విజయనగరంలో ఆశా వర్కర్లపై సర్కిల్ ఇన్‌స్పెక్టర్ త్రినాథ్ అమానుషంగానే గాక అసభ్యంగా కూడా లాఠీ ప్రయోగించిన తీరు దారుణమైంది. బడిపిల్లల మధ్యాహ్న భోజనం వండిపెట్టడంతో సహా అనేక విధులు నిర్వహించే వారికి నెలకు రు.1500 జీతం ఇస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం అమలు చేయకపోగా అడగడమే నేరమైనట్టు విరుచుకుపడటం ఘోరం. మీడియాలో వచ్చిన కారణంగా ఆయనపై తాత్కాలికంగా చర్య తీసుకున్నప్పటికీ ఉద్యమాలు పోరాటాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లనే ఇలాటి పరిణామాలు కలుగుతున్నాయి. పోలీసులు విధి నిర్వహణలో అనివార్యంగా కనీసం తీసుకోవలసిన చర్యలు వేరు, కక్ష కట్టి కొట్టడం దౌర్జన్య పూరితంగా వ్యవహరించడం వేరు.ప్రజలపై అందులోనూ మహిళలపై లాఠీలు ఝళిపించడం, చున్నీలు చెరుగులు లాగడం వంటి పనులు సహించరానివి.
Friday, April 8, 2011
ఆశాలపై అమానుషం

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment