Pages

Thursday, July 14, 2011

ముంబాయి పేలుళ్లు దేశానికి సవాలు

ముంబాయి నగరంలో పరంపరగా జరుగుతున్న పేలుళ్లు అఖిలభారతానికి ఆవేదన కలిగిస్తాయి. ఆందోళన నింపుతాయి. మృతుల కోసం భాష్పాంజలి ..అదే సమయంలో ఇంత పెద్ద దేశపు నిఘా వ్యవస్థ, పోలీసు యంత్రాంగం, పాలనా విభాగం, రాజకీయ నాయకత్వం బాధ్యతపైనా ప్రశ్నలు వస్తాయి. తాజ్‌ హౌటల్‌ దాడి తర్వాత కూడా మనం ఏం పాఠాలు నేర్చుకున్నామో అర్థం కాదు.
మతతత్వ శక్తులు, మాఫియా ముఠాలు, స్మగ్లర్లు, అవినీతి పరులైన రాజకీయ వాణిజ్య వేత్తల విషవలయమే ముంబాయి.అంతర్జాతీయంగా అమెరికా అండదండలు గల పాకిస్తాన్‌ సాగించే కుట్రలు మరో వైపు. ఇన్నిటి వల్ల టెర్రరిస్టులు దాడి చేయగలుగుతున్నారు.మన పోలీసులు నిఘా అధికారుల సంఖ్యను సమర్థతనను సాధన సంపత్తిని పెంచడం సమన్వయ పర్చడం ఇక్కడ కీలకం.లష్కరే తోయిబాకు అనుబంధమైన ఇం డియన్‌ మొహజదీన్‌ ఇందుకు బాధ్యత వహించాలని చెబుతున్నా అధికారికంగా ధృవీకరించ వలసి వుంది. ఇప్పుడు కారకులెవరైనప్పటకీ వారికి దోహదం చేస్తున్న దేశ వాతావరణం అంతర్జాతీయ నేపథ్యం కూడా గమనంలోకి తీసుకోవలసి వుంటుంది.
అన్నిటినీ మించి ఉగ్రవాదులను ,వారికి బలై పోయిన వారిని మతాలను బట్టి చూసే ధోరణి కూడా మారవలసి వుంటుంది. దేశ భద్రత ప్రజా రక్షణ విషయంలో పార్టీలకు అతీతంగా అందరూ కలసి కట్టుగా వ్యవహరిస్తేనే భద్రత సాధ్యం.  పొరబాట్లను ,వైఫల్యాలను సమీక్షించుకునే బదులు (రాహుల్‌ గాంధీ )99 శాతం బాగా చేశామని  కితాబులిచ్చుకుంటే మరింత నష్టం.

19 comments:

  1. ముందు మనము మారాలి....
    లొసుగులు ఉన్నచోటే ఇటువంటి చర్యలు పునరావృతం ఆవుతాయి...
    ఇప్పటికి అనేక సార్లు ముంబయిలో విధ్వంసాలు జరిగినప్పటికి, ముంబాయిని శత్రుదుర్బేధంగా మార్చలేకపోతున్న
    యంత్రాంగమే దీనికి భాధ్యత వహించాలి...... భద్రత ప్రమాణాల విషయములో కొన్ని దేశాలు పాటిస్తున్న విలువలను మనము కూడా
    పాటించవలసిన అవసరముంది....

    ReplyDelete
  2. this purely completely our wrong..rajiv is 100 percent correct..

    we dont bother about international politics and dont fear about at any cost..

    we have lot of all but we shouldnt use all things..

    ReplyDelete
  3. మతతత్వ శక్తులు, మాఫియా ముఠాలు, స్మగ్లర్లు, అవినీతి పరులైన రాజకీయ వాణిజ్య వేత్తల విషవలయమే ముంబాయి.
    ....

    Very irresponsible statement, shame on you.

    ReplyDelete
  4. అంతర్జాతీయంగా అమెరికా అండదండలు గల పాకిస్తాన్‌ సాగించే కుట్రలు మరో వైపు.
    బలై పోయిన వారిని మతాలను బట్టి చూసే ధోరణి కూడా మారవలసి వుంటుంది.
    ..........

    Perhaps you should stop pointing USA first for every sin, while criticizing USA you always forget China is also staunch support of Pak, terrorists using China made Grenades and other weapons against India is not uncommon.

    Respond like an Indian, not like USA hater.

