Pages

Saturday, August 4, 2012

పీజులకు ఫ్యూజు!




ఏకీకృత ఫీజుల వివాదం మాటున రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీ ఇంబర్సుమెంటు పథకానికి గ్రహణం పట్టించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాస్తవంలో ఇంజనీరింగ్‌ కాలేజీల ఫీజుల పెంపు ప్రతిపాదనలో తన పాత్ర నిర్వహించకుండా దాటేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం అందరినీ కూచోబెట్టి ఒప్పించే బదులు కాలయాపన చేసింది. వారిలో వారు విడిపోతే చూస్తూ వూరుకుంది. అంతే గాని విద్యార్థు ల తరపున చొరవ తీసుకుని చర్చల ద్వారానో ఆర్డినెన్సు ద్వారానో ప్రతిష్టంభన తొలగించే ప్రయత్నం జరగలేదు.ఇప్పుడు గవర్నర్‌ గారే ఉచితం తప్పు అన్న అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజానికి ఇక్కడ ఉచితం ఏమీ లేదు.ప్రభుత్వం కార్పొరేట్లకు సొమ్ము చెల్లించే విద్య కొనుగోలు చేసి విద్యార్థులకు అందించడం ఇక్కడ సూత్రం. ఆరోగ్యశ్రీలో ఆస్పత్రులైతే ఇక్కడ కాలేజీలు. అంతే తేడా. ఈ వ్యవహారానికి బదులు ప్రభుత్వమే కాలేజీలు నడిపి పిల్లలను చేర్చుకోవచ్చు గదా అంటే భేషుగ్గా చేయొచ్చు.కాని కార్పొరేట్ల బేహారుల సేవ ఏమయ్యేట్టు? కనక అదంతే! ప్రజల డబ్బుతో ఫీజు రీఇంబర్సుమెంట్‌ చేస్తూ అది వైఎస్‌ ఘనత అని ఒక పార్టీ కాదు మాదే గొప్ప అని మరో పార్టీ. ఎంత హాస్యాస్పదం? ఈ అయోమయంలో అఖిల భారత స్థాయిలోనూ అంతర్జాతీయంగానూ విద్యార్థులకు జరిగే నష్టానికి బాధ్యులెవరు? ఈ అనిశ్చితి అశాంతికి దారి తీసినా ఆశ్చర్యం లేదు.

No comments:

Post a Comment