మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రులిద్దరూ ఎందుకు ఘర్షణ పడుతున్నారు? అంతకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో తెలుగుదేశంలోనూ వైరుధ్యాలు ఎందుకు పొడసూపాయి? కరీం నగర్‌లో తెలుగు దేశం తెలంగాణా రణభేరిపై కొన్ని వర్గాలు ఎందుకు ముందేభేరీ మోగిస్తున్నాయి? స్పష్టమవుతున్నదొకటే- ప్రాంతాల గురించి ఎంత చెప్పినా వాస్తవంలో ప్రయోజనాల ఘర్షణ ప్రతిబింబాలే ఇవన్నీ. ఒకే ప్రాంతంలో ఒకే జిల్లాలో ఒకే పార్టీలో ఇంత బాహాటంగా కీచులాడుకుంటున్న నేతలు ప్రతిదీ ప్రాంతాల రేఖలతో చూపించాలనుకోవడం కుదిరే పని కాదు. ఏదో ఒక రీతిలో మేము ప్రత్యేక రాష్ట్రం కోరుతున్నామంటూ సభలు జరిపే వారిని కూడా నిలవరించడంలో కనిపించేది
Friday, May 27, 2011
పున:పున: ప్రతిష్టంభనం..
మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రులిద్దరూ ఎందుకు ఘర్షణ పడుతున్నారు? అంతకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో తెలుగుదేశంలోనూ వైరుధ్యాలు ఎందుకు పొడసూపాయి? కరీం నగర్‌లో తెలుగు దేశం తెలంగాణా రణభేరిపై కొన్ని వర్గాలు ఎందుకు ముందేభేరీ మోగిస్తున్నాయి? స్పష్టమవుతున్నదొకటే- ప్రాంతాల గురించి ఎంత చెప్పినా వాస్తవంలో ప్రయోజనాల ఘర్షణ ప్రతిబింబాలే ఇవన్నీ. ఒకే ప్రాంతంలో ఒకే జిల్లాలో ఒకే పార్టీలో ఇంత బాహాటంగా కీచులాడుకుంటున్న నేతలు ప్రతిదీ ప్రాంతాల రేఖలతో చూపించాలనుకోవడం కుదిరే పని కాదు. ఏదో ఒక రీతిలో మేము ప్రత్యేక రాష్ట్రం కోరుతున్నామంటూ సభలు జరిపే వారిని కూడా నిలవరించడంలో కనిపించేది
Sunday, May 22, 2011
పార్టీలు- ప్రాంతాలు- వ్యక్తులు
గత రెండేళ్లలోనూ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో అతి ఎక్కువగా వినిపించిన మాటలు తెలంగాణా సీమాంధ్ర అన్నవి. (వాస్తవంలో సీమాంధ్ర అన్నమాట ఈ సందర్భంలో పుట్టించింది తప్ప అంతకు ముందు లేదు.) ప్రజలు ఎక్కడైనా ఒక్కటే అలాగే పాలకవర్గ నేతల వ్యూహాలు కూడా వారి వారి అధిపత్యాల పరిరక్షణకే ప్రధానంగా నడుస్తుంటాయని ఎన్నిసార్లు చెప్పినా చరిత్ర పాఠాలు ఉదహరించినా కొంతమందికి బోధపడలేదు.కాని కళ్లు మూసుకుంటే కటిక నిజాలు మాసిపోవు కదా! అందుకే ఆ సత్యం మరింత ప్రస్పుట్షమవుతున్న పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లాలో పాలక పక్షమైన కాంగ్రెస్‌లో మంత్రులు జూపల్లి కృష్ణారావు-డి.కె.అరుణల మధ్య సాగుతున్న అంతర్యుద్ధం గాని, తెలుగు దేశంలో నాగంకు
