Pages

Thursday, July 28, 2011

యెడ్డీకి ఉద్వాసనతోనే బిజెపి సమస్యలు తీరవు




ఎట్టకేలకు కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్పను తప్పించాలని బిజెపి అగ్రనాయకత్వం నిర్ణయించడం అనూహ్యమైన పరిణామం కాదు. దీనివల్ల ఆ పార్టీ ఇబ్బందులు తొలగిపోవడమూ జరగదు. కాకపోతే అవినీతిపై నిప్పులు కక్కుతూ మాట్లాడేవారు ఇన్ని రకాల ఆరోపణలకు ఆలవాలంగా వున్న ముఖ్యమంత్రిని ఎలా సహిస్తున్నారన్న కళంకం లేకుండా చేసుకోవడానికి మాత్రం ఇది పనికి వస్తుంది. అయితే రాజాను తొలగించినా ఆ భూతం మన్మోహన్‌ను వెన్నాడుతున్న స్థితి బిజెపిలోనూ పునరావృతం కావచ్చు. యెడ్డీ ఒక వేళ రాజీనామాకు అంగీకరించినా ఎల్లకాలం మౌనంగా వుండకపోవచ్చు.

మొత్తంపైన బిజెపి ఇప్పుడు బహుముఖ సవాళ్లను ఎదుర్కొంటున్నది. వాజ్‌పేయి రాజకీయంగా పూర్తి అచేతనమై పోవడం వాటిలో మొదటిది. అద్వానీని అనేక విధాల దెబ్బ తీసిన అంతర్గత వివాదాలకు తోడు
ఆయనకూ వయస్సు సహకరించని స్థితి.ఇక సుష్మా స్వరాజ్‌, అరుణ్‌జైట్లీ,వెంకయ్య నాయుడు, రాజ్‌నాథ్‌ సింగ్‌ వంటివారంతా ఇంచుమించు సమానులు కావడంతో సమస్యలు తలెత్తుతున్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతుంటారు. వీరందరి మధ్యనా అనేక వివాదాలు బహిరంగంగానే నడిచాయి. అలాగే గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని అతున్నత నేతగా ముందుకు తేవాలనే వారు,కాదనే వారు కూడా గణనీయంగా వున్నారు. ప్రమోద్‌ మహాజన్‌ హత్యా ప్రయత్నం వల్ల చనిపోయిన తర్వాత నిధులు సేకరించడంలోనూ వెనకపట్టు వుందంటారు.అన్నిటినీ మించి ఆ పార్టీ మత రాజకీయాల కారణంగా దేశ విదేశ గుత్తాధిపతులు ఇంకా కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపుతున్నారని అందువల్లనే యుపిఎ ప్రభుత్వం ఎన్ని సంక్షోభాలను ఎదుర్కొంటున్నా వారి మద్దతు కొనసాగుతున్నదని ఈ విశ్లేషణల సారాంశం. అందుకే పెద్ద ప్రతిపక్షంగా వున్నా బిజెపి పార్లమెంటులో తనదైన పదునైన పాత్ర పోషించి మెప్పించలేకపోతున్నది. పైగా ఆర్థిక విదేశాంగ విధానాలలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ మార్గం కూడా దానిదగ్గర లేదు. బిజెపి కోరుకున్న విధంగా పుంజుకోలేక పోవడం వెనక ఇన్ని కారణాలున్నాయి....

No comments:

Post a Comment