Pages

Monday, February 28, 2011

బహుముఖ వైరుధ్యాల మధ్య ఆనిశ్చిత ఆంధ్రప్రదేశ్‌



ఈ వారం రోజులలోనూ ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాల అనిశ్చితి కొత్త మలుపు తిరిగినట్టు కనిపిస్తుంది. గత వారం శాసనసభలో గవర్నర్‌పై దాడి, తర్వాత జయ ప్రకాశ్‌పై దాడి వంటి ఘటనలు, సస్పెన్షన్లు చూశాము. బడ్జెట్‌ సమర్పణలోనూ ఇదే ప్రతిధ్వనించింది. కాకపోతే ఈ సారి టిఆర్‌ఎస్‌కే పరిమితం కాకుండా తెలుగు దేశం, సిపిఐ బిజెపి సభ్యులు కూడా గొంతు కలపడం కొత్త పరిణామం. ఆ తర్వాత తెలుగు దేశం సభ్యులను అద్యక్షుడు చంద్రబాబు నాయుడు సమావేశపర్చి ఈ ధోరణి తగదని మందలించినట్టు కథనాలు వెలువడ్డాయి.అదే సమయంలో తెలంగాణా సమన్వయ కమిటీ అంటూ ఒకటి
ఏర్పాటు చేసుకోవడానికి ఆయన అనుమతించారు. ఇది మరింత ఉధృతంగా పోరాడటానికి అని కొందరు అంటుంటే దూకుడుగా వెళ్లేవారిని అదుపు చేయడానికి అని మరో భాష్యం. అదే సమయంలో చంద్రబాబు నాయుడు శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కేంద్రం చర్య తీసుకోవాలని కూడా బహిరంగంగా కోరారు. ఇది కూడా కొంత సూటిగా జరిగిన పరిణామమే.
ఇవన్నిటి తర్వాత పార్లమెంటులోనూ ఈ వాతావరణమే ప్రతిబింబించడం మరో విశేషం. పార్లమెంటుకు అరుదుగా హాజరయ్యే కె.చంద్రశేఖరరావు, విజయశాంతి సభలో బిజెపి నాయకురాలు సుష్మా స్వరాజ్‌ మద్దతుతో నిరసన తెలిపారు. అంతకు ముందు రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణా ప్రసక్తి లేదంటూ కాంగ్రెస్‌ ఎంపిలు ప్లకార్డులు ప్రదర్శించారు. కెసిఆర్‌ నిరసన తెల్పుతున్న సమయంలోనూ వారు సంఘీభావం ప్రదర్శించారు. అవసరమైతే పార్లమెంటులో వురి వేసుకుంటామన్నట్టు కూడా ఒక ఎంపి మాట్టాడారు.అంతా అయిన తర్వాత బడ్జెట్‌ వరకూ ఆగమన్నారంటూ మౌన వ్రతం చేపట్టారు. మార్చి తర్వాత ప్రకంపనాల గురించి ఇప్పుడు కె.సిఆర్‌ హెచ్చరికలు చేస్తున్నారు. గతంలో మహా కూటమిలో భాగస్వామిగా వుండి ఫలితాలు వచ్చేలోగా బిజెపి ఎన్‌డిఎలతో చేతులు కలిపిన కె.సి.ఆర్‌. తన తాజా చర్యతో మరోసారి తెలంగాణా రంగ స్థలంపై బిజెపికి పెద్ద పీట వేశారు.
తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కేంద్రంలో వున్న కాంగ్రెస్‌ ద్వారానే జరగాలి గనక వారిపై మరీ ఎక్కువగా దాడి చేయబోమన్న వైఖరిని టిఆర్‌ఎస్‌ చాలా సార్లు ప్రకటించింది. తెలుగు దేశంపైనే దాడి ఎక్కువగా కేంద్రీకరించింది.