తెలంగాణా సమస్యపై కేంద్రం పరిష్కారం ప్రకటిస్తుందని ఇప్పటి వరకూ వినిపించిన కథనాలకు అఖిలపక్ష సమావేశం జరపాలని ఇప్పుడు తీసుకున్న నిర్ణయానికి పొంతన లేదు. ఈ పేరిట కాలయాపన చేయడానికి పాచికలు వేస్తున్నట్టు కనిపిస్తుంది. కెసిఆర్ సెప్టెంబర్ గడువు ఎలాగూ దాటి పోతుంది. ఆ లోగా సమావేశం జరుపుతారా అన్నదే సందేహం. నాలుగు ప్రధాన పార్టీలు అభిప్రాయం చెప్పలేదని మాజీ హొం మంత్రి చిదంబరం చెప్పిన నాటి పరిస్థితికి ఇప్పటికీ తేడా ఏమీ లేదు. ఏకాభిప్రాయం లేదని మొన్న మొన్న ప్రధాని చేసిన వ్యాఖ్య కూడా ఆ కోవలోనే వుంది.ఇవన్నీ సర్దుబాటై అన్ని పక్షాలు ఒక్క మాట చెప్పడం ఆచరణలో జరిగేది కాదని అందరికీ తెలుసు. అందుకే నెపం రాష్ట్రంలో పార్టీల పైన పెట్టి రాజకీయం నడిపేందుకే ఈ అఖిలపక్ష ప్రహసనం పునరావృతం చేస్తున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత కూడా కమిటీ జరిగినప్పుడు ఇంకా పార్టీలు కొత్తగా చెప్పేది వుంటుందని ఆశించలేము. తెలుగు దేశం లేఖ ఇస్తుందని చాలా ప్రచారం జరిగినా చంద్రబాబు నాయుడు ఇప్పటికీ మాట్లాడి చెబుతాననే అంటున్నారు. రెండు కాంగ్రెస్‌ల వైఖరి డిటోగా వుంది. మజ్లిస్ వ్యతిరేకంగానే వుంది. కేంద్రం ఏదైనా నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఎలాగూ ఎవరి వైఖరి వారు ప్రకటిస్తారు. కనక గత అనుభవాలను బట్టి చెప్పాలంటే అఖిలపక్షం అన్నది లాంచనమే తప్ప పరిష్కారానికి దారి తీసేది కాదు. సత్వర పరిష్కారానికి మార్గం అంతకన్నా కాదు. తమకు డెడ్‌లైన్లు చెల్లబోవని వాయిలార్ రవి బల్లగుద్ది చెప్పడం నిజానికి వాటిని ప్రకటించిన వారికి సమాధానమే. విలీనంపైన ఆయన వ్యాఖ్యలు కూడా టిఆర్‌ఎస్‌నే ఇరుకున పెట్టేవిగా వున్నాయి.
Monday, September 17, 2012
అఖిలపక్షం పేరిట మళ్లీ అనిశ్చితమే!

Subscribe to:
Post Comments (Atom)
Everyone say what is problem? Giving a solution is the difficult task. so many intellectuals are there in state. They can give a solution than saying there is problem and center is not providing solution.
ReplyDelete