Pages

Saturday, October 15, 2011

రథయాత్ర రాజకీయాలు






అద్వానీ రథయాత్రపై బిజెపి వెలుపల కన్నా అంతర్గతంగానే ఎక్కువ అలజడి కనిపిస్తుంది. నరేంద్ర మోడీ నిరాహారదీక్షతో మొదలైన ఈ చర్చ ఇప్పుడు మరింత మంది నాయకులకు పాకింది. ప్రధాని పదవికి అభ్యర్థులెవరనే విషయంలో(ఇప్పుడు ఎన్నికలూ లేవు, బిజెపి విజయం సాధించిందీ లేదు) పోటా పోటీ ఒక పట్టాన ముగిసేట్టు లేదు. మోడీ అద్వానీని ప్రశంసిస్తూ వ్యాఖ్యలు రాసినా ఆయన మోడీని మెచ్చుకున్నా ప్రధాని పదవిపై మాత్రం సూటిగా వ్యాఖ్యలు లేవు. పోటీలో లేను అని అద్వానీ అన్నట్టు చాలాసార్లు శీర్షికలు కనిపిస్తున్నా ఆయన అలా సూటిగా చెప్పింది లేదు. పార్టీ నిర్ణయిస్తుందనీ, తన కోసం చేయడం లేదని పరిపరి విధాల మాట్లాడటమే జరుగుతున్నది. ఇది ఇలా వుంటే బిజెపిలో ఇంకా రాజ్‌నాథ్‌సింగ్‌, యశ్వంత్‌ సిన్హా, మురళీ మనోహర్‌ జోషి తదితరులు చాలా మంది తామూ రేసులో వున్నామని సూచనలు వదులుతున్నారు. విలక్షణ పార్టీలో విస్తారంగానే ప్రధాన మంత్రులున్నారు. 1995లో తన మాట వినకుండా వాజ్‌పేయిని ముందుకు తెచ్చి అద్వానీ పొరబాటు చేశారన్నట్టు ఉమా భారతి మాట్లాడితే బలపర్చిన వారు మాత్రం పెద్దగా లేరట.

1 comment:

  1. ఈ రధ యాత్రలు, పాద యాత్రలు ఒకసారికి మాత్రమే పనికొచ్చే డిస్పోసబుల్ గ్లౌజ్ వంటివి. ఒకసారి వాడేస్తే మళ్ళీ వాడటానికి పనికి రావు. అద్వానికి ఈ విషయం తెలీదా?

    ReplyDelete