Pages

Friday, July 8, 2011

తాజా పరిణామాలు- పరిశీలనలు

1.కేంద్ర మంత్రి జైపాల్‌ రెడ్డి ప్రధానితో జరిపిన సమావేశానికి శృతి మించిన ప్రాధాన్యత లేదనుకుంటున్నాను. ఆయన ఆచితూచి మాట్లాడిన తీరే ఇందుకు నిదర్శనం.ఇంత కీలక సమయంలో తాను ఖాళీగా లేనని, తన వంతు చేస్తున్నానని అర్థం కావడానికి ఆయన ఈ భేటీ జరిపి వుండొచ్చు. అంతేగాని అడుగు ముందుకు వేసి అనునయ వాక్యాలైనా చెప్పడానికి సిద్దంగా లేరు. ఆఖరుకు సంయమనం పాటించాలని, ప్రశాంతత కాపాడుకోవాలని కూడా చెప్పక పోవడం గమనించదగ్గది. ఈ మాటలు చెప్పడానికి క్యాబినెట్‌ హౌదా అడ్డమేమీ కాదు. ఇప్పుడు తెలంగాణా విభజన కోరే వారి వాణిని వినిపించే సుఖేందర్‌ రెడ్డి జైపాల్‌ మేనల్లుడు(?) కాగా మందా జగన్నాథం బాగా సన్నిహితుడు. ఈ ఇద్దరూ తెలుగు దేశం నుంచి వచ్చిన వారే కావడం మరో విశేషం. సీనియర్‌ మంత్రిగా జైపాల్‌ రెడ్డి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలనే అందరూ కోరుకుంటారు గాని ఆయన తన పరిమితులను అతి జాగ్రత్తగా పాటిస్తున్నారు.
2. కాంగ్రెస్‌ నేత దామోదర్‌ రెడ్డి జెఎసి గురించి చేసిన వ్యాఖ్యలు రాజినామాల తర్వాత కూడా కొనసాగుతున్న రాజకీయ వైరుధ్యాలను వెల్లడిస్తున్నాయి. ఈ సందర్భంలో స్వంత అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి
కాంగ్రెస్‌ నాయకులు ఎంతగా ఆలోచిస్తున్నారో ఈ మాటలే చెబుతాయి. ఇప్పటికే బస్సు యాత్ర ప్రారంభించిన తెలుగు దేశం నాయకులు కూడా అంతకు ముందు టిఆర్‌ఎస్‌ తమకు ఆపాదించిన కళంకాన్ని వదిలించుకున్నట్టుగా ముందుకు పోతున్నారు. వారిని వాయిదా వేసుకోమని కోరడంలోనూ ఇదే కనిపిస్తుంది. జెండాలు లేని ఎజెండా గురించి ఎంతగా చెప్పినా ఎవరి ప్రయోజనాలు వారివేనని ఇవి స్పష్టం చేస్తున్నాయి.
3.భువనగిరిలో సిపిఎం కార్యాలయాన్ని దుండగులు దహనం చేయడం అత్యంత అవాంఛనీయమైన అభ్యంతర కరమైన ఘటన. ఈ మల్లగుల్లాలతో ఏ సంబంధం లేని సిపిఎం ఒకే వైఖరితో కొనసాగుతున్నదని అందరూ అంగీకరిస్తున్నారు. ఈ సమస్యపై ఏ ప్రాంతంలో సాగుతున్న ఏ ఆందోళనలోనూ సిపిఎం భాగస్వామి కాదు. నిర్బంధం ఎక్కడ జరిగినా ఖండించడం తప్ప వాటినిఖండించిందీ లేదు. తన వరకూ తను ప్రజా సమస్యలపై పోరాటాలను యధావిధిగా సాగిస్తున్నది. అలాటి పార్టీ కార్యాలయాన్ని ఇంకా చెప్పాలంటే ఏ పార్టీ కార్యాలయంపైనైనా దాడి చేయడం దగ్ధం చేయడం ప్రజాస్వామికమనిపించుకోదు. అభిప్రాయ భేదాలతో నిమిత్తం లేకుండా ప్రజాస్వామిక వాదులందరూ ఈ దుశ్చర్యను ఖండిస్తారని ఆశించాలి.

