తెలుగు దేశంలో నాయకత్వ పోరు జరుగుతున్నదంటూ ఇటీవల మీడియాలో వరుసగా వచ్చిన కథనాలపై అనేక మంది ప్రశ్నలు లేవనెత్తారు. కుటుంబాలు వ్యక్తులు రాజకీయాలు పెనవేసుకుపోతున్న నేటి స్తితిలో ఇది వూహించదగిన విషయమే. హరికృష్ణ కృష్ణాజిల్లాపర్యటన సందర్భంగా రేగిన దుమారం ఇందుకు ఒక కారణమే. ఆయన ఆయా సందర్భాలలో కాస్త భిన్న స్వరాలు వినిపించి సర్దుకోవడం తరచూ జరుగుతున్నది. ఇవన్నీ పూర్తిగా అంతర్గత విషయాలైనా తెలుగు దేశం ఇప్పుడున్న స్తితిలో ఎవరూ నాయకత్వ సమస్య రగిలించుకుంటారని భావించలేము. హరికృష్ణ ప్రకటన బహుశా ఒత్తిడి తీసుకురావడానికి దారి తీయవచ్చునేమో కాని అన్న తెలుగు దేశం అనుభవం తర్వాత మళ్లీ ఎవరూ అంత తేలిగ్గా కొత్త ప్రయోగాలు చేయలేరు. బీరకాయ పీచులాటి బంధుత్వాల మధ్య కుటుంబాల మధ్య ఘర్సణ గురించిన వూహాగానాలతో ప్రజలకు ఒరిగేది లేదు. కేంద్రమంత్రి పురందేశ్వరిని ఈ వ్యవహారంతో ముడిపెట్టిన కథనాలను ఆమె కొట్టి వేస్తూనే బాలకృష్ణ కాంగ్రెస్‌లోకి వస్తానంటే ఆహ్వానిస్తానని వ్యాఖ్యానించడం గమనించదగ్గ అంశం. ఆయన మాత్రం తను తెలుగు దేశం కోసమే పనిచేస్తానని ప్రత్యేకంగా ప్రకటించారు. ఈ రోజులలో ఒడుదుడుకులు తెలుగు దేశం నేతలు లేదా నందమూరీయుల ముందున్న అవకాశాలు కూడా పరిమితమే. బాలకృష్ణ ప్రకటన ఈ దిశలో తొలి సంకేతం కావచ్చు.జగన్ వివేకా, నందమూరి నారా వంటి అంశాలలోనే జనాన్ని ముంచి తేల్చడం వల్ల సమస్యలు మరుగుపడి పోవడం తప్ప ఫలితం నాస్తి. చెప్పుకోదగిన రాజకీయ వ్యక్తులెవరూ ఈ దశలో పెద్దగా దుస్సాహసాలకు గాని ప్రయోగాలకు గాని పాల్పడగల దృశ్యం లేదు. కొంత కాలం తర్వాత గాని రాజకీయ వేదికపై కొత్త కదలికలు రాకపోవచ్చు.
Sunday, April 10, 2011
తెలుగు దేశం కథనాలు..

Subscribe to:
Post Comments (Atom)
రవి గారు,
ReplyDeleteచాలారోజుల క్రితం ప్రజాశక్తిలో దేవుడనేవాడు నాకెదురుపడితే!!(click) ఈ వ్యాసం వచ్చింది. నా బ్లాగ్‌లోకి కాపీ చేశాను (click) నేను ఆర్టికల్ క్రిందబాగాన "ఎం.వి.ఎస్. శర్మ గారి సౌజన్యంతో" అనిరాశాను. కామెంటర్లు ఎం.వి.ఎస్.శర్మ అంటే ఎవరని అడుగుతున్నారు. వీలయితే చెప్పగలరు.
vasaya garoo,
ReplyDeleteSarma garu uttarandhra MLC.Marxist lo ayana dharavahikanga ee vyasalu rastunnaru.
Meeru menu prachurinchina yodhudu saradhi(Bhagavadgitapai bhoutikavada vyakhyanam), Bharateeya tatwasastramlo bhoutikavadam, bhava vadam choosara? ok