కాంగ్రెస్‌ నేతలను వ్యక్తులుగా విమర్శించడం, ప్రజా ప్రతినిధులకు సవాళ్లు విసరడం జరిగినంతగా కాంగ్రెస్‌ రాజకీయ క్రీడను ఎండగట్టేందుకు టిఆర్‌ఎస్‌ సిద్దం కాలేదు. పైగా కాంగ్రెస్‌ చేతులు బలోపేతం చేయడం, సోనియా గాంధీ పాదాలు పాలతో అభిషేకించడం వంటి విపరీత వ్యాఖ్యలు కూడా కెసిఆర్‌ వినిపించారు. ప్రజారాజ్యం కాంగ్రెస్‌తో విలీనమైన తర్వాత టిఆర్‌ఎస్‌ పై వారి దృష్టి వుందని కూడా బాహాటంగానే చెప్పారు. అదే షరతుగా వస్తే ఆలోచించవద్దా అని కూడా కొందరన్నారు. ఇదంతా అయిన తర్వాత కెసిఆర్‌ బిజెపితో జట్టుకట్టి తెలంగాణం వినిపించడం కాంగ్రెస్‌కు మింగుడు పడని విషయమే కావచ్చు. బిల్లుపై ఓటింగుకు బిజెపి మద్దతు అవసరమన్న వాదన ఒకటైనా వారి ప్రధాన పాత్రతో ఇవన్నీ జరగడం కాంగ్రెస్‌కు రాజకీయంగా నచ్చని విషయం. ఆ సంగతి తెలిసీ కెసిఆర్‌ బిజెపి ఎన్‌డిఎలతో చెలిమి చేస్తున్నారంటే రేపు రాజకీయ వ్యూహమైనా మార్చుకుని వుండాలి లేదా యుపిఎపై ఒత్తిడికోసం వేసే ఎత్తుగడైనా కావాలి. ఈ రెంటిలో ఏది నిజమైనా విశ్వసనీయత మరో సారి సందేహాస్పదమవుతుంది. పార్లమెంటులో బిల్లు వస్తే బలపర్చాల్సిన తమను నిర్లక్ష్యం చేస్తున్నారని బిజెపి నేతలు ఆగ్రహం వెలిబుచ్చిన రోజులున్నాయి.అసలు నిర్ణేతలమైన మమ్ముల్ను కాదని అంతా మీరేనంటే ఎలా అని కాంగ్రెస్‌ నేతులు ఆక్రోశించిన కాలం వుంది. మీ వైరుధ్యాల మధ్య మా మీద దాడి చేస్తారేమిటని తెలుగు దేశం ఆరోపించిన దశా వుంది. నిజానికి ఇవన్నీ రాజకీయ ప్రయోజనాల ప్రహసనాలు తప్ప విశాల ప్రజా కోణం నుంచి జరుగుతున్నవి కావు.
మొత్తంపైన ఇటీవలి కాలంలో సహాయ నిరాకరణ, చట్ట సభల ఘటనల తర్వాత ఈ సమస్యపై ఏదో ఒక ప్రకటన రాకతప్పదన్న అభిప్రాయం బలపడింది. ఏదో ఒక గడువుతో ఏదో ఒక ప్రకటన రావడం అనివార్యమే. అయితే అదైనా చేయమని అడగడంలోనే రాజకీయ పక్షాలు అనివార్యమైన రాజకీయ రాజీని ప్రదర్శిస్తున్నాయి. సంక్లిష్టమైన రాష్ట్ర భవిష్యత్తు సమస్య వున్న ఫలానా పరిష్కారం కాదని తేలి పోయింది. దీనిపై దాగుడు మూతలు సాగిండచమే గాని సూటిగా బయిటపడే ఉద్దేశం కేంద్రానికి లేదనీ తేలిపోయింది.మా ప్రభుత్వాల పరిరక్షణ చూసుకుంటూనే ప్రాంతీయ ప్రాతినిధ్య స్వరం వినిపిస్తామని కాంగ్రెస్‌ సభ్యులు చెప్పడంలో అంతరార్తం ఇదే. అలాగే హైదరాబాదు భవిష్యత్తుపైన ఇతర ప్రాంతాల వారి భద్రతపైన చర్చలకు సిద్ధమేనని టిఆర్‌ఎస్‌తో సహా పలువురు నేతలు చెప్పడం కూడా ఒక విధమైన వాస్తవిక ధోరణని సూచిస్తున్నది. పరిష్కార సూచనతో ప్రకటన చేయాలన్నదే ఇప్పుడందరి కోర్కెగా వుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది శ్రీకృష్ణ కమిటీ నివేదిక అనంతర కాలపు మధనంలో మలి దశ.రణ భేరులు మోగిస్తూనే రాజీ స్వరాలు కూడా వినిపిస్తున్న పార్టీలు ప్రజలు ప్రశాంతతను కోరుకుంటున్నారన్న వాస్తవాన్ని అంగీకరించకతప్పడం లేదు. ఈ శాంతి ఎవరి దయాభిక్ష కాదని, ఎవరు ఎంత తీవ్రంగా మాట్టాడినా రెచ్చిపోకుండా సంయమనం చూపిన ప్రజల శాంతికాంక్షనే ఇందుకు కారణమని అర్థం చేసుకుంటే పాలకవర్గ పార్టీలు ఇన్ని పాచికలు వేసేవి కావు. ఇప్పటికి కూడా రాష్ట్రమంతటినీ గమనంలో వుంచుకుని పరిష్కారంపై మాట్టాడేబదులు ఎవరికి వారు తమ తమ కో ణాలనే వినిపిస్తూ సంయమనం కావాలంటున్నారు. తెలంగాణా