Pages

Wednesday, May 30, 2012

రిజర్వేషన్లపై పారని పాచిక: బడుగుల మధ్య చీలిక!


విభజించి పాలించడం అనే నీతి బ్రిటిష్‌ వారితోనే పోలేదు. పాలకవర్గాలకు ఎప్పుడూ అలవాటైన ఎత్తుగడ అది. మన దేశంలో రిజర్వేషన్ల విధానం అందుకు సరైన ఉదాహరణ. ఉపాధికి చేటు తెచ్చే సరళీకరణ విధానల వల్ల ప్రభుత్వ ఉద్యోగాలే హరించుకుపోతుంటే రిజర్వేషన్ల పేరిట ప్రజల్లో వివిధ తరగతుల మధ్య చిచ్చు పెట్టేందుకు పాలకులు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే వుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం రిజర్వేషన్లపై ఎడతెగని ప్రతిష్టంభన అందులో భాగమే. సామాజిక వెనకబాటు తనమే కొలబద్దగా చూస్తే ముస్లిం మైనారిటీలలో పెద్ద భాగం దళితుల కన్నా వెనకబడిన స్థితి వుందని జస్టిస్‌ రంగనాథ్‌ మిశ్రా కమిషన్‌ నివేదిక స్పష్టంగా పేర్కొంది. వారికి పది శాతం రిజర్వేషన్‌ కల్పించాలని సిఫార్సు చేసింది.ఇప్పుడున్న రిజర్వేషన్లకు ఇబ్బంది లేకుండా ఆ అవకాశం కల్పించాలి. అవసరమైతే అందుకు రాజ్యాంగ సవరణ అందరి సహకారంతో తీసుకురావాలి. అయితే ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం 27 శాతంగా ఉన్న బిసి రిజర్వేషన్లలో 4.5 శాతం ముస్లిం మైనారిటీలకు ఇస్తూ ఆర్డినెన్సు తెచ్చింది. దీనిపై అభ్యంతరాలు వస్తే హడావుడిగా కమిషన్‌ వేసి మమ అనిపించింది. నిజానికి అవకాశం కల్పించబడిన వారంతా ముస్లింలైనా వెనకబడిన కులాలకు చెందిన వారే. కాకుంటే వారికి ముస్లింల పేరిట కోటా ఇవ్వడమే సమస్యకు కారణమైంది. ఇటీవలి శాసనసభ ఎన్నికల సందర్భంలో కేంద్రం కూడా అదే పని చేసింది. హడావుడిగా ఒక ఉత్తర్వు విడుదల చేసి మైనారిటీలకు రిజర్వేషన్‌ ఇస్తానన్నది. తీరా ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌ హైకోర్టు దాన్ని కొట్టి వేసింది. ఆ రీత్యా ఈ తీర్పు దేశమంతటా ప్రభావం చూపిస్తుంది.దీనికి పరిష్కారం రాజ్యాంగ సవరణతో రంగనాథ్‌ మిశ్రా సిఫార్సులు అమలు చేయడమే.దానికి బదులుగా సుప్రీం కోర్టులో సవాలు చేయనున్నట్టు కేంద్ర మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ ప్రకటించారు.అక్కడ ఏం జరుగుతుందో వూహించవచ్చు.ఈ లోగా బిసి వర్గాలకు ముస్లింలకు మధ్య వైరుధ్యాలు పెరుగుతాయి. పాలకుల పాచిక పారుతుంది. కనకనే ఈ విషయంలో కేంద్రం ఎత్తుగడను సరిగ్గా అర్థం చేసుకోవాలి. అలాగే మత ప్రాతిపదికన రిజర్వేషన్‌ వుండరాదని వాదించే వారు దాన్ని తిరస్కరించినా అదే విమర్శ వర్తిస్తుందని గుర్తించాలి. కొంతమంది ఓటు బ్యాంకు పేరుతో దీన్ని తెగనాడతారు. ఎందుకంటే వారి ఓటు బ్యాంకులకు అది అవసరం గనక. ముస్లింలు క్రైస్తవులు బౌద్ధులు జైనులు ఎవరైనా ఈ దేశ ప్రజలందరికీ ఒకే కొలబద్ద వుండాల్సిందే. కాకపోతే వీరంతా ఒకటే తరగతి ఎలా అవుతారని కోర్టు ప్రశ్నించడం చట్టరీత్యా సమంజసమే. కనకనే వారి వెనకబాటు తనం నిరూపించేందుకు అందుకు అవసరమైన శాసనాలు చేసుకోవాలి. ప్రజల అవగాహనా పెంచాలి.

క్యాబాత్‌ హై మన్మోహన్‌ జీ!!


