
రాష్ట్రం విద్యుత్ సంక్షోభంలో అల్లాడుతుంటే ఉత్పత్తికి అవసరమైన గ్యాస్ అమ్మకానికి రిలయన్స్ సంస్థ సహకరించకపోవడం సహజ న్యాయ సూత్రాలకే విరుద్ధం.అందరికీ చెందాల్సిన గ్యాస్‌ను ఒక ప్రైవేటు సంస్థకు కట్టబెట్టడంలో గల అన్యాయం వదిలేద్దాం. సరళీకరణలో అవన్నీ మూమూలే.అంతమాత్రాన అవసరమైనప్పుడు కొనుక్కోవడానికి కూడా దిక్కులేని స్థితి ఏ వ్యాపారంలోనైనా వుంటుందా? వైఎస్‌రాజశేఖర రెడ్డి హయాంలో నేను ఈ విషయమై ఆయనతో ఒకటికి రెండు సార్లు మాట్లాడితే జరిగిపోయిన ఒప్పందాన్ని ఏమీ చేయలేమని కనీసం మనకు సరసమైన ధరకు సరఫరా జరిగేలా యత్నిస్తున్నామని అన్నారు. కాని జరిగింది శూన్యం. ఇప్పుడు పెట్రోలియం సహజ వాయుశాఖా మంత్రి జైపాల్ రెడ్డి రిలయన్స్ సంస్థ ప్రధాని కార్యాలయంపైనే వత్తిడి తెచ్చిన తీరును పరోక్షంగా బయిటపెట్టారు. ఇప్పుడు మనను కాదని మహారాష్ట్రలోని దబోల్ విద్యుత్కేంద్రానికి సరఫరా జరగుతుంటే అతి జాతీయ విధానమని సమర్థిస్తున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రికి ప్రచ్చన్న యుద్ధం జరుగుతున్నట్టు కనిపిస్తుంది. వాస్తవానికి వారిద్దరూ కలిసి మిగిలిన పార్టీలను కూడా కలుపుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలి గాని ఇలా పరస్పరం ఆరోపణలతో బాధ్యతలు వదిలేయడం కాదు.ఏమైనా ఈ నిర్వాకాల వల్ల ఆంధ్ర ప్రదేశ్‌లో అంధకారం అలుముకోవడం అత్యంత ఆందోళన కరం.
No comments:
Post a Comment