Wednesday, May 18, 2011
ప్రజా సంబంధాలే ప్రాణవాయువు:సుందరయ్య జీవితాదర్శం
పుచ్చలపల్లి సుందరయ్య పేరు తల్చుకోగానే ప్రజల మనిషి అన్న ఆయన సార్థక నామం గుర్తుకు వస్తుంది. ధన స్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క అన్న పల్లవి నిరంతరం వినిపిస్తున్నా ఆచరణలో అది ప్రజల పేరిట ప్రజల ద్వారా ప్రజల నెత్తిన అన్న అర్థంలోనే అమలవుతుంటుంది. తమ స్వప్రయోజనలనే ప్రజల వాంఛలుగా చూపించే విద్య పాలకులకు బాగా తెలుసు.ఇందుకు ప్రచారాలు, ప్రలోభాలు, కుదరకపోతే ప్రభుత్వ నిర్బంధాలు కూడా ప్రయోగించేందుకు ఎంత మాత్రం వెనకాడరు.ఏ నినాదం ఏ ప్రచారం ఏ శక్తుల ఏ వర్గ ప్రయోజనాలకు ఉపయోగపడుతుందో తెలుసుకోవడం అంత సులభం కాదు. కనకనే కమ్యూనిస్టులు సామాన్య ప్రజల ముఖ్యంగా కష్టజీవుల శ్రేయస్సు పరమావధిగా పోరాడుతూనే వారి చైతన్యం పెంచడంపైనే కేంద్రీకరిస్తారు. ఇది విసుగూ విరామం లేని వుండకూడని ఒక నిరంతర ప్రక్రియ. ఈ సత్యానికి సుందరయ్య జీవితం ఆచరణలే నిదర్శనం. ఆయనలో ఆలోచనా శక్తి పెరిగిన నాటి నుంచి ఆఖరి శ్వాస విడిచే వరకూ ప్రజలతోనే ప్రజల కోసమే జీవించారు. ప్రజా సేవా కార్యక్రమాలతో మొదలు పెట్టి ప్రజల తరఫున పోరాడే సంఘటిత శక్తిగా కమ్యూనిస్టుపార్టీని తీర్చిదిద్ది విప్లవోద్యమాలు నిర్మించే వరకూ అనేక ఘట్టాలు ఆయన జీవితంలో మనకు దర్శనమిస్తాయి. వీటన్నిటితో పాటు ఈ ధనస్వామ్య ప్రజాస్వామ్యం పరిధిలోనే ప్రత్యామ్నాయాలను నిర్మించేందుకు నిలబెట్టేందుకు కూడా ఆయన అనుపమ సేవలందించారు. ఆ ప్రయత్నాలకు ప్రతిబంధకాలు ఎదురైనప్పుడు ప్రమత్తత కారణంగా ప్రభు వర్గాల పాచికలు పారినప్పుడు కూడా కాస్తయినా నిరాశ చెందక ద్విగుణీకృత దీక్షతో మరింతగా జనంలో లీనమయ్యారు. పశ్చిమ బెంగాల్‌లో సుదీర్ఘ వామపక్ష ప్రభుత్వ పాలనకు ఈ పర్యాయం పరాజయం ఎదురైన నేపథ్యంలో ప్రత్యామ్నాయ శిల్పిగా సుందరయ్య చేసిన కృషి గుర్తుకొస్తుంది.
