Pages

Friday, May 13, 2011

కడప ఫలితం కాంగ్రెస్‌కు శృంగభంగమే




కడప లోక్‌సభ, పులివెందుల శాసనసభ స్థానాల్లో జగన్‌, విజయమ్మలు సాధించిన అసాధారణ విజయం అధికార పక్షానికి శృంగభంగమే.గతంలోనే ఈ బ్లాగులో చెప్పుకున్న దానికి మించిన ఆధిక్యత వచ్చింది. ఇది బ్రహ్మాండమైన విజయమే గాక భయంకరమైన విజయం కూడా అని సాక్షి ఛానల్‌లో అన్నాను.ఆ ప్రభావం అధికార పక్షంపై కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి సవివరంగా నిర్వహించిన పత్రికా గోష్టిలోనూ వ్యక్తమైంది. వివేకానంద రెడ్డిపై వున్న ప్రత్యేకమైన ఆశలు కూడా కుప్ప కూలాయి.ఇవన్నీ వున్నా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగు దేశం లేకుండా ప్రభుత్వాన్ని కూల్చే శక్తి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు లేదు. ఆ మాట గెలుపు తర్వాత జగన్‌ మరోసారి అన్నారు. ఈ లోగానే తెలంగాణా సమస్యపై టిఆర్‌ఎస్‌ రాస్తారోకో వగైరాలు ప్రారంభిస్తున్నది.కనక రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు తప్పక పోవచ్చు.

No comments:

Post a Comment