మూడు రోజుల పాటు టిఆర్‌ఎస్ అద్యక్షుడు కె.చంద్ర శేఖర రావు నిర్వహించిన చండీ యాగంపై అనేక మంది నేతలు వ్యంగ్య బాణాలు సంధించారు. ఈ యాగం వల్ల తెలంగాణా రాష్ట్రం ఏర్పడినట్టేనని చెప్పడాన్ని అపహాస్యం చేశారు. యాగాలతోనే రాజకీయ నిర్ణయాలు జరిగేట్టయితే ఉద్యమాలు ఎందుకని వారు ప్రశ్నించారు. కెసిఆర్‌కు సంబంధించినంతవరకూ ఆయన మాటలూ చేతలు ప్రతిదీ ప్రచార వ్యూహానికి బాగా ఉపయోగపడే రీతిలో వుంటాయి.ఈ యాగం కూడా అందుకు మినహాయింపు కాదు. వ్యక్తిగత విశా ్వసాలతో పాటు దీని వల్ల కొన్ని వర్గాలను సంతృప్తిపర్చాలనే ఆలోచన కూడా వుండొచ్చు.ఏమైనా దీనిపై విస్త్రత స్తాయిలోనే విమర్శలు రావడం ఆహ్వానించదగిన విషయం. రాజకీయాలను మత విశ్వాసాలను కలగాపులగం చేయడం ఎప్పడూ లౌకిక సూత్రాలకు
భిన్నమైన పని. ఎవరి ఇష్టం వారిదని అనుకున్నా దాన్ని నేరుగా రాజకీయాలతో ముడిపెట్టి మాట్లాడ్డం మత విశ్వాసాలకు కూడా భిన్నమైన విషయం. తీరా యాగ సమాప్తి సమయంలో కెసిఆర్ ఆయన పూజించే రుత్విజులనూ ప్రాంతీయ రేఖల ప్రకారం విభజించే వ్యాఖ్యలు చేయడం మరింత స్పష్టమైన వ్యూహాత్మక ముగింపు. దీనిపై ఛానల్‌లో వ్యాఖ్యానం అడిగినప్పుడు ప్రతిదీ ప్రాంతాల వారి కులాల వారి మనుషుల ప్రతిభను మంచితనాన్ని అంచనా వేసే పద్ధతి అర్థరహితం,అవాంఛనీయమని చెప్పాను. పుత్ర కామేష్టి యాగం, అశ్వమేధయాగం లాగా ప్రత్యేక రాష్ట్ర యాగం ఏదీ లేదు కూడా అన్నాను. వ్యక్తిగత భక్తి విశ్వాసాలను రాజకీయాలనూ కలగాపులగం చేయనంత వరకూ ఎవరైనా ఏ యాగం చేసుకున్నా అభ్యంతరం వుండదు.కాని దాన్ని కూడా పాక్షిక కోణంలో చూస్తేనే సమస్యలు వస్తాయి. పాలక పక్షాల రాజకీయాలకు గాని, బ్రాహ్మణీయ లక్షణాలకు గాని,శ్రమ జీవుల పోరాటాలకు గాని ప్రాంతాల దేశాల సరిహద్దులేమీ వుండవన్నది అసలు విషయం.
ఇంతకూ తెలుగు దేశం, కాంగ్రెస్ నేతలు అంతకు మించి బిజెపి ఈ కాలంలో టిఆర్‌ఎస్‌పై విమర్శల జోరు పెంచడం గమనించదగింది. పార్లమెంటు ప్రతిస్టంభనలో సహకరించిన బిజెపి నేతలు తర్వాత అదే పనిగా అవాంతరాలు సృష్టించడం మంచిది కాదని విమర్శించారు.వింతగా విగ్రహాల విధ్వంసాన్ని కూడా ఖండించారు. ఇప్పుడు టిఆర్‌ఎస్ నేతలు వారికి సన్నిహితులైన ఆందోళన కారులు ఐక్య వేదికల గురించి మాట్లాడుతుంటే బిజెపి నేతలు తమ స్వంత సభ తాము ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారు. కెటిఆర్, దయాకర రావు తదితరుల వాగ్యుద్ధం కూడా పార్టీల మధ్య ప్రయోజనాల ఘర్షణ తీవ్రమవుతున్నదని కూడా వెల్లడవుతుంది.