ఎన్నికల్లో జయాపజయాలు: సిపిఎం
ఆంధ్ర రాష్ట్ర ఎన్నికలలో కమ్యూనిస్టులు విజయం అంచుల వరకూ వెళ్లి తర్వాత శతృవర్గాల మూకుమ్మడి దాడిలో దారుణంగా దెబ్బ తిన్న సంగతి అందరికీ గుర్తుంటుంది. 1955లో ఆ పోరాటానికి నాయకుడు భావి ముఖ్యమంత్రిగా
Saturday, May 14, 2011
బెంగాల్ ఫలితాలు: వికృత భాష్యాలు
అయిదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలలో మధ్యంతర మార్పులకు సూచికలుగా వున్నాయి. వీటిపై విశ్లేషణలూ రకరకాలుగా వున్నాయి. అన్నిటిలోకి సహజంగానే పశ్చిమ బెంగాల్‌లో సిపిఎం నాయకత్వంలోని వామపక్ష సంఘటన ప్రభుత్వ ఘోర పరాజయంపై ఎక్కువ చర్చ కేంద్రీకృతమవుతున్నది. ఎర్ర కోటకు బీటలు, కమ్యూనిస్టుల భూస్థాపితం వంటి శీర్షికలు పత్రికల్లోనూ ఛానళ్లలోనూ ప్రత్యక్షమయ్యాయి. 34 ఏళ్ల అవిచ్చిన్న పాలన ముగిసిన ఈ సమయంలో అలాటి చిత్రణ వెలువడడంలో
Friday, May 13, 2011
కడప ఫలితం కాంగ్రెస్‌కు శృంగభంగమే
కడప లోక్‌సభ, పులివెందుల శాసనసభ స్థానాల్లో జగన్, విజయమ్మలు సాధించిన అసాధారణ విజయం అధికార పక్షానికి శృంగభంగమే.గతంలోనే ఈ బ్లాగులో చెప్పుకున్న దానికి మించిన ఆధిక్యత వచ్చింది. ఇది బ్రహ్మాండమైన విజయమే గాక భయంకరమైన విజయం కూడా అని సాక్షి ఛానల్‌లో అన్నాను.ఆ ప్రభావం అధికార పక్షంపై కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి సవివరంగా నిర్వహించిన పత్రికా గోష్టిలోనూ వ్యక్తమైంది. వివేకానంద రెడ్డిపై వున్న ప్రత్యేకమైన ఆశలు కూడా కుప్ప కూలాయి.ఇవన్నీ వున్నా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగు దేశం లేకుండా ప్రభుత్వాన్ని కూల్చే శక్తి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు లేదు. ఆ మాట గెలుపు తర్వాత జగన్ మరోసారి అన్నారు. ఈ లోగానే తెలంగాణా సమస్యపై టిఆర్‌ఎస్ రాస్తారోకో వగైరాలు ప్రారంభిస్తున్నది.కనక రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు తప్పక పోవచ్చు.
వామపక్షాలకు తీవ్రమైన ఎదురు దెబ్బ
పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో వామపక్షాల పరాజయం రాజకీయంగా వాటికి తీవ్రమైన ఎదురుదెబ్బ. కేవలం కమ్యూనిస్టు ఉద్యమాభిమానులే గాక ప్రజాస్వామిక వాదులు, ప్రత్యామ్నాయ శక్తులు వుండాలని కోరుకునే వారంతా ఈ పరిణామానికి విచారిస్తారు. అదే సమయంలో ఆ ప్రజాస్వామ్య స్పూర్తితోనే ప్రజల తీర్పును గౌరవిస్తారు. 2009 పార్లమెంటు ఎన్నికలతో మొదలు పెట్టి వరసగా మూడు ఎన్నికల్లో వామపక్ష ఫ్రంట్ ఓటమి పరంపర చూస్తూ వచ్చింది.దీనికి తోడు సింగూరు, నందిగ్రామ్, లాల్‌గడ్‌లలో పరిణామాలు ప్రతికూలత పెంచి ప్రజలను దూరం చేశాయి. దూరమైన వారిని తిరిగి రాబట్టుకోవడంలో వామపక్ష ఫ్రంట్ తీవ్రంగానే కృషి చేసినప్పటికీ
Sunday, May 8, 2011
కడప కదనంలో కడపటి అంచనాలు
