ప్రాంతాల వారీ వివాదాలు పెంచే ఈ ధోరణి కేవలం మాటలకే పరిమితం కాలేదని సాగర్ జలాల విడుదల వివాదం స్పష్టం చేస్తున్నది. మొన్నటి ఎన్నికల ఎదురు దెబ్బల నుంచి తేరుకోవడానికి తరుణోపాయంగా నీటి విడుదలను వివాద గ్రస్తం చేయడం అవాంఛనీయ పరిణామం. కృష్ణా జలాల కనీస మట్టం, ఆ సమయంలో నీటి విడుదలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలు, ఆ సందర్భంలో పాటించాల్సిన ప్రాధాన్యతలు వీటిపై స్పష్టమైన జీవో వుంది. ఇప్పుడు నీటి లభ్యత చాలా తక్కువగా వుంది గనక ఏం చేయాలన్న దానిపై అఖిలపక్ష సమావేశం జరిపి అంగీకృత నిర్ణయానికి రావలసి వుండింది. అలా గాక ఉప ఎన్నికల అనంతర రాజకీయ నిర్వహణలో భాగంగా ఆదరాబాదరాగా నీటిని విడుదల చేయడం, విమర్శలు రాగానే తాత్కాలికంగా విరమించుకోవడం ఇప్పుడున్న సున్నితమైన రాజకీయ పరిస్థితిలో అత్యంత బాధ్యతా రహితం. సాగునీరు తాగునీరు వీటి మధ్య పాటించాల్సిన నిబంధనలు వుండనే వున్నాయి. కొంతమంది చెబుతున్నట్టు ఇది కేవలం తెలంగాణ ప్రాంతంలో తాగునీటి అవసరాలనే గాక ఇతర చోట్ల కూడా ప్రభావం చూపే అంశం. నిజంగా ఆగష్టులో వర్షాలు కురవకపోతే ఏం చేయాలన్నది ఒక సవాలు. సమిష్టిగా చర్చించి సమతుల్యత పాటించాల్సిన సందర్భంలో అకారణ ఉద్రిక్తతలు పెంచడం కూడా ఒక రాజకీయ వ్యూహమనుకోవాలా?
Saturday, June 30, 2012
నీటి విడుదలలో కొత్త వివాదం
ప్రాంతాల వారీ వివాదాలు పెంచే ఈ ధోరణి కేవలం మాటలకే పరిమితం కాలేదని సాగర్ జలాల విడుదల వివాదం స్పష్టం చేస్తున్నది. మొన్నటి ఎన్నికల ఎదురు దెబ్బల నుంచి తేరుకోవడానికి తరుణోపాయంగా నీటి విడుదలను వివాద గ్రస్తం చేయడం అవాంఛనీయ పరిణామం. కృష్ణా జలాల కనీస మట్టం, ఆ సమయంలో నీటి విడుదలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలు, ఆ సందర్భంలో పాటించాల్సిన ప్రాధాన్యతలు వీటిపై స్పష్టమైన జీవో వుంది. ఇప్పుడు నీటి లభ్యత చాలా తక్కువగా వుంది గనక ఏం చేయాలన్న దానిపై అఖిలపక్ష సమావేశం జరిపి అంగీకృత నిర్ణయానికి రావలసి వుండింది. అలా గాక ఉప ఎన్నికల అనంతర రాజకీయ నిర్వహణలో భాగంగా ఆదరాబాదరాగా నీటిని విడుదల చేయడం, విమర్శలు రాగానే తాత్కాలికంగా విరమించుకోవడం ఇప్పుడున్న సున్నితమైన రాజకీయ పరిస్థితిలో అత్యంత బాధ్యతా రహితం. సాగునీరు తాగునీరు వీటి మధ్య పాటించాల్సిన నిబంధనలు వుండనే వున్నాయి. కొంతమంది చెబుతున్నట్టు ఇది కేవలం తెలంగాణ ప్రాంతంలో తాగునీటి అవసరాలనే గాక ఇతర చోట్ల కూడా ప్రభావం చూపే అంశం. నిజంగా ఆగష్టులో వర్షాలు కురవకపోతే ఏం చేయాలన్నది ఒక సవాలు. సమిష్టిగా చర్చించి సమతుల్యత పాటించాల్సిన సందర్భంలో అకారణ ఉద్రిక్తతలు పెంచడం కూడా ఒక రాజకీయ వ్యూహమనుకోవాలా?
Friday, June 29, 2012
రాష్ట్ర భవిష్యత్తుపై కొత్త నాటకం?
మహారాష్ట్ర ఎన్నికల తర్వాత- సోనియా గాంధీ విదేశాల నుంచి వచ్చిన తర్వాత- ఉప ఎన్నికల తర్వాత- రంజాన్ తర్వాత ఇలా రాష్ట్ర భవిష్యత్తుపై నిర్ణయం వాయిదా వేయడానికి కేంద్రం రకరకాల కారణాలు చూపిస్తూ వచ్చింది.ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక తర్వాత పరిష్కారం చెప్పేస్తామన్నట్టు మాట్లాడుతున్నారు. అందరినీ సంప్రదించాలని చెప్పే హౌం మంత్రి చిదంబరం కూడా సాధ్యమైనంత త్వరలో నిర్ణయం తీసుకోవాలని ప్రకటించారు. మూడు మాసాల్లో తెలంగాణా ఏర్పాటు జరిగిపోతుందని తాము చేసిన ప్రకటన నిజమనడానికి ఇది నిదర్శనమని టిఆర్‌ఎస్ నాయకులు లేదా ఇతర పార్టీల తెలంగాణా నాయకులు కొందరు అప్పుడే అంటున్నారు.మొన్నటి ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌కు మరో గత్యంతరం లేదని కూడా వారు ముక్తాయిస్తున్నారు.నిజానిక ఉప ఎన్నికల వెను వెంటనే ఈ అస్త్రంబయిటకు తీస్తారని నేను బ్లాగులో ఇది వరకే రాసిన సంగతి మిత్రులకు తెలుసు. అయితే ఇప్పుడు నడుస్తున్న నాటకం అంతకంటే రసవత్తరంగా వుంది. కేవలం తెలంగాణా నాయకులు మాట్లాడ్డమే కాదు- వారికంటే ముందే ఇతర ప్రాంతాల నేతలు నిరసన స్వరాలు వినిపించడం మొదలెట్టారు. లగడపాటితో మొదలైన ఈ దుమారం టిజివెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి వంటి మంత్రుల మాటలతో మరింత తీవ్రమైంది. రాయల తెలంగాణా అనీ, రాయలసీమలో కర్నూలు అనంతపురం జిల్లాలను కలిపి ఇస్తారని ఇలా రకరకాల కథనాలకు కాంగ్రెస్ నేతలే వూతమిస్తున్నారు.మరో వైపున
నాయకత్వ మార్పు కథనాలకు కారకులెవరు?
మీరు కోరుకుంటున్నట్లుగా (నాయకత్వ మార్పు) జరగదు అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీడియా ప్రతినిధులతో అన్నారు.నిజానికి మీడియాకు అలాటి కథనాలు ఇస్తున్న వారు కాంగ్రెస్ నేతలే.ఎవరో ఎందుకు? పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్వయంగా చేసిన వ్యాఖ్యలు ఏమి చెబుతున్నాయి?గురువారం సాయింత్రం లోకేష్ వారసత్వ నాయకత్వ స్వీకరణపై చర్చకు టీవీ9లో వుండగా నేటి మాటలో బొత్స వ్యాఖ్యలు విన్నాను.వాటిని నిశితంగా గమనిస్తే చాలా అర్థం వుంది. తర్వాత దానిపైనా చర్చించాల్సి వచ్చింది. లిక్కర్ వ్యాపారులపై దాడులలో విమర్శలను ఎదుర్కొన్న బొత్స తనకు 'అవకాశం వస్తే' మధ్య నిషేదం విధిస్తానని అన్నారు. ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా వున్నాయీ వ్కాఖ్యలు. మొదటిది మద్యం వ్యాపారంతో సంబంధం వుందన్న ఆరోపణలకు సమాధానంగా నిషేదంగురించి చెప్పడం. అయితే తనకు అవకాశం వస్తే చేస్తానని చెప్పడం ద్వారా అధికారం అప్పగిస్తే చేస్తానని సూచించడం. 'ఇప్పుడు పిసిసి అద్యక్షుడుగా వున్నాను.రేపు ఏదైన అవకాశం వస్తే అందరినీ ఒప్పించి అధిష్టానంతో మాట్లాడి మద్య నిషేదానికి కృషి చేస్తాను' ఇవి బొత్స మాటలు. ఈ మాటలలో ఏమైనా అస్పష్టత వుందా? బహుశా కిరణ్ జవాబు బొత్సను ఉద్దేశించినదై వుండొచ్చు. చిరంజీవి అర్హత గురించి జోగి రమేష్ అంతకు ముందే చెప్పారు. అభిమానంతో అన్నాడని మెగాస్టార్ సమర్థించారు. జెసి దివాకర రెడ్డి, శంకర రావు వంటి వారు అంతకు ముందే వ్యాఖ్యానించారు. టికాంగ్రెస్ నేతలు కొందరు తీవ్రమైన విమర్శలే చేశారు.ఇవన్నీ తమ వారి నుంచే జరిగిపోతుంటే
Monday, June 18, 2012
శ్రుతి మించిన అతి తర్కం (రంగనాయకమ్మ గారి పుస్తకంపై నాటి విమర్శపునర్ముద్రణ)
దళితుల సమస్య పరి'ా్కరానికి ''బుద్దుడు చాలడు, అంబేద్కరూ చాలడు మార్క్స్ కావాలి'' అంటూ రంగనాయకమ్మ ఇటీవల ఒక పుస్తకం రాశారు. సామాజిక న్యాయభావన, అట్టడుగు తరగతుల వారిలో స్వీయ అస్తిత్వం గురించిన చైతన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఇలాటి చర్చలు అందరి దృష్టినీ ఆకర్షించడం సహజమే. అందులోనూ అంబేద్కర్ దళితజాతి చైతన్యానికి వైతాళికుడిగా పరిగణించబడుతున్నారు. దేశంలో అత్యున్నత గౌరవాభిమానాలు పొందుతున్న దివంగత నాయకులలో ఆయనొకరు. ఇందుకు సహేతుకమైన కారణాలే వున్నాయి. వాటిని రంగనాయకమ్మ ఇలా వివరించారు:
''అంబేద్కర్ అస్పృశ్యుల సమస్యను దేశంలో అందరి దృష్టికి తెచ్చారు. ఆ దురాచారం మీద పోరాటాన్ని ఒక రాజకీయ ఉద్యమంగా మలచారు. మనకూ హక్కులున్నాయనే స్పృహ అస్పృశ్యులలో కలిగించారు.
రిజర్వేషన్ల ఉద్యమం అంబేద్కర్ కన్నా ముందే ప్రారంభించినా ఆయన ఆ ఉద్యమాన్ని కొనసాగించారు. రిజర్వేషన్ల వల్ల చిన్నకులాల్లో కొంత జనాభాకైనా పెద్ద చదువులు, ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి.
అంబేద్కర్ అస్పృశ్యుల విషయంలో కాంగ్రెస్‌ను, గాంధీని సాధ్యమైనంత ఎక్కువగానే బటyబయలు చేశారు....
అస్పృశ్యత మీదేగాక మొత్తం కులవిధానం అంతటి మీద అంబేద్కర్ తీవ్రమైన వ్యతిరేకత ప్రదర్శించారు.''
తన పుస్తకం చివరిభాగంలో రచయిత్రి ఇచ్చిన ఈ అంచనా ఆయన పాత్రను చాలావరకు సరిగానే చిత్రించింది. అయితే
Saturday, June 16, 2012
అవినీతికి ఆమోదమా? అధినేతలకు గుణపాఠమా?
18 ఉప ఎన్నికల్లో వూహించిన ఫలితాలే వచ్చాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ లేదా జగన్ పార్టీ అభ్యర్థులు 15 స్థానాల్లో విజయం సాధించారు. చాలా చోట్ల భారీ మెజారిటీలు లభించాయి. రాష్ట్ర రాజకీయ రంగంలో కొత్త ప్రాంతీయ పార్టీ ఆవిర్భావ ప్రక్రియ దీనితో పూర్తయినట్టే. బంగ్లాకాంగ్రెస్, ఉత్కళ కాంగ్రెస్, కేరళ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్, తమిళ మానిల కాంగ్రెస్ వంటి పార్టీల తరహాలో మరో ప్రాంతీయ కాంగ్రెస్ అవతరించి బలం ప్రదర్శించింది. సిబిఐ కేసులు, అరెస్టులు ఆరోపణల నేపథ్యం వున్నా జగన్ అభ్యర్థులను ఎన్నుకున్నారన్నది నిజం. అయితే ఈ విజయంతో ప్రజలు ఆయనపై ఆరోపణలన్ని తోసిపుచ్చారనీ,న్యాయం చేశారని భావిస్తే అది అనుచితమే. రాజకీయంగా ఈ సారి కాంగ్రెస్ స్థానంలో జగన్ పార్టీని ఓటర్లు స్వీకరించారు. ప్రభుత్వ నిర్వాకాలపై , రాష్ట్రంలో రాజకీయ ౖ అనిశ్చితిపై పరిపాలనా ప్రతిష్టంభనపై ప్రజల అసంతృప్తి ఆగ్రహం ఈ తీర్పులో ప్రతిబింబించాయి. వైఎస్‌ఆర్ పథకాల ప్రచారం సామాజిక కోణాలు కూడా ప్రధాన పాత్ర వహించాయి. కేవలం సానుభూతితోనో మహిళల కన్నీళ్ల వల్లనో గెలిచారని లేక ప్రజలు తప్పుగా తీర్పు నిచ్చారని అంటే అది పాక్షికత్వం అవుతుంది.
ప్రాథమికంగా ఇది కాంగ్రెస్‌కు తిరసృతి. రెంటిని మినహాయిస్తే తక్కిన అన్ని చోట్ల పాలకపక్షం తన స్థానాలు కోల్పోయింది. శంకరరావు, దివాకరరెడ్డి వంటి పార్టీ నాయకులు భిన్న స్వరాలు వినిపించడం మొదలెట్టారు.మంత్రి మాణిక్యవర ప్రసాద్ ఒక విధమైన పునర్య్యవస్థీకరణ గురించి మాట్లాడారు. కనక చాలా మార్పులు
Friday, June 15, 2012
రాష్ట్రపతి ప్రణబ్
ఎట్టకేలకు సోనియా గాంధీ ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతి అభ్యర్తిగా ప్రకటించారు. అత్యున్నత పీఠంపై అయోమయం తొలగింది. ఈ క్రమంలో మన్మోహన్ సింగ్ కొనసాగింపుపైనా సందేహాలు తీరినట్టయింది. మొత్తం వ్యవహారంలో అందరికంటే అభాసుపాలైంది మమతా బెనర్జీ.నిజానికి ఆమె ములాయంను కలుసుకుని మూడు పేర్లపై ప్రకటన చేసిన కొద్ది సేపటికే ఆ పార్టీ ఇచ్చిన వివరణ మరో విధంగా వుంది. ప్రణబ్ ముఖర్జీ కేవలం కాంగ్రెస్ అభ్యర్తిగా గాక ఉమ్మడి ప్రతిపాదనగా వచ్చేట్టయితే పరిశీలించడానికి వామపక్షాలు ముందే సంసిద్దత వ్యక్తం చేశాయి. ప్రస్తుతానికి కలాం పేరు ఇంకా వినిపిస్తున్నా ఆయన విముఖత చూపించవచ్చు. సంగ్మాను నిలబెట్టాలా లేదా అన్నది ఎన్‌డిఎ తేల్చుకోవల్సి వుంటుంది. ఈ విషయంలో మరింత చర్చ జరగవచ్చు గాని ప్రణబ్ రాష్ట్రపతి కావడంలో సందేహాలు వుండవు.
Tuesday, June 12, 2012
ఉధృత పోలింగ్: ఫలితాలపై వూహలు
దేశాన్ని రాష్ట్రాన్ని కూడా ఆకర్షించిన అనవసర ఉప ఎన్నికల పోలింగ్ తతంగం ముగిసింది. జగన్‌ను అరెస్టు చేసిన తర్వాత పరిణామాలు చాలా భీకరంగా వుంటాయన్నట్టు ఆయన ఇతరులు కూడా పరస్పరం ఆరోపణలు చేసుకున్నప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ ప్రజానీకం అలాటి వాటికి ఆస్కారం లేకుండా శాంతిని కాపాడుకోవడం అభినందనీయం. నిజానికి ఎన్నికల ప్రచారంలోనూ ప్రధానమైన మూడు పార్టీల నేతలు బాధ్యతా రహితంగా ఆరోపణలు గుప్పించుకున్నారు.జగన్ పార్టీ వారైతే ఆయన అరెస్టుతో పాటు రాజశేఖర రెడ్డి మరణాన్ని కూడా ఎన్నికల సమస్యగా మార్చేందుకు యత్నించారు. అయినా ప్రజలు సంయమనం పాటించడం వారి చైతన్యానికి సంకేతం. పోలింగ్ పూర్తి అయ్యీకాకముందే కాంగ్రెస్ ఎంపిల లగడపాటి రాజగోపాల్ తనవైన సర్వేలతో ముందుకొచ్చారు. కొన్ని ఇంగ్లీషు ఛానళ్ల సర్వేలు కూడా వచ్చాయి.ఇవన్నీ వూహించినట్టే వైఎస్‌ఆర్‌పార్టీకి అత్యధిక స్థానాలు వస్తాయని చెబుతున్నాయి.అదే జరుగుతుందన్న భావన సర్వత్రా వ్యాపించి వుంది.అయితే ఈ పరిస్థితి ఈ ఉప ఎన్నికల రంగానికి సంబంధించిందే తప్ప దీర్ఘ కాలం ఇదే వాతావరణం వుంటుందని చెప్పడానికి లేదు. అయితే పాలక కాంగ్రెస్ అంతర్గత కలహాల తాకిడికి గురి కావడం,తెలుగు దేశంలోనూ కొన్ని తీవ్ర పరిణామాలు సంభవించడం సాధ్యమే. అదే సమయంలో జగన్ జైలులో వుండగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కూడా తన వూపు ఏ మేరకు నిలబెట్టుకోగలుగుతుందన్న ప్రశ్న కూడా విస్మరించరానిది. ఎందుకంటే విజయమ్మ షర్మిల ప్రచారాల ప్రభావం తాత్కాలికమే తప్ప నిలకడగా వుంటుందని ఆ పార్టీ వారే అనుకోవడం లేదు. ఉప ఎన్నికల వెనువెంటనే ఉధృతంగా వలసలు జరక్క పోతే ఆ తర్వాత కొంత కాలం స్తబ్దత అనివార్యం.ఈ లోగా రాజకీయాలను తెలంగాణా సమస్యపైకి మరల్చడానికి అన్ని శక్తులూ రంగంలోకి దిగనున్నాయి.
ఏం స్వతంత్రం?
కేంద్రంలో యుపిఎ ప్రభుత్వం అస్తుబిస్తుగా నడుస్తుండడం యధార్థం. నేరుగా ప్రధాని మన్మోహన్ సింగ్‌పైనే ఆరోపణలు రావడం కూడా నిజం. ఆయనను కొనసాగింపుపైనా రకరకాల కథనాలు వస్తున్నాయి. రాష్ట్రపతి అభ్యర్థిని తేల్చుకోవడంలోనూ కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతున్నది. ఇవన్నీ నిజమే గాని దేశ అంతర్గత వ్యవహారాలు. కాని ఒక అంతర్జాతీయ రేటింగ్ సంస్థ వీటి ఆధారంగా వ్యాఖ్యానాలు చేయడం ప్రపంచీకరణ ప్రభావానికి అద్దం పడుతున్నది. అధికారం సోనియా గాంధీ చేతిలో వుండి మన్మోహన్ సింగ్ నామకార్థపు నాయకుడు కావడమే దీనంతటికీ కారణమని స్టాండర్డ్ అండ్ పూర్ అనే అంతర్జాతీయ రేటింగ్ సంస్థ నివేదిక నిచ్చింది. బ్రెజిల్, రష్యా, ఇండియా,చైనా, సౌత్ ఆఫ్రికాలతో కూడిన బ్రిక్స్ కూటమిలో ముందుగా దెబ్బ గినే దేశం ఇండియానే కావచ్చునని కూడా అది పేర్కొంది. ఆర్థికాభివృద్ది 6.5 శాతానికి పడిపోయి, పారిశ్రామిక పెట్టుబడుల సూచి దాదాపు శూన్యంగా మారిన ఆర్థిక స్థితిలో ఇదేమంత ఆశ్చర్యం కలిగించదు. ఇదే అంతర్జాతీయ నివేదికల ఆధారంగా మన అభివృద్ధి గురించి ఆదరగొట్టిన అధినేతలు ఇప్పుడు మాత్రం మరోలా మాట్లాడుతున్నారు.ఆ నివేదికను పట్టించుకోనవసరం లేదన్నట్టు ప్రణబ్ ముఖర్జీ ఉవాచ. అదొక భాగమైతే ఈ విధంగా ఇండియాపై వత్తిడి తేవడంలోని రాజకీయం కూడా పట్టించుకోదగిందే. దేశాన్ని ఈ స్తితికి తెచ్చిన ప్రపంచీకరణ సరళీకరణ విధానాలను మరింత గట్టిగా అమలు చేయాలన్నదే రేటింగ్ సంస్థ సందేశం తప్ప ప్రజానుకూల మార్పులు ఎంత మాత్రం కాదు. ప్రధాని సలహాదారు కౌశిక్‌బాసు కూడా ఇటీవలనే విదేశాలలో ఈ విధమైన వ్యాఖ్యానాలు చేయడం తెలిసిన విషయమే. ఆర్టిక సంక్షోభానికి కారణమైన విధానాలను మరింత ఉధృతంగా అమలు చేస్తే ఏమవుతుందో వేరే చెప్పాలా? అదొకటైతే దేశ ఆంతరంగిక పాలనా వ్యవస్థను కూడా అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు ప్రభావితం చేయడం మరింత తీవ్రమైన విషయం.
