గత రెండేళ్లలోనూ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో అతి ఎక్కువగా వినిపించిన మాటలు తెలంగాణా సీమాంధ్ర అన్నవి. (వాస్తవంలో సీమాంధ్ర అన్నమాట ఈ సందర్భంలో పుట్టించింది తప్ప అంతకు ముందు లేదు.) ప్రజలు ఎక్కడైనా ఒక్కటే అలాగే పాలకవర్గ నేతల వ్యూహాలు కూడా వారి వారి అధిపత్యాల పరిరక్షణకే ప్రధానంగా నడుస్తుంటాయని ఎన్నిసార్లు చెప్పినా చరిత్ర పాఠాలు ఉదహరించినా కొంతమందికి బోధపడలేదు.కాని కళ్లు మూసుకుంటే కటిక నిజాలు మాసిపోవు కదా! అందుకే ఆ సత్యం మరింత ప్రస్పుట్షమవుతున్న పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లాలో పాలక పక్షమైన కాంగ్రెస్‌లో మంత్రులు జూపల్లి కృష్ణారావు-డి.కె.అరుణల మధ్య సాగుతున్న అంతర్యుద్ధం గాని, తెలుగు దేశంలో నాగంకు
ఇతరులకు మధ్య నడుస్తున్న రగడ గాని దేన్ని సూచిస్తున్నాయి?ఒకటే ప్రాంతం అటుంచి ఒకటే జిల్లాలో ఒక పార్టీకి చెందిన వారిలోనే ఏకీభావం లేకపోవడం దేనికి నిదర్శనం? మరో వైపున గులాం నబీ అజాద్‌తో విడిగా సమావేశమైన తెలంగాణా కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రిపై ఫిర్యాదులు చేయడంలో తక్కిన వారందరితో కలసే వ్యవహరించారు. పదవుల కోసం అర్హతలు ఏకరువు పెట్టిన వారూ వున్నారు. బాగా సీనియర్ నాయకుడు ఒకరితే 'మీరు ముఖ్యమంత్రి రేసులో లేరు గనక..' అంటే అలా ఎవరన్నారని తనకంటే అర్హుడెవరని ఆగ్రహించారు! అలాగే రకరకాల జెఎసిలు ఒకదానిపై ఒకటి విమర్శలు చేసుకోవడం కూడా కనిపిస్తుంది. కోదండరామ్ టిఆర్‌ఎస్‌ను తప్ప తక్కిన వారిని పట్టించుకోవడం లేదన్న వాదనా వుంది. ఎన్నికల ఫలితాల మరురోజునే టిఆర్‌ఎస్ రాస్తారోకో పిలుపు ఇచ్చినప్పటికి అందరూ కలసి వచ్చిన నాటి ప్రభావం లోపించందని మద్దతు దారులే అంగీకరిస్తున్నారు. క్రాస్ ఓటింగ్ చేసిన ముగ్గురు శాసనసభ్యులపై సస్పెన్షన్ కథ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. కనక అంతర్గత వైరుధ్యాలు ఆధిపత్య వ్యూహాలు వున్నాయనే వాస్తవాన్ని దాటవేసి అంతా ప్రాంతీయ రేఖల మేరకే జరుగుతున్నదని ఎవరైనా అంటే అది అర్థసత్యమే అని చెప్పాలి.
