Pages

Friday, June 24, 2011

పుట్ట(పర్తి)పగిలిన రహస్యాలు- సర్కారు మీన మేషాలుపుట్టపర్తి బాబా ఆఖరి ఘట్టంలోనే అనేక మంది అనుమానాలు వ్యక్తం చేసినా అధినేతలు అలసత్వం ప్రదర్శించిన ఫలితం ఇప్పుడు స్పష్టమవుతున్నది. ఆధ్యాత్మికత పేరుతో సమాంతర సామ్రాజ్యాలను అనుమతించడం తగదని నా వంటి వారు హెచ్చరిస్తే ఆగ్రహించిన వారికి ఇప్పటి పరిణామాలు కనువిప్పు కాగలుగుతాయా? ఇప్పుడు ట్రస్టు సభ్యులపై రకరకాల కథనాలు వస్తున్నాయి. ఆఖరుకు బాబా కుటుంబ సభ్యులు కూడా భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అలాటి ఒకరిద్దరితో నేను టీవీ ఛానెల్‌ చర్చలో మాట్లాడాను కూడా. వారి గొంతులో స్పష్టంగా భయం తొంగి చూస్తున్నది. అంతా రత్నాకర్‌ లేదా శ్రీనివాసర్‌ వంటి వారి పేర్లు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నా నిజానికి ఇదో పెద్ద వలయం. ఇందులో అనేక పెద్ద తలకాయలు వున్నందునే ఇంత వెసలు బాటు లభించింది. హత్యలు జరిగినా రక్తం చిందినా అంతు చిక్కని రీతిలో అపార సంపదలు ప్రవహించినా ఆరాలు తీయని అధినేతలకు దానితో బ్రహ్మముడి వుంటుంది. ఇప్పుడు దేశంలో బడా పారిశ్రామిక వేత్తలు, రాజకీయ వాణిజ్య వేత్తలు హఠాత్తుగా అగుపిస్తున్నారంటే ఇదంతా యాదృఛ్చికంగానూ భక్తి ప్రపత్తులతోనూ మాత్రమే జరుగుతున్నదనుకుంటే అంత కన్నా అవివేకం వుండదు. విదేశీయులు ప్రముఖులు కూడా యథేఛ్చగా సంచరించే ఇలాటి ఆశ్రమాలే నల్లడబ్బుకు అక్రమ కార్యకలాపాలకు మాఫియాలకు వాటమైన ఆశ్రయాలు అవుతుంటాయి. అందులో అభాగ్యులెందరో అమాయకంగా ఆహుతి అవుతుంటారు . ఆ మౌఢ్యాన్ని అడ్డుపెట్టుకుని పబ్బం గడుపుకోవడానికి పైసలు కూడగట్టుకోవడానికి పాలక వర్గ నేతలు పాకులాడుతుంటారు.ఇదే విష వలయం. ఇప్పుడు కూడా అంతా బయిటకు వస్తుందా అనేది అనుమానమే. ఎందుకంటే ఇప్పటికే సగం మాఫీ తతంగం జరిగే పొయింది....

No comments:

Post a Comment