Pages

Tuesday, October 25, 2011

డిఎస్‌ రాకతో మూడవ కేంద్రం



కాంగ్రెస్‌ అధిష్టానం పార్టీలో అంతర్గత కలహాలను ప్రోత్సహించి విభిన్న అధికార కేంద్రాలను ఏర్పాటు చేసే పని పున: ప్రారంభించింది. శాసనమండలికి పిసిసి మాజీ అద్యక్షుడు డి.శ్రీనివాస్‌ను నియమించడం ఈ దిశలో మరో చర్య. ఇప్పటికే కిరణ్‌ కుమార్‌ రెడ్డి, బొత్స సత్యనారాయణల మధ్య సాగే ప్రచ్చన్న యుద్దం చాలనట్టు డిఎస్‌ కూడా తోడవువతారనడంలో సందేహం లేదు. ప్రాంతీయ కోణం ఈయన విషయంలో బలంగా వుంటుంది. లోగడ నిజామాబాద్‌లో గెలిస్తే పెద్ద మంత్రినవుతానని బాహాటంగా ప్రచారం చేసుకున్న డిఎస్‌ మనసులో మాట అందరికీ తెలుసు. పెద్ద మంత్రి కావడానికి ఎంఎల్‌ఎ ఎంఎల్‌సి ఏదైనా ఫర్వాలేదు! కనక ఇప్పటి నుంచి ఆయన ఆ పనిలో వుంటారు.ఇకపోతే తెలంగాణాలో పార్టీ ఎంఎల్‌లను దారికి తెచ్చుకోవడానికి జానారెడ్డిపై ఆధారపడటానికి లేదని భావిస్తున్న అధిష్టానం డిఎస్‌ సేవలను కూడా ఉపయోగించుకోవచ్చు. కిరణ్‌,బొత్స,డిఎస్‌ ముగ్గురు మోతుబరులు పోటీ పడి పార్టీని ప్రభుత్వాన్ని కాపాడటం అధిష్టానం పని తేలికచేయొచ్చు. కాకపోతే ఈ నేతలు ప్రజల కోసం కూడా పోటీ పడితే తప్పులేదు ఆ పోటీ ఆధిపత్యం చుట్టూ తిరిగే అవకాశాలే ఎక్కువ. ఆ విధంగా ఒకరిపై ఒకరు పోటీ పడుతుంటే అధిష్టానం అందరినీ తిప్పుకుంటూ గుప్పిట్లో పెట్టుకుంటుంది.

No comments:

Post a Comment