Pages

Friday, October 21, 2011

ప్రపంచ నియంతపట్ల ప్రమత్తతా?



గడాఫీ హత్య లేదా హతం వెనక అమెరికా పాత్ర దాచేస్తే దాగని సత్యం. ఆయన కడిగిన ముత్యం అని నేనెక్కడా చెప్పలేదు. ఆయన హయాంలో అభివృద్దిని కూడా వికీ పీడియాలో చూడొచ్చన్నాను. ఆయన ఎలాటి వాడైనా ఎక్కడో వున్న అమెరికా కూటమి జోక్యం అవసరమేమిటి? ఇలా ఇతర దేశాధినేతలను హతమార్చడం మొదలెడితే అంతమెక్కడీ దేశాల సార్వభౌమత్వాలకు రక్షణ ఎక్కడీ విమానాన్ని కూల్చివేయడం, హొటల్‌పై దాడి వంటివాటికి దేశాలనే బాంబు దాడులతో దగ్ధం చేస్తున్న అమెరికా అమానుష వ్యూహాలకూ పోలిక ఎక్కడీ గడాఫీని త్వరితంగా నిర్మూలించాలని ఒత్తిడి చేయడానికే విదేశాంగమంత్రి హిల్లరీ క్లింటన్‌ లిబియా వెళ్లిన సంగతి మీడియాలో రాలేదా? గడాఫీ తన దేశానికి నియంత అవునో కాదో గాని అమెరికా ప్రపంచానికే నియంతగా మారిన అమెరికా అంతకంటే కొన్ని రెట్లు ముప్పుగా వుందనడంలో సందేహం లేదు. సోవియట్‌ యూనియన్‌ ఆఫ్ఘనిస్తాన్‌లో జోక్యం చేసుకుందనే పేరుతో మొదలైన అమెరికా వినాశకర వ్యూహాలు ఆఖరుకు 9/11 ఘటనలకు దారి తీసి ఆ పైన మరింత దారుణ రూపం తీసుకున్నాయి. ఇంకా దిగజారతాయి. ఈ మాటలు చెప్పకుండా దాచుకోవలసిన అవసరం ఏ మాత్రం లేదు. అవి దారుణమని అనుకోలేని వారికి ఇవే దారుణంగా కనిపిస్తే నేను చేయగలిగింది లేదు. ఇది అమెరికా పట్ల అమెరికా ప్రజల పట్ల వ్యతిరేకత కాదు. వారి అమానుష ఆధిపత్య వ్యూహాల అభిశంసన మాత్రమే.
దీనిపై నా ఎంట్రీపై చాలా వ్యాఖ్యలు చేయడమే గాక వారిలో వారు వాదించుకోవడం ఆలస్యంగా చూశాను.ఆ భాషను పద ప్రయోగాలను నేను హర్షించలేను. కనకనే మొత్తం తీసేశాను. ఇక ముందైనా వాదనలో విషయానికి విజ్ఞతకు ప్రాధాన్యం ఇస్తారని ఆశిస్తాను.

2 comments:

  1. /సోవియట్‌ యూనియన్‌ ఆఫ్ఘనిస్తాన్‌లో జోక్యం చేసుకుందనే/
    అలా అన్నారా! ఎంత దుష్ప్రచారమండీ... ఆ దేశ అధ్యక్షుడు ఆహ్వానిస్తే స్నేహశీలతతో సైనిక సహకారానికి వెళ్ళారే కాని, శాంతికాముక దేశమైన సోవియట్ దురాక్రమణ చేయడమా! అసంభవము, నమ్మలేకుండా వున్నాను. ఏమా కథ? ఓ పోస్ట్లో మీ వర్షన్ వివరించండి, అంతే!

    ReplyDelete
  2. మీతో ఏకీభవిస్తున్నాను.ఒక దేశంలో ఏదొ కారణం చెప్పి మరో దేశం సైనిక జోక్యం చెయ్యకూడదు.ఆ దేశప్రజలే తమ సమస్యలను పరిష్కరించు కోవాలి.ప్రజాస్వామ్య ఉద్ధరణ కోసమే ఐతే , అమెరికా ,నాటో దేశాలు సౌదీ అరేబియా లోను ,బర్మాలోను ఎ ందుకు జొక్యం చేసుకోవు ?ఆయిల్ కోసం ,ఆధిపత్యం కోసమే కదా ఇదంతా. అమెరికాగాని, రష్యా ,చైనాలుగాని ,మనదేశం గాని తమదేశం మీద దాడి చేస్తే తప్ప ఇతర దేశాలలో జోక్యం , ముఖ్యంగా సైనిక దాడి జరపకూడదు. సాధారణంగా ఇటువంటి దురాక్రమణ ను ఖండించే రష్యా ,చైనా,భారత్ మౌనం అవలింబించడం కుట్ర గాని,స్వార్థం వలన గాని అయివుంటుంది అనుకొంటున్నాను.గడ్డఫీ నియంతృత్వాన్ని నేను సమర్థించను.కాని నాటో సైనికజోక్యాన్ని ఖండిస్తాను.=కమనీయం

    ReplyDelete