అనిశ్చిత ఆంధ్ర ప్రదేశ్‌లో అధిష్టానం జాదూ
ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్‌కు కొత్త పరిశీలకుడి హౌదాలో వచ్చిన పాత కాపు గులాం నబీ ఆజాద్ అభిప్రాయ సేకరణ ప్రహసనం అధిష్టానం తాజా వ్యూహాలకు అద్దం పట్టింది. ఒక సంక్షోభం నుంచి బయిటపడటానికి మరో సంక్షోభాన్ని సృష్టించడం కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య. వై.ఎస్.రాజశేఖర రెడ్డి మరణానంతర పరిస్థితిలో ఎదురైన అంతర్గత కల్లోలాన్ని అదుపు చేయలేక టిఆర్‌ఎస్ అధినేత నిరాహారదీక్షను ఉపయోగించుకుని ప్రాంతీయ వివాదాలకు ఆజ్యం పోసింది. తర్వాత దానిపైన దాట వేత వైఖరితో ప్రజల మధ్య తంపులు పెట్టింది. ముఖ్యమంత్రిని మార్చి మరో ప్రయోగం చేసింది. మేలో జరిగే శాసనసభ ఎన్నికల తర్వాత రాష్ట్ర భవిష్యత్తుపై ఏదో నిర్ణయం జరగబోతుందన్న భావన కలిగించింది. తీరా ఆ ఎన్నికలు ముగిశాక ఆ సమస్యను దాటవేసేందుకు ముఖ్యమంత్రిపై ఫిర్యాదుల పర్వం ప్రారంభించింది. ప్రజా సమస్యల పరిష్కారంలో వైఫల్యం అన్న కోణం నుంచి కంటే వ్యక్తుల వర్గాల అసమ్మతిని వ్యక్తీకరించడానికే ఎక్కువ అవకాశమిచ్చింది. ఇదంతా సాధారణమే అన్నట్టు చెబుతున్నా వాస్తవంలో ప్రజల దృష్టిని మళ్లించే బృహత్ వ్యూహాలు ఇందులో దాగి వున్నాయి. ఈ లోగా ఇతర రాజకీయ శక్తులతో కూడా మంతనాలు జరుపుతూ తన పబ్బం గడుపుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేయొచ్చు. కడప ఉప ఎన్నికల్లో జగన్ అసాధారణ మెజారిటి తెచ్చుకున్న వెనువెంటనే ఈ ప్రక్రియను ప్రారంభించడం ద్వారా ఆ ప్రభావాన్ని తటస్థపరిచేందుకు కూడా ప్రయత్నిస్తుండొచ్చు. అంతా అయిన తర్వాత ఆజాద్ ఆఖరులో చేసిన ప్రకటన కాంగ్రెస్ పటిష్టతకు తోడ్పడాలని మాత్రమే! అంటే రాష్ట్ర ప్రజల అవస్థల కన్నా అధికార పక్షం మనుగడే కీలకమని భావిస్తున్నారన్నమాట. అంతా స్వకీయమే!
రెండు నిష్క్రమణల మధ్య తేడా
ఇటీవల ఎన్నికలు ముగిసిన రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు కొలువు తీరాయి. కేరళలో కన్ను లొట్టపోయినట్టు నెగ్గిన యుడిఎఫ్ కూటమి ముఖ్యమంత్రి వూమెన్ చాందీ ప్రమాణ స్వీకారం చేయకుండానే పదవుల పంపిణీపై అసమ్మతి పెల్లుబికింది. చిన్నరాష్ట్రమైన పాండిచ్చేరిలోనైతే ఎన్నికల నేస్తమైన తమను వదలిపెట్టి రంగస్వామి ఏకపక్షంగా ప్రభుత్వం ఏర్పాటు చేశారని అన్నా డి.ఎంకె నేత జయలలిత మండిపడ్డారు. ఆమె ప్రమాణ స్వీకారాన్ని చూస్తే సిపిఐ తెలుగు దేశం పార్టీలతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆహ్వానం అందుకోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించింది.మరోవైపున ఇప్పటి వరకూ ఏలిన కరుణానిధి కుమార్తె రాజ్యసభ సభ్యురాలు కనిమొళి 2 జి స్కాంలో అరెస్టు కావడం అధికారాంతపు దురవస్థను ప్రతిబింబించింది.కాగా హౌరాహౌరి రాజకీయ పోరాటం జరిగిన పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ పెద్ద మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బుద్దదేవ్ భట్టాచార్జీ,బిమన్ బసులు హుందాగా హాజరై ప్రజాస్వామ్య స్పూర్తిని ప్రదర్శించారు. ఆ ప్రభుత్వంపై ఎలాటి అవినీతి ఆరోపణలు ఇంత వరకూ రాలేదు. కాగా మమతా బెనర్జీ మాత్రం సింగూరులో టాటాలకు 600 ఎకరాల భూమి అప్పగించేందుకు సిద్దంగా వున్నానని పారిశ్రామికీకరణకు వ్యతిరేకం కాదని ప్రకటించడం ద్వారా ఎన్నికల ప్రచారంలోనూ అంతకు ముందు చేసిన వాదనలనుంచి తిరోగమించడం మొదలు పెట్టినట్టే. అలాగే ఆయుధాల గాలింపు మొదలు పెడతామని చేసిన ప్రకటన. మావోయిస్టులతో జత కట్టిన మమతకు ఆయుధాల అన్వేషణ అంత అత్యవసరంగా గుర్తు రావడంలో ఆంతర్యం దాచేస్తే దాగదు.ఇప్పటికే ఇద్దరు సిపిఎం కార్యకర్తలు హత్యలకు గురై అనేక దాడులు సాగుతున్న తీరు ఆమె భావి ధోరణికి తొలి సూచికగా వుంది. అయితే ఈ ఎన్నికల్లోనూ ఓడిపోయిన వామపక్షాలకు కూడా నలభై శాతంపైనే ఓట్టు వచ్చాయని గుర్తుంచుకుంటే అంత తేలిగ్గా వారిని దెబ్బ తీయడం సాధ్యమయ్యేది కాదని ఆమె ఆమె తాబేదార్లు గ్రహించాల్సి వస్తుంది. ఈ విషయంలో కేంద్రం పాత్ర ఎలా వుంటుందో కూడా చూడాల్సి వుంటుంది.
