Pages

Monday, May 2, 2011

నకిరేకల్‌లో నర్రా రాఘవరెడ్డి జీవిత కథకు ఆదరణ



ఏప్రిల్‌ 25న నల్గొండ జిల్లా నకిరేకల్‌లో ఆ నియోజకవర్గానికి ఆరుసార్లు ప్రాతినిద్యం వహించిన నర్రా రాఘవ రెడ్డి జ్ఞాపకాలకు పుస్తక రూపం యాభయ్యేండ్ల ప్రజా జీవితం ఆవిష్కరించాను. ఈ సందర్భంగా తెలంగాణా సాయుధ పోరాట యోధులు చాలా మంది విచ్చేశారు. ఆ పోరాట విశిష్టత, తర్వాత కాలంలో పాలకవర్గాల తీరు తెన్నులు వంటివన్నీ ప్రస్తావనకు వచ్చాయి. తెలంగాణాలో దొరల చెరలకు స్వస్తి చెప్పిన కమ్యూనిస్టు ఉద్యమ పాత్రను, అందులో భాగమైన రాఘవ రెడ్డి ఆదర్శ ప్రజా జీవితాన్ని ప్రతివారూ కొనియాడారు.ఇక్కడ కూడా ఆయన జీవిత కథపుస్తకం 300 ప్రతులు అక్కడికక్కడే చెల్లిపోవడం విశేషంగా కనిపించింది. పుస్తకాలకు ఆదరణ లేదని ప్రజా యోధుల త్యాగాలు ఎవరూ పట్టించుకోరని కొందరు చేసే వ్యాఖ్యలు ఎంత అవాస్తవమో  రెండు అనుభవాలు కళ్లకు కట్టాయి.

No comments:

Post a Comment