4.వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్లీనం ఘనంగానే ప్రారంభమైంది. విజయమ్మ ప్రసంగం కూడా అభిమానులను ఆకట్టుకునేట్టు హుందాగా సాగింది. ఈ సమావేశాలలో వైఎస్‌ఆర్‌ సంక్షేమ పథకాల ప్రశంస, ఆయన లేని లోటు, ప్రస్తుత ప్రభుత్వంపైనా నాయకత్వంపైనా తెలుగు దేశంపైనా విమర్శలకు కేంద్రీకరణ వుంటుంది. కొంతమంది అనుకుంటున్నట్టు ప్రాంతీయ సమస్యపై స్పష్టమైన తుది ప్రకటన వెలువడుతుందని ఆశించడం అవాస్తవమే. మిగిలిన రెండు పెద్ద పార్టీలను దాటి పోయి మాట్లాడే పని జగన్‌ ఎందుకు పెట్టుకుంటారు? కాకపోతే ఆ విషయాలు మరో భాషలో అస్పష్టంగా చెప్పి అందరినీ మెప్పించే ప్రయత్నమే చేస్తాడు. కావాలంటే కేంద్రంపై విమర్శలతో సరిపెడతారు.

15 comments:

  1. సమస్యా పరిష్కారం రాష్త్ర నాయకుల చేతుల్లో ఉంది. కేంద్రం చేతుల్లో కాదు కాక కాదు. ఇంత పెద్ద రాష్ట్రాన్ని అన్ని ప్రాంతాల వారు ఒప్పుకుంటేనే విభజించటమో కలిపి వుంచటమో సాధ్యం. అది తేలాల్సింది రాష్ట్రంలో. ఇలా కాక ఇంకో లాగా అవ్వొచ్చని ఎవరికైనా అనిపిస్తే అదేంటో చెప్పగలరు.

    ReplyDelete
  2. పావని గారూ,

    మీరు ఏం చెప్పాలనుకుని ఏం చెబుతున్నారో అర్థం కావడం లేదు.ఏ రాష్ట్ర సమస్య పరిష్కారం ఆ రాష్ట్రం చేతుల్లోనే వుంటే ఇక కేంద్రం, దేశం అన్న మాటలకు అర్థమే వుండదు. రాజ్యాంగం కూడా అలా చెప్పడం లేదు. మీరు చెప్పే ప్రకారమైతే దేశంలో కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే వుండేవి కావు. సమైక్య అనైక్య వాదులెవరూ ఈ సూత్రీకరణను ఒప్పుకోరు. ఎందుకంటే అది పూర్తిగా వాస్తవ విరుద్ధం, అనర్థ దాయకం కూడా. ఎవరి అభిప్రాయాలు ఏవైనా వాస్తవాలను రాజ్యాంగాన్ని గమనంలో వుంచుకుని మాట్లాడాలి. ఆర్టికిల్‌ 3 ప్రకారం రాష్ట్రాల సరిహద్దుల మార్పు, విలీనం, విభజన, పేరు మార్పు ఇవన్నీ పార్లమెంటుకే వున్న అధికారాలు. దానికి ముందు సంబంధిత రాష్ట్ర శాసనసభ అభిప్రాయం నిర్ణీత గడువు విధించి రాష్ట్రపతి తెప్పించాల్సి వుంటుంది. ఆ సభ అంగీకరించినా తిరస్కరించినా కేంద్రం తన పని తాను చేసుకుపోవచ్చు. ఆర్టికిల్‌ 4 ప్రకారం ఇది రాజ్యాంగ సవరణ కిందకే వస్తుంది. కొంతమంది అంటున్నట్టు శాసనసభతో నిమిత్తం లేకుండా పార్లమెంటే ఏదైనా చేయొచ్చుననడం గాని, మీరంటున్నట్టు కేవలం రాష్ట్రాలే నిర్ణయించుకోవచ్చనడం గాని నిజం కాదు. వివరణ కోసమే ఈ జవాబు.

