2 జి స్ప్రెక్ట్రం కుంభకోణం యుపిఎ 2 ప్రభుత్వాన్ని పట్టి కుదిపేయడం ఖాయంగా కనిపిస్తుంది. రాజాను కాపాడటానికి మొదట్లో గట్టిగా ప్రయత్నించిన ప్రధాని మన్మోహన్ సింగ్ తర్వాత న్యాయస్థానాల ముందు తల వంచక తప్పలేదు. ఆ తర్వాత కూడా సంకీర్ణ (అ)ధర్మం పేరిట తనను తాను సమర్థించుకోవడానికి విఫలయత్నం చేశారు. ఆ సెగ కనిమొళి, మారన్ తదితరులందరికీ తాకింది.అయితే ఈ వ్యవహారంలో ప్రధాని కార్యాలయం, నాటి ఆర్థిక మంత్రి చిదంబరం పాత్రను కూడా విచారించాలన్న డిమాండు వస్తూనే వుంది. దాన్ని ఎంతగా పెడచెవిని పెట్టినా ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ లేఖ బయిటకు వచ్చాకనైనా స్పందించక తప్పడం లేదు. చిదంబరంపై కూలంకషమైనదర్యాప్తు జరగాలంటే ఆయన నేతృత్వంలోని సిబిఐకి స్వేచ్చ వుంటుందా? ఆ కోణం నుంచి చూస్తే ఆయన తప్పక ఇంటి దోవ పట్టాల్సి రావచ్చు. యుపిఎకు ఒక మూల స్తంభంగా వున్న చిదంబరం కూడా వేటుకు గురైతే ప్రభుత్వ పునాదులు కదలడం అనివార్యం. అసలు ప్రణబ్ ముఖర్జీ లేఖ బయిటకు రావ్టడం వెనక అత్యున్నత స్తాయి అంతర్గత కలహాల ప్రభావం వుందా అని కూడా ఆనుమానించక తప్పదు. మసకబారిన మన్మోహన్ ప్రభకు ఇదో తాజా దెబ్బ. అపర చాణక్యుడిగా వెలుగొందిన చిదంబరం ఇంతటి ఇరకాటంలో పడటం చూస్తే ఈ నాటి రాజకీయాల మేడిపండు స్వరూపం స్పష్టమవుతుంది.
Friday, September 23, 2011
చిదంబర రహస్యాలు తేల్చాల్సిందే!

Subscribe to:
Post Comments (Atom)
comparing a cunning fellow wth chaanakya is nt a justified one.chidambaram dnt have any least respect in his own town nd in his own state.such a mean minded fellow he is...
ReplyDeleteమీతో ఏకీభవిస్తున్నాను, తెర గారు. :)
ReplyDeleteచూడండి, మనకు భిన్నత్వంలో ఏకత్వం కొన్ని విషయాల్లో వుంది. ;)
చాణుక్యుడిని ఈ సాంబార్-ఇడ్లన్, వడై-సాంబారన్, థోసై లతో పోల్చడం తప్పేకాని, చాణుక్యుడు సీరియల్ చివరిభాగం ఓసారి చూడండి, ఆ మహోన్నత వ్యక్తిత్వం. ఆస్ట్రోజ్యోద్ సార్‌తో ఏకీభవిస్తున్నా.
@astrojoyod & snkr
ReplyDeleteAll comparisons are lame. so says Tolstoy. I can claim some knowledge of chanakya.. i never really likened both. Apara.. velugondina are in fact derogatory remarks.. remeber the wonderful alankara traditions sir.. tks..