    ReplyDelete
  5. @tara

    thanks for joining. fine. if you feel such dark forces are not there in Mumbai most welcome to do so. I got much meterial on that.
    that china is a friend of Pakistan is well known fact and there is a long history. i never complimented china but it is not the main pillar of that regime.it's us and everybody know. Hydely is not in china and our govt never referred to China in this regard.Finally islamic terrorism, clash of civilizations, making of Bin laden etc. were done in usa is an acknwoledged fact.
    so Taraji have some respect for facts and don't strain much. USA is a great country and pointing out it's follies is not hatred. my comments are not at all new and they represent a wide spectrum in this country. pl bare with them. i never hate anybody but don't spare either. only unbecoming comments from some obssesed make me shame for them. no problem
    At least for the day think of the dead and wounded and i hope u don't drag.bye.

    ReplyDelete
  6. ముంబాయి నగరంలో పరంపరగా జరుగుతున్న పేలుళ్లు అఖిలభారతానికి ఆవేదన కలిగిస్తాయి. ఆందోళన నింపుతాయి. ’మృతుల కోసం భాష్పాంజలి ఘటిస్తాయి’. రవి sir, ఇక్కడ పేలుళ్ళు ’మృతుల కోసం భాష్పాంజలి ఘటిస్తాయి’ అన్నట్టు గా ఉంది.

    journoల ఊకదంపుడుతనం కనిపిస్తుంది ఈ వ్యాసంలో. it is only my opinion

    ReplyDelete
  7. తార గారు విమర్సించటానికే పుట్టినట్టుగా మాట్లాడటం విడ్దూరంగా వున్నది...రవి గారి తెలుగు సంగతి పక్కన పెడితే మీ తెలుగు ఒకసారి చదవాలని కోరికగా వుందండి. ముందు మీ ఆలోచనా విధానం మార్చుకోండి apudu ravi gari matalu baga bodha paduthai..

    ReplyDelete
  8. తెలుగు అభిమాని గారూ,
    మీ విమర్శను స్వీకరిస్తున్నాను గాని ఆ కామెంట్‌లో నా జర్నోపై వ్యాఖ్య అవసరమంటారా? పదాలు ఎప్పుడైనా కాస్త అటూ ఇటూ కావడం జర్నోలు కాని వారికి కూడా జరుగుతుంది. ఏదైనా ధన్యవాదాలు

    అన్‌ నోన్‌ గారు,

    ఈ ఒక్క రోజైనా వివాదం వదిలేద్దామని తారకు చెప్పాను. మీరూ స్పందించక పోవడమే మెరుగు. ఇక పైన చేసిన పొరబాటు నా భాషాజ్ఞాన లోపం వల్లనే అని తెలుగు అభిమాని భావిస్తే అనుకోనివ్వండి. ధన్యవాదాలు.

    ReplyDelete
  9. అంతర్జాతీయంగా అమెరికా అండదండలు గల పాకిస్తాన్‌ సాగించే కుట్రలు మరో వైపు.బలై పోయిన వారిని మతాలను బట్టి చూసే ధోరణి కూడా మారవలసి వుంటుంది.
    ..........
    so Taraji have some respect for facts and don't strain much.

    @ Ravi garu,
    I can only laugh at your delusions. I think the facts you have are "Red" facts. Here are somethings you may want to know. It's china which has helped Pakistan to create nuclear bombs and is helping it to create missiles. Most of people in Pakistan including Pakistan army men hate America but they love China(http://www.dawn.com/2011/05/15/china-pakistan-alliance-strengthened-post-bin-laden.html, http://www.dawn.com/2010/12/17/china-pakistan-sign-20-bn-dollar-deals-minister.html, http://www.dawn.com/2011/05/15/china-pakistan-alliance-strengthened-post-bin-laden.html,http://www.dawn.com/2011/03/24/china-pushes-ahead-pakistan-nuclear-plant-expansion.html, Read wikileaks in dawn here http://www.dawn.com/pakistan-papers, http://www.dawn.com/2011/06/25/my-enemys-enemy.html). and Finally NFP super satire on this topic http://www.dawn.com/2011/06/23/pak-china-friendship-a-deep-review.html. You may not know china was the only country which criticized US for breaching Pakistan sovereignty when OBL was killed. and finally http://www.google.com/#q=china+site:http://www.dawn.com&hl=en&prmd=ivnslm&ei=4BIfTpOpDYzJrAfBnNCMAg&start=10&sa=N&bav=on.2,or.r_gc.r_pw.&fp=4384c80c42457fac&biw=1173&bih=618.

    Hope this information is enough to help you come out of your delusions.

    ReplyDelete
  10. siva,

    please watch my comment carefully.. the likes of your web links are not opinions of Indian govt. other problems are different. pl cite one such statement like Hydley affair. any way welcome after many days...

