Pages

Monday, September 12, 2011

నకిలీ కంపెనీల పేర్లతో నయ వంచన

ఎమ్మార్పణం-3

ఏజంటుగా నియమించుకున్న స్టైలిష్‌ హౌమ్స్‌కు చదరపు గజం రు5000 చొప్పున 100 ప్లాట్లు అప్పగించాలని, ఏజంటు ప్రతి విల్లాపైన నాలుగు శాతం తన కమిషన్‌గా అదనంగా వసూలు చేయొచ్చని దానితో కుదర్చుకున్న ఒప్పందంలో అవకాశమిచ్చారు. వాస్తవానికి అక్కడ భూమి ధర ఇంతకంటే డజను రెట్టు ఎక్కువ వుంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ యాభై వేలకు తక్కువ కాదు. అయినా మొదటి వంద ప్లాట్లు ఏజంటు ఈ రేటుకే అమ్ముకోవాలని, మిగిలినవి మార్కెట్‌ రేటు ప్రకారం విక్రయించవచ్చునని అవకాశమిచ్చారు. ఆ తర్వాత 2-5-05 న ఎమ్మార్‌ ప్రతినిధులు మరో కొత్త పేరును తెచ్చారు. అప్పటికే తాము భాగస్వామిగా చేర్చుకున్న ఎంజిఎఫ్‌ గ్రూపు అనుబంధ సంస్థ అయిన ఫ్రిడ్జి హౌల్డింగ్స్‌ లిమిటెడ్‌కు తమ 74 శాతం వాటాలో 34 శాతం ఇచ్చేందుకు అంగీకరించాలని కోరారు.ప్రాజెక్టు పూర్తయ్యేవరకూ పంపిణీ ఏర్పాట్లు మార్చనవసరం లేదని ఎపిఐఐసి అధికారులు చెప్పారు. 2005 జూన్‌ 6న ఎపిఐఐసి మేనేజింగ్‌ డైరెక్టర్‌ మొదటి దశకు సంబంధించిన రాస్తూ భూమి లావాదేవీలు ఇంకా మొదలు కాకుండానే నగదు తీసుకుంటున్నట్టు తెలిసిందని, ఇది సంయుక్త వ్యవహారం గనక తమతో కలసి వ్యవహరించాలని కోరారు.అంటే అప్పటికే పరిస్థితి చేజారడం
మొదలెట్టిందన్న మాట
21-9-2006న జరిగిన ప్రాజెక్టు సమావేశంలో ఎమ్మార్‌ ఎంజిఎఫ్‌ ప్రతినిధులు తాము బయిట నుంచి అప్పు తెచ్చుకోవడానికి అవకాశమివ్వాలని అభ్యర్తించారు.అంటే తమ ఆర్థిక స్తోమతను గురించి చెప్పుకుని ప్రాజెక్టు కైవశం చేసుకున్న ఆ సంస్థ ఆదిలోనే చేతులెత్తేసిందన్నమాట.దీనిపై ఎలాటి చర్చ జరిగిందీ వివరాలు తెలియడం లేదు. ఎంజిఎప్‌ను రంగంలోకి తెచ్చిన సంస్థ ఎమ్మాఆర్‌ ఎంజిఎఫ్‌ ల్యాండ్‌ లిమిటెడ్‌ పేరుతో మరో కొత్త పేరు ఢిల్లీ కస్తూర్బా రోడ్డు చిరునామాతో సృష్టించారు. ఎమ్మార్‌- ఎపిఐఐసిలో కూడిన ఇహెచ్‌టిపిఎల్పఐ దీని ప్రభావం ఏమిటన్నది కనీసంగా కూడా చర్చించలేదు. కాని 2006 సెప్టెంబరు 21న జరిగిన సమావేశంలో కన్వీనెన్ను ఒప్పందం ప్రకారం 258.36ఎకరాల భూమికి ఇహెచ్‌టిపిఎల్‌ తిరుగులేని యజమాని అని దానిపై ఏ విధమైన లావాదేవీలు జరపడానికైనా దానికి అ ధికారమున్నదని తేల్చి చెప్పారు.దానికి డెవలపర్‌గా వున్న ఎమ్మార్‌ ఎంజిఎప్‌ ఏ పరిమితులు లేకుండా పనిచేయవచ్చునని ప్రకటించారు.ఎమ్మాఆర్‌ ఎంజిఎప్‌, ఎస్‌పివి జెవి కంపెనీలన్నిటికీ ఒకే యాజమాన్యం వుండటం ఇక్కడ గమనించదగ్గది. కేవలం తమ అవసరాలకోసం ఆదాయాలను తక్కువ చూపించి పన్నులు వాటాలు ఎగవేయడం కోసం ఎప్పటికప్పుడు ఏవో పేర్లను చెబుతూ గందరగోళ పర్చారు.