తనపై ఆరోపణలు నిరూపిస్తే ప్రజా జీవితం నుంచి తప్పుకుంటానని ఫ్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్న మాటలు చాలా హాస్యాస్పదంగా వున్నాయి. ఆయనతో సహా కేంద్ర మంత్రులపై అన్నాహజారే బృందం చేసిన ఆరోపణల ఉద్దేశం ఏమైనా కావచ్చు గాని అవి హఠాత్తుగా వచ్చినవి కావు. నిరాధారమైనవీ కావు. మన్మోహన్‌ నీతి నిజాయితీల గురించి స్త్తోత్ర పాఠాలు పాడే వారికి కొదువ లేదు గాని సమస్య ఆయన వ్యక్తిగత సచ్చీలత కాదు. వ్యక్తిగా ఆయన ఎలాటి వాడైనా ఆయన మంత్రివర్గం మాత్రం అత్యంత అవినీతి భరితమైందిగా పేరు పొందింది. రెండేళ్ల కిందట స్వయంగా ఆయనే మీడియా ముఖ్యులను పిలిపించి స్వతంత్ర భారత చరిత్రలోనే తనది అవినీతి ప్రభుత్వమన్నట్టు వస్తున్న వార్తలను కాస్త తగ్గించాలని వేడుకున్నారు. ఆ తర్వాత మరిన్ని కుంభకోణాలు వెలుగు చూశాయి. అందులో ఎస్‌ బ్యాండ్‌, బొగ్గు కుంభకోణాలు ఆయన ఆధ్వర్వంలో వున్న శాఖల్లోనే జరిగాయి. దీనిపై కాగ్‌ నివేదికలో పేర్కొన్న భాగాలు వెనక్కు తీసుకోలేదు. అవి లీక్‌ కావడంతో తనకు సంబంధం లేదని మాత్రమే వివరణ ఇచ్చింది.ఈ సంగతి గతంలోనూ బ్లాగులో చెప్పుకున్నాం. కనక బొగ్గు మంత్రిత్వ శాఖ వివరణ ఆధారంగా తను నిర్దోషినై పోవాలని మన్మోహన్‌ చెప్పడం అర్థ రహితం. అలా అయితే ప్రతి శాఖా సమర్థించుకుంటుంది. ఎస్‌ బ్యాండ్‌ కుంభకోణంలో ఇస్రో మాజీ చైర్మన్‌ మాధవన్‌ నాయర్‌పై చర్యలు తీసుకున్న ప్రభుత్వం ఆ శాఖను చూస్తున్న మన్మోహన్‌ తప్పు లేదని ఎలా చెబుతుంది? రియలన్స్‌ వారు పెట్రోలియం రేట్లు పెంచాలంటూ లేఖలు రాస్తే వాటిని తనకు పంపించి ప్రధాని కార్యాలయం ఒత్తిడి చేస్తున్నదని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ఇటీవల వెల్లడించలేదా? కనక మన్మోహన్‌ సింగ్‌ మౌనంగా వుంటే అదో తీరు గాని అతకని సమర్థనలతో సవాళ్లు విసిరి సంతృప్తి పడితే చాలదు.

Tuesday, May 29, 2012

జగన్‌ అరెస్టు అనంతరం..


వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అద్యక్షుడు జగన్మోహన రెడ్డి అరెస్టు అనూహ్యం కాకపోగా అనివార్యమైన పరిణామం. దీన్ని నివారించడానికి రాజకీయంగానూ న్యాయ పరంగానూ చేయగలిగిన వాదనలు ప్రయత్నాలన్ని వారు చేశారని గుర్తుంచుకోవాలి.ఇప్పటికే దీనిపై చాలా చర్చలు జరిగిన దృష్ట్యా కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రమే పేర్కొంటున్నాను.

1.సోనియాకు అనుకూలంగా వుంటే ఈ కేసు పెట్టేవారా అన్న ప్రశ్న వాస్తవంగా సమస్యను ఆ ఉభయులకు మాత్రమే పరిమితం చేస్తున్నది. సోనియా కోరుకోకపోయినా మన్మోహన్‌ సింగ్‌ సహకరించకపోయినా 2జి స్పెక్ట్రం వంటి అవినీతి వ్యవహారాలు దర్యాప్తునకు వచ్చాయి.కనక ఇది రెండు కాంగ్రెస్‌లకు మాత్రమే సంబంధించినది కాదు.పైగా సోనియా గనక పదవిఇచ్చేందుకు సిద్ధపడి వుంటే వీరు కూడా సర్దుకుని వుండేవారు.
2.అయితే కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ ప్రయోజనాలు కూడా స్పష్టం.ఎ1గా వున్న జగన్‌ను ఇంత కాలం ఎందుకు అరెస్టు చేయలేదు? అన్న ప్రశ్న వారితో సహా అందరూ అడుగుతున్నారు. సిబిఐ కోర్టు కూడా అడిగింది. అలాగే సిబిఐ దర్యాప్తు ఆయనకే పరిమితం చేసి అందుకు బాట వేసిన మంత్రులను వదిలేస్తే ఎలా అన్నది మరో పెద్ద ప్రశ్న. ఈ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌, పిసిసి అద్యక్షుడు బొత్స కూడా తమ రాజకీయ పాలనా బాధ్యత లేదన్నట్టు మాట్లాడ్డం చెల్లుబాటయ్యేది కాదు. ఈ తప్పుకు బాధ్యత అవిభాజ్యమైంది.అనుభోక్త జగన్‌ అయితే కావచ్చు గాని తక్కిన వారు అమాయకులు కాదు. ఇదే సమయంలో లిక్కర్‌ సిండికేట్లపై ఎసిబి దాడుల పట్ల వ్యవహరించిన తీరు పూర్తి భిన్నంగా కనిపిస్తూనే వుంది.
3.తెలుగు దేశం అద్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు చేయొద్దని కేసులు వేయొద్దని

