Pages

Thursday, May 17, 2012

రాష్ట్రపతి ఎన్నిక: కాంగ్రెస్‌ తర్జనభర్జన


రాష్ట్రపతి ఎన్నిక తేదీ దగ్గర పడుతున్నా ఏ పేరూ ముందుకు తీసుకురాలేకపోవడం కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకత్వ సంధిగ్ధాన్ని వెల్లడిస్తుంది. బాగా ప్రచారం పొందిన ప్రణబ్‌ ముఖర్జీ పేరును కూడా అధికారికంగా ప్రతిపాదించలేదు. అంతకంటే ముఖ్యమైన విషయమేమంటే అసలు అందరి అభిప్రాయాన్ని కూడగట్టే దిశలో చర్చలు ప్రారంభించింది లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎవరైనా వస్తే ప్రతిపక్షాలు బలపర్చడం సులభం కాదు. అలా గాక మిగిలిన వారి సహాయం కూడా తీసుకుని ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించే క్రమంలో పేర్లు వస్తే ఇతరులు కూడా స్పందించే అవకాశముంటుంది. బహుశా బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎలోనూ ఇలాటి సమస్యలే వున్నాయి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ఆజాద్‌ పేరు చెబుతున్నా అందరూ కోరితేనే ఒప్పుకుంటారని ఆయన అంటున్నారు. గతంలోనే ఆయనను వామపక్షాలు మరికొన్ని పార్టీలు ఒప్పుకోలేదు. పైగా రాజేంద్ర ప్రసాద్‌ తర్వాత మరే రాష్ట్రపతికి రెండవ అవకాశం ఇవ్వలేదు కూడా. మధ్యలో ఇంత విరామం పెట్టుకుని మళ్లీ కలాం ను తీసుకురావడం అసహమైన ప్రతిపాదన మాత్రమే. ఇప్పుడు బిజెడి అన్నా డిఎంకె పిఎ సంగ్మా పేరు తెచ్చాయి గాని ఆయన పార్టీ ఎన్‌సిపినే బలపర్చడం లేదు. వామపక్షాలు ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా ఇంకా ఒక వైఖరి తీసుకోలేదు. ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీకి అన్ని అర్హతలు వున్నా వామపక్షాలు అప్పట్లో ఆయనను ముందుకు తెచ్చాయి గనక బిజెపి విముఖంగా వుంది.ఇవన్నీ సర్దుకుని ఒక పేరు రావడానికి చాలా కసరత్తు జరగాల్సిందే. అలా కాకపోతే పోటీ కూడా జరగొచ్చు. అంతేగాని మీడియాలో కథనాలు వస్తున్నంత వేగంగా ఈ వ్యవహారం కొలిక్కి రాదు.

No comments:

Post a Comment