Sunday, June 10, 2012
ఉపయోగం లేని ఉప ఎన్నికలు: ఉత్తుత్తి ఉద్రేకాలు
ఉపయోగం లేని ఉప ఎన్నికల ప్రహసనంలో మూడు ప్రధాన పార్టీల నేతల సరళి విసుగుపుట్టించేంత మూస ధోరణిలో సాగుతున్నది. తమ తమ కోణాల్లో రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్న కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ తెలుగు దేశం పార్టీలు అరిగిపోయిన రికార్డుల్లా అవే వ్యక్తిగత అంశాల చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. కీలకమైన ప్రజా సమస్యలు విధాన పరమైన విషయాలు తెర మరుగై పోయి ఒకరిని మించి ఒకరు దూషణల్లో నేతలు మునిగి తేలుతున్నారు. ప్రతివారికి అవతలి వారి లోపాలు తప్ప తమ తప్పిదాలు పొరబాట్లు అసలు కనిపించని పరిస్థితి. వివాదాలు తప్ప విధానాల లోతుల్లోకి పోవడం ఎవరికీ ఇష్టం లేదు. ఎందుకంటే విధానాల పరంగా చూస్తే వీరంతా ఏదో ఒక బిందువు దగ్గర ఆరోపణలన్ని సంగమిస్తాయని తెలుసు. జగన్ మోహన రెడ్డిపై విమర్శలు చేసి తాము బయిటపడాలని కాంగ్రెస్, ఆ ఇద్దరిని విమర్శించి తాను మెరుగని చూపించుకోవాలని తెలుగు దేశం ఈ ఇద్దరిపై ధ్వజమెత్తి తాము కక్ష సాధింపుకు బలవుతున్నామని ఒప్పించాలని వైఎస్‌ఆర్ పార్టీ. ఇది మౌలికంగా 17 స్థానాల్లో ప్రచార పోకడ.
ఈ క్రమంలో వైఎస్‌ఆర్ పార్టీపై కేంద్రీకరణ అధికంగా వుండటం సహజం. ఎందుకంటే ఈ ఎన్నికలు రావడానికి ఆ జగన్ అనుయాయుల రాజీనామాలే ఏకైక కారణం.తద్వారా తన సత్తా చాటుకోవడం, కాంగ్రెస్ తెలుగు దేశంల నుంచి వలసలు ఆకర్షించడం పైకి కనిపించే లక్ష్యాలైతే అంతకన్నా కీలకమైన భాగం మరొకటి వుంది.ఇప్పటికే జైలులో వుండి దర్యాప్తు విచారణ ఎదుర్కొంటున్న తనను ఏ పరిస్థితుల్లోనైనా సమర్థించే సైన్యాన్ని తయారు చేసుకోవడం జగన్ వ్యూహం. రేపు ప్రజా జీవితంలో తన స్థానాన్ని కాపాడుకోవాలంటే సిబిఐ ద్వారా కోర్టులలో బయిటకు వచ్చే ప్రతి విషయం కక్ష సాధింపులో భాగమని ప్రజలముందు చెబుతుండాలి. కేవలం తన కుటుంబ సభ్యులే చెబితే నమ్మించడం కష్టం గనక వారే చాలరు గనక ఒక యంత్రాంగం
Thursday, June 7, 2012
పెరిగిన గందరగోళం
ఈ వారం రోజులలోనూ రాష్ట్ర దేశ రాజకీయాలలో అనేక విషయాలు స్పష్టంగా రుజువయ్యాయి.
1.జగన్ ను బెయిల్‌పై విడుదల చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సిబిఐ వాదిస్తే హైకోర్టు ఆమోదించింది. అయితే బెయిలుపై రానవసరం లేకుండా జైలులోనుంచే నేరుగా జడ్జిలనే తారుమారు చేసిన గాలి జనార్థనరెడ్డి కొత్త సంచలనం సృష్టించారు. తెలుగు దేశం న్యాయ స్థానాలను మేనేజ్ చేస్తుందని ఇంతకాలం ఆరోపిస్తూ వచ్చిన వైఎస్‌ఆర్ పార్టీ ఈ విషయమై పెద్దగా స్పందించక పోవడం విశేషం.