Thursday, May 24, 2012

మోపిదేవి అరెస్టుతో మొదలైన సంచలనం



మంత్రి మోపిదేవి వెంకట రమణ అరెస్టు వూహించనిది కాకున్నా అనుకున్న దానికన్నా వేగంగా జరిగింది. ఒక సంఘటన జరుగుతుందని తెలిసినా నిజంగా జరిగినప్పుడు వుండే ప్రభావం ఎంత తీవ్రమో ఇప్పుడు అందరికీ అనుభవంలోకి వస్తున్నది. . జగన్‌ ముందస్తు బెయిలు కోసం దరఖాస్తు చేసుకోవడంలోనూ ఇదే కనిపిస్తుంది. వ్యాన్‌పిక్‌ కుంభకోణంలో మోపిదేవి పాత్ర ఎంత, వైఎస్‌రాజశేఖరరెడ్డి వత్తిడి ఎంత అన్నది ముందు ముందుగాని తేలాలి.అయితే ఈ ప్రాజెక్టు భూ సేకరణ ప్రహసనం గుంటూరు ప్రకాశం జిల్లాల్లో వందలాది గ్రామాలలో ప్రకంపనలు పుట్టించిన మాట మాత్రం నిజం. అనేక విషాదాలకు కూడా దారి తీసిన వికృత వ్యవహారమది. జగన్‌ ఆస్తుల కేసులో మొదటగా అరెస్టయిన నిమ్మగడ్డ ప్రసాద్‌, మోపిదేవి వెంకట రమణ కూడా ఆ కేసుకు సంబంధించిన వారే కావడం గమనించదగ్గది. ఆయననే ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నిస్తూ ఇతర మంత్రుల పేర్లు తీసేవారున్నారు. ఇది మొదలు అని భావించేవారు వున్నారు. జగన్‌ అరెస్టుకు ముందుగా మంత్రులపై చర్య అనివార్యమని భావించినందునే ఇది జరిగిందనే వారూ వున్నారు.ఏమైనా ఈ ప్రక్రియ ఇప్పుడే ఆగకపోవచ్చు. జాబితాలో మరో అయిదుగురు మంత్రులైనా వుండే అవకాశం వుంది. వారు విచారణకు సహకరించే తీరు కూడా సిబిఐ వైఖరిని ప్రభావితం చేస్తుంది. జగన్‌ అభిమానులు కొందరు భావిస్తున్నట్టు ఈ రోజు ఉదయం చర్చలో నటి రోజా నాపై ధ్వజమెత్తినట్టు ఇందులో వ్యక్తిగత ఇష్టాయిష్టాల పాత్ర ఏమీ లేదు.జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలన్నదే ప్రశ్న. వ్యూహాత్మకంగానే మంత్రిని ముందుగా అరెస్టు చేశారని వైఎస్‌ఆర్‌పార్టీ వారు ఆరోపించడం నిజమే అనుకున్నా నిలబడేది కాదు. ఇంతకాలం వారితో సహా కాంగ్రెస్‌ విమర్శకులందరూ అడుగుతూ వచ్చిన పరిణామం జరిగినప్పుడు తప్పు పట్టడానికి లేదు. ఇక పోతే మంత్రులు అనవసరంగా బలిపశువులయ్యారని కొందరు చేసే వాదనలోనూ పస లేదు. నిజానికి అవినీతి ఒప్పందాలకు తలవొగ్గి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను బలిపెట్టడం కన్నా పొరబాటు ఏముంటుంది? ఇంతకంటే వారు పదవిని వదులుకున్నా ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు.ఐఎఎస్‌లకూ ఇదే వర్తిస్తుంది. ఇతర కుంభకోణాలు కొన్ని తీవ్రమైనవే వచ్చినా ఈ తరహా వ్యవహారం దేశంలోనే ఎన్నడూ లేని రీతిలో దర్యాప్తుకు వచ్చినందున అది ఇచ్చే పాఠాలు కూడా ప్రతివారూ నేర్చుకోవలసి వుంటుంది.

