స్వామిగౌడ్ సన్మాన కార్యక్రమం తెలంగాణా విభజన వాద వాణికి వేదికగా మారడం వూహించదగిన విషయమే.అయితే అక్కడ వారిలో విభజనలు కూడా వ్యక్తం కావడం మహబూబ్‌నగర్, పరకాల వంటి పరిణామాల కొనసాగింపుగా కనిపిస్తుంది. టిఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రతినిధుల మాటల్లో తేడాలు స్పష్టంగా కనిపించాయి. నేను 2009లో తెలంగాణా నినాదంతో గెలవలేదని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించడం సాహసోపేతమైనదే.అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి వస్తే పదిహేను రోజుల్లో తెలంగాణా వచ్చేస్తుందని కేశవరావు ఆవేశ పూరితంగా చెప్పిన మాట అపహాస్యానికి మాత్రమే అక్కరకు వస్తుంది కారణమేదైనా జెఎసి చైర్మన్ కోదండరాం అక్కడ కనిపించలేదు.ఇవన్నీ ఒక ఎత్తయితే కె.సి.ఆర్ ఈ సభలో తన సంకేతాల గురించి చెప్పిన మాటలు ఆలోచించదగినవి. సంకేతాలు నాకు రాకపోతే ఎవరికొస్తాయని మీడియాను ఎద్దేవ చేస్తూ ఆయన అన్న మాటలలో అసహనమే కనిపిస్తుంది. తెలంగాణా ఉద్యమానికి ఆయన అగ్ర నాయకుడు ప్రధాన ప్రతినిధి అనడంలో సందేహం లేదు గాని కేంద్రం గురించిన ఆయన జోస్యాలు అనేక సార్లు విఫలమైనాయి. ఒకవైపున కాంగ్రెస్ నాయకులే సంకేతాలు లేవని చెబుతుంటే నాకు సూచనలున్నాయన్నట్టు చెప్పడం తప్పకుండా ప్రశ్నార్థకమే. ప్రశాంతంగా వుంటే పరిశీలిస్తామని ప్రధాని చెప్పినందునే ప్రశాంతంగా వున్నామని ఆయన అంటున్నారు గాని ప్రధాని కాదు కదా కేంద్రంలో ఏ ప్రతినిధి కూడా అలాటి మాట చెప్పింది లేదు. హౌం శాఖ నుంచి ఆర్థిక శాఖకు వెళ్తూ ఆఖరి పత్రికాగోష్టిలో కూడా చిదంబరం అందరూ అంగీకరించాకే అఖిలపక్ష సమావేశం వుంటుందని కుండబద్దలు కొట్టి చెప్పారు.ఉద్యమ నాయకులు నమ్మకం నిలబెట్టడం కోసం ఏదైనా చెప్పాలని ఆ పార్టీ నేతలు సమర్తించుకుంటారు గాని అవాస్తవమైన ఆశలు భ్రమలు కల్పిస్తే తర్వాత వాస్తవాన్ని తట్టుకోలేని వారు అఘాయిత్యాలకు తలపడతారు. కనక ఉద్యమ సారథులు వూహాగానాలు చేసే కంటే ఉన్నమాట చెప్పి జనాన్ని నిలబెట్టుకోవాలి.లేదంటే నిజం చెప్పినా నమ్మని స్థితి రావడానికి ఎంతో కాలం పట్టదు.మరో వైపున ఉద్యోగులు కొందరు బుద్ధి జీవులు రాజకీయ వాస్తవాలతో నిమిత్తం లేకుండా ఉద్వేగాలకు ఉద్రేకాలకు గురి కావడం కూడా వాంఛనీయం కాదు.ప్రాంతీయ సమస్యకు పార్టీలతో నిమిత్తం లేకుండా తామే పరిష్కారం సాధిస్తామన్న భ్రమ నుంచి ఉద్యోగులు విద్యార్థులు తదితరులు బయిటపడటం అవసరం. ఎందుకంటే వారిని బలిపెట్టి తమ పబ్బం గడుపుకోవడం 1969-72 మధ్య అనేక మంది స్వార్థ పర నాయకులలో చూశాం.అలాటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలి.