విభజన కోరేవారు ఇతరుల సందేహాలు నివృత్తి చేసే బాధ్యత తమదని చెబుతుంటే కోస్తా కాంగ్రెస్‌ నాయకులు కొందరు రాష్ట్రాల విభజన వల్ల అనర్తాలను కరపత్రాలు వేసి పంచుతున్నారు. ఉభయులతో విడివిడిగా మాట్లాడ ్డం తప్ప ఒకటిగా కూచోబెట్టి చెప్పే పని అధిష్టానం చేయడం లేదు. ప్రభుత్వ పరిరక్షణకు మాత్రం ఒకటే వైఖరిని పాటిస్తున్నారు. అలాగే తెలుగు దేశంనాయకులు కూడా రాజకీయాంశాలపై ఒకే వైఖరి తీసుకుంటూ ప్రాంతాల వారీ స్వరాలు ఆలపిస్తున్నారు.
ముందే చెప్పుకున్నట్టు తెలంగాణా సమస్యపై బిజెపి జాతీయ నేతలు తరలి వచ్చి ఒకటికి రెండు సార్లు సభలు పెట్టడం ఈ ప్రాంతంలో తమ ప్రాబల్యం పెంచుకునే ప్రయత్నం మాత్రమే. లౌకిక తత్వానికి మారుపేరైన తెలంగాణాలో ఇది ఎలాటి ప్రభావం చూపుతుంది? మైనారిటీల ప్రతిస్పందన ఎలా వుంటుంది అనేది ఆలోచించవలసిన అంశం. సమాంతరంగా మజ్లిస్‌ నేత ఒవైసీ కూడా మాట్లాడ్డంలోనే ఈ సంకేతాలు స్పష్టమవుతున్నాయి.ఈ మాట అన్నందుకే ఒకప్పుడు సిపిఎంపై విభజన వాదులు ధ్వజమెత్తారు గాని ఇప్పుడు ఆదిలోనే ఆ వైరాలు పడగవిప్పుతున్నాయి.
వెనువెంటనే రాష్ట్ర విభజన జరక్కపోయినా రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడంపై టిఆర్‌ఎస్‌ దృష్టి పెడుతుందనే అంచనా రాజకీయ వర్గాలలో వుంది. వారి మాటలు చేతులు కూడా దాన్ని ప్రతిబింబిస్తున్నాయి. కాంగ్రెస్‌ ఎంఎల్‌ఎలపై జెఎసి విమర్శలు కేంద్రీకరించిన తర్వాత వారు ఎదురు దాడి చేశారు.తెలుగు దేశంతో అంతకు ముందే రాజకీయ జగడం నడుస్తున్నది. తెలంగాణాలో మేము, సీమాంధ్రలో జగన్‌ అని టిఆర్‌ఎస్‌ జగన్‌ బలం గురించి ే వెల్లడిస్తున్న అంచనాలు వారి సానుకూలతను ఇంకా చెప్పాలంటే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ను బయిటపెడుతున్నాయని తెలుగుదేశం పదే పదే అంటున్నది. కనక రాష్ట్ర రాజకీయాలలో వైరుధ్యాలు ప్రయోజనాల ఘర్షణలు పరి పరివిధాల పయనిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆందోళనలు బందులు కూడా తీవ్రమవుతున్నాయి. ఎడతెగని ఈ ప్రతిష్టంభనను ప్రజలు ఆమోదించడం కష్టం గనకనే అనివార్యంగా చేయవలసి వస్తున్నదని టిఆర్‌ఎస్‌ లేదా జెఎసి అనునయ ధోరణిలో చెబుతున్నాయి.జగన్‌ నిరాహార దీక్ష సందర్భంలో ప్రభుత్వం పడగొట్టే ధోరణిలో మా ట్టాడ్డం కూడా అనిశ్చితిని పెంచుతున్నది. ఈ రకరకాల రాజకీయ వైరుధ్యాల మధ్య కేంద్రం సూటిగా ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం కన్నా దాటవేతకు ముసుగ్గా వుండే ప్రకటన వెలువడే అవకాశమే ఎక్కువ. అయితే అదైనా పరిస్థితిని కొంత కుదుటు పర్చవచ్చు. ఎందుకంటే ప్రతిష్ట కాపాడుకోవడానికి ఏదో ఒక ప్రకటన వస్తే కొంత కాలం సాగించవచ్చునన్న యోజన అన్ని పాలకపక్షాల్లో వుంది. అనేకసవాళ్లతో వుక్కిరిబిక్కిరవుతున్న మన్మోహన్‌ ప్రభుత్వం కూడా ఆ దిశనే ఎంచుకోవచ్చు.

