Pages

Thursday, October 20, 2011

అమెరికా హత్యల జాబితాలో గడాఫీ



లిబియా అధినేత కల్నల్‌ గడాపీని వెంటాడి వేటాడి ఒకప్పుడు సద్దాం హుస్సేన్‌ను హతమార్చినట్టే అమెరికా అండదండలు గల వ్యతిరేక శక్తులు అంతమొందించాయి. మొత్తం అరబ్‌ ప్రపంచంలో ఆధునికత, లౌకికతత్వం నింపిన మరో పాలకుడు ఖతమై పోయాడు. మానవాభివృద్ధి సూచికల్లో లిబియా ఎంతటి ప్రగతి సాధించిందో ఇదే ఇంటర్‌ నెట్‌లోని వికీ పీడియా చూస్తే తెలుస్తుంది. కొద్ది రోజుల కిందటనే అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ లిబియాలో పర్యటించి గడాఫీని హతమారిస్తే సహాయం చేస్తామని ప్రకటించి వచ్చారు. లిబియాలో వచ్చే మార్పులలో తమకూ వాటా వుండాలని అమెరికా అన్న సంగతి చాలా ఛానళ్లలో ప్రసారమైంది. గడాఫీ నియంత అని పెద్ద ప్రచారమే జరుగుతుందనడంలో సందేహం లేదు. ఆయన పాలనలో అనేక పొరబాట్టు వుండొచ్చు కూడా. కాని వాటికి శిక్షలు వేసే హక్కు అమెరికాకు ఎవరిచ్చారనేది ప్రశ్న.
1986లోనే గడాఫీ హత్యకు అమెరికా దాడులు చేసింది. ఆయన చిన్న కుమార్తె బలైంది అప్పట్లో. తర్వాత ఎన్ని హత్యా ప్రయత్నాలు
జరిగాయో చెప్పడానికి లేదు. నిజానికి సోవియట్‌ విచ్చిన్నం తర్వాత, మరీ ముఖ్యంగా ఇరాక్‌ ఆక్రమణ తర్వాత గడాఫీ కొంత మెత్తబడ్డాడని కూడా చెప్పారు. అయితే ఎంత సర్దుకున్నా కొంతమందిలా అమెరికా తొత్తులా మారలేకపోయాడు.ప్రపంచంలో చమురు నిల్వలు ఎక్కువ గల ఆరు దేశాల్లో లిబియా ఒకటి. కనక దాన్ని ఆక్రమించి తీరాలన్నది అమెరికా వ్యూహాత్మక అవసరం. సౌదీ అరేబియా, కువైట్‌, ఇరాక్‌, సూడాన్‌ ఇప్పటికే దాని అధీనంలో వున్నాయి. ఇప్పుడు లిబియా కూడా వశమైనాక వీటిలో ఒక్క ఇరాన్‌ మాత్రమే మిగిలి వుంటుంది. దానిపైన కూడా దాడులు సాగుతూనే వున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌ల తర్వాత లిబియా వంతు పూర్తయింది. వెనిజులా అద్యక్షుడు హ్యూగో చావేజ్‌ దీని గురించి కొద్ది రోజుల కిందటనే హెచ్చరించాడు కూడా. గడాఫీ హత్యపై జనం కేరింతలు కొడుతున్నారని షరా మామూలుగా చూపిస్తారు గాని దాని వల్ల కలిగే అనర్థాలేమిటో మరికొద్ది కాలం ఆగితే అదే అర్థమవుతుంది.
ఇంతకూ వాల్‌స్ట్రీట్‌ ప్రదర్శనలనే సహించలేని స్వేచ్చాయుత సీమ ఇతరులను మానవ హక్కుల సుద్దులు చెప్పడం ఎంత హాస్యాస్పదం?మరెంత అమానుషం? నిజమైన ప్రజాస్వామ్య ప్రియులెవరూ గడాఫీ హత్యను హర్షించరు. దేశాల స్వాతంత్ర సార్వభౌమత్వాలకు వచ్చిన ముప్పును గురించే ఆందోళన పడతారు.

4 comments:

  1. శాంతి కాముకుడు, స్నేహశీలి, అంగరక్షకులుగా స్త్రీలను నియమించి గౌరవించిన వాడు, లౌకిక భావాలు కల పరిపాలనా దక్షుడు హత్యకు గురికావడం విచారించాల్సిన విషయం. లిబియా ఆయిల్ కోసమే ఒబామా ఈ హత్య చేయించారంటారా? హమ్మమ్మ... న్యాయానికి కాలం లేదండీ, తెర గారు.
    నే చెబుతూనే వున్నా, కుర్రళ్ళు వింటేగా! అందరూ అంతర్జాతీయ పత్రికలు చదివేవాళ్ళే! పెద్దలు అనలైజ్ చేసి చెప్పిందే విని బుద్ధిగా తలాడించే యువత .... సోవియట్ రోజులు మరీ రావండి. యువత భ్రస్టు పట్టి పోతోంది, ఈ అంతర్జాలం వల్ల.

    ReplyDelete
  2. you are great snkr garoo, keep on telling the truth.. not just to the youth even learnded elders like you. but don;t attribuete your vitriolism to me. tnks.

    ReplyDelete
  3. అమెరికా మోచేతినీళ్ళు తాగితాగి ఏది న్యాయమో ఏది అన్యాయమో గ్రహించే స్థితిలో యిప్పటి యువత లేదులేండి రవిగారు..

    బిన్‌లాడెన్‌‌ లాంటి వాడిని పెంచిపోషించి సోవియట్ రష్యాపై ఉగ్రవాదం పెంచిపోషిస్తానికి ఆయుధ సంపదనూ సమకూర్చడం వంటివి యిప్పటి యువతకి ఎలా తెలుస్తుంది?

    ఏదైనాసరే ఆమెరికాకి శత్రువా, మిత్రివా అనేదే వీరికి ముఖ్యం. బిన్‌లాడెన్‌ ఒక్కప్పుడు వీరికి హీరోనే, ఆమెరికాకు శత్రువుగా మారినప్పుడు మాత్రం వీరికి నరహంతక నాయకుడుగా తెలిసింది.

    ఇరాక్ పై యుద్ధంచేసి ౧౦ సంవత్సరాలైనా యిప్పటికీ సరైన సమాధానం లేని/చెప్పలేని వీరి కలలరాజ్యం, పాలస్తీనా, లిబియా లలో కూడా ఆక్రమణకు చమురు బావులకోసమేనని ప్రపంచం మొత్తానికి తెలిసినా యిటువంటి వారికి తెలియనట్లు నమ్మదగినదేనా?
    ఆమెరికా ఏది చెబితే అదే రైట్ అదే మావాదన, మేము బుర్రపెట్టం. ఓకే. హామ్మా మా డాలర్లు ఏమవ్వాలి?

    ReplyDelete
  4. nijamaina daarshanikudu, abhydayavadi, deshabhakthudu ee rakanga hatamavatam kramasikshana, pragathini, susampannanni korukunevareri ee hathyani jeernichukoleru, edi eamaina libiya tirugubatudarulu tondarapadi duradrustavanthulayyaru.

    ReplyDelete