Sunday, August 5, 2012
కె.సి.ఆర్ కొత్త సంకేతాలు- పాత సందేహాలు

Saturday, August 4, 2012
రాయలసీమలో బాబుకు కొత్త సవాలు
బైరెడ్డి రాజశేఖర రెడ్డి రాయలసీమ వాదంతో చేస్తున్న నిరాహారదీక్ష ఇప్పటికే చిక్కుల్లో వున్న తెలుగు దేశంకు కొత్త సవాలని చెప్పాలి. తెలంగాణాలోనూ కోస్తాంధ్రలోనూ ఇప్పటికే పలువురు ఆ పార్టీని వదలి వెళ్లారు. ఆ విధంగా చూస్తే రాయలసీమలో శోభా నాగిరెడ్డి వంటి వారు గతంలోనే నిష్క్రమించగా ఉప ఎన్నికల్లోనూ ఓటములు ఎదురైనాయి. ఇలాటి పరిస్థితుల్లో బైరెడ్డి కొత్తగా సీమ వాదం తీసుకురావడం నిరాహారదీక్షతో కార్యాచరణకు దిగడం సరికొత్త సంకటమే.తెలంగాణా ఫోరం నేతలు దీనిపై ఎలా స్పందిస్తారనేది ఒకటైతే అధినేత ఇచ్చే స్పష్టతకు దీనివల్ల కలిగే ఆటంకం మరొకటి. పైగా ఆయన కూడా చిత్తూరు జిల్లాకు చెందిన వారు కావడం అదనపు ఇబ్బంది. ఒకవేళ కర్నూలు జిల్లా తెలుగు దేశం అద్యక్షుడు చెప్పినట్టు నిజంగానే దీన్ని వ్యక్తిగత వ్యవహారంగా తీసుకుంటే అప్పుడు బైరెడ్డి స్వంత వేదికకు బలం చేకూర్చినట్టు అవుతుంది.ఇప్పటికే రాయలసీమలో సామాజికంగా జగన్ వర్గం గట్టి సవాలు విసురుతున్న నేపథ్యంలో ఈ పరిణామం వల్ల మరో గండి పడకుండా ఏం చేస్తారో చూడాల్సిందే. ఈ దీక్షను ఉపేక్షిస్తే అప్పుడు ఇతర ప్రాంతాల్లోనూ ఇలాటివే తలెత్తవచ్చు. దాంతో అధినేత ఇస్తానంటున్న స్ఫష్టతకు విలువ లేకుండా పోవచ్చు. రాయలసీమలో స్వంత పునాది పెంచుకోవాలనుకుంటున్న నాయకులు ఈ వాదనను బలపర్చే అవకాశం వుంటుంది గాని బైరెడ్డికి ఆ స్థానం ఇవ్వడానికి వారు సిద్ధపడతారా అనేది మరో ప్రశ్న. సిద్ధాంతాలు గాని నికరమైన విధానాలు గాని లేని వ్యక్తులు శక్తులు ఏదైనా చేయొచ్చు. కనక ఇది తెలుగు దేశంకు తర్వాత కాంగ్రెస్‌కు కూడా ఇరకాటమే.
రిలయన్స్ అందరికంటే గొప్ప!

రాష్ట్రం విద్యుత్ సంక్షోభంలో అల్లాడుతుంటే ఉత్పత్తికి అవసరమైన గ్యాస్ అమ్మకానికి రిలయన్స్ సంస్థ సహకరించకపోవడం సహజ న్యాయ సూత్రాలకే విరుద్ధం.అందరికీ చెందాల్సిన గ్యాస్‌ను ఒక ప్రైవేటు సంస్థకు కట్టబెట్టడంలో గల అన్యాయం వదిలేద్దాం. సరళీకరణలో అవన్నీ మూమూలే.అంతమాత్రాన అవసరమైనప్పుడు కొనుక్కోవడానికి కూడా దిక్కులేని స్థితి ఏ వ్యాపారంలోనైనా వుంటుందా? వైఎస్‌రాజశేఖర రెడ్డి హయాంలో నేను ఈ విషయమై ఆయనతో ఒకటికి రెండు సార్లు మాట్లాడితే జరిగిపోయిన ఒప్పందాన్ని ఏమీ చేయలేమని కనీసం మనకు సరసమైన ధరకు సరఫరా జరిగేలా యత్నిస్తున్నామని అన్నారు. కాని జరిగింది శూన్యం. ఇప్పుడు పెట్రోలియం సహజ వాయుశాఖా మంత్రి జైపాల్ రెడ్డి రిలయన్స్ సంస్థ ప్రధాని కార్యాలయంపైనే వత్తిడి తెచ్చిన తీరును పరోక్షంగా బయిటపెట్టారు. ఇప్పుడు మనను కాదని మహారాష్ట్రలోని దబోల్ విద్యుత్కేంద్రానికి సరఫరా జరగుతుంటే అతి జాతీయ విధానమని సమర్థిస్తున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రికి ప్రచ్చన్న యుద్ధం జరుగుతున్నట్టు కనిపిస్తుంది. వాస్తవానికి వారిద్దరూ కలిసి మిగిలిన పార్టీలను కూడా కలుపుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలి గాని ఇలా పరస్పరం ఆరోపణలతో బాధ్యతలు వదిలేయడం కాదు.ఏమైనా ఈ నిర్వాకాల వల్ల ఆంధ్ర ప్రదేశ్‌లో అంధకారం అలుముకోవడం అత్యంత ఆందోళన కరం.