బ్లాగర్‌ మిత్రులకు: వూళ్లో లేనందువల్ల గత రెండు రోజులుగా తాజా పర్చడం కుదరలేదు. ఆదివారం సంచికలో రాసిన వ్యాసం పైన పొందుపర్చాను.
తెలుగు భాషపై నా మొదటి వ్యాసంపైన గాకున్నా దాన్ని పురస్కరించుకుని చాలా చర్చ జరిగింది.ఆ వ్యాఖ్యలను గమనంలో వుంచుకుని ప్రత్యేకంగా బ్లాగు కోసం రాస్తే ఎలాటి వ్యాఖ్యలు( అంతకు ముందు వారిలో ఒక్క శివ తప్ప)రాలేదు. కారణం??? రాసి తీరాలని కాదు గాని ఓ చిన్న సందేహం.అంతే.

11 comments:

  1. పశ్చిమ బెంగాల్లో పదవ తరగతి పిల్లవాడిని అడిగినా పోఇన లోక్సభ ఎన్నికల్లో సిపిఎం కి bjp కి లోపాయికారీ ఒప్పందం ఉంది అని చెపుతారు .త్రినమూల్ కాంగ్రెస్ వోట్లను చీల్చడానికి మీ పరోక్ష మద్దతుతో bjp అభ్యర్థులను నిలబెట్టిందన్న విషయం జగద్విదితం .ఒక ఎన్నికల్లో కేవలం కొన్ని సీట్లు గెలవటానికి మీరు bjp తో ఒప్పందం చేసుకోవచ్చు ,అది ఎత్తు గడ కాని ఎప్పుడు secularism విషయం లో రాజి పడని కెసిఆర్ ఒక పెద్ద సమస్యని పరిష్కరించే క్రమంలో parliament లోని ప్రధాన ప్రతిపక్షం మద్దతు కోరడం సందేహాస్పదం అనడం కంటే హాస్యాస్పదం ఇంకా ఏమైనా ఉందా?బెంగాలిలో బాన్డమి అని ఒక పదం ఉంది అంటే hypocrisy అని అర్థం.
    సంక్లిష్టమైన రాష్ట్ర విభజన సమస్య ఉన్న ఫలానా పరిష్కారం కాదని తెలిపోఇన్ద ?మాకు ఎవ్వరికి ఏమి తేలి పోలేదే ?statements సున్నితమైన విషయాలలో చేసేటప్పుడు ప్రజలు ప్రశాంతత కోరుకొంటున్న విషయాన్నీ దృష్టి లో పెట్టుకొని మీ లాంటి మేధావులు కాస్త సంయమనం పాటిస్తే మంచిదేమో

