Pages

Thursday, June 30, 2011

మన్మోహన భాషణాల మర్మమేమి?





ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తాను అసమర్థుడిని కాదని చెప్పుకున్నారు. సమర్థుడు అవునో కాదో గాని సమర్థకుడు మాత్రం అవునని నిరూపించుకున్నారు. దేశ చరిత్రలోనే తనది అత్యంత అవినీతి కర ప్రభుత్వమని మీడియా వర్ణిస్తున్నట్టు ఆయన ఆక్రోశించారు. ........... రాజా వంటి వారు ఏదైనా చెప్పినప్పుడు నమ్మడం సహజం కదా అని అమాయకంగా పెద్ద మనిషిలా మాట్టాడారు. ఇదే పెద్ద మనిషి గతసారి మీడియాతో మాట్లాడినప్పుడు అవినీతి పరుడైనప్పటికీ మిశ్రమ ప్రభుత్వం గనక భాగస్వామ్య పార్టీలు చెప్పినట్టు తీసుకోక తప్పదని అన్నమాటలను గుర్తు చేసుకోవాలి.
...... లోక్‌ పాల్‌ పరిధిలోకి రావడానికి అభ్యంతరం లేదంటూనే అది సర్వరోగ నివారిణి కాని నొసటితో వెక్కిరించారు.ఇవన్నీ నిజమైతే లోగడ అన్నా హజారే వంటి వారితో చర్చలు,రామ్‌దేవ్‌ బాబాకు ఘన స్వాగత సత్కారాలు వంటి ప్రహసనాలన్ని ఎందుకు జరిపించినట్టు?
.... తాను సమర్థుడిని అంటూనే యువతరానికి అంటే రాహుల్‌కు ఎప్పుడైనా సింహాసనం అప్పగించడానికి సిద్ధమని ప్రకటించి విధేయత చాటుకున్నారు.
...... రాజ్యాంగాన్ని రాజకీయ విలువలను వల్లించే మర్యాదస్తుడు తమ లావాదేవీలపై తనిఖీకి ఉద్ధేశించిన సిఎజిపై బాధ్యతా రహితంగా వ్యాఖ్యలు చేశారు. సిఎజి నిజంగా పొరబాటు చేస్తే ప్రభుత్వ పరిధిలో చట్టబద్దంగా వ్యవహరించాలి తప్ప ఈ బహిరంగ వ్యాఖ్యలెందుకు? ఆయన రాజాను నమ్మినట్టే సిఎజి కూడా నమ్మ లేదనా?
సమస్క సచ్చీలత సద్బుద్ధి కాదు. చట్టబద్దత. నిబంధనలు పాటించడం. ఆ సంగతి వదిలిపెట్టి పెద్దాయన ఏవో సుద్దులు చెప్పి ఫలితమేమిటి?

1 comment:

  1. రవి గారూ ,
    ప్రధాన మంత్రిగా ఉద్యోగం చేస్తున్న మన్మోహన్ సింగ్ నుండి అంతకన్నా ఏమి ఆశించగలం ? దేవత మాట్లాడితే ఉపయోగం గానీ .. పూజారి ఎంత చెప్పినా ఏం ప్రయోజనం !

    ReplyDelete