మావోయిస్టు సానుభూతిపరుడనే ఒకే కారణంతో మానవ హక్కుల ఉద్యమ నాయకుడు వినాయక్ సేన్‌కు రోయచూర్ కోర్టు యావజ్జీవ శిక్ష విధించడం దేశ వ్యాపితంగా ప్రజాస్వామిక వాదులందరి విమర్శకు గురైంది. ఈ విషయంలో కోర్టుకు సమర్పించిన సాక్ష్యాధారాలు కూడా తాడూ బొంగరం లేకుండా వున్నాయి. ఎట్టకేలకు సుప్రీం కోర్టు ఆయనను బెయిలుపై విడుదల చేయడం ఆహ్వానించదగిన పరిణామం. ఇదే సమయంలో మావోయిస్టు నాయకుడు ఆజాద్ ఎన్‌కౌంటర్‌పైన దర్యాప్తు జరపాలన్న ఆదేశం వెలువడింది. మావోయిస్టులను రాజకీయంగా ఎదుర్కోవడం, శాంతి భద్రతల కోణాన్ని కూడా కాపాడ్డం ప్రభుత్వాల బాధ్యత. అంతేగాని బూటకపు ఎన్‌కౌంటర్లు,వినాయక్ సేన్ వంటివారిపై కక్ష సాధింపులు ఇందుకు మార్గం కాదు. చత్తీస్‌ఘర్‌లో సాల్వాజుడం ప్రయోగం ఇలాటి పోకడలకు పరాకాష్ట. ఈ ఘటనల్లో సుప్రీం ఆదేశాలను ఆహ్వానించినంత మాత్రాన మావోయిస్టుల అర్థ రహిత హత్యా రాజకీయాలను బలపర్చినట్టు కాదు ,వాటిని ఖండించినంత మాత్రాన బూటకపు ఎన్‌కౌంటర్లను బలపర్చాలని కాదు. ప్రజాస్వామిక హక్కులను పద్ధతులను గౌరవించాల్సిన బాధ్యత ఉభయ పక్షాలపై వుంటుంది. ఈ సమయంలోనే బెంగాల్‌లో మమతా మావోయిస్టులకు సంబంధించి వస్తున్న వార్తలను గమనిస్తే కేంద్రం వైఖరిలోనూ ఇటు వీరి పోకడలోనూ కూడా పరస్పర విరుద్ధత స్పష్టంగా కనిపిస్తుంది. ఇవన్నీ ఎలా వున్నా వినాయక్ సేన్ వంటి గౌరవనీయ ప్రజాస్వామిక వాదిని నిష్కారణంగా నిరవధిక జైలు శిక్షకు గురి చేయడం సరైంది కాదు. అత్యున్నత న్యాయస్థానం దాన్ని సరిచేయడం సముచితంగా వుంది.
Tuesday, April 19, 2011
వినాయక్ సేన్ విడుదల హర్షనీయం

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment