Pages

Sunday, April 24, 2011

బాబా కన్నుమూత- భవిష్యత్తు??


దాదాపు నెల రోజుల పాటు అత్యంత నిగూఢంగా నడిచిన సత్యసాయిబాబా ఆఖరి ఘట్టాన్ని అధికారికంగా ముగిస్తూ ఆయన ఆదివారం ఉదయం అస్తమించినట్టు ట్రస్టు ప్రకటించింది. ఇది వూహించిన విషయమే గాక సహజ సిద్దం కూడా. బాబా మహిమాన్వితుడు గనక మరణం లేదని భావించే వారైనా సరే ఆయన దేహానికి చికిత్స చేయించకుండా వదలిపెట్టలేదు. అయితే ఆ చికిత్స మాత్రం అనేక అనుమానాలకు తావు నిచ్చింది. ఆయన తమ దగ్గరకు వచ్చే వరకు ఏ స్థితిలో వున్నారో ఏ మందులు వాడారో తెలియదని చికిత్సకు ఆధ్వర్యం వహించిన డా.సపాయి స్ఫష్టంగా చెప్పారు. ఐసియులోకి ఎవరినీ అనుమతించలేదు గనక అక్కడ ఏం జరిగిందో కూడా తెలియదు. తమది సహాయక పాత్ర తప్ప ప్రత్యక్ష నిర్ణాయక స్థానం కాదని ప్రభుత్వ ప్రతినిధులు చెప్పారు. బాబా మహిమలపై, ఆయన ప్రశాంతి నిలయం మర్మాలపై చాలా వివాదాలే నడిచాయి. కాకపోతే ఆయన ఆకరి ఘట్లం కూడా అత్యంత అనుమానాస్పదంగా జవాబుదారి లేకుండా సాగడమే ఆందోళన కలిగిస్తుంది. ఇవన్నీఎవరు నడిపిస్తున్నారు? అక్కడున్న ప్రముఖులు ప్రభుత్వ నేతలు ఎందుకు సహిస్తున్నారు? భక్తులపై ఆదికేశవులు నాయుడు, శ్యాం సుందర్‌ వంటివారు లేవనెత్తిన సందేహాల వెనక సత్యాలేమిటి?బాబా వున్నప్పుడే అంతు చిక్కని ఈ సమాంతర సామ్రాజ్యం ఆయన అనంతరం ఏమి కానున్నది? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు. కేవలం సంపదకు సంబంధించినవి కాదు, సమాజంపై ప్రభావానికి సంబంధించిన ప్రశ్నలు. అంత్యక్రియల తర్వాతనైనా వీటికి సమాధానాలు రావలసిందే.

1 comment: