కాలగతిలో కరిగిపోతున్న 2011 చివరి ఘట్టం. సమీక్షకూ సమాలోచనకు సందర్భం.
సంవత్సరం పొడుగునా చూసిన సమస్యలు సవాళ్లు సంవాదాలు సమరాలు సంచలనాలు సంతోష
విషాదాలను బేరీజు వేసుకోవడానికి సరైన సందర్భం. కాలం ముందుకే పోతుంది తప్ప
వెనక్కు నడవదు. గడియారాలు ఆగిపోవచ్చు గాని ఘడియలు ఆగవు. పరిణామ క్రమం కూడా
అంతే..ప్రతికూలతలను ప్రతిఘటిస్తూ ముందుకు సాగడమే మానవాళి స్వభావం.
కట్టుకథలు పటాపంచలు చేసి కఠోర సత్యాలను కళ్లకు కట్టడం, కల్పనలనూ
కట్టుకథలను కుప్పకూల్చి కఠినతర పరీక్షలకు ప్రజా రాశులను సమాయత్త పర్చడం
కాలసూత్రం.
2011 నే తీసుకోండి. ధర్నా చౌక్ నుంచి వాల్‌స్ట్రీట్ వరకూ ప్రతిచోటా కనిపించిన దృశ్యం ప్రతిఘటనే.సంస్కరణల పేరిట నల్లేరు మీద బండిలా నడిపించుకుపోవాలన్న నయవంచక పథకాలను వామపక్ష ప్రజాస్వామిక శక్తుల నుంచి అడుగడుగునా నిరసన వ్యక్తమవుతూ వచ్చింది. అది కూడా పరిమితులలో ఆగిపోకుండా అంతకంతకూ విస్తారమవుతూ వచ్చింది. ఇన్ని సమస్యల మధ్యనా సాధించుకున్న కోర్కెలు నిలువరించిన ప్రమాదాలు చాలా వున్నాయి. వీటిని చూసి బెంబేలెత్తిన సామ్రాజ్యవాదం మరింత తీవ్రంగా విరుచుకుపడుతున్న స్థితి.2007లో సద్ధాం హుస్సేన్ ఉరితీతతో ముగిసిపోతే 2011 కల్నల్ గడాపీని కడతేర్చడంతో ముగిసింది. అయితే అప్పటికీ ఇప్పటికీ చాలా తేడాలు. ఇరాక్‌లో తిష్ట వేసిన సైన్యాలు ఇంటి దారి పడితే అరబ్ దేశాలలో అనుకున్నట్టల్లా అడటానికి అనేక ఆటంకాలను ఎదుర్కొవలసిన స్థితి అమెరికాకు ఎదురవుతున్నది.ఆఖరుకు ఉపగ్రహం వంటి పాకిస్థాన్ సైనిక కూటమి కూడా పూర్తిగా లొంగిపోవడానికి నిరాకరించడంతో ఉద్రక్తత పెరుగుతున్నది. ఇరాక్‌పైన దురాక్రమణ సమయంలో కన్నా ఇప్పుడు ప్రపంచం అమెరికా అసలు వ్యూహాలను అర్థం చేసుకోగలుగుతున్నది. లిబియా తర్వాత ఏ దేశంపైన దాడి చేస్తారో అని ప్రతివారూ ముందస్తుగానే