పీజులకు ఫ్యూజు!
ఏకీకృత ఫీజుల వివాదం మాటున రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీ ఇంబర్సుమెంటు పథకానికి గ్రహణం పట్టించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాస్తవంలో ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల పెంపు ప్రతిపాదనలో తన పాత్ర నిర్వహించకుండా దాటేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం అందరినీ కూచోబెట్టి ఒప్పించే బదులు కాలయాపన చేసింది. వారిలో వారు విడిపోతే చూస్తూ వూరుకుంది. అంతే గాని విద్యార్థు ల తరపున చొరవ తీసుకుని చర్చల ద్వారానో ఆర్డినెన్సు ద్వారానో ప్రతిష్టంభన తొలగించే ప్రయత్నం జరగలేదు.ఇప్పుడు గవర్నర్ గారే ఉచితం తప్పు అన్న అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజానికి ఇక్కడ ఉచితం ఏమీ లేదు.ప్రభుత్వం కార్పొరేట్లకు సొమ్ము చెల్లించే విద్య కొనుగోలు చేసి విద్యార్థులకు అందించడం ఇక్కడ సూత్రం. ఆరోగ్యశ్రీలో ఆస్పత్రులైతే ఇక్కడ కాలేజీలు. అంతే తేడా. ఈ వ్యవహారానికి బదులు ప్రభుత్వమే కాలేజీలు నడిపి పిల్లలను చేర్చుకోవచ్చు గదా అంటే భేషుగ్గా చేయొచ్చు.కాని కార్పొరేట్ల బేహారుల సేవ ఏమయ్యేట్టు? కనక అదంతే! ప్రజల డబ్బుతో ఫీజు రీఇంబర్సుమెంట్ చేస్తూ అది వైఎస్ ఘనత అని ఒక పార్టీ కాదు మాదే గొప్ప అని మరో పార్టీ. ఎంత హాస్యాస్పదం? ఈ అయోమయంలో అఖిల భారత స్థాయిలోనూ అంతర్జాతీయంగానూ విద్యార్థులకు జరిగే నష్టానికి బాధ్యులెవరు? ఈ అనిశ్చితి అశాంతికి దారి తీసినా ఆశ్చర్యం లేదు.
అన్నా రాజకీయం- అంతా అస్పష్టం!
అపర గాంధీ స్థాయిలో ప్రచారం పొందిన అవినీతి వ్యతిరేక ఉద్యమ కారుడు అన్నా హజారే రాజకీయ వేదిక స్థాపిస్తానని చేసిన ప్రకటనపై పెద్ద హర్షాతిరేకం వ్యక్తం చేసిన వారెవరూ లేరు. కాని ఆయన గత వైఖరికీ దీనికి మధ్య వ్యత్యాసం పట్టి చూపినవారు,ఆ వేదిక భవిష్యత్తుపై నిర్లిప్తత వ్యక్తం చేసిన వారు చాలా ఎక్కువ. అత్యధిక ప్రచారం పొంది ప్రభంజనంలా కనిపించిన ఒక వ్యక్తి కేవలం ఒక ఏడాది కాలంలో ఇంత పేలవమైన ప్రతిస్పందనతో మిగిలిపోవడం అరుదే అయినా అసహజం కాదు.వ్యవస్థాగత అంశాలు వదిలిపెట్టి వ్యక్తిగత పోకడల చుట్టూ పరిభ్రమిస్తే కలిగే ఫలితం ఇలాగే వుంటుంది. వ్యక్తులు స్వీయారాధనలో పడిపోయి ఇచ్చానుసారం అన్ని జరిగిపోతాయనుకుంటే పరిస్థితి తలకిందులవుతుంది. అన్నా హజారే ఒకటికి రెండు సార్లు నిరాహారదీక్షలు ప్రకటించడం, విరమించడం,ఆ దీక్షా శిబిరంలో బృంద సభ్యుల మధ్యనే విభేదాలు కనిపించడం ఇవన్నీ మెరుపును తగ్గించేశాయి. వాస్తవానికి మొదటి నుంచి ఆయన ఆందోళనలో వైరుధ్యాలకు లోటు లేదు. బ్లాగులో నేను హజారే దీక్ష హజార్ సవాళ్లు అంటూ మొదట్లోనే రాశాను. ఇటీవల కూడా మళ్లీ సందేహాలు వ్యక్తం చేశాను.ఇప్పుడు ఆ క్రమం పూర్తయిందని
Subscribe to:
Posts (Atom)