Pages

Wednesday, May 30, 2012

క్యాబాత్‌ హై మన్మోహన్‌ జీ!!


తనపై ఆరోపణలు నిరూపిస్తే ప్రజా జీవితం నుంచి తప్పుకుంటానని ఫ్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్న మాటలు చాలా హాస్యాస్పదంగా వున్నాయి. ఆయనతో సహా కేంద్ర మంత్రులపై అన్నాహజారే బృందం చేసిన ఆరోపణల ఉద్దేశం ఏమైనా కావచ్చు గాని అవి హఠాత్తుగా వచ్చినవి కావు. నిరాధారమైనవీ కావు. మన్మోహన్‌ నీతి నిజాయితీల గురించి స్త్తోత్ర పాఠాలు పాడే వారికి కొదువ లేదు గాని సమస్య ఆయన వ్యక్తిగత సచ్చీలత కాదు. వ్యక్తిగా ఆయన ఎలాటి వాడైనా ఆయన మంత్రివర్గం మాత్రం అత్యంత అవినీతి భరితమైందిగా పేరు పొందింది. రెండేళ్ల కిందట స్వయంగా ఆయనే మీడియా ముఖ్యులను పిలిపించి స్వతంత్ర భారత చరిత్రలోనే తనది అవినీతి ప్రభుత్వమన్నట్టు వస్తున్న వార్తలను కాస్త తగ్గించాలని వేడుకున్నారు. ఆ తర్వాత మరిన్ని కుంభకోణాలు వెలుగు చూశాయి. అందులో ఎస్‌ బ్యాండ్‌, బొగ్గు కుంభకోణాలు ఆయన ఆధ్వర్వంలో వున్న శాఖల్లోనే జరిగాయి. దీనిపై కాగ్‌ నివేదికలో పేర్కొన్న భాగాలు వెనక్కు తీసుకోలేదు. అవి లీక్‌ కావడంతో తనకు సంబంధం లేదని మాత్రమే వివరణ ఇచ్చింది.ఈ సంగతి గతంలోనూ బ్లాగులో చెప్పుకున్నాం. కనక బొగ్గు మంత్రిత్వ శాఖ వివరణ ఆధారంగా తను నిర్దోషినై పోవాలని మన్మోహన్‌ చెప్పడం అర్థ రహితం. అలా అయితే ప్రతి శాఖా సమర్థించుకుంటుంది. ఎస్‌ బ్యాండ్‌ కుంభకోణంలో ఇస్రో మాజీ చైర్మన్‌ మాధవన్‌ నాయర్‌పై చర్యలు తీసుకున్న ప్రభుత్వం ఆ శాఖను చూస్తున్న మన్మోహన్‌ తప్పు లేదని ఎలా చెబుతుంది? రియలన్స్‌ వారు పెట్రోలియం రేట్లు పెంచాలంటూ లేఖలు రాస్తే వాటిని తనకు పంపించి ప్రధాని కార్యాలయం ఒత్తిడి చేస్తున్నదని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి ఇటీవల వెల్లడించలేదా? కనక మన్మోహన్‌ సింగ్‌ మౌనంగా వుంటే అదో తీరు గాని అతకని సమర్థనలతో సవాళ్లు విసిరి సంతృప్తి పడితే చాలదు.

1 comment:

  1. :)) True!

    MMS is a Coalition Dharma Raju. He closes his eyes while his allies & cabinet collegues graze on 2G, 3G, CWG, tatra, Aircel-maxis deals, black money, security scams etc. But MMS is innocent! We have NO other go than to trust him!!

    ReplyDelete