చట్ట విరుద్దంగానూ అక్రమంగానూ ప్రైవేటు శక్తులకు బొగ్గు బ్లాకులు కేటాయించడం వల్ల దేశ ఖజానాకు 10 లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు అత్యున్నత ఆడిటింగ్ సంస్థ సిఎజి నివేదిక పేర్కొంది. ఇది ప్రపంచంలోనే పెద్ద కుంభకోణం అవుతుంది. 2 జి స్పెక్ట్రం కన్నా అయిదు రెట్లు పెద్దదన్న మాట. నిజానికి గనుల ప్రైవేటీకరణతో అంతులేని అవినీతి విస్తరించిందనడానికి గాలి జనార్థనరెడ్డి వ్యవహారానికి మించిన ఉదాహరణ అవసరం లేదు.చమురు సహజ వాయు నిక్షేపాల ప్రైవేటీకరణ కారణంగా ఇప్పటికే ప్రైవేటు రంగం ప్రభుత్వ రంగాన్ని మించిపోయింది. దేశంలోని చమురు నిక్షేపాలకు సంబంధించి అతి పెద్ద ఒప్పందాలు జరిగిపోతున్నాయి.2009-10లో 21.8 కోట్ల టన్నుల ఇనుప ఖనిజం తవ్వకం జరిగితే ఇందులో 63 శాతం ప్రైవేటు కాగా అందులో 45 శాతం విదేశాలకు తరలిపోయింది.బొగ్గు గనులను కూడా ప్రైవేటీకరించే ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరిగాయి. గనుల రంగాన్ని ప్రైవేటు పరం చేయడం వల్ల వనరులను కొల్లగొట్టడం ప్రభుత్వానికి చెల్లివేతలు ఎగ్గొట్టడం కూడా విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఆ పైన దేశీయ అవసరాలను పట్టించుకోకుండా లాభాల కోసం విదేశాలకు తరలిస్తుంటే రేపు మనకు వనరులు లేకుండా పోయే పరిస్థితి. ఇది బొగ్గు విషయంలోనూ తీవ్రంగానే వుందని సిఎజి నివేదిక స్పష్టం చేసింది.అయితే ఇది ఒక పత్రికలో రాగానే మన్మోహన్ ప్రభుత్వంలో అలజడి రేగింది. తము పేర్కొన్నది ప్రాథమిక నివేదిక మాత్రమేనని తర్వాత అభిప్రాయం మార్చుకున్నామని సిఎజితోనే లేఖరాయించారు. అంతేగాక బొగ్గు గనులు పాడుకున్న వారికి అనుకోకుండా విపరీతమైన లాభాలు వచ్చినంత మాత్రాన అది ప్రభుత్వానికి నష్టం అనుకోనవసరం లేదని కూడా వింత వాదన తీసుకొచ్చారు. దీనంతటిని బట్టి చూస్తుంటే సిఎజిపైన కూడా ఎంత వత్తిడి పెరిగిందో తెలుస్తుంది.
చివరగా ఒక్కమాట చెప్పాలి. పెట్టుబడిదారులు చాలా మంది ఉత్పత్తి చేసి లాభాలు సంపాదించడం కన్నా ఉత్తుత్తినే లాభాలు దండుకోవడానికి పాకులాడుతున్నారు. ఈ క్రమంలో వారి దృష్టి ప్రకృతి వనరులపై పడింది.
prakruthini kaalaraasina vaadevadoo baagupadaledu Sir....
ReplyDeleteఉత్పత్తి చేసైనా ... ఉత్తుత్తిగనే అయినా పెట్టుబడి లాభాన్నే కోరుతుంది. దానికోసం ఎంతకైనా తెగిస్తుంది అనడానికి సాక్ష్యాలే ఈ చేష్టలు. ప్రకృతిని నాశనం చేయడం ద్వారా ప్రభుత్వానికి నష్టం తో పాటు పర్యావరణ సమస్యలూ తీవ్రమవుతాయి. ఇలా జాతి మనుగడకు సర్వత్రా వినాశనం కలిగించే ఈ చర్యల పట్ల ప్రజలు అప్రమత్తం కావాలి. అప్రమత్తం చేయాలి.
ReplyDelete