Pages

Monday, August 1, 2011

ప్రాంతాల మధ్య చిచ్చు కోసమే 14(ఎఫ్‌)పై మడత పేచీ



రాష్ట్రంలో ప్రాంతాల మధ్య ప్రజ్వలన పెంచడమే కేంద్రం ఉద్ధేశమని 14(ఎప్‌)పై చిదంబరం ప్రకటన మరోసారి స్పష్టం చేస్తున్నది. ఏకాభిప్రాయం అవసరమని రోజూ పల్లవి ఆలపించే కేంద్రం అన్ని పార్టీలూ ఏకగ్రీవంగా శాసనసభలో ఆమోదించిన తీర్మానాన్ని ఎందుకు మన్నించడం లేదు? ఒకే సమస్యపై మళ్లీ తీర్మానం చేయాల్సిన అవసరమేమొచ్చింది? అసలు హైదరాబాదులో వివిధ ఉద్యోగాలకు సంబంధించి వున్న నిబంధనలలో పోలీసు శాఖకు మాత్రమే మినహాయింపు ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఆ పని చేసిన వారు ఆలస్యంగానైనా సరిదిద్దుకోకపోగా మరింత సాగదీయడం కేవలం అనిశ్చితి పెంచడానికి తప్ప మరెండుకు ఉపయోగపడదు. 14(ఎఫ్‌) రద్దు రాజ్యాగ రీత్యా కుదరదని లగడపాటి రాజగోపాల్‌ వంటి వారంటారు గాని తమ ప్రభుత్వమే శాసనసభలో ఎలా ఏకగ్రీంగా ఆమోదింపచేసి పంపిందో చెప్పరు. అలాగే గతంలో ఇవన్నీ సమస్యలే కాదన్న తెలంగాణా విభజన వాద నాయకులు ఒక్కసారిగా దానికి ఎందుకు ప్రాధాన్యత వచ్చిందో చెప్పరు. ఈ ఉభయుల విన్యాసాలకు కేంద్రం పాచికలు మరింత దోహదం చేయడమే దురదృష్టకరం.సమస్య రాష్ట్రంలో లేదని కేంద్రమే దోషి అని ఈ తాజా వైఖరి నిరూపిస్తున్నది. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి దీనిపై రాసిన లేఖను కేంద్రం మన్నిస్తుందని ఆశించడం కష్టం.ఇంత ఉద్రిక్తత పెరిగిన తర్వాత ప్రాంతీయ రాగాలు అలపించే పార్టీలు గతంలో వలె వ్యవహరిస్తాయా అన్నది సందేహం.

No comments:

Post a Comment