    ReplyDelete
  2. కృష్ణ మనోహరి గారూ,

    1.నా వ్యాసం సరిగ్గా చదవకుండా మీరు వ్యాఖ్యలు చేస్తున్నారు. సందేహాస్పదమవుతుంది అన్న నా మాట యుపిఎ ఎన్‌డిఎలకు వర్తిస్తుందన్న భావం మీరు పట్టుకోలేదు. కెసిఆర్‌ లౌకిక తత్వంపై నేను వ్యాఖ్యలు చేయలేదు. కాని బిజెపితో ఆయన కలసి వ్యవహరించడం వల్ల కలిగే కొన్ని ప్రభావాలను సంకేత ప్రాయంగానే చెప్పాను. నాతో విభేదించే హక్కు మీకు పూర్తిగా వుంది. నన్ను విమర్శించడానికి బెంగాల్‌ సిపిఎంను పదే పదే ప్రస్తావనకు తీసుకు రావడం అప్రస్తుతం. దానిమీద మీకు తోచిన విమర్శలు మీరు చేసుకోవచ్చు.
    2. ఎవరి అవగాహనను బట్టి వారి అంచనాలు వుంటాయి. వివిధ రాజకీయ పార్టీలలోనూ, జెఎసిలలోనూ ముఖ్యులైన వ్యక్తులతో బహిరంగంగా సాగే మా చర్చల ఆధారంగా నా వ్యాఖ్యలు వుంటాయి. కనక 'మాకు తేలిపోలేదే' అని మీరు అంటే నేను చేయగలిగింది లేదు. రేపో మాపో అంతా అయిపోతుందన్న భ్రమలు ప్రజల్లో కలిగించడం కంటే వాస్తవాన్ని సూచించడం తప్పని మీకు ఎందుకనిపిస్తుందో తెలియలేదు. జరుగుతున్న పరిణామాలు మరింత జాగ్రత్తగా గమనించమని కోరడం తప్ప చేయగలిగింది లేదు.ఎందేకంటే మన పాలకులు ఎప్పుడైనా ఏదైనా చేయగల చెప్పగల 'సమర్థులు'

    ReplyDelete
  3. @ krishna monahari

    to say that there was a understanding between CPIM and BJP during the lok sabha polls is very silly as there were direct confrontations between the both parties in many constituencies like diamond harbour and darjeeling excluding the ideological differences they always have

    ReplyDelete
  4. @gargeya
    the perception of the bengal people regarding various political parties and the realpolitik that has happened in bengal during last loksabha elections which i came to know during my interaction with people is what i have commented upon .if there are standing instuctions from party bosses that people are silly,i cant help it.what confrontation in darjeeling?ideological differences?అన్ని వేదాల్లో ఉన్నాయిని అనుకోవడానికి అంతా పార్టీ కి తెలుసు అనుకోవడానికి మధ్య గతి తార్కికమైన తేడా ఏమైనా ఉందంటారా

    ReplyDelete
  5. - in darjeeling there were direct attacks by BJP ang GJM on CPIM cadre and this was so bad that party leaders complained to Election commision

    - ideologically just because both the parties are against congress does not make them friends which is being projected by TMC and congress to create a gap between CPIM and minotities

    ReplyDelete
  6. @gargeya
    we are common people.we are not--------- commitee members to misinterpret and distort facts.whatever happened and is happening in darjeeling is between those for gorkhaland state and those opposed to gorkhaland state.political parties identities are irrelevant in this context.

