Pages

Sunday, July 24, 2011

జగన్‌పై ఆరోపణల దర్యాప్తు


ఇటీవలి కాలంలో పాలక వర్గమూ మీడియా కేంద్రీకరించే అంశాలు రెండే - తెలంగాణా, జగన్‌. ఈ రెండవ అంశానికి సంబంధించి వచ్చిన పరిణామాలు రాజకీయాలపై ప్రభావం చూపిస్తున్నాయి. జగన్‌పై వచ్చిన అరోపణలను ప్రాథమికంగా దర్యాప్తు చేసి రెండు వారాల్లో నివేదిక నివ్వాల్సిందిగా హైకోర్టు ఆదేశించడం ముఖ్యమైన మలుపు. దీన్ని వెంటనే స్వాగతించి సంసిద్ధమయ్యే బదులు సుప్రీం కోర్టులో నిలుపదల ఉత్తర్వుల కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దేశమంతటా అవినీతి ఆరోపణలపై పెద్ద వుద్యమాలు నడుస్తున్న స్తితిలో ఈ దర్యాప్తును సుప్రీం కోర్టు ఆపుతుందని ఎవరూ అనుకోలేదు కూడా. ఇప్పుడు సిబిఐ ఎలాటి విషయాలు నివేదిస్తుందో వాటిపై న్యాయస్థానాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాల్సిందే. అయితే జగన్‌ పార్టీ నాయకులు ఈ కేసును రాజకీయ కుట్ర కింద కొట్టి వేయడం మాత్రం ఎవరూ హర్షించలేదు. గతంలో వీటిని సహించిన కాంగ్రెస్‌ ఇప్పుడు ఇదంతా చేయడంలో రాజకీయాలు వున్నాయనేది నిజమే అయినా వాస్తవాలు ప్రజల ముందు వుంచాల్సిన బాధ్యత జగన్‌పై వుందనేది అంతకన్నా పెద్ద నిజం.

No comments:

Post a Comment