Pages

Thursday, May 24, 2012

మోపిదేవి అరెస్టుతో మొదలైన సంచలనంమంత్రి మోపిదేవి వెంకట రమణ అరెస్టు వూహించనిది కాకున్నా అనుకున్న దానికన్నా వేగంగా జరిగింది. ఒక సంఘటన జరుగుతుందని తెలిసినా నిజంగా జరిగినప్పుడు వుండే ప్రభావం ఎంత తీవ్రమో ఇప్పుడు అందరికీ అనుభవంలోకి వస్తున్నది. . జగన్‌ ముందస్తు బెయిలు కోసం దరఖాస్తు చేసుకోవడంలోనూ ఇదే కనిపిస్తుంది. వ్యాన్‌పిక్‌ కుంభకోణంలో మోపిదేవి పాత్ర ఎంత, వైఎస్‌రాజశేఖరరెడ్డి వత్తిడి ఎంత అన్నది ముందు ముందుగాని తేలాలి.అయితే ఈ ప్రాజెక్టు భూ సేకరణ ప్రహసనం గుంటూరు ప్రకాశం జిల్లాల్లో వందలాది గ్రామాలలో ప్రకంపనలు పుట్టించిన మాట మాత్రం నిజం. అనేక విషాదాలకు కూడా దారి తీసిన వికృత వ్యవహారమది. జగన్‌ ఆస్తుల కేసులో మొదటగా అరెస్టయిన నిమ్మగడ్డ ప్రసాద్‌, మోపిదేవి వెంకట రమణ కూడా ఆ కేసుకు సంబంధించిన వారే కావడం గమనించదగ్గది. ఆయననే ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నిస్తూ ఇతర మంత్రుల పేర్లు తీసేవారున్నారు. ఇది మొదలు అని భావించేవారు వున్నారు. జగన్‌ అరెస్టుకు ముందుగా మంత్రులపై చర్య అనివార్యమని భావించినందునే ఇది జరిగిందనే వారూ వున్నారు.ఏమైనా ఈ ప్రక్రియ ఇప్పుడే ఆగకపోవచ్చు. జాబితాలో మరో అయిదుగురు మంత్రులైనా వుండే అవకాశం వుంది. వారు విచారణకు సహకరించే తీరు కూడా సిబిఐ వైఖరిని ప్రభావితం చేస్తుంది. జగన్‌ అభిమానులు కొందరు భావిస్తున్నట్టు ఈ రోజు ఉదయం చర్చలో నటి రోజా నాపై ధ్వజమెత్తినట్టు ఇందులో వ్యక్తిగత ఇష్టాయిష్టాల పాత్ర ఏమీ లేదు.జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలన్నదే ప్రశ్న. వ్యూహాత్మకంగానే మంత్రిని ముందుగా అరెస్టు చేశారని వైఎస్‌ఆర్‌పార్టీ వారు ఆరోపించడం నిజమే అనుకున్నా నిలబడేది కాదు. ఇంతకాలం వారితో సహా కాంగ్రెస్‌ విమర్శకులందరూ అడుగుతూ వచ్చిన పరిణామం జరిగినప్పుడు తప్పు పట్టడానికి లేదు. ఇక పోతే మంత్రులు అనవసరంగా బలిపశువులయ్యారని కొందరు చేసే వాదనలోనూ పస లేదు. నిజానికి అవినీతి ఒప్పందాలకు తలవొగ్గి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను బలిపెట్టడం కన్నా పొరబాటు ఏముంటుంది? ఇంతకంటే వారు పదవిని వదులుకున్నా ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు.ఐఎఎస్‌లకూ ఇదే వర్తిస్తుంది. ఇతర కుంభకోణాలు కొన్ని తీవ్రమైనవే వచ్చినా ఈ తరహా వ్యవహారం దేశంలోనే ఎన్నడూ లేని రీతిలో దర్యాప్తుకు వచ్చినందున అది ఇచ్చే పాఠాలు కూడా ప్రతివారూ నేర్చుకోవలసి వుంటుంది.

3 comments:

 1. Roja Garu TDP tarupuna 2 sarlu contest chesi odipoyina taruvath adhikara congres loki jump chealanukundi.Adi kudaraka YSR Congress loki vellindi. TDP lo 6 years undi chandrababu pogidina notithone ippudu chandrababu kuda avineethiparudu antundi ayana vallane rastram brastupatti payindanta.Chandrababu avineethi ayantho anatagaginappudu kanapadaleda.Nijamga avidiki chittashuddi unte elections kante munde congress loki velli contest chesedi.Appude ame chittasuddi prajalandariki telisindi.Evarina Chattaniki atheetulu karu. Aneka Kotla prajadanam Congress government hayamulo kollagottaranedi nijam.Vari asthulu ippudu evidanga kondalla perigayo vari neetiki addam padutundi.Vyavasthalanu inthaga brastu pattinchina varu prajagraham lo kottukupoka tappadu.Courtulanu,judges ni nindinchadam vari diga jarudu tananiki nidarshanam. Gatham lo Devulluga kanipinchina vyaktulu,courts,judges ippudu variki dayyaluga kanpistunnayi.Deenini batti vari manostiti ardam chesukovachu.

  ReplyDelete
 2. /వ్యూహాత్మకంగానే మంత్రిని ముందుగా అరెస్టు చేశారని వైఎస్‌ఆర్‌పార్టీ వారు ఆరోపించడం నిజమే /
  ఈ వూహలు, జగన్ రెండ్రోజుల క్రితం వూహలు అన్నీ నిజమవ్వాలని ఆశిద్దాం. :)

  /ఇంతకంటే వారు పదవిని వదులుకున్నా ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు.ఐఎఎస్‌లకూ ఇదే వర్తిస్తుంది. /
  నిజాయతీకి బ్రహ్మరథం పట్టే త్రేతాయుగాలు పోయాయి. ప్రజలు తెలివిమీరి పోయారు, అవినీతి పరుల ఎంగిలిమెతుకులకు మరిగిన ప్రజలు నిష్పాక్షికత, నిజాయతీలను సపోర్ట్ చేయరని, ఇక్కడి కామెంట్లను బట్టి తెలుస్తోంది. విషయాన్ని డైల్యూట్ చేస్తూ/ దారి మళ్ళిస్తూ... CBI పనితీరు, 'అందరికీ ఇలానే జరిగిందా?' , ' ఇప్పుడే స్ట్రిక్ట్‌గా వుండాలా?' , మంత్రుల అరెస్టు వ్యూహాత్మకమా?' , 'CBI అధికార పరిధి లోనిదేనా? ', అందరికీ ఇలానే వ్యవహరిస్తామని హామీ ఇస్తారా? .... ఇలాటి చవుకబారు ప్రస్తావనలను , లీగల్ పాయింట్లను పదే పదే ప్రస్తావించడం బట్టి తెలుసుకోవచ్చు.

  ReplyDelete
  Replies
  1. eedokkade chavakabarani vaadu. prajalanta engili metukulaku aashapadevallu. Dabbu pogaru kanipistondi mee maatallo.

   Delete