాంటివారున్నారన్న గణాంకాలు ఇవ్వడంలో కూడా ప్రభుత్వం/ అధికారులు ఇన్నేళ్ళు తాత్సారం చెయ్యడంలాంటివన్నీ కూడా రాజ్యాంగ ఉల్లఘణలేగా?ఇక హైదరాబాద్ ఫ్రీ జోన్ అంశం మరో ఉదాహరణ.
    (ఎందుకంటే సిక్ష్ పాయింట్ ఫార్ములాను ఆర్టికల్ 371డి ద్వారా రాజ్యాంగ రక్షణ కల్పించారు) అలాంటప్పుడు ఇప్పుడు మళ్ళీ అలాంటి ప్రయోగాలే చేద్దమంటే నమ్మకం ఎలా కుదురుతుంది?
    ఇందుకు ఏవైనా మార్గాలుంటే చెప్పండి. ప్రజల్ని (ముఖ్యంగా మన ఇరు ప్రాంతాల మూర్ఖ నాయకుల్నీ) అందరం కలిసి ఒప్పించవచ్చేమో చూద్దాం:) వాస్థవానికి ఇలాంటి ప్రయత్నం కృష్ణ కమిటీ చేసియుండాల్సిందనేది నా అభిప్రాయం.
    విధివిధానాలు, చట్టాలు, ఎప్పుడు రూపుదిద్దుకున్నా అవి ఆయా కాలమాన పరిస్థితులను బట్టి, అణ్వయించుకునే తీరునుబట్టి ఉంటాయి.
    ఇప్పుడు కృష్ణ కమిటీ గొప్పది, వారు చెప్పింది తారక మంతరం అనే మనం బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా జలాల వీహయంలో ఇచ్చిన తీర్పును మాత్రం వ్యతిరేకించవచ్చ? అంటే శ్రీకృష్ణకు ఉన్న విస్వసనీయత బ్రజేష్ కుమార్ కు లేదనా?
    కాదు. వాళ్ళలాంటి విజ్ఞులు చెప్పేవాటిల్లో వాస్థవాలే ఉండేందుకు అవకాశం ఉన్నా మరొక ఆచరణ సాధ్యమైన పరిష్కారం కొరకు ప్రయత్నించగలిగితే అందరికీ ప్రయోజన్ముంటుందికదా అన్న ఆతృత అందరిలోనూ ఉంటుంది. అది కృష్ణా నీళ్ళు కావచ్చు, రాష్ట్ర విభజనా కావచ్చు. అది వేరూ ఇది వేరూ అంటే ఎవర్ని ఎవరమూ బాగు చెయ్యలేం:) ఏమంటారు?

