Pages

Tuesday, November 29, 2011

చిల్లర బతుకులు ఛిద్రం


ధరల పెరుగుదల, వ్యవసాయ సంక్షోభం, ఉపాధి రాహిత్యం వంటి సవాలక్ష సమస్యలతో ప్రజలు సతమతమవుతుంటే పాలకుల చర్యలన్ని బతుకులను మరింత చితగ్గొట్టేవిగా వుంటున్నాయి. పెన్షన్‌ సంస్కరణలు, చిల్లర వ్యాపారంలో వాటికి ద్వారాలు తెరవడం పరిస్తితిని మరింత దిగజార్చడానికే దారి తీయడం అనివార్యం. 2004 ఎన్నికల ప్రణాళికలో చిల్లర వ్యాపారంలో ఎఫ్‌డిఐలను ప్రవేశపెడతానని ప్రకటించిన బిజెపి ఎన్‌డిఎ కూడా ఇప్పుడు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయంటే పరిస్తితి తెలుస్తుంది.
మధ్యతరగతి ఉద్యోగులు జీవితమంతా శ్రమించి నిల్వ చేసుకున్న పెన్షన్‌పై అనేక విధాల దాడి చేయడమే గాక దాన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌కు మళ్లించడానికి నిర్ణయించడం, అందులోనూ విదేశీ పెట్టుబడులను అనుమతించడం దారుణమైంది. ఆ దె బ్బ నుంచి కోలుకునేలోగానే చిల్లర వ్యాపారంలో వాల్‌మార్ట్‌ వంటి బహుళ జాతి తిమింగళాలను స్వాగతించాలని నిర్ణయించారు. దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధికులకు స్వయం ఉపాధి కలిగిస్తున్న ఈ రంగంలో వాటిని రానివ్వడం అత్యంత వినాశకరమైన నిర్ణయం.ప్రస్తుతం వున్నదే ఉపాధి రహిత అభివృద్ధి. ఇందులో యాభై శాతం వరకూ స్వయం ఉపాధి వుందని కేంద్ర గణాంక శాఖ లెక్కలు. కొత్తగా ఉపాధి కల్పించకపోగా వున్నది కూడా హరించుకుపోవడానికి కేంద్రం నిర్ణయం దారితీస్తుంది.ముప్పయి శాతం సరుకులు దేశంలోనే చిన్న మధ్య తరహా సంస్థల దగ్గర తీసుకోవాలనే నిబంధన ఒక రక్షణగా చెప్పారు. అయితే అది దేశీయ సరుకులకే పరిమితం కాదని తర్వాత వివరణ వెలువడింది. ఇప్పుడు సోనియా గాందీ పట్టుపట్టి దాన్ని దేశానికే పరిమితం చేయాలని గట్టిగా చెబుతున్నారని అంటున్నారు. కాని అదొక్కటే సరిపోదు. అదైనా జరిగేంత వరకూ నమ్మాల్సిన అవసరం లేదు.
ఈ దేశంలో వెయ్యికి ఒక చిన్న దుకాణం చొప్పున వుంది.వీటిపై కోట్ల కుటుంబాలు ఆధారపడి వున్నాయి. సామాన్య జనానికి కూడా ఇవి అందుబాటులో వున్నాయి. కాని వాల్‌మార్ట్‌ వంటి సంస్థల రాకతో ఇవి మూతపడక తప్పదు. దానివల్ల వాటి యజమానులు వీధుల్లో పడటమే గాక సామాన్య ప్రజలు కాస్తో కూస్తో పప్పు చింతపండు వంటి వినిమయ సరుకులు తెచ్చుకోవడం కూడా ఇబ్బందిగా మారుతుంది.ఎందుకంటే అడుగు పెట్టడానికే కళ్లు తిరిగే భారీ మాల్స్‌ వరకూ వారు వెళ్లలేరు. ఇవి మొదట్లో కాస్త సరసంగా అనిపించినా వామనుడి మూడో పాదం లాగా అన్నిటినీ ఆక్రమించిన తర్వాత రైతులను కొనుగోలు దార్లను కూడా పిప్పిచేస్తాయి. వినిమయ సంసృతి మరింత విజృంభించుతుంది. ఉత్తరోత్తరా అధిక ధరలతో పాటు ఆహార భద్రత కూడా దెబ్బతినిపోతుంది. సంపన్న దేశాలలో ఈ గొలుసు కట్టు దుకాణాల వ్యాపారాలు విస్తరించే అవకాశాలు లేవు గనక మనపైన పడుతున్నారు. అణు ఒప్పందం విషయంలో వలెనే ఇప్పుడూ మన్మోహన్‌ సింగ్‌ ప్రత్యేకంగా పట్టుపడుతున్నారు

No comments:

Post a Comment