Wednesday, May 23, 2012

జగన్‌ అభ్యర్థన తోసి వేత



బుధ వారం నాడు న్యాయ స్థానాలలో జగన్‌కు ఊరట, తిరస్కరణ ఒకేసారి లభించాయి. సాక్షి ఖాతాల స్తంభనను షరతులతో ఎత్తివేయడం వూరట. మే 25న సిబిఐ ముందు హాజరు కావలసిందేనని హైకోర్టు నిక్కచ్చిగా చెప్పడం ఎదురు దెబ్బ. పైగా 46(1) సిఆర్‌పిసి కింద సిబిఐ వ్యవహరించాలని కూడా కోర్టు చెప్పింది. దీని ప్రకారం నిందితులను విచారించేందుకు మాత్రమే గాక అవసరమైతే అదుపులోకి తీసుకోవడానికి కూడా సిబిఐకి అధికారం లభిస్తుంది.తన ఎన్నికల ప్రచారం కోసం పదిహేను రోజుల గడువు కావాలని జగన్‌ చేసిన వాదనను కోర్టు తోసి పుచ్చడం వూహించిందే. గతంలోనే చెప్పుకున్నట్టు సిబిఐ విచారించేది నిందితుడి హౌదాలో తప్ప వైఎస్‌ఆర్‌ పార్టీ అద్యక్షుడుగా కాదు.ఆ ప్రాతిపదికను ఆమోదించేట్టయితే రేపు ఇతర రకాలైన నిందితులకు కూడా దీన్ని వర్తింపచేయాలని ఉటంకించే అవకాశముంటుంది.మే 28న హాజరు కావాలని సమన్లు వుండగా మళ్లీ 25న ఎందుకు పిలిచారనే ప్రశ్నకు కూడా సిబిఐ సమాధానం ఇచ్చింది.నిమ్మగడ్డ ప్రసాద్‌, బ్రహ్మానందరెడ్డి రిమాండ్‌ ఆ రోజున ముగిసిపోతున్నందున వారి సమక్షంలో జగన్‌ను ప్రశ్నించాల్సి వుందని పేర్కొంది. మరో విశేషం ఏమంటే జగన్‌ మంగళవారం చేసిన తీవ్రమైన ఆరోపణలు(అల్లర్లు ఎన్నికల వాయిదా కుట్ర వగైరా) కోర్టులో లేవనెత్తలేదు. అంటే అవి నిలబడవని భావించారా? లేక ఆధారాలు లేవనా? కనీసం ప్రధానికి రాసిన లేఖనైనా జతపర్చి వుండొచ్చు కదా? అంతేగాక తనకు ఏం జరిగినా సంయమనం పాటించాలని ప్రజలకు పిలుపునివ్వడం నిన్నటి ధోరణికి కాస్త సవరణగా వుంది! ఆ మేరకు మంచిదే గాని వ్యూహాత్మకమైన జాగ్త్రత్త కోసం కూడా చెప్పివుండొచ్చు. అందుకే పోలీసులు 144 వ సెక్షన్‌ వగైరాలను ప్రయోగిస్తున్నట్టు ప్రకటించారు.ఈ ఉద్రిక్తతల మధ్యన ఏం జరుగుతుందో చూడాలి. చెడు ఏది జరగరాదని ఆశించాలి.సాక్షి ఖాతాల స్తంభనను ఎత్తివేసినా ఆస్తిపాస్తుల క్రయ విక్రాయాలపై నిషేదం విధించడం, చెక్కుల ద్వారానే చెల్లింపులు జరపాలని పది రోజులకోసారి నివేదిక ఇవ్వాలని ఆదేశించడం ఇవన్నీ ఆంక్షలుగా వుంటాయి. ఇవి కూడా మధ్యంతర ఉత్తర్వులే. కనక అసలు తీర్పు తర్వాత ఎప్పుడు వస్తుందో చూడాలి.

Tuesday, May 22, 2012

జగన్‌ మాటల ఆంతర్యం? ఆందోళన?



వైఎస్‌ఆర్‌ పార్టీ అద్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి తన అరెస్టు అనంతర పరిణామాలపై చేసిన ఊహాత్మక వ్యూహాత్మక వ్యాఖ్యలు ఇప్పటికే చాలా విమర్శలకు దారి తీయడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పటి వరకూ ఆయన మాట్లాడిన తీరుకు ప్రస్తుత వ్యాఖ్యలకు మధ్య హస్తిమశకాంతరం తేడా వుంది. మొదటి సంగతి ఏమంటే ఎలాటి విచారణకైనా సిద్ధమేనని అంటూనే తమ నాయకుణ్ని అరెస్టు చేస్తే రాష్ట్రం అగ్ని గుండం అవుతుందని గతంలో ఆ పార్టీ నాయకులు అనేక బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంలో రెండు రోజుల పాటు అరెస్టు వూహాగానాల మధ్య భారీ సమీకరణలు, విస్త్రత సందేశాల పంపిణీ కూడా జరిగింది. తర్వాత ఆ వాతావరణం కొంత మారినా మళ్లీ ఇటీవల పరిణామాలు వేగం పుంజుకున్నాయి. సాక్షి ఖాతాల స్తంభన, తర్వాత నిమ్మగడ్డ ప్రసాద్‌ అరెస్టు, ఆస్తుల స్తంభన యత్నాలు ఇవన్నీ వేడిని పెంచాయి. అంతిమంగా మే28న జగన్‌తో సహా పలువురికి సమన్లు అందాయి. లాయర్‌ ద్వారా హాజరు అయ్యే అవకాశం వుందని సమన్ల భాషను బట్టి చాలా మంది నిపుణులు చెప్పినా సోమవారం నాడు కోర్టు మొదటి సారి స్వయంగా రావాలన్నట్టు వ్యాఖ్యలు చేసింది.వెళితే అరెస్టు చేయొచ్చనే అంచనాలు కొన్ని

Monday, May 21, 2012

మళ్లీ పాత బాణీలో కెసిఆర్‌ మాటలు!