    ReplyDelete
  12. 1. ఆర్‌.ఎస్‌. రెడ్డి గారూ, గతంలో కుదిరిన ఒప్పందాలను సరిగ్గా అమలు జరపని మాట యదార్థమే. ఆ మాట శ్రీకృష్ణ కమిటీ సూటిగానే చెప్పింది.అయితే అది పాలక వర్గాల లక్షణం తప్ప ప్రాంతాల సమస్య ప్రజల మధ్య సమస్య కాదు.ఇప్పుడు రాష్ట్రాలు వేరైనా తర్వాత కూడా పాలకులు ప్రజలపట్ల బాధ్యతగా వ్యవహరిస్తారనుకోవడం భ్రమ. విభజన వల్ల తప్పక వచ్చేవి రాజకీయ పదవులు మాత్రమే. అందుకే పార్టీలకు అతీతంగా చాలా మంది నేతలు దానిపై విన్యాసాలు చేస్తున్నారు.విభజన కోరే వారైనా ఈ విషయంలో స్పష్టంగా వుండాలి. అంతేగాని జనానికి దాంతోనే ఏదో ఒరిగిపడుతుందని అరచేతిలో వైకుంఠం చూపించడం అవాస్తవికం.
    2. హరి గారూ, మీరన్నట్టు చిన్న రాష్ట్రాలలోనే మతతత్వ ప్రమాదం వుందని నేను రాయలేదు. శ్రీకృష్ణ కూడా చెప్పలేదు. పరిగణనలోకి తీసుకోవలసిన అంశాల్లో అది కూడా ఒకటని మాత్రమే ప్రస్తావన.ఈ ప్రస్తావన మైనారిటీలకు మాత్రమే పరిమితం కాదని, దానికి ప్రతిగా వుండే మెజారిటీ మతతత్వం గురించి కూడానని గుర్తు చేశానంతే.
    3.పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌,ఇరాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌లను మీరు ఉదహరించారు.ఈ దేశాల్లో ఒకే మతం వుంది కదా అని. అసలు పాకిస్తాన్‌,బంగ్లాదేశ్‌ ఎలా ఏర్పడ్డాయో ఈనాటికి కూడా వాటికి మనకు మధ్య మత ఛాందసం ఎలా బుసలు కొడుతున్నదో గమనించగలిగితే ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. జిన్నా లౌకిక వాది అని అద్వానీ కితాబు నిచ్చిన ఒక్క ఉదాహరణ చాలదా?మధ్య యుగాలలోనే క్రూసేడులు అనబడే మతయుద్ధాలు క్రైస్తవ, ఇస్లాం మతాల మధ్య జరిగాయి. భారత దేశంలో శైవ వైష్టవ కలహాలు భీకరంగా సాగాయి. చెప్పాలంటే చాలా వున్నాయి. ఇప్పటికీ వున్నాయి. అమెరికన్‌ దౌత్యవేత్త శామ్యూల్‌ హంటిగ్టన్‌ రాసిన క్లాష్‌ ఆఫ్‌ సివిలిజేషన్స్‌ అన్న పుస్తకం గురించి మీరు వినేవుంటారు కదా..
    4.చిన్న రాష్ట్రాలలో బిజెపి ఎక్కువగా గెలిచింది. తను ఏర్పాటుచేసిన మూడు రాష్ట్రాలలోనూ అదే ఎక్కువగా అధికారం చేస్తున్నది.అయితే చాలా పెద్ద రాష్ట్రమైన యుపిలోనూ అయోధ్య సమస్య పుట్టింది.కనక ఈ సమస్యకు దానికి సంబంధం లేదు. బిజెపి/జనసంఘం పుట్టక ముందు నుంచి కమ్యూనిస్టుల వైఖరి ఒక్కటే. ఇప్పుడు సిపిఐ వైఖరి మారింది గాని సిపిఎం భాషా రాష్ట్రాలకే కట్లుబడి వుంది.అయితే ఇది తెలంగాణా ప్రజల పట్ల గాని ప్రాంతం పట్ట గాని వ్యతిరేకత అని ఎవరూ అనలేరు.ఎందుకంటే ఆ పార్టీకి ఈ ప్రాంతం నుంచే గణనీయంగా శాసనసభ్యులు, పలు సార్లు పార్లమెంటు సభ్యులు ఎన్నికైనారు. ఇప్పటికీ అనేక జిల్లాల్లో ఉద్యమాలున్నాయి. ఇటీవల ఎదురు డెబ్బ తిన్న మాట నిజం. మీరన్నట్టు నామమాత్రమై పోయిందా లేదా అనేదానిపై ఎవరి అంచనా వారికి వుండొచ్చు.
    5.బెంగాల్‌లో మావోయిజం దాడులు వగైరా వేరే సమస్య. అది మావోయిజమా మమతాయిజమా అన్నది పెద్ద సందేహం.ఏమైనా సమస్యే.

