Pages

Tuesday, July 26, 2011

అసలు ఆయా పార్టీలలో ఏకాభిప్రాయం వుందా?



తెలంగాణా సమస్యపై హౌం మంత్రి చిదంబరం చేసిన తాజా వ్యాఖ్యలుతో కేంద్రం ఎత్తుగడలు స్పష్టంగా బహిర్గతమవుతున్నాయి.

1.డిసెంబరు 9 ప్రకటన ప్రభుత్వం తరపున అని చెప్పే చిదంబరం కాంగ్రెస్‌ పార్టీ ఒక వైఖరి తీసుకోలేదని గతంలో చెప్పారు. అంటే నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వం వైఖరి తీసుకోకుండానే ప్రకటన సాధ్యమా?

2.పార్టీల మద్య ఏకాభిప్రాయం కావాలని అంటున్న కేంద్రం ఆ పని తమతోనే మొదలు పెట్టొచ్చు. ఆజాద్‌ ఆ పని చేస్తున్నారని చిదంబరం అంటున్నారు గాని దీనితో కాంగ్రెస్‌ నాయకులే చాలామంది ఏకీభవిస్తారా?

3.ఒకే ప్రాంతంలోని వివిధ పార్టీలు ఎవరి ప్రయోజనాలు వారు చూసుకుంటున్నప్పుడు- ఒకే పార్టీ వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా మాట్లాడుతున్నప్పుడు
ఏకాభిప్రాయం పల్లవితో ఏమైనా ప్రయోజనమా? మీ అభిప్రాయం ఏమిటో చెప్పాలని అందరూ ఏకాభిప్రాయంతో అడుగుతున్నా ఎందుకు చెప్పడం లేదు?

4.రెండు వారాల్లో అయిపోతుందని సంకేతం అందుకున్న వారు దాన్ని పంపించిన కేంద్రాలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో పరీక్షించుకుంటారని ఆశించవచ్చునా?

5.ఇదంతా అయిన తర్వాత కూడా ఎంపి పొన్నం ప్రభాకర్‌ తెలుగుదేశం లేఖ ఇచ్చేట్టయితేనే తమ బాధ్యత అని చెప్పడం ఉచితమేనా? తెలుగు దేశం ద్వంద్వ భాషణం ఒకటైతే కాంగ్రెస్‌ అంతకన్నా రెండు రెట్లు అధికంగా విన్యాసాలు చేయడం లేదా?

6.ఏది ఏమైనా కేంద్ర రాష్ట్ర స్థాయిలో ప్రధాన పార్టీలు తమ తమ స్వలాభాల మేరకు పనిచేస్తున్నాయి తప్ప విశాల ప్రజా శ్రేయస్సు అనివ్చితి తొలగింపు అనేది పట్టించుకోవడం లేదు. భాషా రాష్ట్రాల విభజన వద్దని సూత్ర ప్రాయంగా చెప్పిన సిపిఎం మినహా అన్ని పార్టీలలోనూ ఏదో ఓక విధమైన గందరగోళం వుంది. రెండు ప్రదాన పార్టీలు స్పష్టంగా రెండు మాటలు మాట్టాడుతున్నాయి. దీన్ని సాకుగా చూపుతూ కేంత్రం తన వంతు క్రీడ తాను సాగిస్తున్నది.

