Pages

Friday, June 24, 2011

ఎమర్జన్సీ ఒక పీడకల.. ఒక ప్రమాద హెచ్చరిక


1975 జూన్‌ 25 అర్థరాత్రి విధించిన ఎమర్జన్సీ లేదా అత్యవసర పరిస్తితి భారత ప్రజాస్వామ్యానికి గ్రహణం పట్టిన ఒక ప్రమాద కర ఘట్టం. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే ఈ దేశాన్ని అంత పెద్ద రాజ్యాంగం కూడా కాపాడలేక పోయిన చీకటి ఘట్టం.ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాదు హైకోర్టు తీర్పు నివ్వడం, ప్రతిపక్షాలు ఆమె అవినీతికి వ్యతిరేకంగా ఉమ్మడిగా ఉద్యమించడం జరిగిన నేపథ్యంలో కేవలం తన పదవిని కాపాడుకోవడానికి రాష్ట్రపతిని రబ్బరు స్టాంపుగా చేసుకుని ప్రధాని ఇందిర అర్థరాత్రి అత్యవసర పరిస్థితి ప్రకటించారు.హక్కులన్ని రద్దయిపోయాయి. పత్రికలు ప్రభుత్వాధికారుల అనుమతి తీసుకున్నాకే విడుదల కావలసిన స్థితి. ఆకాశవాణిలో అనుక్షణం ఆమె భజన. జయప్రకాశ్‌ నారాయణ్‌, మొరార్జీ దేశాయి, వాజ్‌పేయి, అద్వానీ, జార్జి ఫెర్నాండెజ్‌, జ్యోతిర్మయి బోసు, మాకినేని బసవపున్నయ్య తదితరులను అరెస్టు చేసి జైళ్లలో పెట్టారు. వామపక్ష నేతలను అరెస్టు చేస్తే అంతర్జాతీయంగా అభ్యుదయ ముసుగు తొలగిపోతుందనే భయంతో పై సా ్తయి నేతలను విడుదల చేసినా కార్యకర్తలను జిల్లాల నాయకులను నిర్బంధంలోనే వుంచారు. ఇందిరా గాందీ కుమారుడైన సంజరు గాంధీ రాకతో భారత రాజకీయాల్లో వారసత్వ పర్వం వూపందుకుంది. ప్రజల ప్రాణ రక్షణ హక్కు కూడా లేదని సుప్రీం కోర్టులో కేంద్ర న్యాయవాది వాదించాడు! అనేక అమానుసాలు అత్యాచారాలకు అది దారితీసింది. ఇదంతా అయ్యాక ఎన్నికలు ప్రకటిస్తే 1977మార్చిలో హడావుడిగా జనతా పార్టీ ఏర్పడి అ ధికారంలోకి వచ్చింది. కాని విధాన సారూప్యత లేక జనసంఘం ఆరెస్సెస్‌ విధేయులు ఇమడ లేక ఆ ప్రభుత్వం పతనమై పోవడంతో మళ్లీ 1980లో ఇందిరా గాంధీనే తిరిగి అధికారంలోకి రాగలిగారు.ఆంధ్ర ప్రదేశ్‌లోనైతే 1977లో, 1978లో,1980లో కూడా ఇందిరా గాంధీనే విజయం సాధించారు. అయితే జనతా ప్రభుత్వం కూలిపోయినా ఎమర్జన్నీ దుష్పలితాలను సరిదిద్డడంలోనూ దాన్ని ఇష్టానుసారం విధించే వీలు లేకుండా చేయడంలోనూ కొన్ని కీలకమైన రాజ్యాంగ సవరణలు చేయగలిగింది. అలాగే దేశంలో రాజకీయ సమీకరణాలను శాశ్వతంగా మార్యేసి ఏక పార్టీ ఆధిపత్యానికి దాదాపు స్వస్తి పలకడానికి కూడా ఆ ఎన్నికలు కారణమైనాయి.ఇప్పటి వరకూ ఈ దేశంలో చూస్తున్న చాలా పరిణామాలు నాయకత్వాలు ఎమర్జన్నీ అనంతర ఘట్టంలో రూపుదిద్దుకున్నవే.

1 comment:

 1. 1. చాలా మంది వ్యాఖ్యలు రాసినందుకు వాజీ గారు సుదీర్ఘ స్పందన ఇచ్చినందుకు ధన్యవాదాలు.
  2.అయితే ఇవన్నీ అసలు ఎంట్రీకి సంబంధం లేనివి గనక కొనసాగించడం లేదు. మరో ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు జరుగుతూనే వుంటాయి.
  3.తెలుగుదేశం లేదా మరో పార్టీతో సంబంధాల గురించి ఇప్పుడు అనుకూలంగా లేక ప్రతికూలంగా మాట్లాడుకోవడం అప్రస్తుతమే అనుకుంటున్నాను. దానిపై ఎవరూ ఏమీ ప్రకటించింది లేదు.
  4.మోడీ గురించిన నా వాక్యం గతంలోది గుర్తు పెట్టుకుని ఉదహరించారు. దానిపై ఆయన అభిమానులు ఆగ్రహిస్తున్నారు. మోడీకి అమెరికా వీసా నిరాకరించడాన్ని అందరూ ఖండించారు. అయితే అది ఆయనకు పెద్ద కితాబు కాదు. వాజ్‌పేయి కూడా ఆయనను పదవి నుంచి తొలగించాలని విఫలయత్నం చేసి విరమించుకున్నారు. ఆప్తమిత్రుడైన నితీష్‌ కుమార్‌ ఆయన ఎన్నికల ప్రచారానికే రావద్దని షరతు పెట్టారు. ఇంతకూ ఇప్పుడు బిజెపి వివిధ స్థాయిల్లో వివాదాల మయంగా నడుస్తున్నట్టు కనిపిస్తుంది. గోపీనాథ్‌ ముండేను బుజ్జగించే పని ఇంకా పూర్తి కాలేదు. అలాగే కర్ణాటకపై సుష్మ- అరుణ్‌ జైట్లీల వివాదం వగైరాలు..అన్నిటినీ మించి అమెరికా రాయబారితో జైట్లీ వ్యాఖ్యలకు సంబంధించి వికీ లీక్స్‌ వెల్లడి.. అవి కూడా గమనంలోకి తీసుకోవాలి.
  5. తార గారికి కమ్యూనిస్టు పార్టీల నాయకులపై ఏ అభిప్రాయం వున్నా నిక్షేపంగా కొనసాగించుకోవచ్చు. ఉన్న పరిస్తితుల్లో వారు ప్రజల కోసం పోరాడుతున్నారని నమ్మే వారే ఇప్పటికీ ఎక్కువ శాతం వున్నారని నా అంచనా. ఎన్నికల ఫలితాలలో అవి ప్రతిబింబించాలంటే ఏవో పొత్తులు సర్దుబాట్లు వగైరా. వాటిపైనా ఎవరి అంచనాలు అభిప్రాయాలు వారివి. ఆ సమయంలో చర్చించవలసినవి.

  ReplyDelete