పరకాల ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్‌ గెలిస్తే వంద రోజుల్లో సోనియా గాంధీ తెలంగాణా ప్రకటిస్తారని ఆ పార్టీ అద్యక్షుడు కె.చంద్రశేఖరరావు చేసిన ప్రకటనను కాంగ్రెస్‌ ఎంపి పొన్నం ప్రభాకర్‌ స్వాగతించారు. గతంలో కెసిఆర్‌ ఇదే రీతిలో రాష్ట్ర విభజనకు గడువులు ప్రకటించడం తర్వాత అవి జరక్కపోవడం పలుసార్లు జరిగింది.ఇటీవలనే ఆయన కాంగ్రెస్‌ మోసం చేసిందని ఇక ఉద్యమం తీవ్రం చేయాల్సిందేనని కూడా ప్రకటించారు. అలాటిది హఠాత్తుగా ఎందుకని సోనియాపై విశ్వాస ప్రకటన చేస్తున్నారనేది ఆసక్తి కరమైన ప్రశ్న. తక్షణ కారణం ఉప ఎన్నికలే.కాగా కాంగ్రెస్‌ తెలంగాణా విషయం పునరాలోచిస్తోందని, ఉప ఎన్నికల పోలింగ్‌ ముగిసిన వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తుందని ఒక ప్రచారం రాజకీయ వర్గాలలో నడుస్తున్నది.దీన్ని ప్రముఖులే ప్రచారంలో పెట్టడమే కాక అనేక రకాల తర్కాలు కూడా జతచేస్తున్నారు. బహుశా ఇలాటి వ్యాఖ్యలలో కూడా ఆ ప్రభావం వుండొచ్చు. అయితే కాంగ్రెస్‌ రాజకీయ విన్యాసాలు తెలిసిన వారు చూస్తున్న ప్రజలు మాత్రం ఇలాటి ప్రచారాలను ఒక పట్టాన నమ్మడం కష్టమే. పైగా కాంగ్రెస్‌ నాయకత్వం ఇస్తున్న బహిరంగ సంకేతాలకు ఈ అంచనాలు భిన్నంగా వుండటం కూడా కనిపిస్తుంది. ఆ సంకేతాలన్ని ఉప ఎన్నికల కోసమేనన్నది విభజన కోరే వారి వాదన. జగన్‌ వ్యవహారం ఏదో విధంగా ఒక కొలిక్క వస్తున్నట్టుంది కాబట్టి మళ్లీ తెలంగాణా పాచిక తీస్తున్నారా అన్నది కూడా సందేహించాల్సిన విషయం. 

Thursday, May 17, 2012

రాష్ట్రపతి ఎన్నిక: కాంగ్రెస్‌ తర్జనభర్జన


రాష్ట్రపతి ఎన్నిక తేదీ దగ్గర పడుతున్నా ఏ పేరూ ముందుకు తీసుకురాలేకపోవడం కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకత్వ సంధిగ్ధాన్ని వెల్లడిస్తుంది. బాగా ప్రచారం పొందిన ప్రణబ్‌ ముఖర్జీ పేరును కూడా అధికారికంగా ప్రతిపాదించలేదు. అంతకంటే ముఖ్యమైన విషయమేమంటే అసలు అందరి అభిప్రాయాన్ని కూడగట్టే దిశలో చర్చలు ప్రారంభించింది లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎవరైనా వస్తే ప్రతిపక్షాలు బలపర్చడం సులభం కాదు. అలా గాక మిగిలిన వారి సహాయం కూడా తీసుకుని ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించే క్రమంలో పేర్లు వస్తే ఇతరులు కూడా స్పందించే అవకాశముంటుంది. బహుశా బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎలోనూ ఇలాటి సమస్యలే వున్నాయి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ఆజాద్‌ పేరు చెబుతున్నా అందరూ కోరితేనే ఒప్పుకుంటారని ఆయన అంటున్నారు. గతంలోనే ఆయనను వామపక్షాలు మరికొన్ని పార్టీలు ఒప్పుకోలేదు. పైగా రాజేంద్ర ప్రసాద్‌ తర్వాత మరే రాష్ట్రపతికి రెండవ అవకాశం ఇవ్వలేదు కూడా. మధ్యలో ఇంత విరామం పెట్టుకుని మళ్లీ కలాం ను తీసుకురావడం అసహమైన ప్రతిపాదన మాత్రమే. ఇప్పుడు బిజెడి అన్నా డిఎంకె పిఎ సంగ్మా పేరు తెచ్చాయి గాని ఆయన పార్టీ ఎన్‌సిపినే బలపర్చడం లేదు. వామపక్షాలు ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా ఇంకా ఒక వైఖరి తీసుకోలేదు. ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీకి అన్ని అర్హతలు వున్నా వామపక్షాలు అప్పట్లో ఆయనను ముందుకు తెచ్చాయి గనక బిజెపి విముఖంగా వుంది.ఇవన్నీ సర్దుకుని ఒక పేరు రావడానికి చాలా కసరత్తు జరగాల్సిందే. అలా కాకపోతే పోటీ కూడా జరగొచ్చు. అంతేగాని మీడియాలో కథనాలు వస్తున్నంత వేగంగా ఈ వ్యవహారం కొలిక్కి రాదు.