    ReplyDelete
  3. ఒక చిన్న వివరణ. ఆర్టికల్ 3 ఇచ్చిన అధికారం ప్రకారం పార్లమెంటు రాష్ట్రాలను పునర్విభజించినపుడు షెడ్యూల్ 1, షెడ్యూల్ 4 లలో ఉన్న రాష్ట్రాలు, యూనియన్ టెర్రిటరీల సమాచారానికి ఆటోమేటిక్‌గా సవరణ అవసరమవుతుంది. అయితే ఇది రాజాంగ సవరణ (ఆర్టికల్ 368 ప్రకారం) కిందకు రాదు కనుక ఆర్టికల్ 368 సూహించే రాజ్యాంగ సవరణ ప్రొసీజరు పాటించే అవసరం లేదు. ఇది కేవలం సమాచారాన్ని సవరించడం మాత్రమే.

    article 4:
    2) No such law as aforesaid shall be deemed to be an amendment of this Constitution for the purposes of article 368.

    ReplyDelete
  4. రవి గారు, నేను కేవలం తెలంగాణా సమస్యని ద్రుష్టిలో ఉంచుకోని రాస్తే మీరు రాజ్యాంగం గురించి జెనరలైజ్ చేసి మాట్లాడుతున్నారు.పైగా నేనేదో ప్రతి విషయం రాష్ట్రాల చేతుల్లోనే ఉండాలని,కేంద్రపు జోక్యం అక్కర్లెదని అంటున్నట్టు సమాధానం నేనడగని ప్రశ్న కు రాసుకొచ్చారు.

    గతపదేళ్ళలో మనకు మూడు కొత్త రాష్ట్రాలేర్పడ్డాయ్. అవి ఆయా రాష్త్ర నాయకుల ఉమ్మడి అంగీకారంతో ఏర్పడ్డాయా లేకా కేవలం కేంద్రం దగ్గర మీరు పైన చెప్పిన రాజ్యాంగ అధికారాలను వాళ్ళ మీద రుద్దేస్తే వచ్చాయా? మీకు నిజంగా తెలియదా?(అంతకు 50 years ముందు రాష్ట్రాలెలా వచ్చాయనేది అప్రస్తతుం ఇక్కడ..ఎందుకంటె అప్పుడొక national framework ఉంది..on top of that those were formative years of our nascent democracy under a strong single party rule).

    సమస్యకి సమాధానం ఇక్కడే ఉంది అంటే అర్థం..సూత్రప్రాయంగా కేంద్రానికి మనని కలిపి వుంచటానికికానీ, విడగొట్టటానికి కానీ అభ్యంతరం లేదు. కానీ ఏది చేసినా రెండు పెద్ద ప్రాంతాల్లో ఒకదానికి సమ్మతం కాదు. ఒకేదాన్ని ఇవ్వటం ఇవ్వక పోవటం ఎలా కుదురుతుంది? దానికి సమాధానం concensus. మన నాయకుల మధ్య ఒప్పందం కావాలి. దానికి ముందు మన రాష్ట్ర నాయకులు కలిసి కూర్చోని మాట్లాడుకోవాలి. అసలు తమ పార్టీ position ఎంటొ చెప్పటానికే ప్రధాన ప్రతిపక్షం సిద్ధంగా లేదు. జగన్ కూడా చేతులెత్తేసాడు. చలి కాచుకోవటం తప్ప కనీసం వాళ్ళ సొంత లీడర్స్ ని కూడా నోరు జారకుండా, రెచ్చగొట్టకుండా కట్టడి చెయ్యలేరు.
    సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో, అందరిని కలుపుకోకుండా కేంద్రం రాజ్యాంగంలో ఏదో రాసుకున్నాం కదా అని ఇంత ముఖ్యమైన విషయాన్ని, ఇంత పెద్ద రాష్ట్రంలొ, ఇన్ని విద్వేషాల మధ్య తోచినట్టు చెయ్యగలదా. అసలు చెయ్యొచ్చా? అలా చేస్తే సమస్య నిజంగా పరిష్కారం అవుతుందా?

    ఇన్ని విశ్లెషణలు రాస్తారుకదా మీరు అందరిని మెప్పించే solution ఏంటొ ఒక్కసారైనా చెప్పరే? కేంద్రం ఏదో ఒకటి తేల్చాలి అని అంటం తప్ప..ఏంటా ఏదో ఒకటి?.విశ్లెషకుడిగా కేవలం సలహాలివ్వటం వరకెగా మీ బాధ్యత. అదైనా చెయ్యొచ్చుగా.
    ఇప్పుడు కెంద్రం ఏమి చేస్తే బావుంటుందో విశ్లేషణాత్మకంగా చెప్పండి.అది అన్ని ప్రాంతాల వారిని ఏ రకంగా సంత్రుప్తి పరుస్తుందో వివరించిడి. మంచి academic discussion అవుతుంది.

    I already explained my take on this. Solution is firmly in the hands of our own local leaders. Our leaders have to sit together, discuss,come to an agreement. Center can at best act as a mediator to facilitate that. If we at state proposes something together and center is dilly-dallying then one can certainly blame them. Not right now.
    You are not an ordinary blogger. You carry much more weight and respect than many others here.Thats is the main reason I want to here from people like you.Regards.

    ReplyDelete
  5. ఈ అధికారాన్ని రాజ్యాంగం కేంద్రానికి ఇవ్వడానికి కారణమే ఇలాంటి విషయాల్లో ఏకాభిప్రాయం సాధ్యం కాదని, కలిసి ఉండడం వల్ల డిస్ప్రపోర్షనేట్‌గా లాభం పొందేవాడు విడిపోవడానికి ఎన్నటికీ ఒప్పుకోడు కాబట్టి. మీరు చెప్పిన మూడు రాష్ట్రాల్లో కనీసం ఝార్కండ్ ఏర్పాటు కాన్సెన్సస్‌తో సంబంధం లేకుండానే జరిగింది.

    ReplyDelete
  6. విశ్వరూప్ గారు, there was a tripartite agreement between Central Govt, state govt.(no less than Lallu Prasad) and Jharkhaland leaders. అదే concensus అంటే.

    Concensus ఎప్పటికీ రాదు అని ఎలా చెప్తున్నారండి.తప్పకుండా వస్తుంది.ఇప్పటి వరకు అసలు మనం ఆ అలోచనె బుర్రలోకి రానివ్వట్లేదు. What is at stake? అనేది రెండు ప్రాంతాలవారికి తెలవాలి. విడిపోతే( లేదా కలిసుంటే) అంతా లాభమే అని ఒకళ్ళు, అంతా నష్టమే అని ఇంకొకళ్ళు అనుకుంటున్నారు.నిజమెక్కడో మధ్యలో ఉంటుంది.ఒకటి రావాలంటే ఇంకోటి కోల్పోవాల్సి వస్తుంది.నా లాభం ఇంకొకళ్ళకు నష్టం లాగా వుంటే-అది solution కానే కాదు.
    నిజం,న్యాయం ఒక ప్రాంతం వారి వైపే ఉన్నాయంటం సరి కాదు.

    In my opinion, ఇంత పెద్ద రాష్ట్రాన్ని కేవలం ఒక ప్రాంతం వాళ్ళని మెప్పించే విధంగా కేంద్రం ఎప్పటికి decision తీసుకోదు.అది తప్పు, ప్రమాదకరం.

    ReplyDelete
  7. Well said, Pavani garu. You have good clarity on the issue.