7. కారణం ఏదైనా చిదంబరం బిజెపి వొక్కటే ఏకాబిప్రాయంతో వుందని కితాబిచ్చారు. శ్రీకృష్న కమిటీపై వెంకయ్య నాయుడు మాటలకు కూడా తెలంగాణా బిజెపి నేతలు అభ్యంతరాలు తెల్పిన రోజులు గత ఏడాది చూశాము. రాజినామాలలోనూ కిషన్‌ రెడ్ది ఈ దఫా మాత్రమే ముందుకొచ్చారు. వాటిని తిరస్కరించిన పిదప మళ్లీ చేయాలనుకోవడం లేదని కథనాలు వస్తున్నాయి గాని నిజమో కాదో తెలియదు.ఇక ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పిన బిజెపి తర్వాత దాన్ని అటక ఎక్కించి అందుకు తెలుగు దేశం కారణంగా చెప్పింది. అయితే తమ పార్టీ ఎంపిగా వున్న నరేంద్రకు స్వయానా అద్వానీనే తెలంగాణా ఏర్పాటు సాద్యం కాదని 2002 ఏప్రిల్‌ 1న లేఖ రాశారు. అప్పటికి టిఆర్‌ఎస్‌ ఏర్పడింది కూడా.
'' 377 వ నిబంధన కింద మీరు లోక్‌సభలో 26.2.2002న ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు గురించి లేవనెత్తిన విషయానికి సంబందించిన అంశం చూడగలరు.
నేను ఆ విషయం పరిశీలన జరిపించాను. ఆర్థికాభివృద్ధిలో ప్రాంతీయ అసమానతలను ప్రణాళికల ద్వారానూ వున్న వనరులను సమర్థంగా ఉపయోగించుకోవడం ద్వారానూ అధిగమించవచ్చు. అందువల్ల ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును ప్రతిపాదించడం లేదు''
అదే అద్వానీ ఈ రోజున తెలంగాణా ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలు స్క్రోలింగులో వస్తుంటే పెద్ద పార్టీలు ఎంత తేలిగ్గా మాటలు మార్చగలవో తెలుస్తుంది. అలాటి మాటల గారడీతో ప్రాంతాల పేరిట బురిడీ కొట్టించడం తప్ప నిజంగా నిబద్ద విధానంతో నిలబడతాయని ఏ విధంగానూ అశించడానికి లేదు. కనక చిదంబరం చెప్పే ఏకాభిప్రాయం ఎండమావి మాత్రమే. ఆ పేరిట కేంద్రం నడిపిస్తున్న రాజకీయ మాయాజాలమే కనిపిస్తున్న సత్యం. ప్రాంతాలకు అతీతంగా అందరూ అర్థం చేసుకోవలసిన సత్యం అది.పాలకుల తత్వమూ అదే. దాన్ని అర్థం చేసుకోగలిగితే ప్రాంతాల మధ్య ఉద్రిక్తతలకు అవకాశం వుండదు. అవసరమ అసలే వుండదు.

12 comments:

  1. ప్రా౦తాలకతీత౦గా అర్ధం చేసికొని తెల౦గణా ప్రజలు ఉద్యమాన్ని నిలిపివేయ్యాలి అ౦తే కదా మీరు చెప్పేది (ఆ౦ధ్ర లో ఎలాగు ప్రజలను౦డి ఉద్యమ౦ లేదు కాబట్టి అర్ధం చేసికొన్నా లేకున్నా పెద్ద మార్పే౦ ఉ౦డదు )

    ReplyDelete
  2. 1. ఇవ్వకకపొతె కొంపలంటుకో పోతయ్యని వీరంగం చేసిన ప్రతిపక్ష నాయకులు, ఊదరగొట్టిన ప్రసార మాధ్యమాలు, విశ్లేషకులు, చస్తున్నాడంటూ నిమిషానికో బుల్లెటిన్ ఇచ్చిన డాక్టర్లు, కళ్ళు చెవులు మూసుకోని నిర్లిప్తంగా కూర్చున్న సీమ-కోస్త నాయకులనూ చూసి కేంద్రం ఆ నిర్ణయం తీసుకుంది. అందరూ మర్నాడే అడ్డం తిరుగుతారని ఊహించలెకపోవటం తెలివితక్కువతనం కావొచ్చేమో కానీ అందులో ఏవో కుట్రలూ కుతంత్రాలు ఉన్నయాని నేననుకోను. విశ్లెషణల పేరిట conspiracy theories వండివార్చటం కాక మీ సలహా ఏదన్నా ఉంటే చెప్పగలరు.

    2. తెలంగాణావారేకభవించరు, మిగిలినవారు ఏకీభవిస్తారు. మీ అభిప్రాయం?

    3. ఏకాభిప్రాయం తప్ప ఇంకో మార్గం లేదు కాక లేదు. మాకు నచ్చిన డెసిషన్ ఇస్తేనే మాట వింటాం లేకపోతే ఊరుకోమూ అనోపక్క చెప్తూ అదే నోటితో కేంద్రం అభిప్రాయం చెప్పట్లేదంటూ గొంతు చించుకోవటం దివాళా కోరుతనం. పొలిటీషియన్స్ కి ఎలాంటి మాటలైనా చెల్లుతాయి మీరెందుకు ఆ పల్లవే పాడతారు. ఊరికే ఉచ్చిలితనం తప్ప నిజంగా వాళ్ళొ డెసిషన్ చెప్తే ఒప్పుతారా..రావణ కాష్టం కాదా? ఇంతకీ కేంద్రం ఏమి చెప్తే,చేస్తే అందరూ సంతోష పడతారో ఒక బ్లూ ప్రింట్ లాంటిది ఎందుకివ్వలేకపొతునారు? జస్ట్ సలహానెగా..విశ్లేషకులయ్యుండీ భయపడితే ఎలా? (ఆల్రెడి చెప్పానని చెప్పకండి..చెప్పలేదు మీరు)

    4 .వారిదో మాటా...దానికో విలువ. సర్లెండి.
    5. పై సమాధానమె దీనికి కూడా.
    6. రాష్ట్ర నాయకుల సంగతి ఒప్పుకుంటా కానీ..కేంద్రంలో రోజు కుట్రలు పన్నుతున్నారనే మీ వాదనని ఏకీభవించను. రాష్ట్రం ఇలా తగలపడటం వల్ల కేంద్రానికి వచ్చే లాభం సూన్యం. మనం కొట్టుకున్నంత సేపు పరిస్తితులు ఇలాగే వుంటాయి. This is essentially a hate movement where logic and truth has no takers.

