Pages

Friday, June 15, 2012

రాష్ట్రపతి ప్రణబ్‌



ఎట్టకేలకు సోనియా గాంధీ ప్రణబ్‌ ముఖర్జీని రాష్ట్రపతి అభ్యర్తిగా ప్రకటించారు. అత్యున్నత పీఠంపై అయోమయం తొలగింది. ఈ క్రమంలో మన్మోహన్‌ సింగ్‌ కొనసాగింపుపైనా సందేహాలు తీరినట్టయింది. మొత్తం వ్యవహారంలో అందరికంటే అభాసుపాలైంది మమతా బెనర్జీ.నిజానికి ఆమె ములాయంను కలుసుకుని మూడు పేర్లపై ప్రకటన చేసిన కొద్ది సేపటికే ఆ పార్టీ ఇచ్చిన వివరణ మరో విధంగా వుంది. ప్రణబ్‌ ముఖర్జీ కేవలం కాంగ్రెస్‌ అభ్యర్తిగా గాక ఉమ్మడి ప్రతిపాదనగా వచ్చేట్టయితే పరిశీలించడానికి వామపక్షాలు ముందే సంసిద్దత వ్యక్తం చేశాయి. ప్రస్తుతానికి కలాం పేరు ఇంకా వినిపిస్తున్నా ఆయన విముఖత చూపించవచ్చు. సంగ్మాను నిలబెట్టాలా లేదా అన్నది ఎన్‌డిఎ తేల్చుకోవల్సి వుంటుంది. ఈ విషయంలో మరింత చర్చ జరగవచ్చు గాని ప్రణబ్‌ రాష్ట్రపతి కావడంలో సందేహాలు వుండవు.

2 comments:

  1. 8సంవత్సరాల రబ్బర్‌స్టాంప్ అనుభవం దృష్ట్యా మన్‌మోహన్ సింగ్ గారే ఆ పదవికి అర్హులు అనిపించినా... సరే ప్రణబ్ చాలా కాలం నుంచి రిటైర్మెంట్ కోరుకుంటున్నారు కాబట్టి ఆయనకే దక్కాలి.
    పైగా, సింగు గారిని రాష్ట్రపతిగా చేస్తే, ప్రణబ్‌ను ప్రధాని చేయాల్సివస్తుంది. అది బంగారమ్మకు నచ్చని అంశం, ఎందుకంటే ఈయన సింగు లా అణిగిమణిగి పడివుండేరకం కాదు. పైగా ప్రణబ్ ప్రధాని అయితే రాకుమారుడికి పట్టాభిషేకం మరింత వాయిదా పడుతుంది. కాబట్టి ప్రణబే ఎక్కిస్తే అన్నింటికి మంచిది అన్నది బంగారమ్మ అనుయాయుల ఎత్తుగడ.

    ReplyDelete
  2. అసలే మన మన్మోహన్ సింగ్ గారు చాలా బద్నామ్ అయ్యి ఉన్నారు. మంత్రుల అవినీతిని వినోదం చూస్తున్నాడన్న ఆరోపణలు వొస్తున్నాయి. 2014 ఎన్నికల కల్లా ఇంకో మూణ్ణాలుగు భారీ అవినీతి ఆరోపణలు రావొచ్చు!!

    అన్నిటికీ మన్మోహన్ సింగ్ అలసత్వమే కారణమని చెప్పేసి, రాహులు గాంధీ గారు నీతివంతమైన, స్వచ్చమైన పాలన అందిస్తాడని కథలు చెప్పి 2014 ఎన్నికలకు వెళ్లొచ్చు!! మన్మోహన్ తరవాత నేనే ప్రధానమంత్రి అవుతానని ప్రణబ్ ముఖర్జీ అద్దం తిరగొచ్చు!! యువరాజు పట్టాబిషేకానికి అడ్డుగా ఉన్న వృద్ధనేత ప్రణబ్ ముఖర్జీని రబ్బర్ స్టాంపు గా మార్చేస్తే అలా పడి ఉంటాడు!! ఐడియా సోనియాదో ఇంకెవరిదో గానీ, అద్భుతం!!

    ReplyDelete