    It has to be settled here and the decission should be forwarded to the Center. It will pass a bill to that effect, keeping national interests in view (if any neighbouring states are affected etc).

    The seperatists are also support united Telangana when it comes to the capital Hyderabad! :) Their approach itself is fundamentally wrong - hate first so that no consensus will be reached and lament/harp-on the same for decades. As some rightly pointed out KCR doesn't want seperation but wants the issue to remain. That is why he did all damage, so that consensus will never be reached.

    ReplyDelete
  8. snkr, pavani and others,

    some nice discussion after a ong time.i thank everybody in this regard.

    1.while parliamant is empowered in the matters of altering status co in the states prior opinion of the assembly concerned is required. this implies consultation process. but one is constitutional another is political process.
    2.i referred to two extreme viewpoints in this regard and tried to present actual position. political antics fall under different category.
    3.i never minced matters in expressing my view point. i for one never believed division of state as panacea for all ills. it is not without many new problems.but having created a mess with vested interest it is the duty and responsibility of center to come out with a categorical position.please understand one can't be blamed for some others mistake.while u are not wrong in pointing out the follies of local leaders it is not correct to absolve center.
    4.lastly, as u repeatedly point out my self in particular taking a forthright stand in nailing down fallacies of many self proclaimed regional leaders. in these troubled times it is nothing but swimming against the tide. given my back ground i am not worried with great confidence in all Telugu people cutting across regional lines.i am sure people take any reasonable solution in their stride and teach a lesson to vested interests as they did earlier.
    5.please understand it is political calculation of ruling party that is coming in the way of announcing any solution and nothing else.
    6.Finally educated and enlightened people like u should understand multiple political and class contradictions at work simultaneously with out counter posing each other.
    sorry for the lengthy response.
    bye.

    ReplyDelete
  9. I love long mails. Thanks for your analysis. But you again dodged the question పోన్లెండి.
    మీరు సమాధానం చెప్పలేరు.మీరే కాదు.దీనిని ఎలా solve చెయ్యాలో ఎవరికీ తెలియదు. ఎవర్ని తిట్టాలో మాత్రం అందరికీ తెల్సు.
    శ్రీ శ్రీ గారు చెప్పిన ఫ్రెంచ్ surrialist writer Mapaasaa(Maupassant) కథ ఒకటుంది.ఒక crab సముద్రపు వొడ్డున యుద్ధంచేస్తుంటుంది.దాంతో అదే.ముందు కాళ్ళు వెనక కాళ్ళతో, కుడి కాళ్ళు ఎడమ కాళ్ళతో.విరిగిన కాళ్ళని గెలిచిన కాళ్ళతో మోసుకుంటూ అది విజయగర్వంతో నవ్వుతూ ఏడుస్తూ కవాతు చేసుకుంటూ వెల్తుంటుంది. అంతే కథ.
    బైట నించి చూసే వాళ్ళకి అది ఆత్మహత్య..విధ్వంసం లేదా వినోదం.దానికి మాత్రం అందులోనే విజయం..ఓటమి.మూర్ఖానందం. ఇక్కడ్నించి(USA) మన రాష్ట్రాని చూస్తుంటే.. ఆ కధే గుర్తుకొస్తుంటుంది.

    ReplyDelete
  10. Pavani, you nailed it. Respect.

    ReplyDelete
  11. snkr,pavani and all the angry birds...

    u r right . thank u.

    ReplyDelete
  12. Ravi gaaru.Thanks for your time.
    Viswaroop, Snkr, Angry Bird and Tara gaaru..thank you. Keep this mostly healthy convrsation to the point. And guys ..please don't go tangential.

    ReplyDelete
  13. @tara

    do remember that my reply is in general nature.i leave it your discretion including latest terms u used.bye for this session.

    ReplyDelete
  14. I know, at then end of day you can only remove my comments.

    Remember, forcibly shutting mouths when ever you don't have answers won't work always, you have to face jerks like me one day or other.

    ReplyDelete