    ReplyDelete
  3. డిసెంబెర్ 9 వరకు నిజంగా తెలంగాణా వస్తుందని నమ్మిన వారు చాలా తక్కువ. అన్ని ప్రాంతాల్లో. ఆ మేరకు వారి తప్పువుంది. . ఆ మాటకి వస్తే కలిసుండాలని 1972 లోనే ఒప్పుకున్నాక 30 ఏళ్ళు నోరు కట్టుకొని అన్యాయం జరిగిందంటూ నిందించటమూ తప్పే. కానీ ప్రస్తుతపు విషయం దాన్ని తవ్వుకోని దుమ్మెత్తిపోసుకోవటం కాదు
    As long as you are insensitive to the feelings of all regions, as long a you do not recognize all stake holders and as long as you do not aim for cosensus you will neither understand the real issue here nor find any solution.

    ReplyDelete
  4. ముల్కీ నిబంధనలు సమైక్య రాష్ట్రంలో అన్యాయమని నిజంగానే ఆరోజు వారు భావించి విడిపోతామన్నారు. మహా మహా కోర్టులకే ఆ నిబంధనలమీద ఏకాభిప్రాయం లేదు. తమకన్యాయం జరుగుతోందని ఉద్యమించటాన్ని, అవతల వాళ్ళ మీద అసూయ కింద మార్చేశారు. జోహార్!
    మీ ప్రాంతపు అభివ్రుద్ధి గురించి మీ మీ MLAలను నిలదీయండి. పక్క వాళ్ళని నిందించటం చాతకానితనం.

    ReplyDelete
  5. డబ్బున్నవాళ్ళకి ఉద్యోగాలు దొరక్కపోతే వ్యాపారాలు పెట్టుకోగలరు. ఉద్యోగాల విషయంలో వెనుకబడిన ప్రాంతాలకి ప్రాధాన్యత ఇవ్వడం అన్యాయం ఎలా అవుతుంది? ఆ మాటకొస్తే ఇరిగేషన్ ప్రోజెక్ట్‌ల విషయంలో వెనుకబడిన ప్రాంతాలకి ప్రాధాన్యత ఇవ్వడం కూడా అన్యాయం అనుకోవాలి.

    ReplyDelete
  6. సమైక్యాంధ్ర పాలకులు తెలంగాణాలో ఇరిగేషన్ ప్రోజెక్ట్‌లు కట్టరు. ఎందుకు అని అడిగితే వాళ్ళు తమ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలనే నిలదియ్యాలంటారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్‌లో కొత్త రైల్వే లైన్లు వెయ్యడం లేదు. హర్ష కుమార్ లాంటి ఎం.పి.లు అడిగినా సరే వెయ్యడం లేదు. వాళ్ళు కూడా ఈ విషయంలో ఆంధ్రా ఎం.పి.లదే తప్పు అంటారు. కొట్టేవాడెప్పుడూ తప్పు తన దగ్గర ఉందని ఒప్పుకోడు.

    ReplyDelete
  7. ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూసే వారు అత్యధికంగా మధ్య తరగతి లేదా అంతకన్న తక్కువ వారు. వారి కష్టాలకి ప్రాంతీయ బేధం లేదు.అసలున్న ఉద్యోగాలెన్ని? అందులో కొత్తవెన్ని? మొత్తం భారతదేశం అందులో ముఖ్యంగా మన రాష్ట్రం వెంకబడినవని ఇంత చదివి ఎలా మర్చిపొతున్నారు. ఈ ప్రపంచాన్ని ఒకే లాంటి సామజిక, ఆర్ధిక, సాంస్క్రుతిక లక్షణాలున్న 1000 భాగాలుగా విడకొట్టినా ఆంధ్రా-తెలంగాణా ఒకే భాగంలో పడతాయి. అంత తక్కువ తేడాలున్న ప్రాంతాలివి. దాన్ని చిలవలు పలవలు చేసి కోతి పుండు ని బ్రహ్మ రాక్షసి చేసి మనని మనం కూకటి వేళ్ళతో పెకిలించుకోని నవ్వుల పాలవుతున్నాము.
    మనని మనం గౌరవంచుకోని నాడు పక్క వాడెవడొ ఉధరిస్తాడనుకోవటం..మూర్ఖత్వం.