గత నెల రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో కడప, పులివెందుల ఉప ఎన్నికల పోరాటమే ఏకైక అంశంగా ప్రచారం పొందింది. పోలింగ్ శాతం కూడా ఇందుకు తగినట్టే వుంది. ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ కోరినట్టు 80 శాతం దాటకపోయినా వున్న వుద్రిక్త వాతావరణంలో ఇది మంచి ఓటింగే. పైగా మరీ తీవ్రమైన శాంతి భద్రతల ఘటనలు లేకుండా ముగియడం మరో ఉపశమనం. పోలింగ్‌పై ఎక్కువ భాగం ఫిర్యాదులు తెలుగు దేశం నుంచే రావడం గమనార్హమైంది. అలాగే డిఎల్ తనకు జగన్ వర్గం నుంచి ప్రాణాపాయం వుందని చెప్పడం, సాక్షి విలేకరిపై ఆయన వర్గీయుల దాడిని జగన్ సహా తీవ్రంగా ఖండించడం ఇవన్నీ ప్రచార పర్వంలోని ఉద్రిక్తతలకు కొనసాగింపు వంటివే. అతిశయోక్తులు, అవాస్తవాలు, అర్భాటాలను పక్కన బెడితే
Monday, May 2, 2011
నకిరేకల్‌లో నర్రా రాఘవరెడ్డి జీవిత కథకు ఆదరణ
ఏప్రిల్ 25న నల్గొండ జిల్లా నకిరేకల్‌లో ఆ నియోజకవర్గానికి ఆరుసార్లు ప్రాతినిద్యం వహించిన నర్రా రాఘవ రెడ్డి జ్ఞాపకాలకు పుస్తక రూపం యాభయ్యేండ్ల ప్రజా జీవితం ఆవిష్కరించాను. ఈ సందర్భంగా తెలంగాణా సాయుధ పోరాట యోధులు చాలా మంది విచ్చేశారు. ఆ పోరాట విశిష్టత, తర్వాత కాలంలో పాలకవర్గాల తీరు తెన్నులు వంటివన్నీ ప్రస్తావనకు వచ్చాయి. తెలంగాణాలో దొరల చెరలకు స్వస్తి చెప్పిన కమ్యూనిస్టు ఉద్యమ పాత్రను, అందులో భాగమైన రాఘవ రెడ్డి ఆదర్శ ప్రజా జీవితాన్ని ప్రతివారూ కొనియాడారు.ఇక్కడ కూడా ఆయన జీవిత కథపుస్తకం 300 ప్రతులు అక్కడికక్కడే చెల్లిపోవడం విశేషంగా కనిపించింది. పుస్తకాలకు ఆదరణ లేదని ప్రజా యోధుల త్యాగాలు ఎవరూ పట్టించుకోరని కొందరు చేసే వ్యాఖ్యలు ఎంత అవాస్తవమో రెండు అనుభవాలు కళ్లకు కట్టాయి.
ఉత్తరాంధ్రసభల్లో శ్రీశ్రీ జయభేరికి గొప్ప స్సందన
ఏప్రిల్ 29.30 తేదీలలో నేను విశాఖ పట్టణం, విజయ నగరం జిల్లాల్లో పలు సభల్లో పాల్గొన్నాను.29న విశాఖ జిల్లా యలమంచలి, నర్సీపట్నంలలో శ్రీశ్రీ జయభేరి అన్న నా పుస్తకం ద్వితీయ ముద్రణ ప్రతులను ఆవిష్కరించారు. నర్సీంపట్నంలో సాహితీమిత్రులతోనూ మీడియాతోనూ ఇష్టాగోష్టిగా జరిపిన సమావేశంలోనూ చాలా విషయాలు వచ్చాయి. శ్రీశ్రీ సాహిత్యం, జీవితం,రాజకీయాలను వివిధ కోణాలనుంచి పరిచయం చేసే 370 పేజీలను పై బడిన ఈ పుస్తకాన్ని అక్కడ సాహితీ మిత్రులు ఎంతగానో ఆదరించడం చాలా సంతోషం కలిగించింది. శ్రీశ్రీ పట్ట వారిలో అమితాసక్తి కూడా కనిపించింది. ఇటీవలనే ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి రెండవ సారి ఘన విజయం సాధించిన ఎంవిఎస్ శర్మ పుస్తకాన్ని పరిచయం చేశారు. ఆ రోజు రాత్రి ఉక్కు ఫ్యాక్టరీలో భారత ప్రజాస్వామ్యం అవినీతి సవాలు అన్న అంశంపై ప్రసంగించాను. 30 వతేదీ శ్రీశ్రీ జయంతి సందర్భంగా విశాఖ పౌర గ్రంధాలయంలోనూ, సాయింత్రం విజయనగరంలో గురజాడ గ్రంధాలయంలోనూ పుస్తక పరిచయం శ్రీశ్రీకి నివాళి కార్యక్రమం సాహితీ మిత్రుల మధ్య చాలా ఉత్సాహంగా నడిచింది. విజయనగరంలోనూ గురజాడ స్మారక చిహ్నంగా వున్న ఆయన స్వగృహంలో ఇష్టాగోష్టి నడిచింది. మొత్తంపైన 200కు పైగా శ్రీశ్రీ జయభేరి పుస్తకాలు తీసుకెళ్తే ప్రతిచోటా కొరత తప్ప పాఠకులకు అవసరమైనన్ని అందించలేక పోయినందుకు విచారించాను. పుస్తకం పట్ల మహాకవి పట్ల వున్న గౌరవం, నా పుస్తకానికి లభించిన ఆదరణ చాలా సంతోషం కలిగించాయి.వంద రూపాయల ధర గల ఈ పుస్తకం సాహిత్యాభిమానులకు యాభై రూపాయలకే అందించడాన్ని వారు కూడా హర్షించారు.