2.జగన్ మా పార్టీలో వుంటే కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి అయ్యేవాడని నోరు జారిన కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ తర్వాత వివరణ పేరుతో సవరణ జారీ చేశారు.అయితే ఇదంతా కాంగ్రెస్‌లో నెలకొన్న అయోమయానికి అద్దం పట్టింది. చాలా వరకూ విజయమ్మ షర్మిల ప్రచారంలో కూడా సోనియా మాట విననందుకే కక్ష సాధిస్తున్నారన్న మాట వినిపిస్తోంది.అయితే 2 జి స్పెక్ట్రంలో రాజా కనిమొళి గాని, ఇతరులు గాని సోనియా గాంధీ కాపాడాలని చూసినా జైలుకు వెళ్లాల్సి వచ్చిందని ఉభయులూ మర్చిపోతున్నారు. ఆఖరకు ప్రధాని మన్మోహన్ సింగ్‌పైనే అన్నా బృందం ఆరోపణలు సంధిస్తే సోనియా రంగంలోకి దిగి సమర్థించాల్సి వచ్చింది. కాకుంటే అన్నా బృందాన్ని మరుసటి రోజునే బిజెపి అద్యక్షుడు నితిన్ గడ్కరీ పరామర్శించడం వల్ల వారికి కాస్త రాజకీయ నేపథ్యం కాస్త బయిటపడినట్టయింది.ఇదే సమయంలో కేజ్రీవాల్ రామ్‌దేవ్ రణాలు రాజీలు కూడా. అన్నా బృందం బిజెపి వారి పేర్లు చెప్పడం లేదన్న విమర్శలు ఒక పక్క వస్తుంటే మరో పక్క సాక్షాత్తూ అద్వానీనే తమ వ్యవహారాలు బాగా లేవని ఒప్పుకోవలసిన స్థితి. యుపిఎ ఎన్‌డిఎ పోటీ పడుతున్నట్టు అనిపిస్తుంది. కనక అవినీతిని ఎవరూ కప్పిపుచ్చలేరు, కాపాడలేరు
3.మోపిదేవి వెంకట రమణ తర్వాత ఇప్పుడు పొన్నాల లక్ష్మయ్యను సిబిఐ విచారించడం మంత్రులకు ఆందోళన పెంచడంలో అశ్చర్యం లేదు.ప్రస్తుతం పొన్నాలను ఇండియా సిమెంట్స్‌కు అదనంగా నీటి సరఫరా విషయంలోనే ప్రశ్నించినా రేపు జలయజ్ఞం అడ్వాన్సుల సంగతి వస్తే మరింత ఇరకాటం కావచ్చు.
4.జగన్ అరెస్టు తర్వాత కొన్ని చోట్ల ఆయన పార్టీ ప్రభావంలో తగ్గుదల వుందని వివిధ ఛానళ్ల వర్గాల సర్వేలలో తెలుస్తున్నది.తెలుగు దేశంలో కాస్త ఆశలు చిగురిస్తున్నా చంద్రబాబు నాయుడు తప్ప మరెవరూ ప్రచారం చేయలేకపోతున్నారన్న విమర్శ వుంది. విశ్వసనీయత కావలసినంత పెరగడం లేదన్న దిగులూ వుంది.
5.వరంగల్ జిల్లా పరకాలలో బిజెపి టిఆర్‌ఎస్‌లు పరస్పరం వాగ్యుద్ధాలు సాగిస్తున్న తీరు చూస్తే మొన్నటి వరకూ చెట్టపట్టాలు వేసుకున్న పార్టీలు ఇవేనా అని సందేహం కలుగుతుంది. మహబూబ్‌నగర్ విజయంతోనే బిజెపి అతిగా అంచనా వేసుకుంటుందని మాత్రం అనిపిస్తుంది. కారణం ఏదైనా టిఆర్‌ఎస్ బిజెపి మత రాజకీయాలను నేరుగా విమర్శించడం మరో విశేషం. రాజకీయ ప్రయోజనాల ఘర్షణ వచ్చాక రాష్ట్ర విభజన అజెండా వెనక్కు పోయి పరస్పర విభేదాలే ప్రధానం కావడం స్పష్టం. సర్వేలు మాత్రం టిఆర్‌ఎస్‌కే మొగ్గు చూపిస్తున్నాయి.
