Pages

Friday, January 14, 2011

సంక్రాంతి శుభాకాంక్షలు

బ్లాగు మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

పండుగ రోజునే ప్రధాని సలహా మండలి దేశంలో ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించడం సాధ్యం కాదని చెప్పిన వార్త వస్తున్నది.అంతులేని ఈ అంతరాల భారతాన్ని మార్చడం ఎలా? వెలిగే భారతానికి రగిలే భారతానికి మద్య అగాధాలు పూడ్చటమెలా అన్న ప్రశ్నను ఈ విధంగా సంక్రాంతి మన ముందుకు తెచ్చి నిలిపింది. అభివృద్ధి గురించిన అంకెల గారడీలకు మనం డూడూ బసవన్నల్లా తలూపకుండా వుంటనే- సంపన్న వర్గాల రంగుల రంగువల్లులను చూసి పరవశించడంతో పాలు పక్కనే వున్న రంగు వెలసిన అశేష జనాన్ని కూడా గుర్తు చేసుకున్న రోజున- అన్న దాతకు కూడా ఆనందం ఆశ కరువై పోతున్న ఈ పంటల పండుగ పరమార్థం నెరవేరెదెలా అని తర్కించిన రోజున నిజమైన క్రాంతి మొదలవుతుంది. సంపూర్ణ సంక్రాంతి సాక్షాత్కరిస్తుంది

6 comments:

  1. ఈ న్యూస్ ఊహించిందే ... ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ఇంతకంటే ఏం చేస్తుంది ... మీకు పండగ శుభాకాంక్షలు

    ReplyDelete
  2. తెలకపల్లి రవిగారికి నమస్కారం...సంక్రాంతి శుభాకాంక్షలు . ఇప్పుడున్న పాలకులకు వారీ కుర్చీలు కాపాడుకోవడమే సమస్యగామారింది. ప్రజల ఆహార భద్రత గురించి పట్టించుకునే పరిస్థితి లేదు.

    ReplyDelete
  3. దరిద్ర పాలకులు... దరిద్ర ప్రభుత్యం

    ReplyDelete
  4. ప్రతి రంగంలోనూ చైనాను అధిగమించడమే మన టార్గెట్ అంటూ ఆడంభరంగా చెప్పుకునే మన నేతలు (వాస్థవానికి అత్యంత జనాభాగల దేశంగా తప్ప మరే విషయంలోనూ ఇప్పట్లో మనకది సాధ్యం కాదు)అదే చైనా జూన్ 1, 2009 నుండే "ఆహార భద్రతా చట్టాన్ని" అమలు చెయ్యడమేకాకుండా ఇప్పుడు దాన్ని మరింత మెరుగు పరిచి నాణ్యమైన "నూతన ఆహార భద్రతా ప్రమాణాల వ్యవస్థను" రూపొందించేందుకు ఆరోగ్యశాఖ, ఇతర ప్రభుత్వ సంస్థలతో కలిసి కృషి చేస్తోంది"
    ఆహార భద్రత అనే ఓపేరుగొప్ప కార్యక్రమం చేపట్టి తామేదో పేదల్ని ఉద్ధరించబోతున్నట్లు, ప్రపంచంలో ఇంతవరకు ఎవడూ పొడవనిది తామే ప్రధమంగా పొడవబోతున్నట్లు మొన్నటి కాంగ్రేసు ప్లీనరీలో "ఆహారాన్ని ఓ హక్కుగా ప్రజలకు అందించే దేశం ప్రపంచంలో మరొకటి ఉంటుందా?" అంటూ గడసరిగా ఆశ్చర్యాన్ని ప్రకటించి జనాల చెవుల్లో పబ్లిగ్గా పువ్వులు పెట్టాలని చూసిన ప్రణబ్ ముఖర్జీ గారికీ, వారి సోనియమ్మకూ ఈ విషయం తెలియదనుకోవాలా??
    ఆమధ్య అమెరికా ప్రెసిడెంటెవడో ఇండియాలో పేదలక్కూడా బలవబట్టే (సంపాదన పెరగడమట!)& తెగతింటుండడంవల్లే ప్రపంచంలో ఆహార నిల్వలు తరిగిపోతున్నాయన్నప్పుడు మన నేతలు తెగ గింజుకున్నారు.
    ఇప్పుడు మన ఘనతవహించిన యూపీయే పాలక ప్రభువులూ ద్రవ్యోల్భన కట్టడికై గురువారం నాడు ఉన్నతస్థాయి జుట్టుపీక్కొనే సమావేశంలో "వేగవంతమైన అభివృద్ధివల్ల(??) పేదల చేతుల్లోకూడా డబ్బులు ఉంటున్నాయనీ (ఇంకా నయం పేదలుకూడా డబ్బులెక్కువై స్విస్సు బ్యాంకుల్లో దాచుకుంటున్నారనలేదు!), ఫలితంగా ఆహార వినియోగం పెరిగి దరలు అదుపులో ఉండడంలేదని సూత్రీకరించారు.రోజుకు 11 రూపాయలు సంపాదించేవారు యుపిఎ ప్రభుత్వం దృష్టిలో పేదలు కారట. నిజంగా నేడు 330రూపాయలతో ఒక మనిషి నెలంతా జీవించగలగటమనేది సాధ్యమేనా?
    ఆహార భద్రత అంటే చాలీ చాలని సరుకుల్ని తక్కువ రేట్లకు పంచి పేదరికాన్ని మరింత పెంచడమూ, పేదల్ని అవమానించడమా? రైతు భద్రతతో కూడిన ఉత్పాదన, నిల్వలు, పేదల కొనుగోలు శక్తీ పెంచడమా? అసలుసిసలైన ఆహార భద్రత అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ జోక్యం కూడా చాలా అవసరమవుతుంది. చాలినంత ఆహారం సరఫరా కావాలంటే వ్యవసాయోత్పత్తులు పెరగాలి. పంటల తీరు కూడా మారవలసి ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా వ్యవసాయం గిట్టుబాటుగా ఉండాలి. అవసరమైన ఆహారాన్ని కొనుగోలు చేయగల శక్తి ప్రజలందరికీ ఉన్నపుడే ఆహారం అందరికీ అందుబాటులోకి వస్తుంది. కొనుగోలు శక్తి కావాలంటే ఉపాధి, గిట్టుబాటు, జీవన విధానం తదితరాలు ప్రధానాంశాలుగా ఉంటాయి. నిజంగా ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే సంతోషించి డిమాండ్‌కు తగ్గట్లుగా వస్తూత్పత్తి, సరఫరా జరిగేలా చూడడంలో తమ సమర్ధత చాటుకోవాలిగానీ ఇలాంటి అసంబద్ధ స్టేట్‌మెంట్లిచ్చి తమ అసమర్ధతను కప్పిపుచ్చుకోజూడటం క్షమార్హంకాదు.

    ReplyDelete
  5. భలే భలే బాగా చెప్పారు
    వెంకట సుబ్బారావు కావూరి
    తెలుగిల్లు

    ReplyDelete
  6. ఆర్.ఎస్ రెడ్డి(డేర్2క్వశ్చన్ బ్లాగర్)
    భలే భలే బాగా చెప్పారు
    వెంకట సుబ్బారావు కావూరి
    తెలుగిల్లు

    ReplyDelete