Pages

Tuesday, June 28, 2011

ఒకే రాష్ట్రానికి ఎంతమంది సిఎంలో!



రాజకీయాల్లోకి రావడం ముఖ్యమంత్రి కావాలనుకోవడం తప్పు కాదు గాని అనుక్షణం ప్రతివారూ అదే పదవిపై ఆశలు( రాయలసీమ భాషలో బాసలు అంటారు) వదుల్తూ కూచోవడం పెద్ద గౌరవ ప్రదమైన విషయం కాదు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి వున్నారు. అనేక విమర్శలు వివాదాల మధ్య ఎలాగో నెట్టుకు రావడానికి తంటాలు పడుతున్నారు. ఇతర పార్టీల వాళ్లు ఆయనను విమర్శించడం తొలగించాలనుకోవడం సహజం. కాని స్వంత పార్టీ అద్యక్షుడు, పార్టీలో కలిసిన మరో పార్టీ అద్యక్షుడు కూడా సిఎం కావాలని బహిరంగంగా కలలు కనడం ప్రారంభిస్తే ఏమనుకోవాలి? పిసిసి పీఠాధిపతి సత్తిబాబు క్షణమైనా ఈ విషయంలో తన మనసు దాచుకోవడం లేదు. ఇక మెగాస్టార్‌ చిరంజీవి కూడా సిఎం పాత్రలో జీవించాలన్న ఆరాటాన్ని బయిటపెట్టేశారు.అసలు ప్రభుత్వ మనుగడే గండంగా నడుస్తుంటే ఇంత మంది సిఎం ఆశలకు అవకాశం వుంటుందా? వుండదని వారికీ తెలుసు. అంతదాకా వస్తే మాట వేసి వుండటం మంచిదనే ముందుచూపు తప్ప ఇందులో సారం ఏముంటుంది? పైగా ఆ విధంగా మాట్లాడ్డం రేంజిని స్పష్టం చేయడానికి కూడా పనికి వస్తుంది.చిరంజీవి కేంద్రం కన్నా రాష్ట్రమే తనకు ఇష్టమని గతంలోనే చెప్పారు. ఇప్పుడు దాని పూర్తి సారం విప్పారన్న మాట. మీడియాకు మేత కావచ్చు, అభిమానులకు మోత కావచ్చు గాని వాస్తవాల రాత ఏమిటన్నదే అసలు ప్రశ్న.

No comments:

Post a Comment