6.పశ్చిమ బెంగాల్‌లో అరు మునిసిపాలిటీలకు జరిగిన ఎన్నికలలో నాలుగు పాలక తృణమూల్ గెల్చుకున్నా హాల్దియా సిపిఎం నిలబెట్టుకోవడంలో ఒక విశేషం వుంది. వామపక్ష ప్రభుత్వంపై దుమారం మొదలైన నందిగ్రామ్ ప్రాంతంలో సిపిఎం ఈ విజయం సాధించడమే ఆ ప్రత్యేకత. ఇప్పటికీ టిఎం సి ఆధిక్యత వున్నా కాంగ్రెస్‌ను కూడా త్వరితంగా దూరం చేసుకుంటున్న తీరు దానికి నష్టం చేస్తుందని విమర్శకులు అంటున్నారు.
అపసవ్య వ్యాఖ్యాతలు
ఇది సుందరయ్య శత జయంతి సంవత్సరం. ఆంధ్ర ప్రదేశ్‌లోనే గాక దక్షిణ భారతమంతటా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి పునాదులు వేసిన ఆ మహానాయకుడి జీవితాదర్శాన్ని, ఆశయ బలాన్ని, మననం చేసుకుంటున్న సందర్భం. ఆంధ్రజ్యోతిలో ఆయన పుట్టిన రోజైన మే మొదటి తేదీన 'మార్క్సిస్టు గాంధీ' పేరిట ఒక నివాళి ప్రచురిస్తూ ఆయన ఔన్నత్యాన్ని అనేక విశిష్ట లక్షణాలను ప్రస్తావించారు. స్థూలంగా ఆ వ్యాసంలో ఆక్షేపించాల్సిన అంశాలేమీ లేవు. సుందరయ్యను కమ్యూనిస్టు గాంధీ అనడం అనేక దశాబ్దాలుగా ఇతరులు చేస్తున్నదే గనక అందులోనూ తప్పు పట్టాల్సింది లేదు. కాకపోతే రచయిత్రి రంగనాయకమ్మ మాత్రం అటు గాంధీని, ఇటు సుందరయ్య బాటలో కృషి చేస్తున్న కమ్యూనిస్టులను కూడా అపహాస్యం చేస్తూ తనదైన శైలిలో 'అస్తవ్యస్త సంస్కర్తలు' అంటూ వ్యాసం రాశారు. ఈ వ్యాసం ప్రధానంగా కొంత కాలం కిందట మరణించిన కె.జి.సత్యమూర్తి/ శివసాగర్‌కు సంబంధించింది అయినా సుందరయ్య ప్రస్తావనతో ముగించడం బట్టి చూస్తే కావాలనే ి ఈ సందర్బాన్ని ఉపయోగించుకున్నారని తెలుస్తుంది. ఇంకా ఇదే ఎడిట్ పేజీలో దళిత బహుజనులు మార్క్సిస్టులు, మార్క్కిస్టు సిద్దాంత అన్వయం, సత్యమూర్తి పాత్ర, కమ్యూనిస్టుల నిబద్దత తదితర అంశాలపై అనేక వ్యాఖ్యానాలు వచ్చాయి..
శివసాగర్ నగ్జలైట్ ఉద్యమంలోనూ అంతకు ముందూ నిర్వహించిన పాత్ర, చేసిన రచనలు, సుప్రసిద్ధాలే. అట్టడుగున పుట్టి ఆశయాల బాటలో పయనించిన ఆయన చైతన్యాన్ని, అక్షరాన్ని శక్తివంతంగా ఉపయోగించిన ఆయన సామర్థ్యాన్ని అందరూ గౌరవిస్తారు.. శివసాగర్ రచనల సంకలనం వెలువడినప్పుడే ఒక విమర్శనాత్మక సమీక్ష రాశాను. అది ప్రజాశక్తిలో పునర్ముద్రితమైంది.(దీనిపైనా విమర్శలు రాకపోలేదు) విప్లవ కవిత్వమంటే కొట్టు నరుకు అనడమేనన్న భావాలు బలంగా వ్యాపించి వున్న కాలంలో ఆయన వర్ణనాత్మకంగా శిల్పసమన్వితంగా కవిత్వం రాశాడు.అయితే అందులోనూ యాంత్రిక ధోరణులు నిర్జీవ పదాలు లేక పోలేదు. వాటిని ఎలాగో అర్థం చేసుకోవచ్చు గాని ఆయనను వియత్నాం విప్లవ నేత హౌచిమన్‌తో పోలిస్తే తనూ ఆమోదపూర్వకంగా మాట్టాడ్డం అతిశయోక్తి అని ఎత్తి చూపించాను. విప్లవ రాజకీయాల్లో కుల సమస్యను దళిత సమస్యను కూడా చేర్చాలనే పేరుతో
Subscribe to:
Posts (Atom)