ఆస్తుల స్తంభన: పూర్వాపరాలు


జగన్‌కు సంబంధించిన సాక్షి ఆస్తుల క్రయ విక్రయాల నిలిపివేత జప్తు అనడానికి లేదని ప్రముఖ న్యాయవాది ఒకరు వివరించారు. ఈ ఆస్తుల విషయంలో యథాతథ స్థితి కొనసాగాలంటే లావాదేవీలు జరక్కూడదు గనక అటాచ్‌మెంట్‌ అనబడే స్తంభన ఉత్తర్వు జారీ చేయడం తప్ప కార్యకలాపాల నిలిపివేయనవసరం లేదు.గతంలో ఖాతాల స్తంభనకు కొనసాగింపుగా దీన్ని పరిగణించవచ్చు.అయితే ప్రభుత్వమే ప్రకటనల నిలిపివేత ఉత్తర్వు ఇవ్వడం అనేక విమర్శలకు దారి తీసిన నేపథ్యంలో ఈ రోజు హైకోర్టు దానిపై తాత్కాలిక స్టే ఇచ్చింది.అయినా తుది తీర్పు వెలువడే వరకు ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోవచ్చు. నిమ్మగడ్డ ప్రసాద్‌ అరెస్టు తర్వాత వ్యాన్‌పిక్‌ ఒప్పందాన్ని రద్దు చేయాలని సాక్షాత్తూ మంత్రి మాణిక్య వర ప్రసాద్‌ కోరడం చాలా ముఖ్యమైన పరిణామం. అన్ని తరగతుల నుంచి వస్తున్న అభిప్రాయం అది. అక్రమ లాభం పొందారంటూనే వాటిని రద్దు చేయకపోవడం వుత్తుత్తి తతంగమనే అభిప్రాయం ఏర్పడుతున్నది. ఇక పెట్టుబడులు పెట్టినందుకే అరెస్టు చేస్తారా అని జగన్‌ వేస్తున్న ప్రశ్నలో చాలా రాజకీయాలు వున్నాయి. సాఫీగా పెట్టుబడులు పెట్టి సజావుగా వ్యాపారాలు చేసుకుంటే ఎలాటి సమస్యలు రావు. అలాటి వేలాది మందికి జోలికి ఎవరూ పోవడం లేదు. అనుమానాస్పదంగా వ్యవహరించిన వారే ఇక్కడ దర్యాప్తు ఎ దుర్కొంటున్నారు గతంలో సత్యం రామలింగరాజు అయినా ఇప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్‌ మామూలుగా వ్యాపారంలో రాణించినంత కాలం సమస్యలు రాలేదనేది వాస్తవం. నిజానికి దారి తప్పిన వారిపై చర్య తీసుకోకపోతే సక్రమంగా వ్యవహరించేవారు కూడా నిరుత్సాహపడటం లేదా తామూ అదే మార్గం అనుసరించడం జరుగుతుంది. కనక సందర్భంతో నిమిత్తం లేకుండా దీన్ని వ్యాపారవేత్తలపై దాడిగా చిత్రించాల్సిన అవసరం లేదు. 

Tuesday, May 15, 2012

నిమ్మగడ్డ ప్రసాద్‌ అరెస్టు: విస్తరించిన పరిధి


మ్యాట్రిక్స్‌ ప్రసాద్‌గా పరిచితుడైన నిమ్మగడ్డ ప్రసాద్‌ను జగన్‌ అక్రమాస్తుల కేసులో అరెస్టు చేయడం కొత్త మలుపు. పూర్తిగా వూహించనిది కాకున్నా వేగంగా జరిగింది. గతంలో అరెస్టయిన సునీల్‌ రెడ్డి సహాయకుడు కాగా విజయసాయి రెడ్డి కుటుంబ ఆడిటర్‌గా దీర్ఘకాలంగా సేవలందిస్తున్న వ్యక్తి. సాక్షి ఖాతాల స్తంభన కూడా నేరుగా వారి యాజమాన్యంలోకి సంస్థకు సంబంధించినవి. కాగా మ్యాట్రిక్స్‌ ప్రసాద్‌ అందుకు భిన్నంగా పెట్టుబడి పెట్టిన వ్యక్తి. ప్రభుత్వం నుంచి అనుచిత లబ్ది పొంది లోపాయికారి అవగాహనతో జగన్‌ సంస్థల్లో 500 కోట్ల పెట్టుబడులు పెట్టారనేది ఆయనపై ఆరోపణ. ఇందుకు ప్రతిగా ప్రకాశం గుంటూరు జిల్లాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్న వాన్‌పిక్‌ ప్రాజెక్టు(వాడరేపు నిజాం పట్నం పోర్ట్స్‌ అండ్‌ ఇండిస్టియల్‌ క్యారిడర్‌) కింద 15 వేల ఎకరాలు ఆయనకు కట్టబెట్టారనేది సిబిఐ ధృవీకరణ.వ్యాన్‌పిక్‌ కోసం భూముల సేకరణ ఒకటైతే ఈ ఒప్పందాన్ని మొదట అనుకున్న దానికి క్యాబినెట్‌లో చెప్పినదానికి భిన్నంగా కుదుర్చుకున్నారనేది అసలు విషయం. దీనిపై ప్రతిపక్షాలు మీడియా కథనాలు అలా వుంచి కేంద్రం నియమించిన అధ్యయన కమిటీ 2010లోనే అంటే ఈ కేసు మొదలు కాకముందే అనేక విమర్శలు చేసింది. మొదట కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం(ఎంవోయు) కు భిన్నంగా తర్వాత రాయితీల వర్షం

