Pages

Thursday, November 8, 2012

వినోదంలో వికృత వివాదంరాంబాంబులు రాజకీయాలు అంటూ సినిమాలకు సంబంధించిన వివాదాలపై లోగడ చర్చించాము. ఆ తర్వాత కాలంలో దేనికైనా రెడీలో బ్రాహ్మణులను అవమానించారంటూ మరో దుమారం రేగింది. ఇది మోహన్‌ బాబు ఇంటిముందు ధర్నా, వారిపై దౌర్జన్యం వంటి సంఘటనలకు దారి తీసింది.కులాల కుమ్ములాటగా మారింది. నిజంగా ఏదైనా సినిమాలో ఎవరికైనా కష్టం కలిగితే సంబంధిత అధికారులను ఇక్కడ సెన్సార్‌ బోర్డుకు వెళ్లాలి. పైగా ఏదైనా సినిమాలో ఒక కులానికి చెందిన పాత్రలను చూపించితే అవమానంగా భావించడం అవసరమా అన్న ప్రశ్న కూడా వస్తుంది. కథను బట్టి లేదా తీసే వారి సంస్కారాన్ని బట్టి పరిపరివిధాల పాత్రలు పెడుతుంటారు. నౌచిత్యాలు కూడా వుండొచ్చు. ్‌ెూహన్‌ బాబు గత చిత్రాలలోనూ తమను తక్కువగా చూపించారని బ్రాహ్మణ సంఘాల ఫిర్యాదుకు ఆధారాలుండొచ్చు. అ ది కథకు అవసరమా కాదా అన్నది అసలు ప్రశ్న. ఏదైనా కులానికి చెందిన పాత్రను లేదా బృందాన్ని ఎగతాళిగా చిత్రిస్తే బాధ కలగొచ్చు గాని ఆ పేరిట అడ్డుకోవడం మొదలెడితే ఆగేదెక్కడీ చారిత్రికంగా చూస్తే శ్రీనాథుడు కాశీఖండములో చిత్రించిన గుణనిధి, తెనాలి రామకృష్ణుని పాండురంగ మహత్యములో నిగమశర్మ బ్రాహ్మణపాత్రలైనా చాలా హీన గుణాలతో వుంటాయి. జుురి వారిని ఏమనాలి? ఎందుకనాలి? సమర సింహారెడ్డి, చెన్నకేశవ రెడ్డి ఇలా ఒకే విధమైన పేర్లే వస్తున్నాయంటే నరసింహనాయుడు అని పె ట్టారు.అయితే వొరిగిందేమిటి? తరిగిందేమిటి? వినోదానికి(కొన్నిసార్లు వికారానికి కూడా) ఉద్దేశించిన సినిమాలపై వివాదాలు పెంచుకుని దాడులు దౌర్జన్యాల వరకూ రావడం అర్థరహితం. ఆలస్యంగా రంగ ప్రవేశం చేసిన పరిశ్రమ ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు కూడా శాంతియుత పరిష్కారం కోసం చొరవ తీసుకోవడం మంచిదే.ఇక ముందైనా ఇలాటి నిరర్థక వివాదాలతో కాలం వ్యర్థం చేసుకోకుండా జాగ్రత్తపడాలి.

9 comments:

 1. దాడులు, దౌర్జన్యాలు ఏమీ జరగలేదు. బ్రాహ్మణులు నిరసన తెలపడానికి మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. ఆయన ఊళ్లో లేరు. నిరసన తెలిపిన బ్రాహ్మణులను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లి వదిలేశారు. మర్నాడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వద్ద ఆందోళనకారులు నిరసన తెలిపి.. మళ్లీ మోహన్ బాబు ఇంటివద్దకు బయల్దేరారు. వాళ్లు ఇంటిదాకా రాకముందే.. ఇద్దరు కానిస్టేబుళ్లు వాళ్లని ఆపారు. వెనక్కి వెళ్లిపోమని చెబుతుండగా.. మోహన్ బాబు గూండాలు లాఠీలతో (ఏబీఎన్ నుంచి బ్రాహ్మణులు వస్తున్న విషయం తెలుసుకుని ముందే సిద్ధంగా ఉన్నారు) పరిగెత్తుకుంటూ వెళ్లి.. కానిస్టేబుళ్లు అప్పటికే ఆపేసిన బ్రాహ్మణులను చావచితక్కొట్టారు. ముందురోజు నిరసన తెలిపిన బ్రాహ్మణులు ఎలాంటి దాడీ చేయలేదు. కనీసంఒక్క రాయి కూడా మోహన్ బాబు ఇంటిమీద వేయలేదు. రెండోరోజు ఆ ఇంటి చాయలకు కూడా రాకముందే కుమ్మి వదిలిపెట్టారు. ఇప్పుడు చెప్పండి తప్పు ఎవరిదో? బ్రాహ్మణుల్లో గుణగణాలు ఎంచడం కాదు సమస్య. పాత్ర పరంగా చెడుగా ఉంటే ఎవరూ పట్టించుకోరు. కానీ, ఈ సినిమాలో బ్రాహ్మణులను ఘోరాతిఘోరంగా అవమానించారు. ‘‘సంభావన ఎక్కువిస్తే మీరు తోక ఊపుకుంటూ వస్తార్రా’’ అనే డైలాగు సినిమాకు ఎంతవరకూ అవసరమో మీ తెలివైన బుర్రతో ఆలోచించి తేల్చుకోండి.

  ReplyDelete
 2. ఈ నీతిని రేపు ఏమైనారిటీ మతం వాల్లో తమ మనోభావాలు దెబ్బతిన్నాయన్నప్పుడు చెప్పగలరా? కనీసం నోరు విప్పగలరా మీలాంటీ మేధావులు? రెండునాల్కల ధోరణి వలనే సమాజంలో మంచెదో చెడేదో తెలుసుకోకుండా చేస్తుంది సమాజంలో

  ReplyDelete
  Replies


  1. నేను దాడులు, దౌర్జన్యాలు అన్న మాట ఎవరికి వర్తిస్తున్నదీ చదివి స్పందించగలరు. ఇక మైనార్టి మెజార్టిల లెక్కన రాజకీయాలు నడిపేవారు వేరే వుంటారు. ఔచిత్యం పాటించారా లేదా దురుద్దేశంతో తప్పు పద్ధతిలో తీశారా అన్నదే సమస్య. ణల్మాన్‌ రష్డీ, తస్లీమా నస్రీన్‌ వంటివారిపై దాడులను నిషేదాలను ఖండించడం మీకు తెలిసే వుంటుంది. కనక కులాలకు మతాలకు మధ్య తేడా కూడా చూడండి.ఇలాటి కథల రూపకల్పనలోనూ పాత్ర ధారణలోనూ పాలుపంచుకున్న వారిలోనూ అన్ని రకాల వారు వుంటారు.
   ఇంతకూ నేను ప్రస్తావించిన గుణనిధి, నిగమశర్మ కథలేమిటి? రేపు వాటిని తీస్తే ఆ పాత్రలను అవమానకరంగా వుండకుండా చేయగలరా? నేను మోహన్‌ బాబును గాని, దాడిని గాని సమర్థించడం లేదు.అయితే వినోదంపై వివాదాలు శ్రుతి మించకూడదని, ప్రభుత్వం ముందే జాగ్రత్తపడాలని చెబుతున్నాను.

   Delete
  2. indulo ravi gaarini tappupattadaaniki emi ledu. durgeswara gaari aavedanani kooda ardham chesukovaali.

   n chanda sekhar
   kachadarajakeeyam.blogspot.in

   Delete
 3. సార్ నేను చెబుతోంది అదే.. గుణనిధి,నిగమశర్మ కథలను తీస్తే ఎవరికీ ఏ అభ్యంతరమూ ఉండదు. అది పాత్ర స్వభావం. కానీ.. ‘‘సంభావన ఎక్కువిస్తే మీరు తోక ఊపుకుంటూ వస్తార్రా’’ అనడంలో ఔచిత్యం ఏమిటి? ఆ మాట అనకుండా కూడా ఈ సినిమా తీయొచ్చని నేనంటున్నాను. నేను సినిమా చూశాను కాబట్టి, నాకు అందులో తప్పు ఉంది కాబట్టి, ఆ డైలాగ్ అక్కడ పూర్తిగా అనవసరం కాబట్టి మాట్లాడుతున్నాను. మీరు కూడా సినిమా చూశారా? చూశాక కూడా ఆ డైలాగులో మీకేమీ అభ్యంతరం ధ్వనించలేదా?

  ReplyDelete
 4. సార్ అసలు విషయం చెప్పడం మర్చిపోయా.. ‘అది కథకు అవసరమా కాదా అన్నదే అసలు ప్రశ్న’ అనే మీ మాటకు సమాధానంగా నేను ఈ వివరణ ఇచ్చాను.

  ReplyDelete
 5. ‘మీ తెలివైన బుర్రతో ఆలోచించి తేల్చుకోండి’ అనే మాట ఉపసంహరించుకుంటున్నాను. క్షమించండి.

  ReplyDelete
 6. నీ కులాన్ని అవమానిస్తూ ఎవరైనా సినిమా తీస్తే ఇలాగే నీతి కబుర్లు చెపుతావా ?

  ReplyDelete
 7. Asalu sisalu Kamma kula aadhipathyavadulamani marosari nirupinchukunaru meeru.....

  ReplyDelete