తెలుగుదేశంలో మరోసారి నాగం జనార్ధనరెడ్డి విమర్శల వివాదాం పునరావృతమవుతున్నది. ఇలాటి ఉదంతాలు గతంలో అనేక సార్లు టీడీపీ కప్పులో తుపానులా సర్దుబాటు అయినా ఈ సారి అంత తేలిగ్గా పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఇంత తీవ్రంగా మాట్టాడి ఉభయులు ఎ ప్పటికప్పుడు సర్దుబాటు చేసుకునేట్టయితే ఈ సారి వివాదాన్నే విశ్వసించలేని స్థితి రావచ్చు.దీనంతటికీ ముఖ్య కారణం తెలుగు దేశం అస్పష్ట విధానమేనన్నది మాత్రం స్పష్టం.అలాగే నాగం కు కూడా తన వ్యక్తిగత ఆకర్షణ శక్తిపై అపారమైన నమ్మకం వున్నట్టు కనిపిస్తుంది. నాగం వొంటెత్తు వైఖరి అనుసరిస్తుడనేది తెలంగాణాకు చెందిన ఇతర తెలుగు దేశం నాయకుల విమర్శ. ఒకే పార్టీలో ఒకే ప్రాంతంలో ఒకే జిల్లాకు చెందిన ముగ్గురు నాయకుల మధ్యన ఇంత తీవ్ర స్థాయిలో అభిప్రాయ భేదాలు రావడం రాజకీయాలను కేవలం ప్రాంతీయ రేఖలను బట్టి చేసే విశ్లేషణలకు అందని చిక్కుముడి.
నేను తెలంగాణాకి అనుకూలమే కానీ చండీ యాగాలకి తెలంగాణా రాదనే నమ్ముతాను. ఇంతకు ముందు వరుణ యాగాలకి వర్షాలు పడలేదు. వాతావరణ మార్పులకి వర్షాలు పడితే వరుణ యాగాలకే వర్షాలు పడ్డాయని చెప్పుకున్నారు. తెలంగాణా రాష్ట్రమనేది లాటరీ టికెట్ కాదు, అదృష్టాన్ని నమ్ముకోవడానికి. ఈ విషయం కెసిఆర్ తెలుసుకోకపోతే గతంలోని చెన్నారెడ్డి పార్టీలాగే తెరాస మూతపడిపోతుంది.
ReplyDeleteమన తెలుగు దేశం లో ఉన్న అతి కొద్ది మంది మేధావులలో మీరు ఒకరు .మన సమైఖ్య వాదాన్ని మీరు సమర్థవంతంగా వినిపియ్యాలి .ఇటువంటి పేలవమైన వాదనల తో మన సమైఖ్య వాదానికి హాని జరుగవచ్చు .చండి యాగం ప్రపంచ శాంతి కొరకని కెసిఆర్ స్పష్టంగా చెప్పారు .ఆయన వ్యాక్యల్లో అసమంజసమైన విషయాలు లేనప్పుడు కూడా మనం ఆయన వెంట బడటం మన బలహీనతని సూచిస్తుంది ."ప్రత్యేక రాష్ట్ర యాగాలు "మరీ చిలిపిగా ఉంది .మన సమైఖ్య రాష్ట్రం లో దాదాపు అందరు నాయకులూ ఎన్నికల ప్రచారాలు ఏదో ఒక దేవుడిని పూజించి ప్రారంబిస్తున్నారు .పేరు గాంచిన దేవాలయాల్లో చాల సార్లు ప్రభుత్వం తరుపున మంత్రులు ,ముఖ్య మంత్రులు కొన్ని కొన్ని ప్రత్యేక సందర్బాలలో హాజరవుతున్నారు ,అప్పుడు లౌకిక సూత్రాలకు బిన్నమైన పని కానప్పుడు .ఇప్పుడు మాత్రం ఎలా అని ప్రజలు అనుకోవచ్చు .శ్రమ జీవుల పోరాటాలకు ప్రాంతీయ సరిహద్దులు ఉండవని నర్మగర్బంగా మన విశాలాంద్ర (సమైఖ్యాంధ్ర )గౌరవాన్ని ఎలాగోలాగు నిలబెట్టేసారు .
ReplyDeletemee complimentsku dhanyavadalu. kani nenu medhavini kanu. mee vyakhyalu aspastanga dwimukhanga unnayi.samaikyata korevarilo rakarakala vyuhalundochhu. varandarito ekibhavinchalani ledu.yaagam vanti amsampai adiginappudu teevra vyakhyalu cheyadalachaedu kanake hasyanga annanu. adi chiplipi ani meerantunnaru. paiga ventapadatam balahinata ani jodinchandam vintaga undi. ikapote ilati yagalu vagaira ewaru chesinappudaina loukika sutrala mata wastoone untundi.rasaiah cm ga unnappudu kooda ilage annanu. ante tappa kcr gari kosame kadu. ayite ayana chivaralo matalato kotta vivadaniki karakulayinattu kanipistundi.bye.
ReplyDelete