నేను మావోయిస్ట్ పార్టీ అభిమానిగా చెపుతున్నాను, మమత బెనర్జీ మా పార్టీతో జతకట్టడం ఏమిటి? She is explicit anticommunist. How can she tieup with our party? Check yourself twice before you make such statements.
ReplyDelete@ప్రవీణ్,
ReplyDeleteకళ్ళకి గంతలు కట్టుకున్నావా? అందరికీ కట్టాలని చూస్తున్నావా?
"How can she tieup with our party?"
పోనీ, మీపార్టీ మమతతో ఒప్పందం కుదుర్చుకుందా CPM కార్యకర్తలను మట్టుబెట్టడానికి?
అయితే ఈ రెండు విషయానికి జవ్వాబు చెప్పు...
1. 08-05-2010 నాడు మావోయిస్టు దుశ్చర్యవలన గూడ్స్ రైల్ Gyaneshwari Express ట్రైన్‌ని ఢీకొట్టటం వల్ల దాదాపు 80మంది చనిపోతే, రైల్‌వే మంత్రిగా వుండికూడా మావోయిస్టు దుశ్చర్యలను కండించకపోవడం పెట్టుబడీదారీ మీడియాకూడా మూక్కున వేలేసుకుంది అప్పట్లో!
2. CPM గ్రమీణ ప్రాంత నాయకులు చాలా మంది మావోయిస్ట్ చేతిలో హత్యలకు గురయ్యారు. వారి చెప్పిన రీజన్ భూస్వామ్యవేత్తలకు కొమ్ముకాస్తున్నారని. మరి తృనుమాల్ కార్యకర్తలుగాని, వారి నాయకులుగాని ఏ ఒక్కరూ గత ఐదు సంవత్సరాలలో మావోయిస్టులచే హత్యకాబడలేదు. ఆంటే,తృనుమాల్ కేవలం బడుగుజీవులకోసం పోరాడే పార్టీనా?
చాలా ఉదహరణలు చెప్పొచ్చు తృణుమాలకి మావోయిస్టులకి వున్న లింకులు. పార్లమెంటరీ ఎన్నికల వ్యవస్థలో పొత్తులు తప్పుకాదని మావోయిస్టులూ నిరూపించారు బెంగాల్‌లో.
డబల్ చెక్ రవి గారు చేసుకోనక్కర్లేదు. నువ్వు మీ పార్టీలో సిథాంతకర్తలను అడుకు తృణుమాలతో టై గురించి. శత్రువుకు శత్రువు మిత్రుడు అనె సిథాంతమో లేక పెద్దదానిని ఓడించాలంటే చిన్నవాటినంనిటిని కలుపుకుపోవాలనె సిథాంతమో ఎదోఒకటి చెపుతారు.
జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్ ఘటన జరిగినప్పుడు రైల్వే పోలీసులు FIRలో ఎవరి పేరూ వ్రాయలేదు. అది మావోయిస్టులు పెట్టారో, ISI ఏజెంట్లు పెట్టారో తెలియకుండా FIRలో పేరు ఎలా వ్రాస్తారు?
ReplyDeleteఅంతేకాదు, నాకు గుర్తున్నంతలో గ్యానేశ్వర్ ఎక్స్ ప్రెస్స్ దుర్ఘటన చేసింది మావోయిస్టులు కాదు, అధికార పార్టీనే అని మమత ప్రకటించినట్లు ఙ్ఞాపకం.
ReplyDeleteతెర గారూ మీరు బ్లాగుమొదలుపెట్టాక వామపక్ష భావజాలాన్ని చర్చించడానికి మా లాంటి ఒత్సాహికులకి ఒక మంచి ప్లాట్ ఫాం దొరికింది.
http://www.hindu.com/2011/04/25/stories/2011042558641300.htm
ReplyDeletehttp://www.thehindu.com/news/national/article443703.ece?css=print
హిందూ పేపర్లో వార్తలు చూడండి.
80 మంది ప్రాణాలు తీసిన దుర్ఘటనపై యూనియన్ రైల్వే మంత్రి గా ఉండి ఖండించకపోగా .. శత్రువులమీదకి దృష్టిమళ్ళించడం