హౌం మంత్రి సబితా ఇంద్రారెడి, మరో మంత్రి మోపిదేవి వెంకటరమణలపై
సహచర మంత్రి శంకర రావు చేసిన తీవ్రారోపణలను విచారణకు స్వీకరించవచ్చునని జస్టిస్ నరసింహారెడ్డి ఆదేశించినట్టు వచ్చిన వార్తల లోతుపాతులు ఈ బ్లాగులో లోగడ చర్చించాము. అవి కేవలం సిఫార్సులు తప్ప నిర్ణయాలు కాదని, ఆ పని చేయవలసింది వేరే ధర్మాసనమని కూడా చెప్పుకున్నాము.నిజంగానే ఇప్పుడు హైకోర్టు ఉన్నాతాసననం ఆ సిఫార్సును తోసిపుచ్చడమే గాక మంత్రుల విభేదాలలో తలదూర్చవద్దని సలహా ఇచ్చింది. ఈ సందర్భంగానే వార్తా కథనాలను ఎంత మేరకు తీసుకోవచ్చనే దానిలో సింగిల్ జడ్జి పరిధి మించారన్న భావన కలిగించే వ్యాఖ్యలు కూడా చేసింది. ఫ్రధాన న్యాయమూర్తి కక్రూ, మరో న్యాయమూర్తి అఫ్జల్ పుర్కార్‌లు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుత హైకోర్టు పరిస్థితి నేపథ్యంలోనూ, నరసింహారెడ్డి తీర్పుల రాజకీయ ప్రాధాన్యత నేపథ్యంలోనూ ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఆరోపణల నిజానిజాల కంటే చట్టబద్దమైన పద్ధతులు, కోర్టుల నిబంధనల రీత్యానే ఈ అంశం ప్రస్తావించాల్సి వచ్చింది.ఇంతకూ శంకరరావుపై ముఖ్యమంత్రి ఆగ్రహంగా వున్నా ఆయన్ను కదిలించలేకపోవడానికి కూడా రాష్ట్ర రాజకీయాలు, అధిష్టానం అనుమతి నిరాకరణే కారణమని కూడా భావిస్తున్నారు. బహిరంగంగా సహచరులపై ఆరోపణలు చేసిన ఆయన మంత్రివర్గంలోనే కొనసాగుతుండగా ఆ ఆరోపణలకు స్పందన లేదా ఖండన లేకపోవడం ఇక్కడ విపరీతం!
No comments:
Post a Comment