Pages

Monday, May 2, 2011

ఉత్తరాంధ్రసభల్లో శ్రీశ్రీ జయభేరికి గొప్ప స్సందన





ఏప్రిల్‌ 29.30 తేదీలలో నేను విశాఖ పట్టణం, విజయ నగరం జిల్లాల్లో పలు సభల్లో పాల్గొన్నాను.29న విశాఖ జిల్లా యలమంచలి, నర్సీపట్నంలలో శ్రీశ్రీ జయభేరి అన్న నా పుస్తకం ద్వితీయ ముద్రణ ప్రతులను ఆవిష్కరించారు. నర్సీంపట్నంలో సాహితీమిత్రులతోనూ మీడియాతోనూ ఇష్టాగోష్టిగా జరిపిన సమావేశంలోనూ చాలా విషయాలు వచ్చాయి. శ్రీశ్రీ సాహిత్యం, జీవితం,రాజకీయాలను వివిధ కోణాలనుంచి పరిచయం చేసే 370 పేజీలను పై బడిన ఈ పుస్తకాన్ని అక్కడ సాహితీ మిత్రులు ఎంతగానో ఆదరించడం చాలా సంతోషం కలిగించింది. శ్రీశ్రీ పట్ట వారిలో అమితాసక్తి కూడా కనిపించింది. ఇటీవలనే ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి రెండవ సారి ఘన విజయం సాధించిన ఎంవిఎస్‌ శర్మ పుస్తకాన్ని పరిచయం చేశారు. ఆ రోజు రాత్రి ఉక్కు ఫ్యాక్టరీలో భారత ప్రజాస్వామ్యం అవినీతి సవాలు అన్న అంశంపై ప్రసంగించాను. 30 వతేదీ శ్రీశ్రీ జయంతి సందర్భంగా విశాఖ పౌర గ్రంధాలయంలోనూ, సాయింత్రం విజయనగరంలో గురజాడ గ్రంధాలయంలోనూ పుస్తక పరిచయం శ్రీశ్రీకి నివాళి కార్యక్రమం సాహితీ మిత్రుల మధ్య చాలా ఉత్సాహంగా నడిచింది. విజయనగరంలోనూ గురజాడ స్మారక చిహ్నంగా వున్న ఆయన స్వగృహంలో ఇష్టాగోష్టి నడిచింది. మొత్తంపైన 200కు పైగా శ్రీశ్రీ జయభేరి పుస్తకాలు తీసుకెళ్తే ప్రతిచోటా కొరత తప్ప పాఠకులకు అవసరమైనన్ని అందించలేక పోయినందుకు విచారించాను. పుస్తకం పట్ల మహాకవి పట్ల వున్న గౌరవం, నా పుస్తకానికి లభించిన ఆదరణ చాలా సంతోషం కలిగించాయి.వంద రూపాయల ధర గల ఈ పుస్తకం సాహిత్యాభిమానులకు యాభై రూపాయలకే అందించడాన్ని వారు కూడా హర్షించారు.

No comments:

Post a Comment