Pages

Thursday, May 17, 2012

ఆస్తుల స్తంభన: పూర్వాపరాలు


జగన్‌కు సంబంధించిన సాక్షి ఆస్తుల క్రయ విక్రయాల నిలిపివేత జప్తు అనడానికి లేదని ప్రముఖ న్యాయవాది ఒకరు వివరించారు. ఈ ఆస్తుల విషయంలో యథాతథ స్థితి కొనసాగాలంటే లావాదేవీలు జరక్కూడదు గనక అటాచ్‌మెంట్‌ అనబడే స్తంభన ఉత్తర్వు జారీ చేయడం తప్ప కార్యకలాపాల నిలిపివేయనవసరం లేదు.గతంలో ఖాతాల స్తంభనకు కొనసాగింపుగా దీన్ని పరిగణించవచ్చు.అయితే ప్రభుత్వమే ప్రకటనల నిలిపివేత ఉత్తర్వు ఇవ్వడం అనేక విమర్శలకు దారి తీసిన నేపథ్యంలో ఈ రోజు హైకోర్టు దానిపై తాత్కాలిక స్టే ఇచ్చింది.అయినా తుది తీర్పు వెలువడే వరకు ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోవచ్చు. నిమ్మగడ్డ ప్రసాద్‌ అరెస్టు తర్వాత వ్యాన్‌పిక్‌ ఒప్పందాన్ని రద్దు చేయాలని సాక్షాత్తూ మంత్రి మాణిక్య వర ప్రసాద్‌ కోరడం చాలా ముఖ్యమైన పరిణామం. అన్ని తరగతుల నుంచి వస్తున్న అభిప్రాయం అది. అక్రమ లాభం పొందారంటూనే వాటిని రద్దు చేయకపోవడం వుత్తుత్తి తతంగమనే అభిప్రాయం ఏర్పడుతున్నది. ఇక పెట్టుబడులు పెట్టినందుకే అరెస్టు చేస్తారా అని జగన్‌ వేస్తున్న ప్రశ్నలో చాలా రాజకీయాలు వున్నాయి. సాఫీగా పెట్టుబడులు పెట్టి సజావుగా వ్యాపారాలు చేసుకుంటే ఎలాటి సమస్యలు రావు. అలాటి వేలాది మందికి జోలికి ఎవరూ పోవడం లేదు. అనుమానాస్పదంగా వ్యవహరించిన వారే ఇక్కడ దర్యాప్తు ఎ దుర్కొంటున్నారు గతంలో సత్యం రామలింగరాజు అయినా ఇప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్‌ మామూలుగా వ్యాపారంలో రాణించినంత కాలం సమస్యలు రాలేదనేది వాస్తవం. నిజానికి దారి తప్పిన వారిపై చర్య తీసుకోకపోతే సక్రమంగా వ్యవహరించేవారు కూడా నిరుత్సాహపడటం లేదా తామూ అదే మార్గం అనుసరించడం జరుగుతుంది. కనక సందర్భంతో నిమిత్తం లేకుండా దీన్ని వ్యాపారవేత్తలపై దాడిగా చిత్రించాల్సిన అవసరం లేదు. 

No comments:

Post a Comment