    ReplyDelete
  11. శిరీష్‌;

    మీ పేరు అలా వచ్చింది గనక అదే రాశాను. ఇప్పుడు పేరు మీరు తెలిసినందుకు సంతోషం. నేను సమర్థన ఇచ్చానా లేదా అన్న దానిపై ఏం వ్యాఖ్యానించినా దానిలోని స్వారస్యం కాస్త పోతుంది.ఆ మొత్తాన్ని మీరే ఒకసారి చదివి చూడండి. అర్థమవుతుంది. ఒకటి నిజం. తెలుగు అభిమాని అన్నట్టు ఇది వ్యాసం కాదు.చిన్న స్పందన. అందులోనూ కరెక్షన్‌లకు ముందు కాపీ వచ్చినట్టుంది. పదాలలో అన్వయ దోషాలు దొర్లాయి.వీలైన మేరకు అవి దిద్దాను. అంత మాత్రాన నాకు పోయేది కాని, నా భాషా జ్ఞానం అధ్వాన్నమని చెప్పే వారికి ఒరిగేది కాని లేదు. వదిలేయండి.ఇలాటి వాటితో విషయం కాస్త దారితప్పి పోకుండా చూసుకోవడం ముఖ్యం.ఈ రోజు దాదాపు 150మంది దీన్ని చూస్తే ఇందులో ఇద్దరో ముగ్గురో ప్రతికూల వ్యాఖ్యలు రాశారు. బాధ భాష కాదు, భావాలకు సంబంధించిందే. అంతగా పట్టించుకోవడం అంటే అసలు చర్చ దారి తప్పడమే. భాషలో పొరబాట్లు అంటారా? జర్నలిజమే హడావుడి సాహిత్యం.అందులో తప్పులు వుండటం అరుదు కాదు.అదీ సంగతి. కృతజ్ఞతలు.

    ReplyDelete
  12. ఫొరం ని తప్పు దారి పట్టించటం నా ఉద్దేస్యం కదు రవి గారు...తార గారి లాంటి మనస్తత్వం ఉన్నవారు నేను పని చెసే రంగం లో చాలా మంది ఉన్నారు ...ఇలాంటి వారికి అలా చెపితేనే అర్ధం అవుతుందని ప్రయత్నించా..క్షమించగలరు.

    ReplyDelete
  13. మీ తెలుగు బాగాలేదా ! హా .. హా .. హా .. గుడ్ జోక్ .
    రవిగారు , ఇంటర్నెట్లో కామెంట్స్ రకరకాలుగా ఉంటాయి . ముఖ్యంగా .. వామపక్ష రాజకీయ అభిప్రాయాలని తీవ్రంగా వ్యతిరేకిస్తూ .. ఒక్కోసారి వ్యక్తిగత స్థాయికి కూడా దిగజారి ఇబ్బంది పెడుతుంటయి . నా సలహా మీరు వాటిని పట్టించుకోవద్దని . శ్రీశ్రీ గూర్చి మీరు రాసిన పుస్తకం చదివాను . బాగా నచ్చింది . మీకు ఎలా చెప్పాలో తెలీక .. సందర్భం కాకపోయినప్పటికీ తెలియజేస్తున్నాను .

    ReplyDelete
  14. asahanam thana paridhi datipoyinapudu alanti vimarsale cheyagalaru brother...ravi garu ilanti vimarsalani +ve ga teesukuntaru anukuntunna...vaama paksham ante padukunnavadu kuda lechi vimarsistharu...alanti vallalo taara garu kuda okaru!!

    ReplyDelete
  15. సర్ కొందరు అదే పనిగా విమర్శిస్తుంటే మీ మంచితనంతో సమాధానాలుస్తూనే ఉన్నట్టున్నారు. అదే నాకు భాధ కలిగించింది. ఏదో మీ వంతుగా సమాచారం అందిద్దమని మీరు ప్రయత్నిస్తుంటే...ఓ పెద్దమనిషి..సోకాల్డ్ భాషాభిమానో..మనిషి ద్వేషో మరి ఎవరో నేను చెప్పలేను కానీ.. అప్పు చేయనివాడు..తప్పు చేయనివాడు మనిషేకాదని నానుడి ఉందని ఆ పెద్దమనిషి తెలుసుకుంటే మేలు.. ఒక ప్రయత్నానికి తోడుగా సరైన సలహాలిస్తే తప్పులేదులే కనీ కంప్లీట్ గా విమర్శిస్తూ తన అక్కసునంతా వెళ్లగక్కడం తప్పు.. తనకు అలాంటివి కనిపించకుండ ఉండాలంటే.. ఆయనే ఓ బ్లాగు పట్టుకొని ఆపని చేస్తే మేలు.. ఏనివే నేను ఫస్ట్ టైం మీ బ్లాగ్ చూసాను..అదే పనిగా విమర్శలు.. సున్నితమైన మీ స్పందనను చూసి నా అభిప్రాయాలు చెప్పాను.. ఏదైన తప్పుగా ఉంటే క్షమించండి. శ్రీపాద రమణ. (NADESHAM.NENU9@GMAIL.COM)

    ReplyDelete
  16. శిరీష్‌, రమణ...