లాడెన్ హతమైతేనే ఉగ్రవాదం ఖతం కాదు
బిన్‌లాడెన్‌ను హతమార్చినట్టు అమెరికా అద్యక్షుడు ఒబామా అధికారికంగా ప్రకటించారు. ఆ దేశ ప్రజలు ఆనందోత్సవాలు చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. భారత ప్రభుత్వం కూడా దీనిపై సానుకూలంగా స్పందించింది. ప్రపంచంలో ఉగ్రవాదాన్ని వ్యవస్థీకృతం చేసి దేశ దేశాలలో అనేక మారణహౌమాలకు కారణమైన లాడెన్ మృతి నిస్సందేహంగా ముఖ్య ఘటనే. ఉగ్రవాదం ఏ పేరుతో ఎవరు చేసినా అంతిమంగా ప్రజలకే నష్టదాయకమవుతుంది. అయితే దాని మూలాలు ఏ ఒక్క వ్యక్తికో పరిమితమైనవి కావు. లాడెన్‌ను సృష్టించి పెంచి పోషించడంలో అమెరికా కీలక పాత్రను ఎవరూ మర్చిపోకూడదు. భస్మాసుర హస్తంలా సెప్టెంబరు 11 తర్వాత అమెరికాకే అతను ముప్పుగా తయారైనాకే శత్రువుగా ప్రకటించారు. ఆ పేరుతో అఫ్ఘనిస్తాన్‌పై దండయాత్ర సాగించారు.నాటి సోవియట్ మద్దతు గల ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు తాలిబాన్లను సృష్టించి పాక్‌ను వత్తాసుగా నిలిపి లాడెన్‌ను కూడా అక్కడ చేర్చింది అమెరికానే.
ప్రతిదశలో అమెరికాకు అరబ్ ప్రపంచం నుంచి ఒక శత్రువు కావాలి. అతన్ని బూచిగా చూపించి తన ఆధిపత్య వ్యూహాలను సాగించుకోవాలి. నాజర్; అరాఫత్,గడాఫీ,ఖొమెనీ,సద్దాం హుస్సేన్ అందరూ ఆ పరంపరలో వారే. బిన్ లాడెన్‌ను కూడా ఆ క్రమంలోనే సృష్టించారు. ఇప్పుడు తుదముట్టించారు. అయితే ఇప్పటి వరకూ అతనికి ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన ను అంటుకోకుండా వదిలివేస్తున్నారు. పైగా సహకరించినట్టు కితాబులిస్తున్నారు ్‌ఇప్పటికీ సౌదీ నుంచి పాకిస్తాన్ వరకూ అన్ని చోట్లా సైనిక నియంతలను మత ఛాందసులను పోషిస్తూ, ఇజ్రాయిల్ యూదు జాత్యహంకారాన్ని పాలు పోసి పెంచుతూ అమెరికా ఉగ్రవాద వ్యతిరేకపోరాటం గురించి చెప్పడం హాస్యాస్సదమే. ముంబాయిలో టెర్రరిస్టు దాడులకు కారణమైన పాక్ అమెరికన్ హెడ్లీని భారత్‌కు అప్పగించేందుకు కూడా సిద్దం కావడం లేదు. చెప్పాలంటే ఇలాటి ఉదాహరణలు ఇంకా చాలా వున్నాయి. ఈ విధానాలు అమెరికా మార్చుకోనంత వరకూ ఉగ్రవాదంపై ఎన్ని సుద్దులు చెప్పినా వాటికి విలువ ఏ మాత్రం వుండదు. లాడెన్ వారసుడుగా
Subscribe to:
Posts (Atom)