    If state divides, the real winners are Tamilnadu, Karnataka, Maharashtra and Gujarath. Not us.

    ReplyDelete
  8. నిన్న ఈ ఐటం రాసిన తర్వాత మళ్లీ చూడటం పడలేదు. ఈ లోగా ఇంత తీవ్ర ః స్థాయిః వాదోపవాదాలు సాగాయని గమనించలేక పోయాను. ఈ భాష నడుస్తుంటే చూడలేకపోవడం పొరబాటే. దీనికి కారకులైన వారెవరి వైఖరినీ ఆమోదించలేను నా బ్లాగులో తన అభిప్రాయాల పరంపర నింపడం ఉచితం కాదని ప్రవీణ్‌ శర్మను గతంలోనే కోరాను. అలాటి ఇతరులకు కూడా అదే నా సలహా. సెల్‌ఫోన్‌ అన్నది సమాచారానికి తప్ప సంభాషణలకు కాదన్నట్టే ఇలాటి చర్చలు క్తుప్తమైన స్పందనలకు తప్ప ఎడతెగని వాదోపవాదాలకు కక్ష సాధింపులకు వేదిక కాదు. విభేదించడానికి అంగీకరిద్దాం అనే పాటి సంయమనం లేకపోతే కష్టం.
    తెలంగాణా సమస్య అంటున్నది వాస్తవంలో ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయ భౌగోళిక భవిష్యత్తుతో ముడిపడిన సమస్య. ఈ విషయంలో నిస్పందేహంగా కేంద్రం అన్ని ప్రాంతాల తోనూ చెలగాటమాడుతున్నది. కాంగ్రెస్‌ వారు కూడా కాదనలేని ఈ సత్యాన్ని పావని వంటి వారు అదే పనిగా ఖండించడం ఆశ్యర్య కరం. నా మాటలు ఏదో ఒక ప్రాంతానికి అనుకూలమో ప్రతికూలమో అనే అపార్థాలతో ధ్వజమెత్తడం అర్థ రహితం. మినహాయింపులు లేకుండా అన్ని ప్రాంతాలలోనూ అవకాశవాదాలు చెలరేగుతున్నాయి గనక అప్రమత్తంగా వుండ వలసిందే. అవాస్తవాలను, అవాంఛనీయ ధోరణులను నివారించవలసిందే.

    ReplyDelete
  9. Mr.Praveen,

    no point in draging the discussion with same old rethoric. pl note none of the above things are there in my present entry. i commented only on the latest devolepments. taht is the main purpose of this interaction. after all i am interested in bloggers at large and not some who are ever redy with arms. have your own platform and refrain from making it monatanous.

    ReplyDelete
  10. Ravi gaaru,

    You are still in conversation with this gentleman? He is a pervert. I learned it in just about an hour. No sane discussion is posible with him. He brings down every topic in to a personal conflict completely ignoring the big picture. I read his other posts and made some reseach on him. It didn't take much time to figure out that basically he has lots of time though he claims he has his own business. He always wonders in every blog, pick some not so aggressive bloggers, intudes into their personal info like IP addresses, locations, churn out some conspiracy theories as his full time activity and instigate them into below the belt fight. He is always off the topic, pungent and revengeful. Heights of his idiosyncracy is some of the audio/videos and blogs that he created specifically targeting his presumed enemies. Another typical characteristic of him is..relentles bombardment of same posts in as many blogs as possible or even imposible. Frankly I feel ashamed momentarily engaging in some discusion with him rather innocently.

    ReplyDelete
  11. ప్రవీణ్,
    ధర్మరాజు లాంటి తెర గారిని విసిగించైనా 'టోటల్ రెవెల్యూషన్' ఇప్పుడే తెప్పించడం అంత అవసరమా?! హమ్మ్..

    ReplyDelete
  12. Particularly Congress party and Telugu Desam partyhave deceived people of Andhra Pradesh and Government at Centre which highly irresponsible attitude of TDP leader Chandra Babu Naidu and Previous D.Srinivas. Now the party leaders A/Sri Chandra babu Naidu and Botsa Satyanarayana have to take their responsibilities to make all legislators irrespective of regions sit in their party offices and to arrive a solution to send a opinion to centre. Blaming centre is highly irresponsible attitude of the AP leaders. Already delayed. The party leaders Sri
    Chandra Babu Naidu and Sri Botsa Satyanarayan have to say with out using the centre and Parliament.

    ReplyDelete