    ఇవన్నీ కొత్త కాదు, ప్రతిసారి పట్టించుకోవడమూ జరగదు. మీరు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం అసలే లేదు. నేను మరీ సున్నితమైన వాణ్ణని, సమయం వృథా చేసుకుంటున్నానని అనుకోకండి.నేను అన్ని రకాల భావాలు గల వారితో మాటల్లోనూ రాతల్లోనూ ఘర్షణ పడుతూనే వుంటాను. అందులో అన్ని స్థాయిల వారూ వుంటారు కూడా. నచ్చిన భావాలను బలపర్చేవారు ఎప్పుడూ వుంటారు.నచ్చని వారికి వ్యతిరేకించేవారికి కూడా సమాధానం ఇవ్వగలిగితేనే ఒక భావం బలం తెలుస్తుంది. ఒకటి రెండు సార్లు చెబుతాము, ధోరణి మారకపోతే వాళ్ల అభీష్టం.డొల్లతనం, కల్లజపం దాగడం చాలా కష్టం. పైన వున్న వాదనల్లోనే మీకు సమాధానాలు తెలుస్తాయి. ధన్యవాదాలు. రాస్తూ వుండండి..

    ReplyDelete
  17. రవి గారూ, మీ బ్లాగులో మీరు రాజకీయాలు రాస్తుంటే కొందరు వచ్చి దాన్ని కమ్యూనిజం ప్రచారంగా ప్రొజెక్ట్ చేయాల్ని చూస్తూ అర్థం లేని రాతలు రాస్తుంటే సహించబుద్ధి ఎలా అవుతోంది మీకు? పైగా అభ్యంతర కర భాష కూడా వాడుతున్నాడు ఆ పెద్ద మనిషి పాపం ఏం
    చదివాడో, తల్లిదండ్రులేమి నేర్పారో? ఎక్కడ ఏమి కనపడినా దాన్ని ఆవు వ్యాసం లాగా కమ్యూనిజం వైపు మళ్ళించి, కమ్యూనిజ వ్యతిరేకుల మెప్పు పొందడం కోసం చేస్తున్న ప్రయత్నం అది

    అలాగే మీ అనుభవమంత వయసు లేని కుర్ర కుంకలు సైతం మీ భాష బాగా లేదని వ్యాఖ్యానించడం ఒకటి! తెలుగులో అక్షరాలెన్నో సరిగ్గా తెలీవు కానీ!

    మీ వ్యాసం ఏ విషయం పైన అయినా, దాని గురించ్ వ్యాఖ్యానించే హక్కు, వ్యతిరేకించే హక్కు అందరికీ ఉంటుంది. కానీ ఇలా చిల్లర మాటలతో అసలు చర్చే జరక్కుండా చెయ్యాలని చూడ్డం ఒక తింగరి తనం. ఇకపై మీరు కామెంట్ మాడరేషన్ పెట్టుకుని, ఈ తార కామెంట్స్ ని తిరస్కరించమని మీకు సలహా! చర్చకు ఉపయోగపడని ,ఎటువంటి విలువా లేని ఇలాంటి కామెంట్స్ ప్రచురిస్తూ పైగా జవాబులు కూడా రాస్తూ మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు మీరు. ఇలాంటి కామెంట్స్ చదవడానికి మీ బ్లాగుకు రావడం చిరాగ్గా ఉంది.

    ఆలోచించండి!

    ReplyDelete
  18. రవి గారికి నేను గొప్ప అభిమానిని...ఆయన విశ్లేషణ కోసం టివి చానల్స్ క్యూ కడతాయంటే అతిశయోక్తి కాదు...అలాంటిది మీరు ఆయన వాడిన తెలుగు గురించి ఘాటైన పదజాలంతో కామెంట్స్ చేయటం నాక్కుడా నచ్చలా

    ఇక ప్రశ్న ఎంటో నేను మాత్రం ఫాలో కాలేదు ఎమిటది?

    ReplyDelete
  19. /ఇం డియన్‌ మొహజదీన్‌ ఇందుకు బాధ్యత వహించాలని చెబుతున్నా అధికారికంగా ధృవీకరించ వలసి వుంది./
    ఇలాంటి ఎదవపనులకు బరువులు, భాధ్యతలు వహించేదేమిగాని ఎవడో ఓ ముష్కర్-ఏ-లబలబానో వహిస్తుంది. రాహుల్ స్టేట్మెంటే కాదు, చిదంబరం, మన్మోహన్లు కూడా పేలవంగా వున్నాయి. స్కాముల వాటాలు లెక్కలు చూస్కున్నాక తీరికగా టెర్రరిజం గురించి ఆలోచిస్తాం అన్నట్టుగా వుంది.

    ReplyDelete