ఆత్మ అడుగులు, మఠాధిపతులు ముఠాలు


పుట్టపర్తి సాయిబాబా ఆఖరి ఘట్టంలో ఆశ్రమ నిర్వాహకుల అనుమానాస్పద వ్యవహారాలు, ఆయన రక్త సంబంధీకుల ఆరోపణలు ప్రపంచమంతా చూసింది. అయినా ప్రభుత్వ పెద్దలు దానిపై నిజానిజాలు తేల్చాలని అనుకోలేదు. కాని బాబా లేని ప్రశాంతి నిలయానికి భక్తుల రాక తగ్గిపోవడం నిర్వాహకులను నిరుత్సాహం కలిగించడం సహజమే. ఆయన ప్రథమ వర్థంతి తర్వాత ఇప్పుడు మళ్లీ భక్త సందోహాన్ని ఆకట్టుకునేందుకు ఆత్మ కథ ఒకటి వచ్చింది.బాబా ఆత్మ తిరుగుతుందని అడుగులు పడ్డాయని అధికారికంగానే అనధికారిక సమాచారం అందించి ఆపైన విస్త్రత ప్రచారం కూడ కల్పించారు. బాబాను నమ్మడం వ్యక్తిగత విశ్వాసం అయినా ఆయన వున్నంత కాలం ఆయనే చూసుకునే వారనుకోవచ్చు. ఇప్పుడు ఆయన అస్తమయం తర్వాతనైనా ఆయన పేరిట సాగే ప్రహసనాలను జాగ్రత్తగా పరిశీలించి జనాన్ని మభ్యపెట్టకుండా చూడాల్సిన బాధ్యత అధికారులకు ప్రభుత్వానికి వుంది. పరమాత్మగా పూజలందిన వ్యక్తి ఆత్మ కావడం వారి నమ్మకాలకు కూడా విరుద్ధమైన విషయం. కోరికలు తీరని వారు ఆత్మలుగా పరిభ్రమిస్తారనేది ఒక మూఢ నమ్మకం. లేదా చాలా మంది చెప్పే నమ్మకం. కాని దైవాంశసంభూతుడుగా పూజలందుకున్న బాబాకు అదెలా వర్తిస్తుంది? పోనీ అనుకున్నా ఆత్మ అడుగులు పడేలా నడుస్తుందా? ఫోటోల నుంచి విభూతి రాల్చడానికి చాలా చిట్కాలున్నాయని జన విజ్ఞాన వేదిక వంటివి ప్రత్యక్షంగా చూపిస్తూనే వున్నాయి. కాని బాబా పునరుద్థానం పేరిట సాగే తతంగం విషయంలో భక్తులు బహుపరాక్‌! ఈ లోగా అఘోరాలో ఘోరాలో వచ్చారంటున్నారు గనక మరింత పరాక్‌.
ఇది ఇలా వుంటే కర్నూలు బాలసాయిబాబా ఆశ్రమం ఆయన లేక వెలవెలబోతున్నదంటూ కథనాలు. గత శివరాత్రి నాడు నోట్లో నుంచి లింగాలు తీస్తానన్న బాలబాబా నీళ్లు మింగుతూ బాగా ఒత్తిడికి గురవుతూ ఎలాగో అయిందనిపించిన ఉదంతం మీడియాలో అందరూ చూశారు. ఆర్థిక నేరాలు, ఆరోపణలు వగైరాల మధ్య పుట్టపర్తి బాబా మరణానంతరం కూడా పెద్ద ప్రభావం చూపలేకపోయినందునే బాలబాబా జెండా ఎత్తేస్తున్నారన్న కథనాలు కాదనడం కష్టమే.

ఇది ఇలా వుంటే నిత్యానందస్వామి నిస్సిగ్గుగా మరో పీఠం ఎక్కి కూచున్నాడు. ఆయన లీలలు రోత పుట్టించినా తనకు మాత్రం కాస్త సంకోచం లేకపోగా జుగుప్సాకరమైన చిరునవ్వులు చిందిస్తున్నాడు.ఆయన అధీనతా పీఠం చేజిక్కించుకోవడంపై పరమ పవిత్రమైనదిగా భావించబడే కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి(ఈయనా హత్య కేసులో అరెస్టయిన వారే) మిగిలిన స్వాములను కూడదీసి సవాలు చేస్తున్నారు. ఆధ్మాత్మిక నిలయాలు కావలసిన మఠాలు ఇలా ముఠాల కుమ్ములాటలకు దిగడం ఏ విలువలకు ప్రతీక భక్తులే ఆలోచించాలి మరి.

వివేకానందుడు ఏనాడో చెప్పినట్టు దైవ స్వరూపులమంటూ వూరేగే బూటకపు స్వాములు బాబాల పట్ల అప్రమత్తత భక్తులకే చాలా అవసరం. 