చిదంబరాన్ని ఎట్టి పరిస్థితులలోనూ చెరసాలలో పెట్టరు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మావోయిస్ట్‌లని అణచివెయ్యడానికి చిదంబరం అవసరమనుకుంటోంది. ఒరిస్సాలోని మావోయిస్ట్‌లు వేదాంత రిసోర్సెస్ అనే బహుళజాతి కంపెనీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. చిదంబరం భార్య వేదాంత రిసోర్సెస్ కంపెనీ పార్ట్నర్. చిదంబరం తన భార్య ప్రయోజనాల కోసమైనా మావోయిస్ట్‌లని అణచివేస్తాడని అనుకునే కేంద్ర ప్రభుత్వం చిదంబరానికి హోమ్ మంత్రి పదవి ఇచ్చింది. గతంలో పశ్చిమ బెంగాల్‌లో మావోయిస్ట్‌లని తీవ్రంగా అణచివేసిన సిద్ధార్థ శంకర రేకి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర మంత్రి పదవి ఇచ్చి అతన్ని రాజకీయంగా పైకి తెచ్చింది. అలాంటి కాంగ్రెస్ పార్టీ చిదంబరాన్ని త్యజిస్తుందని అనుకోలేము.
ReplyDeleteసిద్ధార్థ శంకర రే ఎవరో మీకు బాగానే గుర్తు ఉండి ఉంటుంది అనుకుంటాను. అతను అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన తరువాతే పశ్చిమ బెంగాల్‌లో CPM అధికారంలోకి వచ్చింది.
ప్రవీణ్ శర్మ,
ReplyDeleteసిద్ధార్థ శంకర్‌రే మావోయిస్టులను ఏరివేయడం కాదు, వాళ్లతో కలసి సిపిఎంపై యుద్ధం చేశాడు. ఆ రోజుల పరిస్థితులను సత్యజిత్ రే, మృణాళ్ సేన్ వంటివారు గొప్పగా చిత్రించారు. చిదంబరం కూడా అంతే. మీరు గ్రీన్ హంట్ గురించే మాట్లాడి మమతా మావోయిస్టు కూటమిని మర్చిపోతే ఎలా? ఇంతకూ ఎవరిని వేటాడినా ఎవరికి సేవచేసినా చిదంబరం వంటి వారు పాలక వర్గాలకు ప్రతిభా వంతులైన సహాయకులు. సిద్ధార్థ శంకర్ రే కూడా ఇందిరా గాంధీకి చాలా నమ్మకస్తుడు కదా.. మమతా బెనర్జీతో మంత్రి వర్గంలో వున్న చిదంబరంకు ఆమె స్నేహితులెవరో తెలియదా? పాలకులు ఎప్పుడు ఎవరితోనైనా కలుస్తారు, కత్తి కడతారు. అంతే.
పదేళ్ళ క్రితం, రాష్ట్రంలో నక్సలైట్ ఉద్యమం బలంగా ఉన్న రోజుల్లో CPI(ML)జనశక్తి పార్టీ చంద్రబాబుని విమర్శించడానికి అతన్ని సిద్ధార్థ శంకర్ రేతో పోల్చినప్పుడు చరిత్ర వెతికాను. అప్పుడు తెలిసింది, సిద్ధార్థ శంకర్ రే ఎంత క్రూరుడో. సిద్ధార్థ శంకర్ రే నిజంగానే మావోయిస్టులని అణచివేశాడు. అందుకే అతనికి గవర్నర్ పదవి & రాయబారి పదవులు ప్రతిఫలంగా ఇచ్చారు. కాంగ్రెస్ తన దగ్గర విశ్వాసంగా పని చేసినవాళ్ళు ఎంత అవినీతిపరులైనా వాళ్ళకి పదవులు ఇచ్చి పెంచి పోషిస్తుంది. చిదంబరాన్నైనా అలాగే పోషిస్తుంది.
ReplyDelete/i never really likened both. Apara.. velugondina are in fact derogatory remarks.. /
ReplyDeleteఅంతేలేండి మార్కిస్టులు కాని వాళ్ళలో గొప్పదనాన్ని గుర్తిస్తే వాళ్ళు మార్కిస్టులెలా అవుతారు? :)
snkr
ReplyDeleteit is a pity your prejudice overtake the logic every other second. i mean to say i never compared. as i was rushing to ramachandrapuram i comosed hastily with my flawd english. what is the fun of liking or disliking chanakya.. quetion is only understanding him historically. bye.