    ReplyDelete
  13. 1. ఆర్‌.ఎస్‌. రెడ్డి గారూ, గతంలో కుదిరిన ఒప్పందాలను సరిగ్గా అమలు జరపని మాట యదార్థమే. ఆ మాట శ్రీకృష్ణ కమిటీ సూటిగానే చెప్పింది.అయితే అది పాలక వర్గాల లక్షణం తప్ప ప్రాంతాల సమస్య ప్రజల మధ్య సమస్య కాదు.ఇప్పుడు రాష్ట్రాలు వేరైనా తర్వాత కూడా పాలకులు ప్రజలపట్ల బాధ్యతగా వ్యవహరిస్తారనుకోవడం భ్రమ. విభజన వల్ల తప్పక వచ్చేవి రాజకీయ పదవులు మాత్రమే. అందుకే పార్టీలకు అతీతంగా చాలా మంది నేతలు దానిపై విన్యాసాలు చేస్తున్నారు.విభజన కోరే వారైనా ఈ విషయంలో స్పష్టంగా వుండాలి. అంతేగాని జనానికి దాంతోనే ఏదో ఒరిగిపడుతుందని అరచేతిలో వైకుంఠం చూపించడం అవాస్తవికం.
    2. హరి గారూ, మీరన్నట్టు చిన్న రాష్ట్రాలలోనే మతతత్వ ప్రమాదం వుందని నేను రాయలేదు. శ్రీకృష్ణ కూడా చెప్పలేదు. పరిగణనలోకి తీసుకోవలసిన అంశాల్లో అది కూడా ఒకటని మాత్రమే ప్రస్తావన.ఈ ప్రస్తావన మైనారిటీలకు మాత్రమే పరిమితం కాదని, దానికి ప్రతిగా వుండే మెజారిటీ మతతత్వం గురించి కూడానని గుర్తు చేశానంతే.
    3.పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌,ఇరాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌లను మీరు ఉదహరించారు.ఈ దేశాల్లో ఒకే మతం వుంది కదా అని. అసలు పాకిస్తాన్‌,బంగ్లాదేశ్‌ ఎలా ఏర్పడ్డాయో ఈనాటికి కూడా వాటికి మనకు మధ్య మత ఛాందసం ఎలా బుసలు కొడుతున్నదో గమనించగలిగితే ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. జిన్నా లౌకిక వాది అని అద్వానీ కితాబు నిచ్చిన ఒక్క ఉదాహరణ చాలదా?మధ్య యుగాలలోనే క్రూసేడులు అనబడే మతయుద్ధాలు క్రైస్తవ, ఇస్లాం మతాల మధ్య జరిగాయి. భారత దేశంలో శైవ వైష్టవ కలహాలు భీకరంగా సాగాయి. చెప్పాలంటే చాలా వున్నాయి. ఇప్పటికీ వున్నాయి. అమెరికన్‌ దౌత్యవేత్త శామ్యూల్‌ హంటిగ్టన్‌ రాసిన క్లాష్‌ ఆఫ్‌ సివిలిజేషన్స్‌ అన్న పుస్తకం గురించి మీరు వినేవుంటారు కదా..
    4.చిన్న రాష్ట్రాలలో బిజెపి ఎక్కువగా గెలిచింది. తను ఏర్పాటుచేసిన మూడు రాష్ట్రాలలోనూ అదే ఎక్కువగా అధికారం చేస్తున్నది.అయితే చాలా పెద్ద రాష్ట్రమైన యుపిలోనూ అయోధ్య సమస్య పుట్టింది.కనక ఈ సమస్యకు దానికి సంబంధం లేదు. బిజెపి/జనసంఘం పుట్టక ముందు నుంచి కమ్యూనిస్టుల వైఖరి ఒక్కటే. ఇప్పుడు సిపిఐ వైఖరి మారింది గాని సిపిఎం భాషా రాష్ట్రాలకే కట్లుబడి వుంది.అయితే ఇది తెలంగాణా ప్రజల పట్ల గాని ప్రాంతం పట్ట గాని వ్యతిరేకత అని ఎవరూ అనలేరు.ఎందుకంటే ఆ పార్టీకి ఈ ప్రాంతం నుంచే గణనీయంగా శాసనసభ్యులు, పలు సార్లు పార్లమెంటు సభ్యులు ఎన్నికైనారు. ఇప్పటికీ అనేక జిల్లాల్లో ఉద్యమాలున్నాయి. ఇటీవల ఎదురు డెబ్బ తిన్న మాట నిజం. మీరన్నట్టు నామమాత్రమై పోయిందా లేదా అనేదానిపై ఎవరి అంచనా వారికి వుండొచ్చు.
    5.బెంగాల్‌లో మావోయిజం దాడులు వగైరా వేరే సమస్య. అది మావోయిజమా మమతాయిజమా అన్నది పెద్ద సందేహం.ఏమైనా సమస్యే.

    ReplyDelete
  14. తెలకపల్లి రవి గారు,

    మీ ప్రతిస్పందనకు కృతఙ్ఞతలు.

    రాష్ట్రవిభజన వలన ఎలా మతతత్వం ప్రబలుతుందో తెలుపగలరా? శ్రీకృష్ణ కమిటీ అంది కాబట్టి అని చెప్పకండి, కమిటీ రిపోర్టులో అయా పార్టీలు ఇచ్చిన విషయాలనే క్రోడీకరించారు.

    అసలు రాష్ట్ర విభజన వలన కమ్యూనిస్ట్ తీవ్రవాదం పెరుగుతుందనే మరో వాదన కూడా ఉంది కదా? ఇవి రెండూ పరస్పర వ్యతిరేకమయిన విషయాలు కావా?

    కొన్ని చిన్న రాష్ట్రాలలో బీజేపీ గెలిస్తే మరికొన్ని చిన్న రాష్ట్రాలలో సీపీయం గెలెవలేదా? ఉదా. కేరళ, త్రిపుర. చిన్న రాష్ట్రాలకు, గెలుపోటములకు చిన్న, పెద్ద సైజులతో సంబంధం లేదని తెలియడం లేదా?

    సీపీయం భాషా ప్రయుక్త రాష్ట్రాలకు కట్టుబడి ఉంటే సంతోషం. కాని ఆంధ్ర, తెలంగాణా విడిపోతే భాషా ప్రయుక్త రాష్ట్రాలు కాకుండా ఎలా వుంటాయి? ఒకే భాష మట్లాడే వారు రెండు రాష్ట్రాలలో ఉండకూడదా?

    ప్రత్యేక రాష్ట్రం కావాలనే కోరిక తెలంగాణా ప్రజల్లో బలంగా ఉందని శ్రీకృష్ణ కమిటీయే తేల్చి చెప్పింది. మరి ఏ మార్క్సిస్టు సిద్ధాంతం ప్రకారం సీపీయం ప్రజల ఆకాంక్షలకి విరుద్ధంగా ప్రవర్తిస్తుంది?

    బెంగాల్ లో నక్సలైట్ సమస్య వేరేది అయినట్టే, కొన్ని చిన్న రాష్ట్రాలలో ఈ సమస్య ఉండడానికి కూడా వేరే కారణాలు ఎందుకు కాకూడదు?

    ReplyDelete
  15. మొత్తం ప్రజలు 100 మంది అనుకుంటే, వారిలో కనీసం 51 మందిని ఉద్రేకపరచగలిగితే మెజారిటీ ప్రజల్ని ఉద్రేకపరచినట్టు.
    అదే మొత్తం ప్రజలు 10 మంది ఐతే, వారిలో 6 మందిని ఉద్రేక పరచగలిగితే చాలు, మెజారిటీ ప్రజల్ని ఉద్రేకపరచినట్లే.51 మందిని ఉద్రేక పరచడంతో పోలిస్తే, 6 మందిని ఉద్రేకపరచటం జరంత ఈజీ అన్నట్టు(ఉన్నయ్,లేనియ్ జెప్పి). మన డెమాక్రసీల మెజారిటీ తెచ్చుకోనేకి కొన్ని పార్టీలు ఎంతకైనా తెగిస్తాయనేడ్ది మస్తుసార్లు ప్రూవ్ అయ్యింది. అదన్నమాట ముచ్చట.

    ReplyDelete
  16. I think the marxist ideology that asked is that
    "Workers of the world unite u have nothing to loose but your chains"

    because the working class[in india low socio economic and middle class] have to be united to fight against rulers of the bourgeous class for their rights.

    ReplyDelete
  17. తెలంగాణా విభజన లేదా సమైక్య రాష్ట్ర కొనసాగింపు కాదంటే ఇతర మార్గాలు ఈ సమస్యను సమతుల్యతతో చూడాల్సిన అవసరముంది. పాక్షికత్వం ఏ వైపున వచ్చినా చర్చ దారి తప్పుతుంది. రాజకీయ కోర్కెను రాజకీయ ప్రాతిపదికపై చర్చించాలి తప్ప భావోద్వేగాలను బట్టి కాదు. ప్రజలు కోరుతున్నారనే ఒక్క అంశాన్ని పదే పదే చెబుతూ స్వార్థ పరులైన పదవీ వ్యామోహితులైన పాలకవర్గ రాజకీయ వేత్తల పథకాలు పాచికలను చూడకపోతే చాలా నష్టం. వారిని మాత్రమే చూసి సామాజిక చారిత్రిక నేపథ్యాలను సమకాలీన వాస్తవాలను పట్టించుకోకపోయినా నష్టమే. అన్ని ప్రాంతాలకూ చెందిన ప్రధాన పాలక వర్గ నేతల రాజకీయ ప్రయోజనాలను బట్టి నడవడం తప్ప ప్రజల విశాల ప్రయోజనాలు ఇందులో పెద్దగా ఇమిడి వున్నది లేదు. వారు కావాలనుకున్నప్పుడు రాజీలు చేసుకుంటారు, రాజ్యాధికారాలు పంచుకుంటారు. గతంలో ఎన్నొ సార్లు జరిగిందిదే. కనకనే జనం అప్రమత్తంగా వుండాలి.
    హరి గారు సిపిఎం విధానం గురించి చాలా అడిగారు గాని అది ప్రధాన చర్చతో సంబంధం లేనిది. ఆ విధానంతో ఆయన విభేదించవచ్చు. మార్క్సిస్టు సిద్ధాంతం ఇలాటి విషయాలు స్పష్టంగానే చెబుతున్నది. సోవియట్‌ విచ్చిన్నం తర్వాత ప్రపంచ మంతటా ప్రకోపించిన అంతర్యుద్ధాలు, ఆధునికానంతర వాదం పేరిట సాగుతున్న శకలీకరణలుమన దేశంలోనూ అయోధ్య అనంతర పరిణామాలు ప్రగతిశీల వాదులెవరూ విస్మరించరు. మతతత్వ ప్రమాదం వివరాలు ఎంత వరకూ మాట్లాడాలో నాకు స్పష్టత వుంది. మతతత్వమైనా మావోయిజమైనా ఆయన ప్రస్తావించినందునే నేను స్పందించాను. అయితే ఈ దేశాన్ని రాష్ట్రాన్ని కూడా పాలించే రాజకీయ పక్షానికి మార్క్సిస్టు సిద్దాంతానికి ఏ సంబంధం లేదు. కనక వున్న రాజ్యాంగ పరిధిలోనైనా ఒక పరిష్కారాన్ని ప్రకటించితే అప్పుడు ఎవరి భావాలను బట్టి వారు స్పందిస్తారు.సంఖ్యాబలాలను బట్టి సమస్య ముగుస్తుంది

    ReplyDelete
  18. meeru ,mee marxist siddhantalu pratyaksanga chustunnamu.inkentakalam ee mosam?brahmanulu mantralu chadivinattu,meeru inkenta kaalam artham kaani maatalu maatladi kaalam velibuchalanukontunnaru?

    ReplyDelete
  19. krishna manohari garoo,

    nijanga ewaru ewarini mosam chestunnaro, anni prantala prajalanu vanchinche palaka paxala pachikalemito artham kanantawaraku iilati prasnalu vestuneuntaru. vastava viruddamaina vadanalu mantaralla mogistunnadeawaro jagrattaga gamaninchandi chalu.

    ReplyDelete