Friday, May 11, 2012

రాజకీయం చేసిన ప్రభుత్వం



సాక్షి పరిణామాలపై నా అభిప్రాయాలు నిన్న వివరంగా రాశాను. అయితే తర్వాత రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా ప్రకటనలు నిలిపేస్తూ ఉత్తర్వు జారీ చేయడం అనవసరమైన అవాంఛనీయమైన చర్య. ఇలాటి వాటిని ఎవరిపై ఎవరు తీసుకున్నా ఆమోదించకూడదు.ఈ కారణంగానే మొదటి రోజు కన్నా రెండవ రోజు ఖండనలు పెరిగాయి. అయితే అదే సమయంలో పాత్రికేయులు కూడా పాలక వర్గ నేతల రాజకీయయ చర్చలు తమ ఆందోళనలో ప్రవేశించకుండా జాగ్రత్త పడాల్సి వుంటుంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ రాజకీయంగా వ్యతిరేకించే తీరుకు పత్రికా సంఘాలు మాట్లాడే తీరుకు మధ్యన తేడా లేకపోతే విశ్వసనీయత దెబ్బ తింటుంది. అలాగే సాక్షి సిబ్బంది యాజమాన్యం కూడా రాజకీయ తేడాలకు మీడియా యుద్దాలకు అతీతంగా మద్దతు పొందడంపై కేంద్రీకరించాలే గాని పాక్షిక వాదనలకు లోనైతే చర్చ దారి తప్పుతుంది. అంతిమంగా నష్టం కలిగేది ఉద్యోగులకే. ఏ మీడియా సంస్థ మంచి చెడ్డలేమిటి గొప్పలు తప్పులు ఏమిటి అన్నది ఇక్కడ చర్చనీయం కాదు. అది వేరే సందర్భం. సాక్షి మనుగడకు ఉద్యోగుల భద్రతకు ముప్పు లేకుండా కలగనివ్వకుండా చూసుకోవడంపై కేంద్రీకరించాలంటే మరింత విశాల దృక్పథంతోనూ వృత్తిగత కోణంతోనూ వ్యవహరించాలి. సాక్షికి ముందు సాక్షికి తర్వాత అని నాటకీయంగా చెప్పాల్సినంత గొప్ప తేడాలేమీ చూపనక్కరలేదు. ఎవరి ప్రయోజనాలు వారివి ఎవరి పద్దతులు వారివి. అంతిమంగా మీడియాధిపతులంతా ఒక్కటే. వారి పరమార్థం రాజకీయార్థిక ప్రయోజనాల సాధనే అన్నది అందరికీ వర్తిస్తుంది. సందర్భం సాక్షిదైనా మరొకరిదైనా ఒకే విధంగా మాట్లాడాలి. యాజమాన్యం రాజకీయాలు వ్యూహాత్మక కోణాలు ఈ ఆందోళనతో కలగాపులగం కాకుండా చూడాలి.
.......................
తోక: కొన్ని కార్యక్రమాలు ముఖ్యంగా మా అబ్బాయి పెళ్లి కారణంగా దాదాపు నెల రోజులు బ్లాగులోకి రాకున్నా - వచ్చిన వెంటనే స్పందించిన మిత్రులకు ధన్యవాదాలు

Thursday, May 10, 2012

పత్ర స్వేచ్చ- పుత్ర స్వేచ్చ!



విషయాలు కలగాపులగమైపోయినప్పుడు వివాదాలు వికృతంగా తయారవుతాయి. వ్యక్తిగత వ్యూహాలు కీలకమైనప్పుడు వ్యవస్తాగత కోణాలు తారుమారవుతాయి. జగన్‌ మోహన రెడ్డి ఆక్రమాస్తుల కేసుగా పేరొందిన వ్యవహారంలో ఇప్పుడు సాగుతున్న తర్జనభర్జనలు అలాగే వున్నాయి. దీనిపై నన్ను వ్యాఖ్యానం కోరినప్పుడు మూడు ముక్కలు చెప్పాను- ఖాతాలు స్తంభింపచేయొచ్చు గాని జీతాలు స్తంభింపచేయకూడదు, పత్ర(పత్రికా) స్వేచ్చకు పుత్ర స్వేచ్చకు మధ్య చాలా తేడా వుంటుంది. ఈ ఘటన బ్లాక్‌ డేనా షాక్‌ డేనా అన్నది వారి వారి ధృక్కోణాలను బట్టి వుంటుంది.
ఇలాటిది జరుగుతుందని ఎప్పుడో వూహించామని స్వయానా జగన్‌ వ్యాఖ్యానించారు గనక ఇది అనూహ్య పరిణామం కాదని అనుకోవాలి. అంత ముందుగా వూహించిన వారు దానికి విరుగుడు కూడా వూహంచి వుంటారని మనం వూహించవచ్చు. అవన్నీ ఉద్యోగుల జీవన భద్రతకు అక్కరకు వస్తాయని ఆశించాలి. పిసిసి అద్యక్షులు బొత్స సత్యనారాయణ ఈ మేరకు భరోసా ఇస్తున్నారు గాని ఇప్పటి వరకూ ఈ కేసుతో తమకు సంబంధం లేదంటున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం నేరుగా చేయగలిగిందేముంటుంది? ఇక మానవ హక్కుల సంఘం తన దగ్గరకు వచ్చిన విజ్ఞప్తికి సమాధానం ఇచ్చేందుకు నెల రోజుల వ్యవధి వరకూ ఇచ్చింది గనక మరీ తీవ్రంగా తీసుకోలేదని తెలుస్తుంది. న్యాయస్థానం కూడా కేసు విచారణ రేపటికి వాయిదా వేసింది గనక తక్షణ సమస్యగా పరిగణించలేదని అర్థమవుతుంది. జగన్‌ వ్యాపార సామ్రాజ్యం రాజకీయ యంత్రాంగం విస్తారమైంది గనక ఈ విషయంలో చట్టరీత్యా చేయగలిగినవన్నీ వారు చేస్తారనేది నిస్సందేహం. దానిపై న్యాయ స్థానాలు ఏం చేస్తాయనేది న్యాయమూర్తుల చిత్తం. మామూలు వాళ్లకు