ఎట్టకేలకు కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్పను తప్పించాలని బిజెపి అగ్రనాయకత్వం నిర్ణయించడం అనూహ్యమైన పరిణామం కాదు. దీనివల్ల ఆ పార్టీ ఇబ్బందులు తొలగిపోవడమూ జరగదు. కాకపోతే అవినీతిపై నిప్పులు కక్కుతూ మాట్లాడేవారు ఇన్ని రకాల ఆరోపణలకు ఆలవాలంగా వున్న ముఖ్యమంత్రిని ఎలా సహిస్తున్నారన్న కళంకం లేకుండా చేసుకోవడానికి మాత్రం ఇది పనికి వస్తుంది. అయితే రాజాను తొలగించినా ఆ భూతం మన్మోహన్‌ను వెన్నాడుతున్న స్థితి బిజెపిలోనూ పునరావృతం కావచ్చు. యెడ్డీ ఒక వేళ రాజీనామాకు అంగీకరించినా ఎల్లకాలం మౌనంగా వుండకపోవచ్చు.
మొత్తంపైన బిజెపి ఇప్పుడు బహుముఖ సవాళ్లను ఎదుర్కొంటున్నది. వాజ్‌పేయి రాజకీయంగా పూర్తి అచేతనమై పోవడం వాటిలో మొదటిది. అద్వానీని అనేక విధాల దెబ్బ తీసిన అంతర్గత వివాదాలకు తోడు