25-7-2007న జరిగిన సమావేశంలో అంతకు ముందు కుదిరిన అమ్మకపు ఒప్పందాన్ని మొత్తంగా ఎత్తివేశారు. ఆ స్థానంలో ఒక డెవలప్‌మెంట్‌ కమ్‌ జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ కోరారు. ప్రభుత్వం 2007లో ఒక సెజ్‌ను ప్రకటించింది గనక ఒప్పందాన్ని మార్చవలసి వచ్చిందని ఏవో సాకులు చెప్పారు.అదే నిజమైతే మిగిలిన మూడు సందర్భాలకు వేర్వేరు సంస్థలు ఏర్పాటు చేసినట్టే సెజ్‌లకు కూడా మరో ఏర్పాటు ఎందుకు చేయలేదని దినేష్‌ రెడ్డి నివేదిక ప్రశ్నించింది. తర్వాతి సమావేశంలో పవర్‌ ఆఫ్‌ అటార్నీ ఇవ్వడానికి అంగీకారం కుదిరందంటున్నా దానివల్ల ఆదాయం పంపిణీపై పడే ప్రభావం గురించి ఎందుకుచర్చించలేదని ప్రశ్నించింది, దీంతో జిపిఎ హొల్డర్‌కు అపరిమితమైన అధికారం సంక్రమించింది. ఆదాయం పంపిణీపై తాము ఇచ్చిన లెక్కలను ఎప్పటికీ సవాలు చేయకూడదని డెవలపర్‌గా ఎంజిఎప్‌ పేర్కొన్నది నిజానికి ఎంజిఎఫ్‌ను తీసుకొచ్చినప్పుడే వాటాల పంపిణీపై సరైన అవగాహనకు రాలేదు. వుంటే దాన్ని పొందుపర్చి వుండేవారు ఇక ఆ తర్వాత ఈ భూమిని తాకట్టు పెట్టయినా అప్పు తెచ్చుకోవదానికి జిపిఎకు అధికారం ధారాదత్తం చేయబడింది.ఎలాగో ప్రాజెక్టు దక్కించుకున్న వారికి అవసరమైన ఆర్థిక సామర్థ్యం లేదని దీంతో బట్టబయలైంది. జిపిఎ హౌల్డర్‌కు వివిధ రూపాల్లో 75 నుంచి95 శాతం వరకూ అసలు యజమాని అయిన ఎపిఐఐసి కి కేవలం 5 నుంచి 25 శాతం వరకూ రకరకాలుగా వాటాలు చేపించారు.ఇంత జరిగిన తర్వాత కూడా ఎపిఐఐసి సిఎండి ఆచార్య ఎమ్మార్‌ ఎంజిఎప్‌కు డెవలపర్‌ కమ్‌ ఎజిపిగా నియమించడం పట్ల తమకేమీ అభ్యంతరం లేదని తెలిపారు.ఆ భూమి తనఖా పెట్టి అప్పులు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నా అడ్డుకోలేదు. పారదర్శకత అవసరమని సుద్దులు చెప్పి సర్దుకుంది. దానిపై జులై2న ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ తరపున విజయరాఘవన్‌ ఎపిఐఐసి వైస్‌చైర్మనకు లేఖ రాస్తూ అందరికీ తెలిసే ఈ పనిచేస్తున్నామని తెలిపారు.
అప్పటికి రోశయ్య ప్రభుత్వం ఎమ్మార్‌పై కాస్త కదలిక చూపిస్తున్నందున వాదోపవాదాలు పెరిగాయి.మీ ఏర్పాట్ల వల్ల భాగాలు మార్చుకోవడం వల్ల మాకు నష్టం జరుగుతున్నదంటూ తెలియజేశారు.ఇకపై ఈ విషయంలో ఎలాటి కొత్త నిర్మాణాలు చేయొద్దని పేర్కొన్నారు. అలాగే ఇంటిగ్రేటెడ్‌ ప్రాజెక్టుకు సంబంధించిన ఎలాటి పత్రాలు రిజిస్టర్‌ చేసుకోవద్దని కూడా సంబంధిత శాఖకు రాశారు. అయితే అప్పటికే లాభాలు పోగుపోసుకోవడానికి అలవాటు పడిన ఎమ్మార్‌ ఎంజిఎప్‌ తమ చర్యను సమర్తించుకుంటూ లేఖ రాశారు.

No comments:

Post a Comment