    ReplyDelete
  7. @krishna manohari

    allegations of linkage between cpm and bjp in west bengal may be due to wrong information. infact there is open mahajot comprising of congi,bjp and tmc. in fact all these parties joined by jamate also in some places like nandigram.there are many other points to attack cpm which u may choose.
    demanding gorkhaland is ok but it is highly unrealistic and near impossible given the geographical and other poits.
    it is a myth to talk ofpeople and regions with out taking the political interestrs of ruling parties.as common people you ought to be more vigillent.
    you may look back on your comments the other day in the light of chidambaram statement.one may oppose or disagree with communists, but it should not become an obsession or force of habit.i replied to one such annonymas columnist above. go through if possible and may shoot your comments..

    ReplyDelete
  8. i have said that many people in bengal believe that bjp candidates indirectly benefitted the ruling lf by cutting the opposition votes.they also believe that it is preplanned.

    in nandigram it was not just the parties opposed to cpm that were in the mahajot but even most of the local cpm leaders and almost the entire left cadre joined the mahajot.some of the ex leaders of cpm are now active tmc leaders and they are in important positions in tmc led zilla parishad.nandigram is an issue where the people voluntarily opposed the decision of ruling class.who ever tried to project themselves as opposed to the decision got some milage out of it.bjp might have also tried that.even the lef front partners like forward block also disagreed with cpm on nandigram many times.hence comparing the issue of internal understanding during elections and nandigram issue doesnt hold much ground.

    the idea of free india might have sounded unrealistic to the ruling class at certain point of time.i just dont want to sit over judgement about gorkhaland.i believe ప్రజలే చరిత్ర నిర్మాతలు .

    how come you know that i am opposed to communists?ఏమీ తెలీని వయస్సులో కూడా మే డే కి పక్కింటి kanakiah ఎర్ర జెండాలు కట్టుకొంటే చూసి మురిసి పోఇన వాళ్ళమే .యుక్త వయస్సులో దర్నలుగా రాళ్లిలుగా ఎర్రబడ్డ వాళ్ళమే .కాస్త అర్థం అయ్యాక హైందవ మట్ట్ లే marxist శిబిరాలుగా పునర్జేన్మ ఎత్తాయని దిగులు పడ్డ వాళ్ళమే .
    ఇప్పటికి మేము ఎరుపే .but we are opposed to the parties who are fooling the people in the name of communism.once i read in the news paper an interview of west bengal chief minister in which he said that "we were socialists".may i know which communists you are referring to?భూస్వామి గ ఆధిపత్యం చేసే అవకాసం లేదు .పెట్టుబడిదారుడిని అయ్యి ఆధిపత్యం చేసే నైపుణ్యం లేదు కాబట్టి "communist " అయ్యి ఆధిపత్యం చేస్తాను అనటం న్యాయమా ?

    ReplyDelete
  9. @krishna manohari

    thank u for the detailed reply. i only request u to make a comparitive study of your own statements above and the raiders you have added below.that far is good. so also the comment - one may oppose communists- need not be interpreted as your position. then your words make it clear that you are opposed to several communists of the day.. all this show some kind of conflict and confusion.. disbelief. so be it and hope for clarity.. any way ippatiki erupe statement ok. if so try to distinguish between rational and temper mental reactions.. that too of stereotype.. bye.

    ReplyDelete
  10. @ krishna manohari

    i really dont know if u are a commitee member of some party but i am not and i am as common man as like u.

    and our parties secular credentials have been proved many times but just because some anandbazar patrika or the sunday indian accuse us of getting communalized due to efforts from mahajoth is not gonna work and all this will be judged in the history .

    ReplyDelete
  11. @gargeya..

    you are right.west bengal big media is desperate to dislodge the left front which created a history.. one should be cautious in beliving them.. thank q for the participation.

    ReplyDelete