Pages

Thursday, November 8, 2012

వీర నరసింహగా కెసిఆర్‌




ఇక నరసింహావతారమేనని టిఆర్‌ఎస్‌ అద్యక్షుడు కె.చంద్ర శేఖర రావు ప్రకటించారు. కాంగ్రెస్‌ మోసం చేసిందని, ఇక నమ్మేది లేదని చెప్పేశారు. ఈ బ్లాగు/ఫేస్‌ బుక్‌ ఎంట్రీలు చదివేవారికి ఆయన మాటల డొల్లతనం ఎప్పుడో అర్థమై వుండాలి. కాంగ్రెస్‌ కన్నా మించి పోయి తెలంగాణా ఏర్పాటు తేదీలు ప్రకటించిన కెసిఆర్‌ అందుకు ఆవగింజంతైనా పశ్చాత్తాప పడింది లేదు. అ దే కోవలో ఇప్పుడు చెప్పిందే ఆఖరి వాక్యమనీ అనుకోరాదు. కాకపోతే రాజకీయంగా బలం పెంచుకోవడానికి వంటరిగా నిలదొక్కుకోవడానికి 100 సీట్లు తెచ్చుకోవడమనే పల్లవి ఎత్తుకున్నారు. ఇప్పుడు ఇతర పార్టీలతో సంబంధాలు జెఎసితో అనుబంధాలు తదితర అనేక అంశాలు చిక్కుముడులుగా వున్నాయి. అ న్నిటినీ మించి తెలుగు దేశం, వైఎస్‌ఆర్‌ పార్టీ వంటి ప్రధాన పార్టీలు పాద యాత్రలతో ప్రచారం చేసుకుంటుంటే మన స్థితి ఏమిటన్న ప్రశ్నలు వచ్చాయి. వీటన్నిటికీ సమాధానం ఇవ్వడంతో పాటు సంక్ష్ఞభాన్ని సానుకూలంగా మార్చుకోవడానికే కె.సిఆర్‌ తనదైన శైలిలో కొత్త అవతారమెత్తుతున్నారు. ణరదాకోసం చెప్పాలంటే- ఇప్పటికే ఒక నరసింహం రాజ్‌భవన్‌లో మకాం చేసి వుండగా మరో రాజకీయ నరసింహం అవసరమా, అద్యక్షా?

2 comments:

  1. మరో కొత్తమోసానికి తెర లేపుతున్నారు కేసీఆర్ గారు.
    నరసింహుడు కాదుకదా అరసింహుడు కూడా కాదు.
    పె ద్ద ఏనుగు సామెత గుర్తుకు వస్తుంది ఆయన మాటలు వింటుంటే.
    చాలు . మరో సంతోష్ ని తెలంగాణా ఇవ్వలేదు.

    ReplyDelete
  2. రాజభవన్లో ఉన్న వ్యక్తి నరహింసన్ :)

    ReplyDelete